ఆ టాప్ హీరోయిన్ నాని ని రిజెక్ట్ చేసిందా! ఫ్యాన్స్ ఏమంటున్నారు
on Dec 23, 2025

-ఎందుకు ఆ విధంగా చేసింది
-నాని ప్రస్తుతం ఏం చేస్తున్నాడు
-అభిమానులు ఏమంటున్నారు
తమని మెస్మరైజ్ చేసే విషయంలో నాచురల్ స్టార్ 'నాని'(Nani)ఏ మాత్రం తగ్గడనే నమ్మకం అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది. అందుకు తగ్గట్టే కొంత కాలం నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ హీరోకి లేని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పైగా వేటికవే విభిన్న చిత్రాలు కూడా కావడంతో సిల్వర్ స్క్రీన్ పై నాని చేస్తున్న వీరవిహారం ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి 'ది ప్యారడైజ్'(The paradise)అనే విభిన్నమూవీతో సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు.వచ్చే ఏడాది మార్చి 26 న రిలీజ్ అవుతుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్యారడైజ్ క్యాస్టింగ్ విషయానికి వస్తే నాని సరసన హీరోయిన్ గా ఎవరు జత కట్టబోతున్నారనే విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. డ్రాగన్ బ్యూటీ 'కయదు లోహర్'(Kayadu LOhar)దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై మేకర్స్ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ మూవీలో మొదట హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకోవాలని మేకర్స్ బావించారంట. జాన్వీ ,నాని కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంటుందని భావించి జాన్వీ ని కలిసి క్యారక్టర్ గురించి వివరించారని, కానీ జాన్వీ రిజెక్ట్ చేసిందని అంటున్నారు. ఇందుకు కారణం రామ్ చరణ్(Ram Charan)తో చేస్తున్న'పెద్ది’(Peddi)తో జాన్వీ ఫుల్ బిజీగా ఉండటంతో రెండు సినిమాల డేట్స్ క్లాష్ కావడమే ప్రధాన కారణమనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Also Read: హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్
ఇక ఈ న్యూస్ చూసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు నాని, జాన్వీ ఫెయిర్ బాగుంటుందని ఫ్యూచర్ లో అయినా ఆ ఇద్దరు కలిసి మూవీ చెయ్యాలని కోరుకుంటున్నారు. 'పెద్ది' లో 'అచ్చాయమ్మా' అనే క్యారక్టర్ లో జాన్వీ చేస్తుండగా సదరు క్యారక్టర్ కి సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి స్పందన వస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



