సత్తా చాటుతున్న బీజేపీ...

 

దేశంలో పలు అసెంబ్లీ స్థానాలకు గాను ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈ ఉపఎన్నికల ఫలితాల్లో పలు ప్రాంతాల్లో బీజేపీ తన హవా చాటుకుంది.  మొత్తంగా ఆరు స్థానాల్లో గెలుపు దిశగా బీజేపీ సాగుతుండగా.. కర్ణాకటలోని రెండు స్థానాల్లో పాగావేసే దిశగా కాంగ్రెస్‌ పార్టీ సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టు నిలుపుకుంది.

ఉప ఎన్నికల ఫలితాలు..
* మధ్యప్రదేశ్‌ బాంధవ్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి శివనారాయణ్‌సింగ్‌ విజయం. అటేర్‌ నియోజకవర్గంలోనూ ఆధిక్యం
* అసోం ధేమలీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం. కాంగ్రెస్‌ అభ్యర్థి బాబుల్‌ సోనోవాల్‌పై బీజేపీ నేత రోనోజ్‌ పెగు గెలుపు
* రాజస్థాన్‌ ధోల్‌పూర్‌లో విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థి శోభారాణి కుశ్వాహ
* హిమాచల్‌ ప్రదేశ్‌ భోరాంజ్‌లో  8433 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అనిల్‌ ధిమన్‌ విజయం
* పశ్చిమబెంగాల్‌ కాంతి దక్షిణ్‌ స్థానంలో టీఎంసీ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య ఆధిక్యం

Online Jyotish
Tone Academy
KidsOne Telugu