తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు...ఎన్ని కోట్లంటే?
posted on Oct 3, 2025 6:52PM

దసరా పండుగ అంటేనే మందు , విందు.... మందు లేనిదే ముక్క కూడా దిగదు.... దసరా సీజన్‌లో జరిగే మద్యం అమ్మకాలే ఇందుకు ప్రత్యేక సాక్ష్యంగా చెప్ప వచ్చు...ఎప్పటిలాగే మందుబాబులు ఈ ఏడాది కూడా దుమ్మురేపాయి... కొన్ని కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కొంత మేరకు ఊరట లభించిందని చెప్పవచ్చు... అసలు ఈ సంవత్సరం దసరా పండగ మరియు గాంధీ జయంతి రెండు ఒకే రోజు వచ్చాయి... దీంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగవని అనుకున్నారు. కానీ మందుబాబులు ఎవ్వరు ఊహించని రీతిలో కొనుగోలు చేశారు.
దీంతో మద్యం అమ్మకాలు అసాధారణ స్థాయిలో జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఈరోజు మద్యం దుకాణాలతోపాటు మాంసం దుకాణాలను కూడా మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మందుబాబులు తెలివిగా ఆలోచించి ఒకటి రెండు రోజుల ముందే ఇంట్లో పెట్టుకోవడానికి వైన్ షాప్ ల వద్ద క్యూలు కట్టారు... ఈ విధంగా మందుబాబులు సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటో తేదీలలో పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపారు. దీంతో ఊహించని స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి... సెప్టెంబర్ 29వ తేదీన 278 కోట్లు అమ్మగా సెప్టెంబర్ 30వ తేదీన 33 కోట్లు విక్రయించారు.
అక్టోబర్ ఒకటో తేదీన 86.23 కోట్లు అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ మూడు రోజుల అమ్మకాలపై 60 నుండి 80% ఇంకా పెరిగాయి... దసరా వారంలో మద్యం అమ్మకాలు దాదాపు 1000 కోట్లకు చేరినట్లుగా అంచనా... మూడు రోజుల్లోనే6.71 లక్షల లిక్కర్ కేసులు, 7.22 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయినట్లు సమాచారం... 2024 సెప్టెంబర్ లో 28 38 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది 2025 సెప్టెంబర్ నెలలో 3048 కోట్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గత ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పైగా మద్యం సేల్స్ పెరిగినట్లుగా అధికారులు తెలిపారు.. డిస్ట్రిబ్యూటర్లు స్టాక్ అందుబాటులో ఉంచడం వల్లే విక్రయాలు ఊహించని రీతిలో జరిగాయని స్పష్టం వ్యక్తం చేశారు.