డిజిటల్ అరెస్ట్ కు భయపడి లేడీ డాక్టర్ మృతి

 

మీకు ఎవరైనా ఫోన్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని మీపై కేసులు ఉన్నాయని.. మీ వాళ్లను అరెస్టు చేశారంటూ వచ్చే ఫేక్ కాల్స్ లను నమ్మొద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా చాలామంది ఇటువంటి కాల్స్ రాగానే భయప డిపోయే లక్షల్లో డబ్బులను కేటు గాళ్ల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు... ఓ వృద్ధురాలికి ఇటు వంటి కాల్స్ రావ డంతో భయపడి పోయే హార్ట్ ఎటాక్ తో మరణించింది..

హైదరాబాద్ అమీర్పేట్, ఎస్ ఆర్ నగర్ పరిధిలో ఉన్న మధురానగర్ లో నివాసం ఉంటున్న ఒక రిటైర్డ్ మహిళ డాక్టర్ (75) కు ఓ ఒక వీడియో కాల్ వచ్చింది.  దానిని ఆమె రిసీవ్ చేసుకుంది. ఆ వీడియో కాల్ లో పోలీస్ కనిపించడం తో లేడీ డాక్టర్ ఒక్క సారిగా భయభ్రాం తులకు గురైంది.  మేము పోలీసుల మని మీపై మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని  కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు... 

మిమ్మల్ని అరెస్టు చేయవద్దంటే మేము చెప్పిన విధంగా డబ్బులు చెల్లించాలంటూ భయపెట్టారు. దీంతో చేసేదేమీ లేక బాధిత వృద్ధురాలు వారు చెప్పిన అకౌంట్ కి 6.5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. అయినా కూడా వారి వేధింపులు ఆగలేదు. మరి నీ డబ్బులు కావాలని ఇవ్వకపోతే అరెస్టు చేస్తామంటూ వేధించారు. సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు తాళలేక బాధిత డాక్టర్ గుండెపోటు తో మృతి చెందింది. 

తన తల్లి మృతికి సైబర్ చీటర్స్ కారణమంటూ కొడుకు హైదరా బాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు ఈ తరహా డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu