రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని కేబినేట్ నిర్ణయం

 

రాష్ట్రంలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని  తెలంగాణ కేబినేట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్ మార్చనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో  42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు శాసన సభలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేసే అవకాశముంది. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా కీలక చర్చ జరిగే అవకాశముంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu