కాశ్మీర్ యువతపై గంభీర్ ఫైర్... దేశం విడిచి పోండి...
posted on Apr 13, 2017 4:35PM

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కోపం వచ్చింది. జమ్మా కాశ్మీర్ లో నిన్న కాశ్మీర్ యువత జవాను పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జవాను దాడిపై స్పందించిన గంభీర్ కాశ్మీర్ యువతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ముమ్మాటికీ మాదే...స్వాతంత్ర్యం కోరుకునే వాళ్లు దేశం విడిచి వెళ్లండి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు భారతీయ సైనికుడి మీద ఒక్క దెబ్బ పడితే.. కనీసం వంద మంది జీహాదీల ప్రాణాలు తీయాలని అన్నాడు. మన జాతీయ పతాకంలో మూడు రంగులకు మంచి అర్థం ఉందని, అందులో కాషాయ రంగు ఆగ్రహంతో కూడిన మంట అయితే, తెలుపురంగు జీహాదీల శవం మీద కప్పే వస్త్రమని, ఆకుపచ్చ రంగు ఉగ్రవాదాన్ని ద్వేషించడమని తనదైన శైలిలో భాష్యం చెప్పాడు.