డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోపై అనుమానం ఉంది : ఎమ్మెల్యే బొజ్జల
posted on Oct 13, 2025 7:59PM

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హత్య చేయబడ్డ రాయుడు సెల్ఫీ వీడియో పై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు.. తన ప్రతిష్టను దెబ్బ కొట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని అన్నారు.. రాయుడు సెల్ఫీ వీడియో పై అనుమానం వ్యక్తం చేశారు.. హత్య చేసే ముందు వినుత దంపతులు రాయుడుని బెదిరించి ఇలా చెప్పించేరా లేక ఏఐ వీడియోనా అన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు.. ఎన్నికలు సందర్భంగా అప్పటి జనసేన నాయకురాలు వినుత తన విజయానికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు..
ఆమె మద్దతు కోరుతూ తన తల్లి వినుత ఇంటికి వెళ్లిన కనీసం గేటు తీయలేదని అన్నారు. అయినా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏనాడు తాను వినుతపైన ఆరోపణలు చేయలేదని అన్నారు. హత్య జరిగిన తర్వాత కూడా ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు.. అయినా ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఢిల్లీలో వ్యాఖ్యానించారు.. తనపై జరుగుతున్న దుష్ప్రచారం తెరదించేందుకే ఈ అంశంపై తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు