రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
posted on Oct 1, 2025 8:11PM
.webp)
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో విజయదశమికి ప్రత్యేక స్థానం ఉందని, చెెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగ విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని ప్రజలందరికీ సుఖసుంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆ దుర్గమాతను ప్రార్ధించినట్లు పేర్కొన్నారు.
శమీ పూజ చేయడం, అలాయ్ బలాయ్, పాలపిట్ట దర్శనం తెలంగాణకు ప్రత్యేకమని సీఎం పేర్కొన్నారు. మరోవైపు దసరా వేడుకలను పురస్కరించుకొని సీఎం రేవంత్ స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికు వెళ్లనున్నారు. ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ బాపూఘాట్‌లో మహాత్మ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. తర్వాత సర్వమత ప్రార్ధనల్లో పాల్గొంటారు.