బీజేపీలోకి ఈటల? రేవంత్ రెడ్డికి నిరాశ! 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్..  తమ రాజకీయ భవిష్యత్ గురించి ఇంతవరకు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. స్థానిక, రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటుగా జాతీయ రాజకీయ పరిస్థితులను, విభిన్న కోణాలలో విశ్లేషించుకుని, చివరకు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. అయితే ఆయన తమ మనసులోని మాటను అధికారికంగా ఇంకా బయట పెట్టలేదు. కానీ,  గడచిన రెండు మూడు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు, మీడియాలో వస్తున్న కధనాల అదే సూచిస్తున్నాయి.

గురువారం, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్.. ఈటలను అయన నివాసంలో కలిశారు. ఈ సందర్భగా ఈటల  తమ నిర్ణయాన్ని  వారికి  తెలియచేసినట్లు సమాచారం.ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి తెరాసకు ప్రత్యాన్మాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈటలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినప్పటికీ,  ఈటల బీజేపీ చేరేందుకే మొగ్గు చుపుతున్నారని ఆయన్ని కలిసిన నేతల సమాచారంగా వుంది. 

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా ఇతర బీజేపీ నాయకులతో రాజేందర్ సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. ఈ విషయాన్ని అటు బీజేపీ నాయకులు, ఇటు ఈటల కూడా దృవీకరించారు.  గురువారం కూడా బండి సంజయ్ బీజేపీ జాతీయ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో  ఈటల రాజేందర్ అంశాన్ని ప్రస్తావించారు. ఈటలకు కాషాయ కండువా కప్పేందుకు త్వరలో ముహూర్తం ఖరారు కానుందని ఆయన స్పష్టం చేశారు.

మాజీ మంత్రితో పాటు టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలను కూడా పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ జాతీయ నేతలు.. బండి సంజయ్  కి  సూచించారు. తెలంగాణ ఉద్యమకారులను బీజేపీలో వైపు తిప్పుకోవాలని హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే బీజేపీ హైకమాండ్ సమయం ఇవ్వగానే ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారని బండి సంజయ్ తేల్చిచెప్పేశారు. బుధవారం ఈటల తన నివాసంలో హజూరాబాద్‌ నియోజకవర్గ నాయకులతో పాటు తన సన్నిహితులతో జరిపిన సమావేశంలోనూ బీజేపీలో చేరిక అంశంపైనే చర్చించినట్లు సమాచారం. బీజేపీలో చేరడమే సరైన నిర్ణయమని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారని, ఈనేపధ్యంలోనే ఈటల  తుది నిర్ణయం తీసుకున్నారని, అయన సన్నిహిత వర్గాల చెపుతున్నాయి.

మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీలో చేరకుండా ఉండేందుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని తెలుస్తోంది. తనకు సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలను రాజేందర్ దగ్గరకు రేవంత్ పంపించారని చెబుతున్నారు. అయితే బీజేపీలో చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న ఈటల.. రేవంత్ మనుషులతోనూ అదే విషయం చెప్పారట. దీంతో చేసేదేమి లేక రేవంత్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై వరుసగా నమోదవుతున్న కేసులతో... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే బెటరని ఈటల అనుకుని ఉంటారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu