ఒంగోలును వదిలే ప్రసక్తి లేదు

 తనకు రాజకీయ జీవితాన్నిఇచ్చిన ఒంగోలును వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బాలినేని కుండబద్దలు కొట్టేశారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో అయిన వాళ్లే కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేస్తున్న వారిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఒంగోలు వాసులకే  తాను జవాబుదారిగా ఉంటానని అన్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu