ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
posted on Oct 4, 2025 8:57PM

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగన ఛార్జీలు ఈ నెల 6నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.మొదటి 3 స్టేజీల వరకు రూ.5 పెంపు 4 స్టాపుల తరువాత రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. ఆర్డినరీ బస్సులో 1 నుండి 3 స్టాపుల వరకు రూ.5 పెంచారు.
మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. నగరంలో దశలవారీగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ లోపల రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశ పెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో పది డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.