చంద్రబాబు పైపైకి... కేసీఆర్ కిందికి...
posted on Sep 21, 2015 8:14PM

రాష్ట్ర విభజనతో కష్టాలు, మరోపక్క తీవ్ర ఆర్ధిక లోటు... ఇంకోవైపు కేంద్రం నుంచి నాన్ కోఆపరేషన్...వీటికితోడు ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, పుష్కరాల్లో తొక్కిసలాట...ఇలా అనేక సమస్యలతో ఊపిరి పీల్చుకోలేనంతగా ఇబ్బందిపడ్డ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఇప్పుడు మెల్లగా కుదురుకుంటున్నారు, ఒకవైపు వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ ఇచ్చిన బూస్టింగ్, మరోవైపు పట్టిసీమ సక్సెస్...ఈ రెండు నాయుడులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.
అయితే తెలంగాణలో సీన్ రివర్సైంది, మొన్నటివరకు ఏపీ సీఎం చంద్రబాబుపై పైచేయి సాధించినట్లు కనిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కష్టాల్లో పడ్డారు, ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా,మరోవైపు విపక్షాలన్నీ కలిసి దండయాత్ర మొదలుపెట్టాయి, ఇక వరంగల్ ఎన్ కౌంటర్ తో కొత్త శత్రువులను కొనితెచ్చుకున్న కేసీఆర్... మావోయిస్టుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోంటున్నారు.
పైగా వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 13వ స్థానంలో నిలవడం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోంది, మొన్నటివరకూ దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమని సంబరపడ్డా, ప్రపంచ బ్యాంక్ నివేదికతో నీరుగారిపోవాల్సి వచ్చిందని బాధపడుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 51వేలకోట్లు అప్పు చేశారని ఆర్టీఐ తేల్చిచెప్పడంతో ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఇక రైతు ఆత్మహత్యల్లో అయితే తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే సెకండ్ ప్లేస్ లో ఉండటం టీఆర్ఎస్ సర్కార్ ను కలవరపెడుతోంది, ఇవన్నీ కేవలం నెలరోజుల్లోనే వెంటవెంటనే మీదపడటంతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.