తెలంగాణలో గ్రూపు-2 ఫలితాలు రిలీజ్

 

తెలంగాణలో గ్రూపు-2 ఫలితాలు విడుదల అయ్యాయి. టీజీపీఎస్సీ  చైర్మన్ బుర్రా వెంక‌టేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడించింది. ఒక్క పోస్టును కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో ఉంది. మొత్తం 18 కేట‌గిరిల‌కు సంబంధించి.. ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. 

ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. https://www.tspsc.gov.in/ కాగా, 783 పోస్టులకు గాను 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మూడు దశల్లో ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. తుది ప్రక్రియ అంతా ముగియడంతో.. ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేశారు. తర్వాత వెను వెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

గ్రూప్-2 నోటిఫికేష‌న్‌ను 2022లో విడుద‌ల చేయ‌గా, 2024 డిసెంబ‌ర్ 15, 16 తేదీల్లో రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. దాదాపు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. ఓఎంఆర్‌ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాలతో 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థులకు సంబంధించిన మార్కులు, జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ఈ ఏడాది మార్చి 11న టీజీపీఎస్సీ విడుదల చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu