ఢిల్లీ బంగ్లా హైకమిషన్ వద్ద వీహెచ్‌పీ నేతల నిరసన

 

బంగ్లాదేశ్‌లో  హిందూవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల వీహెచ్‌పీతో పాటు పలు హిందూ సంఘాలు పాల్గొని నినాదాలు చేశాయి. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలు,  దీపూ చంద్ర దాస్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ వీహెచ్‌పీ సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. చంద్ర దాస్‌ మర్డర్‌పై న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu