మేడారంలో క్యూఆర్ స్కానర్లు.. ఎందుకో తెలుసా?
posted on Oct 11, 2025 9:34AM

మెడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కానుకులు సమర్పించేందుకు ఆన్ లైన్ విధానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. వన దేవతల దర్శనం తరువాత కానుకలు వేసేందుకు జేబులో క్యాష్ లేక భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం అధికారుల దృష్టికి రావడంతో అధికారులు వనదేవతలకు కానుకలు సమర్పించడానికి ఆన్ లైన్ విధానాన్ని ఏర్పాటు చేశారు.
ఇందు కోసం తాడ్వాయ్ కెనరా బ్యాంకు అధికారులతో సంప్రదించి.. మేడారం ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ స్కానర్ లను ఏర్పాటు చేయించారు. దీంతో వనదేవతలను దర్శించుకున్న తరువాత హుండీలో సొమ్ములు వేయాలని అనుకున్నా చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా చెల్లించే అవకాశం ఏర్పడింది. ఈ ఆన్ లైన్ స్కానర్లను మేడారం ప్రధాన పూజారి ఆవిష్కరించారు.