తమిళనాడు సర్కార్ పై సుప్రీం ఆగ్రహం..ఎందుకు పట్టించుకోవడం..
posted on Apr 13, 2017 3:04PM
.jpg)
రైతు రుణాలను మాఫీ చేయాలని తమిళనాడు రైతులు ఎప్పటి నుండో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం వారి ఆందోళనులు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా దీనిపై విచారించిన కోర్టు...రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు రైతుల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని... మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. తమిళనాడులో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది.