కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో పిల్లలను వేధిస్తున్న ఓ   ఉపాధ్యాయునికి భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు దేహశుద్ధి చేసిన సంఘటన  బుధవారం (అక్టోబర్ 22) సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

 భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో వారిని వేధింపులకు గురి చేస్తున్న విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు బుధవారం సాయంత్రం ఆ పాఠశాలకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.

అనంతరం ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో విద్యార్థినులతో ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సోషల్ మీడియాలో వేధిస్తున్నట్లు పలువురు విద్యార్థినులు తమకు ఫిర్యాదు చేయడంతోనే ఆ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశామని విద్యార్థి పరిషత్ నాయకులు చెప్పారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu