పవన్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
posted on Sep 28, 2025 3:49PM
.webp)
గత ఐదు రోజులుగా వైరల్ ఫీవర్ బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను, సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించినప్పటికీ మంగళవారం శాఖాపరమైన అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలికాన్ఫరెన్సులు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.
తొలి మూడ్రోజుల్లోనే దాదాపు రూ.250 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆదివారం సెలవుదినం కావడంతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సోమవారం నాటికి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు ఐదు రోజుల క్రితం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.