Home

»

Latest News

రజినీకాంత్‌ సినిమాలో షారూక్‌ ఖాన్‌.. కన్‌ఫర్మ్‌ చేసిన మరో హీరో!

Dec 25, 2025

ఇటీవలి కాలంలో పలు భాషలకు చెందిన స్టార్‌ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పటికే కొందరు స్టార్‌ హీరోలు కొన్ని భారీ చిత్రాల్లో కేమియో రోల్స్‌ చేశారు. తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ కూడా  ఒక తమిళ సినిమాలో కనిపించబోతున్నారు. 

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్‌’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌ వంటి ఇతర భాషల స్టార్‌ హీరోలు రజినీకాంత్‌తో కలిసి నటించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్‌2’ రూపొందుతోంది. ఫస్ట్‌పార్ట్‌లో ఉన్న స్టార్‌ హీరోలు ఇందులో కూడా కొనసాగుతారు. వారితోపాటు షారూక్‌ఖాన్‌ కూడా రజినీకాంత్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు.

షారూక్‌ ఖాన్‌కి రజినీకాంత్‌ అంటే ఎంతో అభిమానం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ అభిమానంతోనే తను సొంతంగా నిర్మించిన ‘రా.వన్‌’ చిత్రంలో రజినీతో కేమియో రోల్‌ చేయించారు. ఆ సినిమాలో చిట్టిగా రజినీ కనిపిస్తారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ రజినీ, షారూక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్‌ సీనియర్‌ హీరో మిథున్‌ చక్రవర్తి ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇటీవల మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేశారు. అయితే చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com