రక్తసిక్తమైన దేవరగట్టు, స్వామి కోసం బన్నీ ఫైట్
posted on Oct 25, 2012 5:30PM

దేవరగట్టు మరోసారి రక్తసిక్తమైంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవంలో భాగంగా జరిగిన కర్రల సమరంలో చాలా మంది గాయపడ్డారు. ప్రతిఏటా విజయదశమి పర్వదినాన ఈ సంప్రదాయం కొనసాగుతోంది. రెండు గంటల పాటు పరిసర గ్రామాల ప్రజలు కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. స్వామివారిని తీసుకు వెళ్లేందుకు ఇరువర్గాలు కర్రలతో బన్నీ ఫైట్ చేశాయి. ఈ దాడిలో సుమారు డెబ్బై మందికి పైగా గాయాలపాలయ్యారు. తలలు పగిలాయి. తీవ్ర గాయాలై తలలు పగిలినప్పటికీ ఇరు గ్రామాల ప్రజలు మళ్లీ బన్నీ ఫైట్‌లో పాలు పంచుకున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ భక్తుల హింసాత్మక ధోరణిని మాత్రం అడ్డుకోలేకపోయారు. దీనిపై పలు సంఘాలు కూడా స్వామి వారి భక్తులలో చైతన్యం తీసుకు వచ్చే కార్యక్రమాలు కొన్నేళ్లుగా చేపడుతున్నారు. కానీ అవి ఫలించడం లేదు.