దినకరన్ కు మరో ఎదురుదెబ్బ.. కోర్టు నోటీసులు...

 

శశికళ వర్గానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో దినకరన్ ఓటర్లకు డబ్బు పంచుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఆ ఎన్నిక రద్దు అయింది. ఇప్పుడు మరో దెబ్బ తగిలింది. దినకరన్ కు చెన్నైలోని ఆర్థిక నేరాల కోర్టు సమన్లు జారీ చేసింది.  ఫెరా నిబంధనలను దినకరన్ ఉల్లంఘించినట్టు ఈడీ అభియోగాలు మోపడంతో... ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నెల 18, 19 తేదీల్లో కోర్టుకు హాజరు కావాలంటూ జడ్జి ఆదేశించారు. కాగా 1994 నుంచి ఈ కేసు దినకరన్ ను వెంటాడుతోంది. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టులో దినకరన్ కు ఊరట లభించినప్పటికీ... ఈడీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో, ఆయన మళ్లీ విచారణ ఎదుర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu