ఈ నెల 18వరకు భారీవర్షాలు!

 నైరుతి రుతుపవనాలు  తిరోగమనం సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే ఆరంభమైంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

అంతే కాకుండా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఆ అల్పపీడన ప్రభావంతో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇలా ఉండగా ఆదివారం (సెప్టెంబర్ 14) హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu