టాలీవుడ్ లో విషాదం.. నాగార్జున దర్శకుడు మృతి.. కారణమిదే!
on Dec 17, 2025

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్(కేకే) కన్నుమూశారు. మరణానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. స్టమక్ లో ఇన్ఫెక్షన్ వచ్చి, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. (Director Kiran Kumar)
Also Read: చేతులు జోడించి అడుగుతున్నా.. శ్రీలీల ఎమోషనల్!
మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కేకే.. 2010లో నాగార్జున హీరోగా వచ్చిన 'కేడి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. దర్శకుడిగా బ్రేక్ తీసుకున్న ఆయన.. చాలా గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ కి రెడీ అయ్యారు. ఇటీవల KJQ(కింగ్.. జాకీ.. క్వీన్) అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న వేళ.. డైరెక్టర్ కేకే మరణించడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



