మేస్త్రీ- మెస్సీ...టూర్ ఆఫ్ హైదరాబాద్
posted on Dec 13, 2025 12:17PM
.webp)
ప్రపంచ ఫుట్ బాల్ లెజండ్, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ 14 ఏళ్త తర్వాత తిరిగి భారత్ వచ్చారు. 2011లో కోల్ కతాలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత మెస్సీ ఇండియా రావడం ఇది సెకండ్ టైం. GOAT ఇండియా టూర్ పేరుతో మూడు రోజుల పాటు ఆయన భారతదేశంలో పర్యటిస్తారు.ఈ టూర్ లో మెస్సీ మొదట కోల్ కత, తర్వాత హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, ఢిల్లీ సందర్శిస్తారు. ఈ టూర్ మెయిన్ టార్గెట్ ఏంటంటే దేశంలో ఫుట్ బాల్ ని ప్రోత్సహించడం. ఆపై చారిటీ, కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం.
కోల్ కతాలో శనివారం ఉదయం సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అటు తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నటుడు షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ వంటి వారిని కలుస్తారు. అలాగే శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు మెస్సీ.
ఇక శనివారం సాయంత్రం మెస్సీ హైదరాబాద్ వస్తారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో కలసి ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతారు.. ఆ తర్వాత మెస్సీ గౌరవార్దం సంగీత కచేరీ.. ప్రీమియం మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఫలక్ నుమా ప్యాలెస్ లో ఫోటో సెషన్లో పాల్గొంటారు మెస్సీ. ఒక్కో ఫోటో కోసం పది లక్షల మేర వసూలు చేస్తారు.
ఆల్రెడీ మెస్సీతో ఫుట్ బాల్ ఆడ్డానికి మేస్త్రీ రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం నెట్టింట రేవంత్ ఫుట్ బాల్ ఆడిన వీడియులు తెగ వైరల్ అవుతున్నాయి. బేసిగ్గా ఫుట్ బాల్ అంటే ఎంతో మక్కువ గల రేవంత్ కి తెలంగాణలో క్రీడాభివృద్ధిపై ప్రత్యేకమైన ఆలోచనలున్నాయి. ఇది వరకే కపిల్ వంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి.. తెలంగాణలో క్రీడాభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మెస్సీతో కలసి ఆయన ఫుట్ బాల్ ఆడి.. ఇక్కడ ఈ ఆటకు విశేషమైన ఆదరణ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొన్నటి గ్లోబల్ సమ్మిట్ లోనూ వివిధ క్రీడారంగాలకు సంబంధించిన ఎందరో ప్రముఖులను ఆహ్వానించి వారి ద్వారా క్రీడా చర్చలు జరిగేలా చేశారు. 140 కోట్ల మంది భారతీయులకు ఒలింపిక్స్ లో బొటాబొటీగా మెడల్స్ వస్తున్నాయ్. ఈ సంఖ్యను పెంచడానికి మన వంతు కృషి చేయాలన్నదే సీఎం రేవంత్ ఆలోచన. ఈ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ మెస్సీ టూర్ ప్లాన్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇక ఆదివారం నాడు ముంబైలో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఎం.ఎస్. ధోనీ, శుభ్‌మన్ గిల్ వంటి క్రికెటర్లు, నటి కరీనా కపూర్, నటుడు జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో సమావేశమవుతారు మెస్సీ. సోమవారం ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు మెస్సీ.మెస్సీ, మేస్త్రీ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మ్యాచ్‌కి ముందు ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో భాగంగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనల్లో ప్రముఖ హైదరాబాద్ రాప్ సింగర్ కేడన్ శర్మ పాల్గొంటారు.
పాటలు, డ్యాన్స్‌లతో హైదరాబాద్ లైఫ్ స్టైల్లో భాగమైన, బిర్యానీ, ఇరానీ చాయ్ గొప్పదనాన్ని వివరిస్తారు. తెలుగు సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చెబుతారు. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే బిర్యానీ- బాల్ బాడ్మింటన్- బాహుబలి అంటూ మోడీ లాంటి వారే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక కేడన్ శర్మ మాట్లాడుతూ.. గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇవ్వబోతున్న తొలి భారతీయ హిప్-హాప్ ఆర్టిస్ట్‌గా తాను రికార్డు సృష్టించడం గర్వంగా ఉందన్నారాయన. తాను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడినని.. అందుకే తన ప్రదర్శనలు పక్కా లోకల్‌గా, స్ట్రీట్ బేస్‌డ్‌గా ఉంటాయని అన్నారు.
నేను సాయి పల్లవి, అల్లు అర్జున్ గురించి మాట్లాడతాను, సల్మాన్ ఖాన్ గురించి కాదు. తెలుగు సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లాయని అన్నారు. తన పర్ఫామెన్స్‌లో మెస్సీకి పుష్ప ఫేమస్ డైలాగ్ వినిపిస్తానని అన్నారు. ఏది ఏమైనా వరల్డ్స్ ఫుట్ బాల్ లెజండ్ మెస్సీ రాకతో ఇక్కడి ఫుట్ బాల్ లవర్స్ ఎంతో హ్యాపీ ఫీలవుతున్నారు. మరీ ముఖ్యంగా మేస్త్రీ రేవంత్ ఎప్పుడెప్పుడు మెస్సీతో కలసి కాలు కాలు కదుపుతామా అన్న ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు.