హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సన్ టీవీ గ్రూప్
posted on Oct 25, 2012 4:22PM

హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీని సన్ టీవీ గ్రూప్ 850 కోట్లకు బిడ్డింగ్ వేసి దక్కించుకుంది. సంవత్సరానికి రూ. 85 కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లపాటు కాలానికి గాను 850 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించి సన్ గ్రూప్ జట్టును సొంతం చేసుకుంది. డెక్కన్ చార్జర్స్ అనుభవం నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేసి బీసీసీఐ బిడ్డింగ్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గడువు ముగిసింది. చివరకు హైదరాబాద్ జట్టును సన్ గ్రూప్ దక్కించుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం రెండు కంపెనీలు పోటీపడ్డాయి. ఒకటి పీవీపి కాగా రెండోది సన్ టీవి. పీవీపి ఏడాదికి రూ. 75 కోట్ల చొప్పున బిడ్డింగ్ వేయగా సన్ నెట్వర్క్ ఏడాదికి రూ. 85 కోట్లు చొప్పున మొత్తం రూ. 850 కోట్లకు వేసింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ టీవీ గ్రూప్ కి దక్కింది.