ఆ విషయంలో ఇద్దరు వ్యూహాలూ ఒక్కటే

నీళ్లు పుష్కలంగా దొరికితేనే ఏ ప్రాంతమైనా సస్యశ్యామలం అవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది, కరువు కనుమరుగవుతుంది, పాడిపంటలతో గ్రామాలు కళకళలాడతాయి, రైతులు, ప్రజలు సంతోషంగా ఉంటారు, అందుకే బ్రిటీష్ హయాంలోనూ వ్యవసాయానికి పెద్దపీట వేశారు, ఆనకట్టులు కట్టారు, ప్రజలకు తాగుసాగు నీరు అందేలా చేశారు కాబట్టే బ్రిటీష్ పాలన అంతరించి దాదాపు డెబ్బై ఏళ్లు కావొస్తున్నా గోదావరిపై ఆనకట్ట కట్టిన కాటన్ ను ఈనాటికీ తమ గుండెల్లో పెట్టుకున్నారు ప్రజలు. అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాగుతాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తున్నారు.

ఇంటింటికీ నీళ్లిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతాం...ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్, సేమ్ టు సేమ్ అలాంటిదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్రై చేస్తున్నారు, పట్టిసీమ సక్సెస్ తో తొలి విజయాన్ని అందుకున్న చంద్రబాబు, అదే ఊపులో పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ముందుకు కదులుతున్నారు, 2018 నాటికి పోలవరం చేయగలిగితే, ఆ పేరుతో 2019లో ఓట్లు అడగాలని చంద్రబాబు ఇప్పట్నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు, అందుకే ఆరునూరైనా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరాలని నిర్ణయించుకున్నారట, పోలవరం పూర్తయితే ఇటు కృష్ణాడెల్టాకు, అటు ఉత్తరాంధ్రకు పుష్కలంగా నీరు ఇవ్వొచ్చని, దాంతో శ్రీశైలం నీటిని పూర్తిగా  రాయలసీమకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నట్లుగా పోలవరం పూర్తయితే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కూడా పనికొస్తుంది

అటు తెలంగాణలోనూ కేసీఆర్ ఇలాంటి వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు, తాగుసాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, 2019 ఎన్నికల్లోపే పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు, అందుకే ఇంటింటికీ నీళ్లిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతామంటూ శపథం చేసి మరీ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ ఇద్దరు  అనుకున్నట్లు తాగుసాగునీటి ప్రాజెక్టులను గడువులో పూర్తి చేయగలిగితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu