ఇన్ఫోసిస్ కాస్ట్ కటింగ్

 Infosys plans cost cutting, Infosys cost cutting, Cost cutting has been planned in infosys

 

ఇక్కడ ఉద్యోగాల్లేవ్..! సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీకూడా ఈ బోర్డ్ పెట్టేసింది. ఇండస్ట్రీకి మళ్లీ రిసెషన్ మొదలయ్యింది. భారీగా పెరుగుతున్న వ్యయం, విపరీతంగా తగ్గిపోతున్న వర్క్ కాంట్రాక్ట్ లు ఈ నిర్ణయానికి కారణం. కనీసం మూడు నెలలవరకూ క్యాంపస్ ఇంటర్యూవు చేయకూడదని ఇన్ఫోసిస్ యాజమాన్యం నిర్ణయించింది.

 

ఇప్పటిదాకా ఇంటర్వ్యూ దశలో ఉన్న 17 వేల ఉద్యోగాలకుకూడా ఈ నిర్ణయంతో బ్రేక్ పడింది. ఇంతకు ముందు ఎంపిక చేసిన అభ్యర్ధులకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చేవాళ్లు. ఇప్పుడా శిక్షణ కాలాన్ని రెండున్నర నెలలకు కుదించారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా పెద్ద కంపెనీలు కాస్ట్ కటింగ్ ప్రయత్నాల్లో మునిగితేలుతుంటే బోలెడన్ని చిన్నచిన్న కంపెనీలు తాళాలేసేసుకున్నాయ్. చాలాకంపెనీలు స్టాఫ్ ని తగ్గించుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నాయ్.