టెస్టుల్లో యువీ, రైనా అవుట్
posted on Nov 6, 2012 9:34AM
.jpg)
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు సంచలనాలు ఏమి జరగలేదు. సందీప్ పాటిల్ సారథ్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ పాత సంప్రదాయాన్నే కొనసాగించింది. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాకు చోటు దక్కలేదు. సీనియర్లు, యువకులతో కూడిన జట్టులో మొత్తం ఏడుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్, ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ఒక వికెట్ కీపర్ ఉన్నారు.
విజయ్, రహానెకు చోటు. ఫామ్‌లోలేని ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్, గంభీర్‌ను జట్టులో కొనసాగిస్తూనే రిజర్వ్ ఓపెనర్‌గా తమిళనాడు ఆటగాడు మురళీవిజయ్, ముంబయి బ్యాట్స్‌మన్ రహానెను తీసుకున్నారు. వీరి ఎంపిక ఢిల్లీ ఓపెనర్లకు ఓ రకంగా హెచ్చరికలాంటింది. బద్రీనాథ్ స్థానంలో విజయ్‌కు అవకాశమిచ్చారు. మిడిలార్డర్‌లో వెటరన్ సచిన్‌తో పాటు పుజార, కోహ్లీ, యువీపై బాధ్యతలు ఉంచారు. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 15న అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్ ఆరంభంకానుంది.