కేసీఆర్, మోడీ.. డీల్ సెట్ అయ్యిందా?

చాలా మంది అనుకుంటున్న‌ట్టు.. కేసీఆర్   ఫామ్ హౌస్ లో కూర్చోవడానికి ఆరోగ్యం కారణం కాదట... ఆయన అరోగ్యం శారీర‌క‌మైన‌ది కాదు,  ఆర్ధిక‌ప‌ర‌మైన‌ది, బయటకు తెలియని రాజకీయపరమైనది అనంటున్నారు.   తెలంగాణలో ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న‌ ఒక శ‌తృవును ఢీ కొట్టాలంటే.. మ‌రో ఇద్ద‌రు మితృలుగా కలవాలి అన్న భావనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు.  రేవంత్ దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని  మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ ముందుకెళ్తున్నారు.

దీంతో ఇటు మోడీకి, అటు కేసీఆర్ కి ఒక ర‌క‌మైన మితృత్వం అవ‌స‌ర‌మైంది. ఎలాగైనా స‌రే ఇక్క‌డ పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న మోడీ ఏకకాలంలో ఇటు కేసీఆర్, అటు రేవంత్ ఇద్దరికీ సమప్రాధాన్యత ఇస్తూ పొలిటికల్ గేమ్ అడుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్ కి అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేశారు. అదేమంత ఫలితం ఇచ్చినట్లు కనబడదు.  నెక్స్ట్ స్టెప్ లో.. కేసీఆర్ అండ్ కో    లోక్ స‌భ‌లో లోపాయికారిగా స‌హ‌క‌రిస్తామ‌ని  మోడీకి మాటిచ్చారంటున్నారు. అన్నట్లుగానే  కేసీఆర్ తాను జీరో  అయ్యి మరీ బీజేపీకి 8 ఎంపీ  సీట్ల‌తో ఒక ఊపు ఉత్సాహం కలిగించేలా 2024 సార్వత్రిక ఎన్నికలలో సహకరించారంటారు పరిశీలకులు.

అయినా స‌రే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం  క‌నిక‌రించ‌కుండా కేసీఆర్ లాంటి మ‌ద‌గ‌జాన్ని సంపూర్ణంగా  గుప్పెట్లో పెట్టుకోవాల‌న్న యోచనతో   క‌వితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేందు కూడా సై అన్న కేసీఆర్.. ఆ తరువాత బీజేపీతో అసలు డీల్ స్టార్ట్ చేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.  సరే సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందం టున్నారు విశ్లేషకులు.  

గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు. ఇంతకీ మోడీ పాలసీ ఎంటంటారా?.. భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీల అగ్రనాయకులను తొలుత కేసులతో భయపెట్టి, ఆ తరువాత   కమలం శరణ్యం అనేలా దారికి తెచ్చుకోవడం. కేసీఆర్ విషయంలోనూ మోడీ అదే పాలసీని అవలంబించి ఉంటారని అంటున్నారు.  

ఈ నేపథ్యంలోనే ఇటీవల  రేవంత్ చేసిన కామెంట్ ను కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఫార్ములా వన్ రేస్ కేసులో  కేటీఆర్ విచార‌ణ‌కు,  కాళేశ్వ‌రం వ్య‌వ‌హారంలో కేసీఆర్, హ‌రీష్ ల అరెస్టుకు ఈడీ, సీబీఐకి అనుమ‌తులివ్వ‌డంలో కేంద్రం ఆమోదయోగ్యం కాని జాప్యం చేస్తున్నదని రేవంత్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. సరే ఆ తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి.   కాళేశ్వరం వ్యవహారంలో ఇంకా ఎటువంటి కదలికా రాలేదన్నది తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన సుదీర్ఘ అజ్ణాతాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించడం చూస్తుంటూ.. కేంద్రంలో ఆయన ఏదో ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చినట్లే భావించాల్సి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఆదివారం (డిసెంబర్ 21) మీడియా సమావేశంలో విమర్శలు గుప్పిస్తూనే మోడీ గారు అని సంబోధించడాన్ని వారు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. గతంలో మోడీయా, బోడీయా అన్న కేసీఆర్ ఇప్పుడు మర్యాదపూర్వకంగా మోడీగారూ అంటూ విమర్శించడమే ఏదో ఒప్పందం జరిగే ఉంటుందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu