బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 26 నాటికి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ఈ అల్పపీడనం 27వ తేదీన దక్షిణ ఒడిసా, ఉత్త కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

ఇలా ఉండగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలో  భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు అన్న సమచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక పోతే మంగళవారం తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu