బర్త్ డే బంప్స్ ఆట ఆడి మంచానికే పరిమితమైన విద్యార్థి
posted on Sep 17, 2025 9:25PM

బర్త్ డే బంప్స్ అనే ఆట ఆడుతూ ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన నాచారం లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది.. పుట్టినరోజున స్కూల్ కి వెళ్లి తన స్నేహితులతో ఎంజాయ్ చేయా లని వెళ్లిన ఓ బర్త్డే బాయ్ కి విషాదం ఎదురైంది... స్నేహితులు బర్త్ డే బంప్స్ అనే ఆట ఆడి... బర్త్డే బాయ్ ని తీవ్రంగా గాయపరిచారు. చివరకు అతను బెడ్ కే పరిమితం అయ్యాడు. పుట్టినరోజు ఈ విషాదం జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విడిపించ సాగారు తన కొడుకు ఈ పరిస్థితికి రావడానికి గల కారకులపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంతటి దారుణ మైన ఘటన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగింది..హైదరాబాద్ కొత్తపేట న్యూ మారుతి నగర్ లోని జీవీకే విజయ భారతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సునీత అనే మహిళ కొడుకు బుర్ర ప్రశాంత్ నాచారం బ్రాంచ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 29వ తేదీన ప్రశాంత బర్త్డే ఉంది అయితే బర్త్డే రోజు తన స్నేహితులందరితో కలిసి ఎంజాయ్ చేయాలని ఎంతో ఆశపడ్డాడు ఈ తరుణంలోనే ప్రశాంత్ మధ్యాహ్నం 12:50 గంటల ప్రాంతంలో స్కూలుకు వెళ్లి స్నేహితులందరికీ చాక్లెట్లు ఇచ్చి వారితో సరదాగా గడపసాగాడు అదే సమయంలో స్నేహితులందరూ కలిసి బర్త్ డే బంప్స్ అనే ఆట ఆడాసాగారు.
అయితే ఈ క్రమంలో చరణ్ అనే విద్యార్థి ఒక్కసారిగా రిశాంత్ ప్రైవేట్ పార్ట్ పై మోకాళ్ళతో బలంగా కొట్టాడు... మిగతా విద్యార్థులు అందరూ కలిసి ప్రశాంత్ పై దాడి చేశారు. దీంతో ప్రశాంత్ వృషణాలలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. అంతేకాకుండా అతని ప్రైవేట్ పార్ట్ నుండి రక్త స్రావం అయ్యింది... దీంతో రిషాంత్ స్పృహ తప్పి పడిపో యాడు. రిషాంత్ తల్లిదండ్రులకి సమాచారం రావడంతో... హుటా హుటిన స్కూల్ కి చేరుకున్న తల్లిదండ్రులు రిషాంత్ చూసి వెంటనే స్థానికంగా ఉన్న ప్రసాద్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్ష చేసి వెంటనే అతన్ని గాంధీ నగర్ లోని నర్మదా హాస్పి టల్ కి తరలించారు. నర్మదా హాస్పిటల్ లో వైద్యులు పరిక్షించి రిషాంత్ వృషణం దెబ్బతి న్నట్లుగా నిర్ధారిం చారు.
అనంతరం శస్త్ర చికిత్స కోసం బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ కి పంపించారు. అక్కడ కేర్ హాస్పిటల్ లో రిశాంత్ కి సర్జరీ చేశారు... రిషాంత్ మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. మూడు నెలల తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తామని వైద్యులు అన్నారు... ఎంతో సంతోషంగా నవ్వుతూ..
తూలుతూ... ఇల్లంతా తిరిగే తన కొడుకు మంచానికే పరిమితం కావడం తో ఆ తల్లిదండ్రులు ఆగ్రహం చెందారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించి ఉంటే తన కొడుకు పరిస్థితి ఇంత తీవ్రతకు చేరుకోక పోతుండే... స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణం గానే తన కొడుకుకి ఈ పరిస్థితి వచ్చిం దని... అట్టివారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇన్చార్జి మరియు రిషాంత్ ను గాయపరచిన చరణ్ అతని స్నేహితులపై నాచారం పోలీసు లకు ఫిర్యాదు చేశారు. నాచారం పోలీసులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై 117(2)r/w3(5)BNS కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.