బిగ్‌బాస్ : స‌న్నీ మీ టైమ్ వ‌చ్చేసింది

గ‌త సీజ‌న్‌లో సోహైల్ `క‌థ వేరే వుంట‌ది` అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. క‌ప్పు గెల‌వ‌లేక‌పోయినా విన్న‌ర్ ని మించిన పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయితే తాజా సీజన్ లో మాత్రం వీజే స‌న్నీ `అప్నా టైమ్ ఆయేగా`... క‌ప్పు ముఖ్యం బిగులూ.. అంటూ ర‌చ్చ చేస్తున్నాడు. ఈ రెండు డైలాగ్‌ల‌తో స‌న్నీ ప్రేక్ష‌కుల హృద‌యాల్ని గ‌ట్టిగానే త‌డిమిన‌ట్టున్నాడు. ఎందుకంటే ఇదే విష‌యాన్ని బిగ్‌బాస్ నొక్కి మ‌రీ చెప్ప‌డం... మీ టైమ్ వ‌చ్చేసింద‌ని ఇండైరెక్ట్‌గా విజేత నువ్వే అంటూ హింట్ ఇచ్చేయ‌డం స‌న్నీ అభిమానుల్లో ఆనందాన్ని క‌లిగిస్తోంది. క‌ప్పు ముఖ్యం బిగులూ అంటూ టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో వున్న వీజే స‌న్నీ త‌న జ‌ర్నీ అన్ని ర‌కాల ర‌సాల‌ని పండించి ఒక విధంగా సినిమాలో హీరో త‌ర‌హాలో ప‌రిపూర్ణంగా నిల‌వ‌డం విశేషం. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌సారం అయిన ఎపిసోడ్ లో ముందు ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ జ‌ర్నీని చూపించిన బిగ్‌బాస్ ఆ త‌రువాత వీజే స‌న్నీని లాన్ లోకి పిలిచి అత‌ని జ్ఞాప‌కాల్ని... హౌస్ లో అత‌నికి ఎదురైన అవ‌మానాల్ని.. గెలుచుకున్న ఎవిక్ష‌న్ పాస్ ని .. మిగ‌తా వారి కోసం దాన్ని త్యాగం చేసిన తీరుని చూపించాడు. Also read: ష‌న్ను - సిరిల‌కు జెస్సీ స్ట్రాంగ్ వార్నింగ్ ఆ త‌రువాత స‌న్నీ జ‌ర్నీని శ్రీ‌మంతుడు, లెజెండ్‌.. మాస్ట‌ర్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని వేసి హౌస్ లో స‌న్నీ ఓ హీరో అనే స్థాయిలో ఇచ్చిన ఎలివేష‌న్‌.. అత‌నే ఈ సీజ‌న్ విజేత అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పిన తీరుతో స‌న్నీనే ఈ జీన్ విజేత అని క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. `స‌ర‌దా స‌న్నీ ఒకే అక్ష‌రంతో మొద‌ల‌వుతాయ‌ని .. మీరు గుర్తు చేశారు. గెలిచిన ఆట‌లు.. జ‌రిగిన గొడ‌వ‌లు.. మోసిన నింద‌లు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా అంద‌రి ముఖంపై చిరున‌వ్వు తీసుకు వ‌చ్చి ఎంట‌ర్‌టైన‌ర్ గా అంద‌రి మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. `అప్నా టైమ్ ఆయేగా.. స‌న్నీ మీ స‌మ‌యం వ‌చ్చేసింది` అంటూ బిగ్ బాస్ స‌న్నీని ఓ రేంజ్ లో పొగ‌డ్త‌ల‌తో ముంచేసి విజేత త‌నే అంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేయ‌డంతో స‌న్నీ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. 

శ్రీ‌రామ‌చంద్ర‌ను గెలిపించ‌మంటూ ఆటో తోలిన ర‌వి! వీడియో వైర‌ల్‌!!

  బిగ్ బాస్ తెలుగు 5వ సీజ‌న్ క్లైమాక్స్‌కు వ‌చ్చింది. 13 వారాల‌కు పైగా వీక్ష‌కుల్ని రంజింప‌చేస్తోన్న ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా నిల‌వ‌డానికి బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్‌.. న‌లుగురు మేల్, ఒక‌రు ఫిమేల్‌.. ఢీ అంటే ఢీ అంటున్నారు. అభిమానుల‌తో పాటు, హౌస్‌లో వారికి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి, బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెస్టెంట్స్ కూడా త‌మ‌కు న‌చ్చిన ఫైన‌లిస్ట్ గెలుపు కోసం తీవ్రంగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. వీజే స‌న్నీ, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి హ‌న్మంత్‌, మాన‌స్ ల‌లో ఎవ‌రికి గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తోంది. బెట్టింగ్ రాయుళ్లు త‌మ ప‌ని తాము చేస్తున్నారు.  Also read:  నాగ్.. విన్న‌ర్‌గా అత‌న్నే చూడాల‌నుకుంటున్నారా? స‌న్నీ, ష‌ణ్ణు, శ్రీ‌రామ్ మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన్న‌ద‌నీ, ఈ ముగ్గురిలో ఒక‌రు విన్న‌ర్ అవ‌డం త‌థ్య‌మ‌నీ గ‌ట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు హౌస్‌లో త‌న‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన సింగ‌ర్ శ్రీ‌రామ‌చంద్ర కోసం యాంక‌ర్ ర‌వి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక శ్రీ‌రామ్‌తో మాట్లాడుతూ, "నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా" అని చెప్పాడు ర‌వి. ఇప్పుడు ఆ మాట‌ను నిల‌బెట్టుకుంటూ అత‌ని గెలుపు కోసం వినూత్నంగా ప్ర‌చారం చేస్తున్నాడు. Also read:  కాజ‌ల్ పారితోషికం ఎంతో తెలుసా? రోడ్డుపై "బిగ్ బాస్ హౌస్‌.. బిగ్ బాస్ హౌస్" అని కేక‌లు వేసుకుంటూ ఒక ఆటో న‌డిపాడు. "బిగ్ బాస్‌ సీజన్‌ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి" అంటూ ప్ర‌చారం చేశాడు. ఆటో వెనుక వోట్ ఫ‌ర్ శ్రీ‌రామ్ అనే పోస్ట‌ర్ అతికించాడు. ఈ వీడియోను త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ర‌వి, "All the five are deserving, But the title deserving SRC" అనే క్యాప్ష‌న్ పెట్టాడు. ఫ్రెండ్ కోసం ర‌వి ప‌డుతున్న త‌ప‌న చూసి, అంద‌రూ అత‌డిని ప్ర‌శంసిస్తున్నారు. శ్రీ‌రామ‌చంద్ర అభిమానులు కూడా ర‌వి ఆటో తోలుతూ, శ్రీ‌రామ‌చంద్ర‌కు ఓటేయ‌మ‌ని అడుగుతున్న వీడియోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. 

ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ : మ‌ళ్లీ రెచ్చిపోయిన రోజా

న‌టి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో వున్నా.. ఆడిటోరియంలో వున్నా స‌రే త‌గ్గేదిలే అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. గ‌త కొంత కాలంగా ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కి రోజా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. స్కిట్ లు చేసే టీమ్ ల‌పై అదే రేంజ్ లో పంచ్ లు వేస్తూ వుంటుంది రోజా. అవి కొన్ని సార్లు మ‌రోలా పేలుతుంటాయి. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో రోజా వేసిన పంచ్ న‌వ్వులు పూయించ‌డ‌మే కాకుండా ఆ పంచ్ కి బీప్ వేస్తే బాగుంటుందే అనేలా వుంది. మాళ‌విక ప్లాన్ వేద తెలుసుకుంటుందా? తాజా ఎపిసోడ్ లో ర‌ష్మీ గౌత‌మ్‌, గెటప్ శ్రీ‌ను ఏజెంట్ లుగా మారి రంగంలోక‌రి దిగారు. ప్ర‌మో స్టార్టింగ్ లోనే `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కి మీరు అన్యాయం చేశారంటూ మిగ‌తా స‌భ్యుల‌పై ఫైర్ అయింది ర‌ష్మీ.. ఆ వెంట‌నే ఆటో రాంప్ర‌సాద్ అందుకుని నాకైతే ఫ‌స్ట్ మిమ్మ‌ల్నే క‌ట్టేయాలంటాడు. స్కిట్ చేయ‌మంటే ష‌బీనాతో ల‌వ్ సింబ‌ల్ చేయించుకుంటున్నావా సిగ్గుందా అస‌లు అని న‌రేష్ ని ర‌ష్మీ అడిగితే.. అస‌లు స్టార్ట్ చేసింది ఎవ‌రండీ... చంటి పిల్లోడి కూడా తెలుసు మీరే స్టార్ట్ చేశార‌ని.. ముందు తిట్టాల్సింది మిమ్మ‌ల్ని మామూలుగా కాదు బండ‌బూతులు తిట్టాలి అని న‌రేష్ .. ర‌ష్మీపై ఫైర్ కావ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇక వ‌ర్ష‌, ఇమ్మానుయేల్ ల‌ని క‌ట్టేసి మీరు ముంతాజ్ , షాజ‌హానా? అని అడుగుతుంది ర‌ష్మీ .. దానికి ఇమ్మానుయేల్ నుంచి అదిరిపోయే పంచ్ ప‌డింది. మీరు లైలా మ‌జ్నులా? అని డైరెక్ట్ పంచ్ వేయ‌డంతో మ‌నో, రోజా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు. ఇదే సంద‌ర్భంగా న‌రేష్ పై రోజా వేసిన పంచ్ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో బీప్ పంచ్‌ల‌కు ప‌రాకాష్ట‌గా నిలిచింది. `వాడు పండించాక నువ్వేంపండిస్తావురా కెమిస్ట్రీ` అని రోజా వేసిన డ‌బుల్ మీనింగ్ పంచ్ ఓ రేంజ్ లో పేల‌డంతో మ‌ళ్లీ రోజా రెచ్చిపోయిందిగా అంటూ నెటిజ‌న్ లు పంచ్ లు వేస్తున్నారు. తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.  

 కాజ‌ల్ ఎలిమినేష‌న్‌కు కార‌ణాలు ఇవేనా?

12వ వారం యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ కావ‌డం తెలిసిందే. అయితే ఇది అన్యాయం అక్ర‌మ‌మ‌ని .. కుట్ర చేసి ర‌విని ఇంటి నుంచి బ‌య‌టికి పంపించార‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి. తాజాగా జ‌రిగిన కాజ‌ల్ ఎలిమినేట్ వెన‌క అయితే ఎలాంటి కుట్ర లేదు.. కుతంత్రం లేదు. కార‌ణం హౌస్ లో వున్న కంటెస్టెంట్ ల‌తో పోలిస్తే కాజ‌ల్ కు ఓటింగ్ త‌క్కువ‌గా న‌మోదు కావ‌డ‌మే. అయితే ఆమె వెన‌క‌బ‌డ‌టానికి, హౌస్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి కార‌ణం ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ముందే గేమ్ ప్లాన్ ని యాంక‌ర్ ర‌విలా సిద్ధం చేసుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజ‌ల్ త‌ను ఫాలో అయిన స్ట్రాట‌జీనే ఇంటి దారి ప‌ట్టించింద‌ని చెబుతున్నారు. ప్రతీ విష‌యంలోనూ త‌ల‌దూర్చ‌డం.. గిల్లిక‌జ్జాల‌కు దిగ‌డం.. దీంతో హౌస్ మేట్స్ చాలా వ‌ర‌కు కాజ‌ల్ బ‌య‌టికి ఎప్పుడు వెళుతుందా అని ఓపెన్ గానే చెప్పేయ‌డంతో కాజ‌ల్ జ‌ర్నీకి బిగ్‌బాస్ హౌస్ లో బ్రేక్ ప‌డింది. అన‌వ‌రంగా అరుస్తూ ఇంటి స‌భ్యుల‌కు చిరాకు తెప్పించిన ఆమె నోరే ఎలిమినేట్ అయ్యేలా చేసింది. కాజ‌ల్ పారితోషికం ఎంతో తెలుసా? ఇక మొద‌ట్లో ష‌ణ్ముఖ్ తో స‌న్నిహితంగా వున్న కాజ‌ల్ ఆ త‌రువాత త‌న స్టాండ్ ని మార్చుకుని మాన‌స్ తో ఫ్రెండ్షిప్ చేయ‌డం.. స‌న్నీకి ద‌గ్గ‌ర కావ‌డంతో నెటిజ‌న్ లు కాజ‌ల్ పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మాన‌స్‌, స‌న్నీల‌తో కాజ‌ల్ కు ప్ర‌త్యేక‌మైన బంధం ఏర్ప‌డ‌టంతో ఒక్క‌సారిగా కాజ‌ల్ పై పాజిటివ్ వైబ్ మొద‌లైంది. ఓ ద‌శ‌లో స‌న్నీని టార్గెట్ చేసిన నాగార్జున‌నే ఎదిరిస్తూ స‌న్నీకి అండ‌గా నిలిచింది కాజ‌ల్‌. ఈ ఒక్క సంఘ‌ట‌న‌తో కాజ‌ల్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆమెపై ప్రేక్ష‌కుల్లో పాజిటివ్ వైబ్ స్టార్ట‌యింది. కాజ‌ల్ కున్న క్లారిటీ.. గెలుపు పై వున్న విశ్వాసం అమెని ఇన్ని రోజులు హౌస్ లో కంటిన్యూ అయ్యేలా చేశాయి.   

బిగ్ బాస్ : క‌ప్పు బ‌రాబ‌ర్ గెలుస్తా - స‌న్నీ

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5సోమ‌వారం సెంచ‌రీ కొట్టేసింది. షో మొద‌లై వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో హౌస్ లో వున్న ఐదుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలే ఎలా వుంటుంది? .. విన్న‌ర్ నేనే అవుతానంటూ ఆలోచ‌న‌ల్లో మునిగితేలుతున్నారు. హౌస్ లోవున్న టాప్ 5 కంటెస్టెంట్ ల‌లో స‌న్నీ, మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి , ష‌ణ్ముఖ్ వున్నారు. ఈ ఐదుగురిలో ఒక్క‌రే టైటిల్ విన్న‌ర్‌గా నిల‌వ‌బోతున్నారు. అయితే అది ఎవ‌రు? అన్న‌దే ఇప్పుడు కంటెస్టెంట్‌ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. రీమేక్ కి ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్! ఈ నేప‌థ్యంలో ఆల్ రౌండ‌ర్ గా పేరు తెచ్చుకున్న స‌న్నీ నే విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా వున్నాయంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఓట్ల ప‌రంగానూ స‌న్నీనే అంద‌రి కంటే ముందు వ‌రుస‌లో నిలుస్తున్నాడు. ఇదిలా వుంటే గ్రాండ్ ఫినాలే పై స‌న్నీ స్పందించాడు. గ్రాండ్ ఫినాలే ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో స‌న్నీ, మాన‌స్ దీని గురించి మాట్లాడుకున్నారు. ఈ సంద‌ర్బంగా స‌న్నీ మాట్లాడుతూ ` టెన్ష‌న్ గా వుంది ఎలాగైనా టైటిల్ గెల‌వాలి. మా అమ్మ‌కు క‌ప్ ఇస్తరా బ‌య్.. ఇది ఫిక్స్‌.. ఏదైనా కానీ బరాబ‌ర్ క‌ప్పు ఇస్తా` అంటూ త‌న విజేత‌గా నిలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేయ‌డం  ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆ త‌రువాతే బిగ్‌బాస్ కంటెస్టెంట్ అ జ‌ర్నీని బిగ్ బాస్ వ‌న్ బై వ‌న్ చూపించ‌డం మొద‌లు పెట్టారు. మంగ‌ళ‌వారం స‌న్నీ జ‌ర్నీ  చూపించే అవ‌కాశం వుంది.   

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు ఊహించ‌ని స్టార్స్

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ క్లైమాక్స్ కి చేరింది. మ‌రో ఐదు రోజుల్లో ముగియ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో గ్రాండ్ ఫినాలే ఎలా వుండ‌బోతోంది.. భారీ స్థాయ‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఎవ‌రెవ‌రు రాబోతున్నారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొన్ని వారాలుగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతూ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. కాజ‌ల్ ఎలిమినేష‌న్ తో హౌస్ లో మొత్తం 5 గురు కంటెస్టెంట్ లు మిగిలారు. 4 గంట‌లు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డ్డ‌ వ‌నిత‌.. ఎందుకో తెలుసా? టాప్ 5 కంటెస్టెంట్ లు మిగిలారు. ఇక ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడొక‌లెక్క అన్న‌ట్టుగా హౌస్ వాతావ‌ర‌ణం మారింది. టాప్ 5 కి చేరిన కంటెస్టెంట్ ల‌లో ఆదివారం జ‌రిగే గ్రాండ్ ఫినాలేలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే గ్రాండ్ ఫినాలేకి ఈ సారి భారీ స్థాయిలో ఊహించ‌ని గెస్ట్ లు, స్టార్ లు రానున్నార‌ని తెలుస్తోంది.   డిసెంబ‌ర్ 19న జ‌రగ‌నున్న గ్రాండ్ ఫినాలేను నెవ‌ర్ బిఫోర్ అనే రేంజ్‌లో నిర్వ‌హించాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ గెస్ట్ లుగా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాలీవుడ్ క్రేజీ స్టార్ ల‌ని ఈ ఈవెంట్ కి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్ వీర్ సింగ్, దీపికా ప‌దుకోన్ ల‌తో పాటు అలియాభ‌ట్ కూడా పాల్గొననుంద‌ని , ఇందు కోసం మేక‌ర్స్ సంప్ర‌దింపులు జరుపుతున్నార‌ని తెలిసింది. ఇదే నిజ‌మైతే గ్రాండ్ ఫినాలే మ‌రింత గ్రాండ్ గా వెలిగిపోవ‌డం ఖాయం.    

నాగ్.. విన్న‌ర్‌గా అత‌న్నే చూడాల‌నుకుంటున్నారా?

కింగ్ నాగార్జున బిగ్‌బాస్ సీజ‌న్ 5కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని సీజ‌న్ ల కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగ్ తాజా సీజన్ విష‌యంలో మాత్రం విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నారు. గ‌తంలో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నేచుర‌ల్ స్టార్ నాని విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌డం తెలిసిందే కానీ నాగార్జున మాత్రం ఇంత వ‌ర‌కు హోస్ట్ ప‌రంగా విమ‌ర్శ‌ల‌కు గురి కాలేదు. అందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు కానీ తాజా సీజ‌న్ ప‌రంగా మాత్రం ఆయ‌న విమ‌ర్శ కుల‌కు అడ్డంగా దొరికి పోతుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. సిరి - ష‌న్నుల హ‌గ్గుల యుద్ధం అన్ స్టాప‌బుల్‌ సీజ‌న్ ప్రారంభం నుంచి ఓ ఇద్ద‌రు కంటెస్టెంట్‌ల‌పైనే ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డం మిగ‌తా వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం తాజా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.  ష‌న్ను, సిరిల‌ని హ‌గ్గుల విష‌యంలో ఎంక‌రేజ్ చేయ‌డం.. స‌న్నీని గిల్టీ బోర్డ్ వేసుకోమ‌ని చెప్ప‌డం.. ష‌న్ను , సిరి త‌ప్పులు చేస్తున్నా వారిని మంద‌లించ‌క‌పోగా స‌న్నీని టార్గెట్ చేయడం వంటి కార‌ణాలు ఆడియ‌న్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. శ‌నివారం జ‌రిగిన ఎవ‌రు హిట్ ఎవ‌రు ఫ్లాప్ టాస్క్ లోనూ నాగ్ ప‌క్ష పాతాన్ని ప్ర‌ద‌ర్శించిన తీరు విమ‌ర్శ‌లు కురిపిస్తోంది. ఈ టాస్క్‌లో ష‌న్ను ఫ్లాప్ అని కాజ‌ల్‌, ఆ త‌రువాత స‌న్నీ ట్యాగ్స్ పెట్టారు. ఆ త‌రువాత ష‌న్ను హిట్ అని సిరి ట్యాగ్ ఇచ్చింది. అయితే ష‌న్నుకి రెండు ఫ్లాప్ ట్యాగ్ లు రావ‌డం... స‌న్నీకి మూడు హిట్ ట్యాగ్‌లు రావ‌డం.. ఇష్టం లేని నాగార్జున ... ఏ ప్రాతిపాదిక పై ష‌న్నుని ఫ్లాప్ అంటావ‌ని స‌న్నీని నిల‌దీయ‌డం.. ఫైన‌ల్ గా స‌న్నీతోనే ష‌న్ను కి పెట్టిన ఫ్లాప్ ట్యాగ్ ని తీసేయించి దాన్ని సిరికి పెట్టించ‌డం ప‌లువురిని ఆశ్చర్యానికి అస‌హ‌నానికి గురిచేసింది. ప్రేమ వుంటే కంటెస్టెంట్ కి ఇంత‌లా స‌పోర్ట్ చేయాలా? .. త‌ప్పు చేస్తున్నా.. ఇలా వెన‌కేసుకురావాలా? .. హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున ఇలా ప‌క్ష‌పాతాన్ని చూపించ‌డం ఏమీ బ‌గాలేద‌ని నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.. ఏంటీ నాగార్జున .. ఫ‌న్నుని విన్న‌ర్‌గా చూడాలనుకుంటున్నారా? అని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.   

నిజం తెలుసుకున్న మోనిత‌..రౌడీల‌కు చుక్క‌లు చూపించిన కార్తీక్‌

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. కార్తీక్‌, దీప‌, మోనిత ల చుట్టూ తిరిగే రివేంజ్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర ఈ సీరియ‌ల్ ని రూపొందిస్తున్నారు. ఊహించ‌ని మ‌లుపులు, ట్విస్ట్‌ల‌తో నిరంతరాయంగా సాగుతూనే వుంది. తాజాగా ఈ సోమ‌వారం 1221వ ఎపిసోడ్ లోకి ఈ సీరియ‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. శ్రీ‌వ‌ల్లి పురిటి నొప్పులు పడుతుంటే దీప చ‌లించిపోతుంది. ఎలాగైనా త‌న‌కు వైద్యం చేయ‌మ‌ని భ‌ర్త డాక్ట‌ర్ బాబుని నిల‌దీస్తుంది. ఈ ఉప‌ద్ర‌వం నుంచి త‌ప్పించుకోవాల‌ని అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాడు. దాంతో శ్రీ‌వ‌ల్లిని అంబులెన్స్ లో ఆసుప‌త్రికి తీసుకెళ‌తారు. సీన్ క‌ట్ చేస్తే మోనిత .. డాక్ట‌ర్ బాబు గురించే ఆలోచిస్తూ వుంటుంది. ఇలా ఆలోచిస్తూనే కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కానీ అది మ‌హేష్ ద‌గ్గ‌ర వుండ‌టంతో త‌ను లిఫ్ట్ చేస్తాడు. కార్తీక్ .. ఎక్క‌డున్నావ్‌.. ఏమైపోయావ్ అని అరుస్తుంది. దీంతో చిరాకొచ్చిన మ‌హేష్ కార్తీక్ ఎవడు అనేస్తాడు.  శ్రీ‌వ‌ల్లి ఎవ‌రు?.. కార్తీక్‌ని ఇబ్బందిపెట్టిన దీప‌ ఇంత‌కీ నువ్వు ఎవ‌డివిరా అంటుంది మోనిత‌... మ‌ర్యాద అంటూనే కార్తీక్ గురించి చెప్పాలంటే డ‌బ్బుల‌వుతాయంటాడు. అకౌంట్ నెంబ‌ర్ చెప్పు పంపిస్తా అంటుంది మోనిత‌. ఆ త‌రువాత  మ‌హేష్ తాను చూసింది .. కార్తీక్‌, దీప పిల్ల‌ల‌తో క‌లిసి ఊరు విడిచి వెళ్లింది చెబుతాడు.. దీంతో విసుక్కున మోనిత సౌంద‌ర్య ఆంటీకి తెలిసే ఇదంతా జ‌రుగుతోందా? అని అనుమానిస్తుంది. క‌ట్ చేస్తే శ్రీ‌వ‌ల్లి ఇంటి సామాను చెట్టుకింద వుండ‌టం చూసిన కార్తీక్ వాటిని ఇంటికి చేర్చ‌బోతుంటాడు. ఇంత‌లో రుద్రాణికి సంబంధించిన ముగ్గురు రౌడీలు వ‌చ్చి `మేం ఎవ‌రిమో తెలుసా ` అంటూ కార్తీక్‌ని బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌నుషులే గా అని స‌మాధానం చెబుతాడు కార్తీక్‌. అడ్డు త‌గిలిన రౌడీల‌కు కార్తీక్ చుక్క‌లు చూపిస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.     

కాజ‌ల్ పారితోషికం ఎంతో తెలుసా?

బిగ్‌బాస్ ఫైన‌ల్ అంకానికి చేరింది. ఈ షో ముగియ‌డానికి మ‌రో వార‌మే మిగిలి వుంది. దీంతో చివ‌రి వారం అంటే ఈ ఆదివారం ఆర్జే కాజ‌ల్ హౌస్ పుంచి ఎలిమినేట్ అయింది. ఈ నేప‌థ్యంలో ఆమె రెమ్మున‌రేష‌న్ పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. హైస్‌లో మొద‌టి నుంచి ఇంటి స‌భ్యుల కార‌ణంగా అవ‌మానాలు, చీత్కారాలు ఎదుర్కొంటూ వ‌చ్చింది కాజ‌ల్‌. బిగ్‌బాస్ త‌న డ్రీమ్ అని చెప్పుకుంటూ వ‌చ్చింది.. అయినా ఆమెని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. బిగ్‌బాస్ బండారం బ‌య‌ట‌పెట్టిన ర‌వి  గొడ‌వ‌ల మారి అని.. త‌ను హౌస్ నుంచి బ‌య‌టికి వెళితేనే గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని కార‌ణం చెబుతూ ష‌న్ను డైరెక్ట్‌గా నామినేట్ చేయ‌డం ప‌లువురిని షాక్ కి గురిచేసింది. అయినా స‌రే మొండి ప‌ట్టుద‌ల‌తో తాన స్ట్రాట‌జీల‌తో ముందుకు వెళుతూ చివ‌రి వారం వ‌ర‌కూ గ‌ట్టి పోటీనిస్తూ వ‌చ్చింది. ఎవ‌రు ఎన్నిర‌కాలుగా విమ‌ర్శ‌లు చేసినా తాను ఎక్క‌డా త‌గ్గేది లేదు అంటూ మొండిగానే ముందుకు సాగింది. 14 వారాల పాటు గ‌ట్టి పోటీనిస్తూ నిల‌బ‌డి చివ‌రికి ఈ ఆదివారంఎలిమినేట్ అయింది. అయితే ఈ 14 వారాల‌కు గానూ కాజ‌ల్ కి ఎంత రెమ్యున‌రేష‌న్ అందింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హౌస్ లోకి వ‌చ్చే ముందు వారానికి కాజ‌ల్ కి 2 ల‌క్ష‌లు పారితోషికంగా ఫిక్స్ చేశార‌ట‌. అంటే 14 వారాల‌కు ఆమెకు పారితోషికంగా 30 ల‌క్ష‌లు అందిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం అప్పు త‌న‌కు వుంద‌ని ముందే చెప్పిన కాజ‌ల్ ఆ మొత్తంలో త‌న అప్పుని తీర్చుకుంటుంద‌ని చెబుతున్నారు.   

 ప్రియాంక‌కు ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చిన ప్రియ‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 క్లైమాక్స్‌కి చేరింది. వ‌చ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఈవెంట్ జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన కంటెస్టెంట్‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంద‌డి చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రికి వున్న అభిమానాన్ని, ప్రేమ‌ని చాటుకుంటూ నెటిజ‌న్‌ల‌కు షాకిస్తున్నారు. హౌస్ లో స్నేహం చేసిని కంటెస్టెంట్ ల‌కు ప్ర‌త్యేక బ‌హుమ‌తులు ఇస్తున్నారు. అవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల 13వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బ‌య‌టికి వ‌చ్చేసిన ప్రియాంక తాజాగా నెట్టింట వైర‌ల్ గా మారింది. కార‌ణం త‌న‌కి న‌టి, మాజీ హౌస్ మేట్ ప్రియ గిఫ్ట్ ఇవ్వ‌డ‌మే. వివ‌రాల్లోకి వెళితే.. హైస్‌లో ప్రియ‌, ప్రియాంక మధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఇద్ద‌రి అభిరుచులు క‌లిశాయి. ఇద్ద‌రిలో ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా మ‌రొక‌రు త‌ల్ల‌డిల్లిపోయేవారు. అంత‌లా ప్రియ‌, ప్రియాంక మ‌ధ్య అనుబంధం ఏర్ప‌డింది. అది హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కూడా కొన‌సాగుతోంది. త‌మ అనుబంధానికి గుర్తుగా ప్రియ‌.. ప్రియాంక‌కు ఓ గోల్డ్ రింగ్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చింది. ఈ విష‌యాన్ని పింకీ అభిమానుల‌తో పంచుకుంటూ ప్రియ‌కు డైమండ్ రింగ్ ని అంద‌జేస్తున్న ఫొటోల‌ని ఇన్ స్టా వేదిక‌గా పంచుకుంది. `అక్క ఇచ్చిన బ‌హుమ‌తి తెర‌చి చూడ‌గానే ఒక్క‌సారిగా షాక‌య్యాను. అందులో డైమండ్ రింగ్ వుంది. ఇది నేను ఊహించ‌లేదు. థాంక్యూ .. ల‌వ్ యూ అక్క‌` అంటూ డైమండ్ రింగ్ ఫొటోని ప్రియాంక షేర్ చేసింది.   

ష‌న్ను - సిరిల‌కు జెస్సీ స్ట్రాంగ్ వార్నింగ్

బిగ్‌బాస్ సీజ‌న్ 5 క్లైమాక్స్‌కి చేరింది. వ‌చ్చే వారం ఫైన‌ల్ జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి జ‌రిగిన ఎపిసోడ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. గ‌త కొన్ని వారాలుగా బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ష‌న్నుల ట్రాక్ ఆడియ‌న్స్‌కి అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సిరి, ష‌న్నుల‌కి ఎక్స్ హౌస్ మేట్ జెస్సీ షాకిచ్చాడు. ఆదివారం ఇంటి స‌భ్యులతో ఒక‌రితో ఒక‌రిని అనుక‌రించే టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఈ సంద‌ర్భంగా కాజల్ ని అనుక‌రించిన శ్రీ‌రామ్ న‌వ్వులు పూయించాడు. ఆత త‌రువాత సిరిని స‌న్నీ అనుక‌రించిన న‌వ్వులు కురిపించాడు. ఇక ష‌న్నుని కాజ‌ల్ అనుక‌రించి అదే స్థాయిలో న‌వ్వించింది. ష‌న్ను.. స‌న్నీని అనుక‌రించారు. అయితే ఈ అనుక‌ర‌ణ సంద‌ర్భంగా సోడా వేస్తున్నావుగా అని ష‌న్నుపై పంచ్ లేయ‌డం న‌వ్వించింది. అయితే ష‌న్ను ... స‌న్నీని అనుక‌రిస్తూ త‌నికి తానే గ్రేట్ అనుకుంటుంటే నాగ్ .. ష‌న్ను ఎలా గ్రేట్ ప్ర‌తీ దానికీ అలిగి కూర్చుంటాడంటూ గాలితీసేయ‌డంతో ఇంటి స‌భ్యులు న‌వ్వుల్లో మునిగిపోయారు. ఇదిలా వుంటే ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తారంటూ కొన్ని వీడియోల‌ని ప్లేచేశారు నాగార్జున‌. ఇందులో జెస్సీ... ష‌న్ను, సిరిల‌కు సీరియ‌స్ గా వార్నింగ్ ఇవ్వ‌డం షాకిచ్చింది. `ష‌న్ను చాలా సిరీయ‌స్‌గా అడుగుతున్నాను..నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ వుందో... వేరే జ‌నాలు ఏమ‌నుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? అని షాకిచ్చాడు... ఆ త‌రువాత సిరిని కూడా అదే స్థాయిలో నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. బిగ్బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడ‌టానికి వ‌చ్చావు క‌దా సిరి .. కానీ అది ప‌క్క‌న పెట్టి ఎమోష‌న‌ల్ క‌లెక్ష‌న్ అయిపోతున్నాను. ఇది.. అది.. క‌నెక్ట్ అయిపోతున్నాను అంటున్నావ్ .. ఇది నీకు అవ‌స‌ర‌మా? అని క్లాస్ పీకాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. జెస్సీ మాట్లాడిన తీరు ష‌న్ను ని పోటీలో సిరి వెన‌క్కి లాగేసింద‌ని స్ఫ‌ష్ట‌మ‌వుతోంది.  

ఢీ 14: సుధీర్ పోయి సార్థ‌క్ వ‌చ్చె.. ఏం జ‌రిగిందో!?

  కావ్య‌శ్రీ విజేత‌గా నిల‌వ‌డం ద్వారా 'ఢీ 13 కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్స్' స‌క్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అల్లు అర్జున్ గెస్ట్‌గా పాల్గొన్న ఈ ఎపిసోడ్‌కు వీక్ష‌కాద‌ర‌ణ అపూర్వంగా ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ సిరీస్ నెక్ట్స్ సీజ‌న్‌కు ఇప్ప‌టికే మంచి బ‌జ్ న‌డుస్తోంది. లేటెస్ట్ ప్రోమో ప్ర‌కారం వ‌చ్చే 'ఢీ 14' నుంచి సుడిగాలి సుధీర్ త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డ‌య్యింది. అత‌ని ప్లేస్‌లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థ‌క్ వ‌చ్చాడు. కొంత కాలంగా ఈ పాపుల‌ర్ డాన్స్ షోలో టీమ్ లీడ‌ర్‌గా ఉంటూ వ‌స్తున్న సుధీర్‌ ఎందుకు త‌ప్పుకున్నాడంటూ సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ న‌డుస్తోంది. సుధీర్ ఫ్యాన్స్ అయితే ఈ మార్పును జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాగా ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ వ‌ల్లే సుధీర్ ఈ షో నుంచి త‌ప్పుకున్నాడ‌ని తెలిసింది.  Also read:  "మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి".. జ‌బ‌ర్ద‌స్త్‌కు టాటా చెప్పి ఏడ్చేసిన‌ సుడిగాలి సుధీర్ టీమ్! మ‌రో టీమ్ లీడ‌ర్‌గా హైప‌ర్ ఆది కొన‌సాగ‌నున్నాడు. ఆ ఇద్ద‌రితో షూట్ చేసిన ప్రోమోను రిలీజ్ చేశారు. యాంక‌ర్‌గా ప్ర‌దీప్ మాచిరాజు ఎప్ప‌ట్లా త‌న స్టైల్ పంచ్‌ల‌తో అల‌రించ‌నున్నాడు. 'ఢీ' మునుప‌టి సీజ‌న్ల‌లో సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ కెమిస్ట్రీ, సుధీర్‌పై ఆది వేసే పంచ్‌లు వీక్ష‌కుల్ని అమితంగా అల‌రించాయి. ఒక‌వైపు ఊపిరి తిప్పుకోనివ్వ‌ని డాన్సులు, మ‌రోవైపు కామెడీతో 'ఢీ' షో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో సుధీర్‌-ర‌ష్మి జోడీకి ఫాలోయింగ్ పెర‌గ‌డంలో ఈ షో బాగా దోహ‌దం చేసింది. Also read:  సోహైల్ ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పేశాడు 'ఢీ 14' ప్రోమోలో జ‌డ్జిలుగా ప్రియ‌మ‌ణి, గ‌ణేశ్ మాస్ట‌ర్ మాత్ర‌మే క‌నిపించారు. పూర్ణ క‌నిపించ‌లేదు. ఆమె ఈ సీజ‌న్‌లో కొన‌సాగుతుందా, లేదా అనేది తెలియాల్సి ఉంది. 15వ తేదీ ప్రారంభ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా ల‌క్ష్య హీరో హీరోయిన్లు నాగ‌శౌర్య‌, కేతికా శ‌ర్మ వ‌చ్చారు. కాగా ఈ సీజ‌న్‌లో నాలుగు విభాగాల్లో పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. జూనియ‌ర్స్‌, లేడీస్‌, జోడీస్‌, ఛాంపియ‌న్స్ అనే విభాగాల్లో ఈ కాంపిటిష‌న్ ఉంటుందని యాంక‌ర్ ప్ర‌దీప్ అనౌన్స్ చేశాడు. Also read:  కొంప‌ముంచిన అషూరెడ్డి చెత్త ఐడియా! సుధీర్ ప్లేస్‌లో 'ఢీ 14'లో ఎంట‌ర్ కావ‌డంపై అఖిల్ మాట్లాడుతూ, "సుధీర్‌తో ప‌నిచేయ‌డానికి నేనెప్పుడూ ఎదురుచూస్తుంటాను. త‌ను అసాధార‌ణ టాలెంట్ ఉన్నవాడు, స‌హ‌న‌టుడు. ఈ సీజ‌న్‌లో అత‌డిని మ‌నం మిస్స‌వుతున్నాం. అయిన‌ప్ప‌టికీ నాదైన ముద్ర‌వేయ‌డానికి ప్ర‌య‌త్నించాను. ఈ షోలో నేను ప్లేబాయ్‌లాగా క‌నిపిస్తా. ఈ షోలో నాలోని ఫ‌న్ సైడ్‌ను చూస్తారు" అని చెప్పాడు.

మాళ‌విక ప్లాన్ వేద తెలుసుకుంటుందా?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. స్టార్ మా లో ఇటీవ‌లే మొద‌లైన ఈ ఫ్యామిలీడ్రామా మహిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప కోసం త‌పించే ఓ యువ‌తి క‌థ నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కులు కొత్త కోణంలో ఆవిష్క‌రించిన తీరు అల‌రిస్తోంది. కీల‌క‌మైన వేద పాత్ర‌లో కోల్‌క‌తా న‌టి డెబ్ జానీ మోడ‌క్ న‌టిస్తుండ‌గా మ‌రో ప్ర‌ధాన పాత్ర అయిన య‌ష్ గా నిరంజ‌న్ న‌టిస్తున్నారు. కొంప‌ముంచిన అషూరెడ్డి చెత్త ఐడియా! య‌ష్ , వేద‌ల గిల్లిక‌జ్జాల నేప‌థ్యంలో సాగిపోతున్న ఈ సీరియ‌ల్ తాజాగా పాప కార‌ణంగా సరికొత్త మ‌లుపులు తిరుగుతోంది. పాప‌ని..డాక్ట‌ర్ వేద‌ని అడ్డు పెట్టుకుని య‌ష్ ని దెబ్బ‌తీయాల‌ని య‌ష్ మాజీ భార్య మాళ‌విక, ఆమె ప్రియుడు ప్లాన్ చేస్తారు. దీంతో వ్య‌వ‌హారం కోర్టు దాకా వెళుతుంది. కోర్టులో మ‌హిళా క‌మీష‌న్ య‌ష్ కూతురు షుషీని త‌ల్లి మాళ‌వికే అప్ప‌గించాల‌ని రెండు వారాల్లో తుది తీర్పు ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తుంది. దీంతో చేసేది లేక య‌ష్ త‌న ఖుషీని మాళ‌విక‌కు అప్ప‌గించి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఈ నేప‌థ్యంలో ఈ శ‌నివారం జ‌రిగే ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. శనివారం ఎపిసోడ్ లో వేద‌ని త‌మ వైపు తిప్పుకుని య‌ష్‌ని మ‌రోసారి అడ్డంగా బుక్ చేయాల‌నుకుంటారు మాళ‌విక‌, అత‌ని ప్రియుడు. ఇందులో భాగంగా వేద‌కు ఫోన్ చేసి ఇంటికి ర‌ప్పిస్తారు. ఇదే స‌మ‌యంలో ఖుషీని ఆస్ట‌ల్‌లో చేర్పించాల‌ని మాళ‌విక చేస్తున్న ప్ర‌య‌త్నం వేద‌కు తెలుస్తుంది. అదే స‌మ‌యంలో య‌ష్ త‌ల్లి మాలిని .. మా ఖుషీని మాకిచ్చేయ్ అని గోల చేస్తుంది.. అక్క‌డే వున్న వేద‌ని చూసిన మాలిని ఈ ఇద్ద‌రూ క‌లిసి మ‌న‌ల్ని మోసం చేస్తున్నారు య‌ష్ అని అప్పుడే వ‌చ్చిన య‌ష్‌తో చెబుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. వేద‌ని మ‌ళ్లీ య‌ష్, అత‌ని త‌ల్లి అపార్థం చేసుకున్నారా? .. మాళ‌విక‌, అత‌ని ప్రియుడి ప్లాన్ ని వేద ప‌సిగ‌ట్టిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

 శ్రీ‌వ‌ల్లి ఎవ‌రు?.. కార్తీక్‌ని ఇబ్బందిపెట్టిన దీప‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఎపిసోడ్‌లు గ‌డుస్తున్నా కొద్దీ ఈ సీరియ‌ల్‌ని ద‌ర్శ‌కుడు బంక‌లా సాగ‌దీస్తూనే వున్నాడు.. ఒకరు పోతె ఇంకొక‌రు అన్న‌ట్టుగా సిటీ దాటినా కార్తీక్ , దీప‌ల‌కు విల‌న్‌ల బెడ‌ద త‌ప్ప‌కుండా చూసుకుంటున్నాడు. మోనిత బాధ త‌ప్పింద‌నుకుంటే వీరి పాలిట ఇంద్రాణిని దీంచేశాడు. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌కి చెప్ప‌కుండా ఇంటిని వ‌దిలి కొత్త ఊరికి కార్తీక్‌, దీప , పిల్ల‌లు చేరుకుంటారు. అక్క‌డ ఇంద్రాణి రూపంలో కొత్త ట్విస్ట్ మొద‌ల‌వుతుంది. కంట‌త‌డి పెట్టిన `కార్తీక దీపం` న‌టి ఈ శ‌నివారం 1220వ ఎపిసోడ్‌లోకి ఈ సీరియ‌ల్ ప్ర‌వేశిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి... క‌థ ఏ మ‌లుపు తీసుకుంటోంది అన్న‌ది ఒక‌సారి చూద్దాం. సౌంద‌ర్య‌ ఏడుస్తూ వుండ‌గా ఆనంద‌రావు, ఆదిత్య బ‌య‌టికి వెళ్లి వ‌స్తుంటారు..`ఏమైనా తెలిసిందా అని సౌంద‌ర్య అడుగుతుంది. స‌మాధానం వుండ‌దు.. నా పెద్దోడు తిరిగి ఇంటికి వ‌స్తాడా? .. మ‌ళ్లీ మ‌మ్మీ అని న‌న్ను పిలుస్తాడా? అని బోరు మంటుంది. క‌ట్ చేస్తే ...దీప ఇంటిని శుభ్రంగా తుడిచేసి పిల్ల‌ల‌కి దుప్ప‌ట్లు ప‌రిచి ప‌డుకోమంటుంది. కార్తీక్‌ని పిల్ల‌ల ప‌క్క‌నే ప‌డుకోమ‌ని పిలుస్తుంది. నేల‌పై ప‌డుకోమ‌న‌గానే `సారీ మ‌మ్మీ మిమ్మ‌ల్ని ఇలా క‌ష్ట‌పెట్టాల్సి వ‌స్తోంది అని కార్తీక్ ఫీల‌వుతాడు... ఇదిలా వుంటే బ‌య‌ట ఓ యువ‌తి ప్ర‌స‌వ వేద‌న‌తో ఆరుస్తూ వుంటుంది. `అమ్మా శ్రీ‌వ‌ల్లీ ఓర్చుకో... ఓర్చుకోమ్మా అంటూ ఓ ముస‌లావిడా.. ఓ వ్య‌క్తి ఆమెని ఓదారుస్తుంటారు. ఆ అరుపులు విని దీప‌, కార్తీక్‌, పిల్ల‌లు బ‌య‌టికి వ‌చ్చి చూస్తారు. ప్ర‌స‌వ వేద‌న‌తో బాధ‌ప‌డుతున్న ఆ యువ‌తిని చూసి దీప త‌ల్ల‌డిల్లిపోతుంది. దీప ద‌గ్గ‌రికి వెళ్లి హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లండి అంటుంది. వెంట‌నే వారు డాక్ట‌ర్ లేడు అని స‌మాధానం చెబుతారు. ఇంత‌కీ శ్రీ‌వ‌ల్లి ఎవ‌రు? .. ఆమె కోసం కార్తీక్‌ని దీప ఎందుకు ఇబ్బంది పెట్టింది? ..చివ‌రికి కార్తీక్ ఏం చేశాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

మొన్న యాంక‌ర్ ర‌వి...ఇప్పుడు..

బిగ్‌బాస్ క్లైమాక్స్ కి చేరుతున్నా కొద్దీ హౌస్‌లో చిత్ర విచిత్రాలు జ‌రుగుతున్నాయి. సిరిని కంట్రోల్ చేస్తున్నానంటూ ష‌న్ను కంట్రోల్ త‌ప్పేస్తున్నాడు. అంతే కాకుండా కంట్రోల్ చేస్తున్నాన‌నే నెపంతో సిరిని టార్చ‌ర్ పెడుతున్న తీరు నెటిజ‌న్‌ల‌కు ఆగ్ర‌హాన్నితెప్పిస్తోంది. ఇదిలా వుంటే ఈ ఆదివారం ఎలిమినేష‌న్ షాకింగ్‌గా వుండే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 12 వ వారం యాంక‌ర్ ర‌విని ఎలిమినేట్ చేసి షాకిచ్చిన‌ట్టుగానే ఈ వారం బిగ్‌బాస్ అంత‌కు మించి అనే స్థాయిలో షాక్ ఇవ్వ‌బోతున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. బిగ్‌బాస్ బండారం బ‌య‌ట‌పెట్టిన ర‌వి   ఇంత‌కీ బిగ్‌బాస్ ఈ వారం షాక్ ఇవ్వ‌బోయేది మ‌ర‌నెవ‌రికో కాదు `బ్ర‌హ్మ‌` అని నాగ్ పేరు పెట్టిన ష‌న్నుకి. యూట్యూబ్‌లో మిలియ‌న్‌ల కొద్దీ ఫాలోవ‌ర్స్ వున్నా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక సిరి కార‌ణంగా అత‌ని ప్ర‌వ‌ర్త‌న చాలా మారింది. ఏ స్థాయిలో అంటే వీడెందుకు ఇంకా హౌస్‌లో కంటిన్యూ అవుతున్నాడ్రా బాబూ అని ఆడియ‌న్స్ అనుకునేంత‌. యూట్యూబ‌ర్‌గా వున్న క్రేజ్ ని త‌న యాటిట్యూడ్‌తో బిస్కెట్ అయ్యేలా చేసుకున్నాడు ష‌న్ను. అదే అత‌న్ని గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేయ‌బోతోంద‌న్న‌ది తాజా వాద‌న‌. ఓ వైపు సిరి ఫ్రెండ్ అంటూనే త‌ను ఎవ‌రితో అయినా క్లోజ్ అవుతున్న‌ట్టుగా అనుమానం మొద‌లైతే ష‌న్ను ఓ సైకోలా బిహేవ్ చేస్తూ సిరిని మాన‌సికంగా టార్చ‌ర్ చేసేస్తున్నాడు. ఇదే అత‌న్ని ఆడియ‌న్స్ లో అథఃపాతాళానికి తొక్కేసింది. అంతే కాకుండా ఛాన్స్ చిక్కిన‌ప్పుడ‌ల్లా సిరికి హ‌గ్గులు.. కిస్సులు ఇచ్చేస్తూ వీర లెవెల్లో రెస్ట్ రూమ్ ద‌గ్గ‌ర రొమాన్స్ చేసేయ‌డం కూడా ష‌న్నుపై అభిమానుల్లో అస‌హ్యం క‌లిగేలా చేస్తోంది. ఇదే అత‌న్ని ఈ వారం ఎలిమినేట్ అయ్యేలా చేయ‌బోతోంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఆడియ‌న్స్ పోల్ ని బ‌ట్టే ఎలిమినేష‌న్ అని చెబుతూ వ‌స్తున్న బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ష‌న్ను విష‌యంలో అదే ఫాలో అవుతారా లేక సొంత నిర్ణ‌యం తీసుకుని ష‌న్నుని సేవ్ చేస్తారా అన్న‌ది తెలియాలంటే శ‌నివారం ఎపిసోడ్ చూడాల్సిందే. 

సోహైల్ ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పేశాడు

బిగ్‌బాస్ సీజ‌న్ 5 క్లైమాక్స్ చేరింది. దీంతో ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌ర‌నే దానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది. ఎవ‌రికి తోచింది వాళ్లు చెప్పేస్తున్నారు. కొంత మంది అంటే గ‌త సీజ‌న్ లో కంటెస్టెంట్‌లు వున్న వారు మాత్రం ఖ‌చ్చితంగా ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది స్ప‌ష్టంగా చెప్పేస్తున్నారు. ఇటీవ‌ల బిగ్‌బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తాజా సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది స్ప‌ష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ సీజ‌న్ విన్న‌ర్ స‌న్నీ అని, అత‌ని గేమ్ ప్లాన్ బాగుంద‌ని, ఎంట‌ర్‌టైన్ చేస్తూరే త‌ర గేమ్ తాను ఆడుతున్నాడ‌ని అదే అత‌న్ని విన్న‌ర్‌గా నిల‌బెడుతుంది రాహుల్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశాడు. తాజాగా ఇదే విష‌యాన్ని బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ఆక‌ట్టుకున్న సోహైల్ చెప్పుకొచ్చాడు. హౌస్‌లో వున్న స‌న్నీ ఈ సీజ‌న్ విన్న‌ర్ అని తేల్చేసిన సోహైల్ హౌస్‌లో స‌న్నీని చూస్తుంటే గ‌త సీజ‌న్‌లో త‌న‌ని తాను చూసుకున్న‌ట్టుగా వుంద‌ని మురిసిపోయాడు. బిగ్‌బాస్ విజేత‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. అయితే మిగ‌తా వారి అభిమానులు త‌న‌ని ట్రోల్ చేయ‌డంతో భ‌య‌ప‌డిన సోహైల్ ఆ పోస్ట్‌ని డిలీట్ చేశాడ‌ట‌. అయితే తాజాగా మ‌రోసారి త‌న మ‌న‌సులోని మాట‌ల‌ని బ‌య‌ట‌పెట్టేశాడు. `ఎవ‌రికి స‌పోర్ట్ చేసినా.. మా వాడు ఏం చేసిండు?  మా పిల్ల ఏం చేసింది? అని నన్నేసుకుంటున్నారు. కాజ‌ల్‌, మాన‌స్‌, స‌న్నీ టాప్‌లో ఉంటార‌నిపిస్తోందని పోస్ట్ పెట్టా.. మా వాళ్లు ఎటు పోవాలంటూ అంద‌రూ న‌న్ను గట్టిగానే వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా స్టార్ట్ చేస్తున్నా..ఇదంతా ఎందుకులే అని భ‌యం వేసింది. దాంతో ఆ పోస్ట్‌ని డిలీట్ చేశా. ఈ వార‌మైతే సిరి, కాజ‌ల్ డేంజ‌ర్‌లో వున్నారు. నాకు న‌చ్చిన కంటెస్టెంట్‌లు శ్రీ‌రామ్, స‌న్నీ.. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు టైటిల్ గెలుస్తారని ఓపెన్‌గా చెప్పేశాడు సోహైల్‌.   

బిగ్‌బాస్ బండారం బ‌య‌ట‌పెట్టిన ర‌వి  

12 వ వారం అనూహ్యంగా యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ కావ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేసిన విష‌యం తెలిసిందే. ఇది ర‌విని కూడా షాక్ కు గురిచేసింద‌ట‌. దీంతో ర‌వి ఫ్యాన్స్ ఇది అక్ర‌మం, అన్యాయం అంటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ ముందు ధ‌ర్నాకు దిగ‌డం తెలిసిందే. త‌రువాత త‌న ఎలిమినేష‌న్ విష‌యంలో అనుమానాలున్నాయ‌ని బిగ్‌బాస్‌పై విమ‌ర్శ‌లు చేసిన యాంక‌ర్ ర‌వి హౌస్‌లో అస‌లు ఏం జ‌రుగుతోందో.. బ‌యటి ప్ర‌పంచానికి ఏం చూపిస్తున్నారో క్లారిటీగా చెప్పేశాడు. దీంతో బిగ్‌బాస్ పై విశ్వ‌స‌నీయ‌త పోయింది. తాజాగా మ‌రోసారి యాంక‌ర్ ర‌వి బిగ్ బాస్ బండారం బ‌య‌ట‌పెట్టాడు హౌస్‌లో మీకు తెలియ‌నివి చాలా జ‌రిగాయి.. జ‌రుగుతున్నాయి. కానీ ఆడియ‌న్స్‌కి మాత్రం ఏది చూపించాలో అదే చూపిస్తున్నారు. మిగ‌తా దాన్ని దాచేస్తున్నారు. దీంతో ఆడియ‌న్స్‌ని కావాల‌నే త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ఆడియ‌న్స్ హ‌ర్ట్ అయితే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ అవుతుంది.. దాంతో ప‌బ్లిసిటీ వ‌స్తుంది.. ఇదే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు స్ట్రాట‌జీ. శ్రీ‌రామ‌చంద్ర హౌస్‌లో ఏ ప‌ని చేసినా పాట‌లు పాడుతూనే చేస్తాడు కానీ చూపిస్తున్న ఎపిసోడ్స్‌ల‌లో అత‌ను పాట‌లే పాడ‌టం లేద‌ని చూపిస్తున్నారు. ఇది తెలిసి కూడా నాగ్ స‌ర్ .. శ్రీ‌రామ్ పాట‌లు ఎందుకు పాడ‌టం లేద‌ని అడుగుతున్నారు. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది? ... ఏం చేయాల‌నుకుంటున్నారు... ఏం చూపిస్తున్నారు? .. జ‌రిగింది టెలికాస్ట్ కాన‌ప్పుడు ఎవ‌రైనా ఏం చేస్తారు అంటూ మ‌రోసారి త‌న ఆవేద‌న‌ని వ్య‌క్తం చేశాడు యాంకర్ ర‌వి.   

 సిరి - ష‌న్నుల హ‌గ్గుల యుద్ధం అన్ స్టాప‌బుల్‌

బిగ్‌బాస్ క్లైమాక్స్‌కి చేరుతున్నా కొద్దీ కంటెస్టెంట్‌ల అస‌లు కూపాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ష‌న్ను, సిరిల వ్య‌వ‌హారం మ‌రీ పీక్స్ చేర‌డం కాదు మ‌రీ ఇంత వ‌ల్గ‌ర్ గానా అనే స్థాయికి చేరింది. మాటి మాటికి హ‌గ్గులు.. కిస్సులు.. రెస్ట్ రూమ్ పంచాయితీలు.. ఆ త‌రువాత ప్ర‌ణ‌య గీతాలు.. నువ్వు లేక నేను లేన‌ని, న‌న్ను త‌ప్ప హౌస్‌లో మ‌రెవ‌రినీ ఆ దృష్టిలో చూడొద్ద‌ని ష‌న్ను సిరిని క‌ట్ట‌డి చేస్తున్న తీరు ప్రేక్ష‌కుల‌కు వెగ‌టు పుట్టిస్తోంది. ఛాన్స్ చిక్కింది.. ష‌న్నుపై స‌న్నీ పంచ్ పేలింది ఈ ఇద్ద‌రు ఫ్రెండ్షిప్ అర్థాన్ని మార్చేస్తున్నార‌ని నెటిజ‌న్‌లు వీరిపై మండిప‌డుతున్నారు. గురువారం బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు త‌మాషా టాస్క్ ఇచ్చారు. త‌మ ఫేవ‌రేట్ హీరోలు ఇంటి స‌భ్యులు మారి పోయి పాట ప్లే అవుతుంటే అది ఎవ‌రి పాటో వారు స్టేజ్ పైకి వ‌చ్చి పెర్ఫార్మ్ చేయాలి. ఈ టాస్క్‌లో బాల‌య్య స‌న్నీ, మాన‌స్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌... శ్రీ‌రామ్ .. మెగాస్టార్ చిరంజీవి, ష‌ణ్ముఖ్ .. సూర్య‌.. సిరి జెనీలియా.. కాజ‌ల్ .. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి.. ఇక ఒక్కొక్క‌రు ఒక్కో తార‌గా మారిపోయారు. ష‌న్నుపై మాధ‌వీల‌త సీరియ‌స్‌.. కోర్టుకి వెళుతుంద‌ట‌ ఇందులో స‌న్నీ.. కాజ‌ల్‌.., సిరిల‌తో చేసిన కామెడీ.. వేసిన పంచ్‌లు.. ఓ రేంజ్ లో పేలి న‌వ్వులు కురిపించాయి. ఈ టాస్క్‌లో బాల‌య్య గెట‌ప్‌లో వున్న స‌న్నీతో క‌లిసి సిరి స్టెప్పులేసింది. ఇది చూసిన ష‌న్నుకి ఎక్క‌డో కాలి ముఖం మాడిపోయింది. అక్క‌డి నుంచి సిరిని దూరం పెట్ట‌డం మొద‌లుపెట్టాడు.. మ‌ళ్లీ హ‌గ్గు కోసం డ్రామా షురూ అనేంత‌గా వీరి డ్రామా  మొద‌లైంది. ఆ త‌రువాత అంతా క‌లిసి స్కిట్‌ చేద్దామ‌ని ష‌న్నుని అడిగితే నాకు రాదు బ్రో అయినా మీరంతా ఒక‌టి అంటూ రెస్ట్ రూమ్ వైప్ వెళ్లిపోయాడు.. వెన‌కాలే వెళ్లిన సిరి మ‌ళ్లీ డ్రామా మొద‌లుపెట్టింది. నువ్వు ట్రిప్ అయిన ప్ర‌తి సారి చెప్ప‌డం నాకు న‌చ్చ‌డం లేదంటాడు ష‌న్ను.. నీ బాధ నాకు అర్థ‌మైందిరా అంటుంది సిరి.. ఎంత వారించినా ష‌న్ను విన‌క‌పోవ‌డంతో నువ్వంటే నాకిష్టం అని మ‌ళ్లీ హ‌గ్గులేసుకోవ‌డంతో ఎపిసోడ్‌ని ఎండ్ చేశారు. వీరి హ‌గ్గుల తీరు చూసి త‌ట్టుకోలేక‌పోతున్న నెటిజ‌న్స్ ఈ హ‌గ్గుల యుద్ధం అన్ స్టాప‌బుల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.    

కొంప‌ముంచిన అషూరెడ్డి చెత్త ఐడియా!

బిగ్‌బాస్ తో వెలుగులోకి వ‌చ్చిన యూట్యూబ‌ర్ అషూరెడ్డి. కెరీర్ తొలినాళ్ల‌లో జూనియ‌ర్ స‌మంత‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న అషూరెడ్డి సెల‌బ్రిటీగా మారిపోయింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ టాటూని త‌న ప్రైవేట్ పార్ట్‌పై వేసుకుని వార్త‌ల్లో నిలిచింది. నిత్యం సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూ బోల్డ్ సెల‌బ్రిటీగా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌తో బోల్డ్ ఇంట‌ర్వ్యూలో పాల్గొని.. త‌ను అతి చేస్తే చెంప‌లు వాయించి హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఓంకార్ నిర్వ‌హిస్తున్న `కామెడీ స్టార్స్‌` షోలో హ‌రితో క‌లిసి పులిహోరా క‌లుపుతూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న అషూ రెడ్డి గ‌త కొన్ని వారాలుగా ఆ షోకు దూరంగా వుంటోంది. దుబాయ్ ట్రిప్ కోసం వెళ్లి నెట్టింట సంద‌డి చేసిన అషూ రెడ్డి ఆ త‌రువాత రెండు ల‌క్ష‌ల పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొన్నాన‌ని చెప్పి ఓ వీడియోని పోస్ట్ చేసి అందులో త‌న త‌ల్లికి అడ్డంగా బుక్కై అల్ల‌రి పాలైంది. తాజాగా ఇలాంటి ఓ చెత్త ఐడియాతో త‌న యూట్యూబ్ ఛాన‌ల్ కోసం ఓ వీడియోని పోస్ట్ చేసి అంద‌రి చేత చివాట్లు తింటోంది. ఈ వీడియో చూసిన వారంతా వ్యూస్ కోసం ఇంత‌లా దిగ‌జారిపోతావా అంటూ అషూ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అషూ త‌న త‌ల్లిని ఆట‌ప‌ట్టించేందుకు ఓ ప్రాంక్ వీడియోని షూట్ చేసింది. ఈ వీడియో చూసిన ఎవ్వ‌రికైనా స‌హ‌జంగానే అషూరెడ్డిపై కోపం అస‌హ్యం వేస్తాయి. ఇక నెటిజ‌న్‌ల కి .. ఆమె అభిమానుల‌కు మాత్రం ఓ రేంజ్‌లో మండింది. అంత‌లా మండ‌టానికి గ‌ల కార‌ణం ఏంటంటే త‌ను ప్రెగ్నెంట్ అని త‌న త‌ల్లినే ఆట‌ప‌ట్టిస్తూ అషూ రెడ్డి వీడియో చేయ‌డం.. దాన్నే త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో పోస్ట్ చేయ‌డం. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.