సృష్టిలో ముగిసిన ఈడీ సోదాలు
posted on Sep 27, 2025 10:31AM
.webp)
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఈడీ అధికారలు వేర్వేరు ప్రాంతాలలో నిర్వహించిన సోదాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. హైదరా బాద్ జోనల్ ఆఫీస్ కు చెందిన ఈడి అధికారులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కోల్ కత్తా సహా మొత్తం తొమ్మది ప్రాంతాలలో ఈ తనఖీలు నిర్వహించారు. డాక్టర్ నమ్రత యూని వర్సల్ సృష్టి ఫెర్టిలిటీ & రీసెర్చ్ సెంటర్ పేరుతో అక్రమ సరోగసి రాకెట్ దందా కొనసాగించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవ హారంలో పోలీ సులు ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరా బాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమ్రతపై మోసం, మభ్యపెట్టడం, అక్రమ సరోగసి, చైల్డ్ ట్రాఫికింగ్ మొదలగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారం గా ఈడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు సోదాలు నిర్వహింొచారు. ఈ సోదాల్లో ఈడి అధికారులు కీలక పత్రాల తో పాటు మోసపోయిన జంటల వివరాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకు న్నారు.
డాక్టర్ నమ్రత తన సెంటర్ లో పని చేస్తున్న సిబ్బంది, ఏజెంట్ల సహాయంతో గత పది సంవత్సరాలుగా సరోగసి రాకెట్ నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ నమ్రత దేశవ్యాప్తం గా ఈ అక్రమ రాకెట్ నడిపినట్లుగా తేలింది. గుట్టు చప్పుడు కాకుండా గత పది సంవత్స రాలుగా ఈ దందా కొనసాగిం చినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నమ్రత చేతిలో మోసపోయిన ఓ విదేశీ జంటకు ఇచ్చిన శిశువుకు డిఎన్ఏ టెస్టు చేయగా ఆ శిశువు వారి శిశువు కాదని తేలడంతో ఆ శిశువుకు పాస్పోర్ట్ నిరాకరించారు. ఇలా ఈడి దర్యాప్తు లో డాక్టర్ నమ్రత మోసాలు బయట పడ్డాయి. గత రెండు రోజులుగా ఈడి చేసిన సోదాల్లో కీలక పత్రాలతో పాటు మోసపో యిన జంటల వివరాలు, నమ్రత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.