తల్లిని కొట్టి పశ్చాత్తాపంతో... బీజేపీ నేత ఆత్మహత్య

 

రంగారెడ్డి జిల్లా ఉప్పల్ బిజెపి పార్టీ నాయకులు రేవెల్లి రాజు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబంలో చీకట్లు అలుము కున్నాయి. అయితే  రేవల్లి రాజు నిన్న రాత్రి సమయంలో ఆత్మ హత్య చేసుకో బోయే ముందు ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అనం తరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. బిజెపి పార్టీ నాయకులు రేవల్లి రాజు తన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 

ఏ కొడుకు కూడా కన్నతల్లిని కొట్టాలని అను కోడు... కానీ కుటుంబ కలహాల నేపథ్యంలో నేను ఆ తప్పు పని చేశాను. నేను చేసింది తప్పే... అమ్మ నన్ను క్షమించు... కానీ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం వల్ల నేను ఎక్కడికి వెళ్లినా తలెత్తు కోలేకపోయాను. నేను ఎప్పుడైనా నా కుటుంబం కోసం కష్టపడ్డాను.అందుకే అన్ని చేశాను. నా తమ్ముడి పెళ్లి కూడా చేశాను. కానీ ఈరోజు నా తల్లి నన్ను మోసం చేసింది..అమ్మను కొట్టాను. నేను తప్పే చేశాను. అయితే ఈ విషయం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి తిట్టిపియాలి అంతేకానీ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం వల్ల ఈరోజు నేను ఎక్కడ తలెత్తుకొని తిరగలేకపోతున్నాను... పరువు కోసం నేను ప్రాణాలైనా తీసుకుంటాను.

ఈ వీడియో తీసింది ఎవరో అమ్మకు తెలుసు.... తమ్ముడికి తెలుసు... అంత ఎందుకు ఈ వీడియో నా మరదలే తీసి.... వైరల్ చేసింది... కేవలం ఈ వీడియో వల్లనే నేను ఈరోజు ఎవరి వద్దకు వెళ్లి మాట్లాడలేకపోతున్నాను... నా  పరువు మొత్తం పోయింది. అందుకే ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయిం చుకున్నాను... నేను ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆ వీడియో ఒకటే కారణం... మా అమ్మ నన్ను మోసం చేసింది. అమ్మ నువ్వు నా మీద పగ పట్టి...మోసం చేసి నట్లుగా నా పిల్లల ను మోసం చేయకు... నా పిల్లలు అమాయ కులు ,చిన్నపిల్లలు దయచేసి వారి మీద పగ పట్టి మోసం చేయకు.... నీకు దండం పెడతానని రాజు తల్లిని వేడుకున్నాడు. శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, స్నేహితులు అందరూ నన్ను క్షమించాలని... వేడుకున్నాడు.

 కార్యకర్తలు ఇప్పటివరకు నాకు తోడుగా ఉన్నట్లుగానే... రేపు నా కుటుంబానికి తోడుగా, అండగా ఉండాలని కోరు కుంటున్నానని తన రేవల్లి  రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజు ఆత్మహత్య చేసుకోబోయే ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అనంతరం బీబీనగర్ వద్ద ఉన్న పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు వీడియోను  స్వాధీనం చేసు కుని...మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. రాజు భార్య మహిమ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu