హెచ్ 1 బి వీసాలలో అమెజాన్ టాప్.. రెండో స్థానంలో టీసీఎస్

హెచ్1బి విసాలఫీజును భారీగా పెంచుతూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియన్ల అమెరికా కలలను భగ్నం చేసిందనే చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన  ట్రంప్ నిర్ణయం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న  భారతీయ   కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఇండియన్ ఐటీ సంస్థలు  నైపుణ్యం కలిగిన నిపుణులను అమెరికాలో నియమించుకోవడానికి H1-B వీసాపైనే ఎక్కువగా ఆధారపడతాయి. అలాగే  అమెరికన్ టెక్ దిగ్గజాలు కూడా ఈ వీసా   ద్వారా పెద్ద సంఖ్యలో భారతీయులను నియమించుకుంటాయి.

ఈ పరిస్థితుల్లో వీసా ఫీజు భారీగా పెంచడం ద్వారా అటువంటి నియామకాలపై పెను ప్రభావం పడిందనే చెప్పాలి.  అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్  తాజా డేటా  ప్రకారం చూస్తే..  2024–25 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధిక సంఖ్యలో H1-B వీసాలను అందుకుంది. ఇక  రెండో స్థానంలో టీసీఎస్ ఉంది.   అమెజాన్ డాట్ కామ్  సర్వీసెస్ 10,040 హెచ్1 బివీసాలను, టీసీఎస్ 5,505 హెచ్1బీ వీసాలను తీసుకున్నాయి. ఇక మూడో స్థానంలో  మైక్రోసాఫ్ట్ 5,189 వీసాలతో, మెటా 5,123, ఆపిల్ 4,202 వీసాలతో వరుసగా ఆ తరువాతి స్థానాలలో ఉన్నాయి. అలాగే దిగ్గజ టెక్ సంస్థలు  ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా  కూడా  పెద్ద సంఖ్యలోనే హెచ్1 బి వీసాల ఆధారంగా ఇండియన్స్ ను అక్కడ కొలువుల్లో చేర్చుకున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu