అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చిరంజీవి.. నిజమేనా..?
on Dec 23, 2025

2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)తో ప్రేక్షకులను పలకరించనున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఆ తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఫిల్మ్ ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
నాలుగున్నర దశాబ్దాల కెరీర్ లో 350కి పైగా సినిమాలు చేసిన మోహన్ లాల్(Mohanlal).. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తుంటారు. 2016లో విడుదలైన 'మనమంతా'లో ప్రధాన పాత్ర పోషించారు. అదే ఏడాది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్'లో కథకి కీలకమైన ముఖ్య పాత్ర పోషించారు. ఇటీవల 'కన్నప్ప'లోనూ అతిథి పాత్రలో మెరిశారు. ఇక ఇప్పుడు చిరంజీవితో కలిసి తెరను పంచుకోబోతున్నట్లు సమాచారం. (Chiru Bobby 2)

Also Read: 'ది రాజా సాబ్' ఫస్ట్ రివ్యూ.. షాకిస్తున్న సెన్సార్ రిపోర్ట్!
చిరు-బాబీ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ మోహన్ లాల్ ని సంప్రదించినట్లు వినికిడి. ఈ సినిమాలో నటించడానికి మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. అదే నిజమైతే.. 'జనతా గ్యారేజ్' వచ్చిన పదేళ్ళ తర్వాత మరో తెలుగు స్టార్ తో మోహన్ లాల్ స్క్రీన్ చేసుకున్నట్లు అవుతుంది.
కాగా, ఈ డిసెంబర్ 25న 'వృషభ' సినిమాతో థియేటర్లలో అడుగు పెట్టనున్నారు మోహన్ లాల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



