దేవాన్ష్ కు ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ పురస్కారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్  వరల్డ్ రికార్డ్ సాధించారు. అది అలాంటిలాండ్ అంశంలో కాదు. మేధస్సుకు పదును పెట్టి ఎత్తులకు పై ఎత్తులువేసే ఛెస్ గేమ్ లో.  చెస్‌లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను అత్యంత వేగంగా వేగంగా పరిష్కరించి మరీ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ గా వరల్డ్ రికార్డ్ సాధించి.. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డు అందుకున్నాడు దేవాన్ష్.  మెదడుకు పదును పెట్టి మేథస్సును పెంచే   ఛెస్ లో  దేవాన్ష్ పిన్న వయస్సులోనే సత్తా చాటాడు.  చాటు తున్నాడు.   

లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో  లోకేష్ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ పురస్కారాన్ని అందుకున్నాడు. దేవాన్ష్ తల్లిదండ్రులు లోకేష్, బ్రహ్మణిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   దేవాన్ష్ గతంలోనే చెస్‌లో రెండు ప్రపంచ రికార్డులు సాధించారు. 7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 సెకన్లలో పూర్తి చేశారు. అంతేకాదు, 9 చెస్ బోర్డులపై 32 పావులను 5 నిమిషాల్లో సరిగ్గా అమర్చారు.  

దేవాన్ష్ 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు-2025 గెలుచుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మనవడికి అభినందనలు తెలిపారు. దేవాన్ష్ అతి తక్కువ సమయంలో 175 చెక్‌మేట్ పజిల్స్‌ను పరిష్కరించి  లండన్‌లో పురస్కారం అందుకున్నందుకు గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక నాయనమ్మ నారా భువనేశ్వరి కూడా దేవాన్ష్ ను  అభినందించి ఆశీర్వదిస్తూ ట్వీట్ చేశారు. నారా లోకేష్  అయితే దేవాన్ష్ ను అభినందిస్తూ తన లిటిల్ చాంపియన్ గా అభివర్షించారు. తల్లి బ్రహ్మణి కూడా దేవాన్ష్ పట్ల గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.  ఇది ప్రారంభం మాత్రమే.. పెద్ద కలలు కంటూ ఉండు అంటూ పేర్కొన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu