నక్సల్ ఫ్రీ కంట్రీ ఎలాగో....వైసీపీ రాక్షసుల్ ఫ్రీ స్టేట్ సాధ్యమేనా?
posted on Dec 21, 2025 11:16AM
.webp)
పవన్ తనకు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సల్ ఫ్రీ కంట్రీగా భారత్ ని ఎలా చేస్తున్నారో.. ఏపీ గవర్నమెంట్ తలుచుకుంటూ జగన్ వెంట ఉన్న ఫ్యాక్షనిస్టులను, గూండాలను, మర్డరిస్టులను అలాగే లేకుండా చేయడం ఏమంత కష్టం కాదన్న కామెంట్ చేశారాయన. దీంతో ఒక్కొక్కరి ఫీజులెగిరిపోయాయ్. మరీ ముఖ్యంగా జగన్ అండ్ కో ఉలిక్కి పడింది.
ఈ కామెంట్ పవన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. అధికారులు సైతం జగన్, ఆయన వెనకున్న ఫ్యాక్షన్ ముఠాలను చూసి భయపడుతుండటం వల్ల. వారికంటూ ధైర్యం అందించే దిశగా పవన్ ఈ కామెంట్ చేసినట్టు కనిపిస్తోంది.
దీనంతటిని బట్టీ చూస్తే.. ప్రభుత్వం తలుచుకుంటే జగన్ని, ఆయన పార్టీని నామ రూపాల్లేకుండా చేయడం పెద్ద పనేం కాదని తెలుస్తోంది. నిజానికి అది సాధ్యమేనా? అంటే అందుకు దగ్గర్లో ఉన్న ఉదాహరణ నక్సలైట్లను భారత ప్రభుత్వం రూపుమాపుతుండటం కంటి ముందు కనిపిస్తూనే ఉంది.
నిన్న మొన్న తెలంగాణ డీజీపీ శివధర్ చెప్పే మాటలను అనుసరించి చెబితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లొంగిపోవల్సిన మావోయిస్టుల సంఖ్య కేవలం 54 మంది మాత్రమేనట. యాభై నాలుగు మంది అంటే చాలా చాలా తక్కువ సంఖ్య. ఇప్పటికే కొన్ని వందలాది మంది మావోయిస్టులు ఇటు ఛత్తీస్ గఢ్, అటు మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ముందు లొంగిపోతున్న దృశ్యాలు లేదా ఎన్ కౌంటర్ అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి.
ఈ యాంగిల్లో చూస్తే జగన్, ఆయన వెనకున్న రప్ప రప్ప బ్యాచ్ ని అంత మొందించడం పెద్ద పనేం కాదు. ఇప్పటికే జగన్ తన 5 ఏళ్ల పాలనా కాలంలో చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ప్రతిదీ తవ్వి పోస్తున్నారు సీఐడీ అధికారులు. ఇంకా ఎన్నో డిపార్ట్ మెంట్లు జగన్ చుట్టూ అల్లుకుని ఉన్న అవినీతి ప్రపంచం మొత్తాన్ని డీకోడ్ చేస్తున్నారు. వరుస అరెస్టులు చేస్తున్నారు.
అలాంటిది జగన్ చుట్టూ ఉన్న వారితో పాటు జగన్ ని సైతం జైలు పాలు చేయడం గానీ ఆయన అనుచరగణాన్ని అరెస్టు చేయడం పెద్ద కష్టమేం కాదు. దానికి తోడు ప్రస్తుతం ఉన్న చట్టాలను బట్టీ చూస్తే.. ఇలాంటి వారు ఫలానా కేసుల్లో ఫ్రేమ్ అయితే ఆ తర్వాత ఉన్న ఆ అరకొర, బొటాబొటి పదవులను కూడా కోల్పోయి జైల్లో చిప్ప కూడు తినాల్సి వస్తుంది. మరో లాలూ ప్రసాద్ యాదవ్ లా జగన్ ఆయన అనుచరగణం మారాల్సి వస్తుంది. కాబట్టి జగన్ అండ్ గో గంగమ్మ జాతర రివర్స్ లో పడేలా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో చెప్పేదేముందీ జగన్ రాక్షసుల్ ఫ్రీగా ఏపీ స్టేట్ అవతరించినా అవతరిస్తుంది.