అంతమంది సెలబ్రిటీస్ వచ్చినా 'బిగ్ బాస్ 5 ఫినాలే' రేటింగ్ తక్కువే!

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ డిసెంబర్ 19 న గ్రాండ్ గా ముగిసింది. ఐదో సీజర్ విన్నర్ గా వీజే సన్నీ నిలిచాడు. అయితే ఎంతో ఘనంగా జరిగిన బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేటింగ్ మునుపటి రికార్డులను తిరగ రాస్తూ భారీగా వస్తుందని భావించారంతా. కానీ గత సీజన్లతో పోల్చితే తక్కువ టీఆర్పీ నమోదు చేసి బిగ్ బాస్ ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేసింది. బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ఎప్పుడు లేనంతగా భారీగా గెస్ట్ లు తరలివచ్చారు. రాజమౌళి, రణబీర్ కపూర్, ఆలియా భట్, నాని, నాగ చైతన్య, శ్రియ, ఫరియా అబ్దుల్లా ఇలా ఎందరో సందడి చేశారు. దీంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రికార్డు టీఆర్పీ వస్తుందని అనుకున్నారంతా. కానీ గత సీజన్ల టీఆర్పీతో పోల్చితే తగ్గింది. బిగ్ బాస్ మొదటి నాలుగు సీజన్ల టీఆర్పీ గమనిస్తే '14.13, 15.05, 18.29, 19.51' ఇలా ప్రతి సీజన్ కి పెరుగుతూ వచ్చింది. ఈ సారి గెస్ట్ లు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో గత రెండు సీజన్ల స్థాయిలో రేటింగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 16.04 కి పరిమితమైంది. 16 అనేది మంచి రేటింగే అయినప్పటికీ గత సీజన్లతో పోల్చితే తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి త్వరలో ఆరో సీజన్ ని ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి రికార్డు రేటింగ్ వచ్చేలా ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.

బిగ్‌బాస్ ఓటీటీ అత‌ని చేతికా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. విజేత‌గా వీజే స‌న్నీ నిలిచిన విష‌యం  తెలిసిందే. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ ముగిసిన వెంట‌నే ఓటీటీ లో బిగ్‌బాస్ అనే వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఓటీటీ బిగ్ బాస్ 24 గంట‌ల నిడివితో వుంటుంద‌ని, దాని ఫార్మాట్ వేరేగా వుంటుంద‌ని ఇటీవ‌ల బిగ్‌బాస్ హోస్ట్‌, హీరో నాగార్జున వెల్ల‌డించారు. అయితే దీనికి హోస్ట్ గా ఎవ‌రు వ్య‌వ‌హ‌రిస్తారు? .. ఏమా క‌థ‌... కంటెస్టెంట్ లు ఎలా వుంటారు? .. ఎలా ఎంపిక చేస్తారు? .. అన్న విష‌యాల‌పై మాత్రం ఇంత వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త‌లేదు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ ఓటీటీ ఓంకార్ చేతుల్లోకి వెళ్లిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. Also Read:అది విష‌పూరిత స‌ర్ప‌మే.. స‌ల్మాన్ వెల్ల‌డించిన షాకింగ్ డీటైల్స్‌! అత‌నే ఓంకార్‌. OAK Entertainments పై ఆట‌, సిక్స్త్ సెన్స్‌, ఇస్మార్ట్ జోడీ, మాయాద్వీపం వంటి వినూత్న‌మైన కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌కి టీఆర్పీ రేటింగ్స్ కూడా రికార్డు స్థాయిలో న‌మోదు కావ‌డం విశేషం. దీంతో బిగ్‌బాస్ ఓటీటీ బాధ్య‌త‌ల్ని నిర్వాహ‌కులు ఓంకార్ కు అప్ప‌గించే అవ‌కాశం వుంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ షో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో బిగ్‌బాస్ ఓటీటీ షో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా బిగ్‌బాస్ కొత్త సీజ‌న్ కూడా మ‌రో రెండు నెల‌ల్లో అంటే ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కాబోతోంది. Also Read:జెనీలియాతో స‌ల్మాన్ డాన్స్‌.. వీడియో వైర‌ల్‌! ఇక ఓటీటీ బిగ్‌బాస్ కోసం ఎంపిక చేయ‌బోతున్న కంటెస్టెంట్స్ ఎవ‌రంటే వీరేనంటూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్లు విన్న వాళ్లంతా అవాక్క‌వుతున్నారు. సీజ‌న్ 5 స‌మ‌యంలో ఉప్ప‌ల్ బాలు, క‌త్త‌ర్ పాప‌, యాంక‌ర్ శివ‌, బంజారాహిల్స్ ప్ర‌శాంత్‌, టిక్ టాక్ దుర్గారావు వంటి పేర్లు వినిపించాయి. అయితే వీరినే బిగ్‌బాస్ ఓటీటీకి సెలెక్ట్ చేయాల‌ని ఓంకార్ భావిస్తున్నార‌ని, ఇదేం విచిత్రం బాబోయ్ అని వీక్ష‌కులు అవాక్క‌వుతున్నారు. ఇదే నిజ‌మైతే ఓటీటీ బిగ్‌బాస్ ఓ అరాచ‌కంగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.   

రౌడీల ఉచ్చులో అను.. ఆర్య కాపాడ‌తాడా?

  బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `ప్రేమ ఎంత మ‌ధురం`. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్ న‌టిస్తూ ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. క‌న్న‌డ న‌టి వ‌ర్ష కీల‌క పాత్ర‌లో న‌టించింది. రాజ‌నందిని ఆత్మ క‌థ‌, ప‌గా, ప్ర‌తీకారం నేప‌థ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ తాజాగా కీల‌క అంకానికి చేరుకుంది. త‌న‌కు రాజ‌నందిని చెప్పిన విష‌యాల్ని ఛేధించ‌డం మొద‌లు పెట్టిన అనుకు అడుగ‌డుగున అవాంత‌రాలు ఎదుర‌వుతూ వుంటాయి. ఈ క్ర‌మంలో ఆర్య ప‌డుకోవ‌డంతో రాజ‌నందిని చెప్పిన‌ట్టుగానే మ‌హ‌ల్ లో దాగున్న ర‌హ‌స్యాన్ని ఛేధించ‌డం కోసం అను.. రాజ‌నందిని వాడిన కారులో ఒంట‌రిగా రాజ మ‌హ‌ల్ కు వెళుతుంది. అక్క‌డ రాజ‌నందిని బోర్డుని చూసి ఇక్క‌డే అస‌లు ర‌హ‌స్యం దాగి వుంద‌ని గ్ర‌హిస్తుంది. ఇంత‌లో రౌడీలు కొంత మంది అనుని లోనికి వెళ్ల‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆ త‌రువాత అనుని వెంబ‌డించ‌డం మొద‌లుపెడ‌తారు. ఇది గ‌మ‌నించిన అను అక్క‌డి నుంచి పారిపోయే ప్ర‌య‌త్నం చేస్తుంది. Also Read: షాకింగ్ రోల్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్.. ఉద్వేగ‌భ‌రితంగా 'సేనాప‌తి' ట్రైల‌ర్‌! ఇంత‌లో అనుకి ఎదురుగా ఓ కార్ లైట్లు వెలుగుతాయి. ఆ లైట్ల వెలుతురులోంచి ఆర్య క‌నిపించ‌డంతో కొండంత ధైర్యం వ‌చ్చిన అను అత‌ని వైపు ప‌రుగెడుతుంది. ఆర్య రావ‌డాన్ని గ‌మ‌నించిన రౌడీలు అక్క‌డి నుంచి పారిపోయే ప్ర‌య‌త్నం చేస్తారు. వారిని వెంబ‌డిస్తూ ఆర్య కూడా ప‌రుగెడ‌తాడు. కానీ చిక్క‌కుండా త‌ప్పించుకు పారిపోవ‌డంతో అక్క‌డి నుంచి అనుని ఇంటికి తీసుకొస్తాడు ఆర్య‌.. క‌ట్ చేస్తే ఆర్య ఇంటి వ‌ద్ద సీన్ మ‌రోలా వుంటుంది. అను తీసుకెళ్లిన కారు గురించి శార‌దా దేవికి చెబుతూ మాన్సీ పెద్ద ఇష్యూ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

రుద్రాణికి చుక్క‌లు చూపించిన మాధురి!

  బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ ల‌లో ముందు వ‌రుస‌లో నిలుస్తోంది `కార్తీక దీపం`. పరిటాల నిరుప‌మ్ న‌టించిన ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బుధ‌వారం ఎపిసోడ్ లో శ్రీ‌వ‌ల్లి బాబు నామ‌క‌ర‌ణం జ‌రుగుతుండ‌గా ఇంట్లో కి చొర‌బ‌డిన రుద్రాణి.. నామ‌క‌ర‌ణం ఆపేసి శ్రీ‌వ‌ల్లి బాబుని బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్ల‌డం తెలిసిందే. దీంతో త‌ల్ల‌డిల్లిన శ్రీ‌వ‌ల్లి ఏది జ‌రిగితే అది జ‌రిగింద‌ని త‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల్సిందేన‌ని కోటేష్‌ని వెంటబెట్టుకుని పోలిస్‌ స్టేష‌న్ వెళుతుంది. క‌ట్ చేస్తే గురువారం ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారబోతోంది. డాక్ట‌ర్ బాబు.. త‌నతో రుద్రాణి అన్న మాట‌ల గురించి ఆలోచిస్తుంటాడు. ఇంత‌లో దీప వ‌చ్చి ఏంటీ డాక్ట‌ర్ బాబు ఆలోచిస్తున్నారంటుంది. రుద్రాణి గురించి దీప అని చెబుతాడు. ఆ త‌రువాత `త‌న విష‌యంలో త‌ప్పు చేశానేమోన‌ని'.. అంటూ ఫీల‌వుతుంటాడు. దీనికి దీప `మంచో చెడో అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే.. ఏమోస్తుంది చెప్పండి త‌ల‌నొప్పి త‌ప్ప అని డాక్ట‌ర్ బాబుకు స‌ర్ది చెబుతుంది. క‌ట్ చేస్తే రుద్రాణి ఇంటి ముందు పోలీస్ వ్యాన్ వ‌చ్చి ఆగుటుంది. సౌండ్ విన్న రుద్రాణి.. 'ఒరేయ్ అబ్బులు ఆ సౌండ్ ఏంటో చూడు' అంటుంది. అది గ‌మ‌నించిన అబ్బులు 'అక్కా.. అక్కా.. పోలీసులు వ‌స్తున్నార‌క్కా..' అంటూ కంగారుగా చెబుతాడు.. `ఏంట్రా మ‌ధ్యాహ్న‌మే మందు కొట్టి వ‌చ్చావా?..ఈ రుద్రాణి ఇంటి మీద పోలీసుల నీడ కూడా ప‌డ‌లేదురా?.. నిజంగా వ‌స్తున్నార‌క్కా..' అంటుండ‌గానే ఎస్‌.ఐ. మాధురి స‌రాస‌రి రుద్రాణి ముందుకే వ‌చ్చేస్తుంది. Also Read: రాత్రివేళ ఒంట‌రిగా కారులో అను ఎక్క‌డికి వెళ్లింది? 'ఏంటీ నీ ధైర్యం?' అని రుద్రాణి.. మాధురిని ప్ర‌శ్నిస్తుంది.. ధైర్యం నా ఇంటిపేరు అనుకో రుద్రాణి అని బ‌దులిస్తుంది మాధురి. వెంట‌నే శ్రీ‌వ‌ల్లి, కోటేష్ కూడా లోప‌లికి వ‌చ్చేస్తారు. వీడు మా బాబు అంటూ బాబుని చూపిస్తారు. వారిని బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తుంది రుద్రాణి..ఈ సంభాష‌ణ గ‌మ‌నించిన మాధురి.. వెంట‌నే రుద్రాణి చెంప ఛెల్లుమ‌నిపిస్తుంది.. ఓ విధంగా చెప్పాలంటే రుద్రాణికి చుక్క‌లు చూపిస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

`పెళ్లాం వ‌ద్దు పార్టీ ముద్దు`లో వర్మ హంగామా!

  న్యూ ఇయ‌ర్ హంగామా కోసం వివిధ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్స్ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ని సిద్ధం చేశాయి.. ఇందుకు సంబంధించిన ప్రోమోల‌ని వ‌న్ బై వ‌న్ విడుద‌ల చేస్తూ హంగామా సృష్టిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈటీవీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఓ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. `ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్` కామెడీ షో హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈ 31 నైట్ ప్ర‌త్యేకంగా ఓ కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశారు. `పెళ్లాం వ‌ద్దు పార్టీ ముద్దు` పేరుతో డిజైన్ చేసిన ఈ ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మానికి ఛీఫ్ గెస్ట్‌గా వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఆహ్వానించారు. ఇంకే ముంది.. షో ఆసాంతం న‌వ్వులు.. పంచుల‌తో రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్ లా సాగిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ లో రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయ‌న వేసిన పంచ్ ల‌కు కంటెస్టెంట్ ల‌తో పాటు షోకు హోస్ట్ గా వ్య‌వహ‌రించిన ఇంద్ర‌జ కూడా ప‌డి ప‌డి న‌వ్వ‌డం విశేషం. Also Read: బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణి.. శ్రీ‌వ‌ల్లి రియాక్ష‌న్ ఏంటీ? హైప‌ర్ ఆది ఫ్యామిలీ ఎంట్రీతో ఈ ప్రోమో మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా హైప‌ర్ ఆది త‌న తండ్రి రోజు చేసే ప‌నిని ఫ‌న్నీగా చెప్పి న‌వ్వులు పూయించాడు. ఆ త‌రువాత వ‌ర్మ‌తో క‌లిసి హైప‌ర్ ఆది చేసిన స్కిట్ కూడా న‌వ్వులు పూయిస్తోంది. విష్ణు ప్రియ‌ను చూపిస్తూ 'ముందు వేరే ఆవిడ‌ని చేసుకున్నాను.. అయితే నాకు ఈవిడ న‌చ్చింది.. నేను ఈవిడ కావాల‌నుకుంటున్నాను.. ఇది రైటా రాంగా?' అని హైప‌ర్ ఆది .. వ‌ర్మ‌ని అడ‌గ‌డం...'మీరు త‌న‌ని పెళ్లి చేసుకుని త‌న‌తో తిరుగుతున్నారు క‌దా..? అప్పుడు మీరు నాతో తిర‌గండ‌'ని మ‌రో యువ‌తికి చెప్ప‌డం... ఇంత‌లో ఆటో రాంప్ర‌సాద్ వ‌చ్చి 'బ్ర‌ద‌ర్ ఎవ‌రావిడ క‌త్తిలా వుంద‌'న‌డం... 'నువ్వు అలా అంటే నేను మీ ఆవిడ‌ని అంటాన‌ని అనుకుంటున్నావ్ అబ్బా.. నేను అస్స‌లు అన‌ను' అని పంచ్ వేయ‌డం... షోలో న‌వ్వులు కురిపించింది.  వ‌ర్మ సైలెంట్ పంచ్ ల‌తో న‌వ్వులు పూయించిన ఈ షో 31 రాత్రి 9:30 నిమిషాల‌కు ప్ర‌సారం కాబోతోంది.

సుడిగాలి సుధీర్‌కు ఊహించ‌ని షాక్‌!

  బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో పాపుల‌ర్ అయిన వ్య‌క్తి సుడిగాలి సుధీర్‌. ఈ కామెడీ షోతో పాటు త‌న టీమ్ తో క‌లిసి `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`లోనూ ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ షోలో సుడిగాలి సుధీర్‌కు అనూహ్యంగా షాక్ త‌గిలింది. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల నేప‌థ్యంలో `స్వ‌ర్గంలో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్` పేరుతో ప్ర‌త్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ కి `గులాబీ` ఫేమ్ మ‌హేశ్వ‌రి ముఖ్య అతిథిగా విచ్చేసి సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి న‌టి మ‌హేశ్వ‌రిని ఆహ్వానించే ప్ర‌య‌త్నంలో ఆమెతో చేయి క‌లిపే ప్ర‌య‌త్నం చేశాడు. ఇది గ‌మ‌నించిన మ‌హేశ్వ‌రి హాయ్ అన‌డానికి బ‌దులు న‌మ‌స్కారం చేసి షాకిచ్చారు. `ఇదేంటి నేను హాయ్ చెప్తే మీరు న‌మ‌స్కారం పెడుతున్నారు?' అని సుధీర్ ప్ర‌శ్నించ‌గా `వ‌ద్దు బాబూ.. `నేను చెయ్యి క‌లిపితే నువ్వు పులిహోర క‌లుపుతావ్‌` అంటూ మ‌హేశ్వ‌రి దిమ్మ‌దిరిగే పంచ్ వేశారు. దీంతో అక్క‌డ న‌వ్వులు విరిసాయి. Also Read: మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్! 'ముందు దూరంగా వుండూ' అంటూ న‌టి మ‌హేశ్వ‌రి ఇచ్చిన కౌంట‌ర్ కు సుధీర్‌కు ఫ్యూజులు అవుట‌య్యాయి. ఆ త‌రువాత వేసిన పంచ్ తో ఊహించ‌ని షాక్ త‌గిలింది. 'ఇంత‌కీ మేడ‌మ్ న‌న్ను ఎక్క‌డ వుండ‌మంటారు? అని సుధీర్ అడిగితే.. 'నా నుంచి మాత్రం దూరంగా వుండే'.. అని మ‌హేశ్వ‌రి అన‌డంతో సుధీర్ షాక్ కొట్టిన కాకిలా మాడిపోయాడు. తాజాగా విడుద‌ల చేసిన ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ ప్రోమో ప్రారంభంలో ఇంద్ర‌జ ... అను ఇమ్మానుయేల్ పై వేసిన పంచ్ కూడా బాగానే పేలింది.

 బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణి.. శ్రీ‌వ‌ల్లి రియాక్ష‌న్ ఏంటీ?

  బుల్లితెరపై మ‌హిళా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటున్న ఏకైక‌ సీరియ‌ల్ `కార్తీక దీపం`. దివంగ‌త ర‌చ‌యిత ఓంకార్ త‌న‌యుడు ప‌రిటాల నిరుప‌మ్, ప్రేమి విశ్వ‌నాథ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌ఎంతో కాలంగా ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. డాక్ట‌ర్ బాబుని ర‌త్న‌సీత సాయంతో ఓ కేసులో ఇరికించి డాక్ట‌ర్ వృత్తికే దూరం చేస్తుంది మోనిత‌. అయితే త‌న కొడుకు కోసం మాస్ట‌ర్ ప్లాన్ వేసిన సౌంద‌ర్య ఆ విష‌యాన్ని ర‌త్న సీత ద్వారానే బ‌య‌ట‌పెట్టి మోనితకు షాకిస్తుంది. దీంతో మోనిత .. సౌంద‌ర్య ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. క‌ట్ చేస్తే... కోటేష్ ఎత్తుకొచ్చిన మోనిత కొడుక్కి నామ‌క‌ర‌ణ మ‌హోత్స‌వం జ‌రుపుతుంటారు. ఇంత‌కీ పేరేం పెట్టాల‌నుకుంటున్నార‌ని పంతులు అడిగితే ఆనంద్ అని కోటేష్ చెబుతుండ‌గా.. ఇంత‌లో రుద్రాణి క‌ల‌గ‌జేసుకుని రంగ‌రాజు అంటుంది. అంతా ఆశ్చ‌ర్యంగా చూస్తుండ‌గానే `ఏం శ్రీ‌వ‌ల్లీ పేరు బావుందా?' అని ఎదురు ప్ర‌శ్నిస్తుంది రుద్రాణి.. 'కోటేషు పేరు న‌చ్చిందా?.. వీడిని ద‌త్త‌త తీసుకుంటున్నా'న‌ని శ్రీ‌వ‌ల్లి చేతుల్లో వున్న బాబుని బ‌ల‌వంతంగా తీసుకుంటుంది రుద్రాణి. Also read: మ‌ళ్లీ షాకిచ్చిన మోనిత‌.. కీల‌క మ‌లుపు 'అక్కా ఇది చాలా అన్యాయం'.. అని కోటేష్ అంటే 'అరేయ్ ప్ర‌పంచంలో న్యాయం.. అన్యాయం అని వుండ‌వురా.. బ‌ల‌వంతులు.. బ‌ల‌హీనులు మాత్ర‌మే వుంటారు.' అంటుంది. ఇంత‌లో అక్క‌డే వున్న డాక్ట‌ర్ బాబు క‌ల‌గ‌జేసుకుని రుద్రాణిని ఆపే ప్ర‌య‌త్నం చేస్తాడు కానీ 'ఒప్పందం ప్ర‌కారం నీ కూతురిని తీసుకెళ్లాలి.. అలా చేయ‌నా' అని డాక్ట‌ర్ బాబుకి మాత్ర‌మే వినిపించేలా రుద్రాణి అంటుంది... దాంతో డాక్ట‌ర్ బాబు నిశ్చేష్టుడై వుండిపోతాడు. ఇంత‌లో దీప క‌ల‌గ‌జేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. 'నేను మాట్లాడుతున్నాను క‌దా నువ్వు ఆగు' అంటాడు డాక్ట‌ర్ బాబు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. రుద్రాణి బాబుని తీసుకెళ్ల‌డంతో శ్రీ‌వ‌ల్లి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది? క‌థ ఏ మ‌లుపు తిర‌గ‌బోతోంది?.. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

రాత్రివేళ ఒంట‌రిగా కారులో అను ఎక్క‌డికి వెళ్లింది?

  బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. `బొమ్మ‌రిల్లు` వెంక‌ట్ శ్రీ‌రామ్, వ‌ర్ష హెచ్.కె కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, అనుషా సంతోష్‌, రామ్ జ‌గ‌న్‌, విశ్వ‌మోహ‌న్‌, క‌ర‌ణ్‌, వ‌ర్ష‌, ఉమాదేవి, మ‌ధుశ్రీ‌, రాధాకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త జ‌న్మల నేప‌థ్యంలో సాగే ఫాంట‌సీ థ్రిల్ల‌ర్. త‌ను ప్రేమించిన ఆర్య కోసం తిరిగొచ్చిన రాజ‌నందిని క‌థ‌గా ఈ సీరియ‌ల్ వ‌రుస ట్విస్ట్ ల‌తో విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బుధ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో జెండే (రామ్ జ‌గ‌న్‌) పై అనుమానం మొద‌లైన అను త‌న‌ని వెంబ‌డిస్తూ అత‌ను ఎవ‌రినో ఒంట‌రిగా క‌ల‌వ‌డానికి వెళుతున్నాడ‌ని ప‌సిగ‌ట్టి అత‌న్ని వెంబ‌డిస్తుంది. ఏకాంత ప్ర‌దేశానికి చేరుకున్న జెండే `ఇక్క‌డ ఎవ‌రూ లేరు నేను ఒక్క‌డినే వున్నాను వ‌చ్చేయ్` అని ఎవ‌రికో ఫోన్ చేస్తాడు. అదెవ‌రో తెలుసుకునే లోపే ఇంటి ద‌గ్గ‌రి నుంచి ఫోన్ వ‌స్తుంది. ఇది జ‌రుగుతున్న క్ర‌మంలోనే ఆర్య .. అను కోసం ఫోన్ చేస్తుంటాడు. కానీ అను అటెండ్ చేయ‌దు. ఏం జ‌రిగిందా? అని అంతా ఇంటికి చేరుకుంటారు. కుక్క‌పై విష ప్ర‌యోగం జ‌రిగి చ‌నిపోయింద‌ని తెలుస్తుంది. త‌ను సిద్ధం చేసిన కిళ్లీల‌ను తిని కుక్క చ‌నిపోయింద‌ని శార‌దా దేవి బోరున విల‌పిస్తుంటుంది. ఆర్య‌, జెండే.. శార‌దా దేవికి స‌ర్దిచెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇదంతా వ‌శిష్ట గ‌మ‌నిస్తూ దొరికి పోతానా? అని అనుమానంతో చూస్తుంటాడు. ఇంత‌లో శార‌దా దేవి .. అను, ఆర్య‌ల‌ని పిలిచి అస‌లు విష‌యం చెబుతుంది. ఈ కిళ్లీలు మీ కోసం సిద్ధం చేసిన‌వి.. అని చెబుతుంది. దీంతో షాక్ కు గురైన అనుకు త‌న‌ని, ఆర్య‌ని చంప‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని రాజ నందిని త‌న‌కు చెప్పిన మాట‌లు గుర్తొస్తాయి. ఇదే టైమ్ లో మాన్సీకి మీరా గ‌ట్టి ఝ‌ల‌క్ ఇస్తుంది. క‌ట్ చేస్తే.. తను రాజ‌నందిని చెబుతున్న విష‌యాల్ని రాసుకున్న డైరీ కోసం అను వెతక‌డం మొద‌లుపెడుతుంది. డైరీ క‌నిపించ‌క‌పోయే స‌రికి అను ప‌నివాడిని ఆరా తీస్తుంది. ఈ లోగా అను కోసం బెడ్ రూమ్‌లో ఆర్య ఎదురుచూస్తూ వుంటాడు. ఇంత‌లో అను వ‌చ్చింది గ‌మ‌నించి 'భోజ‌నం చేశావా?' అని అడుగుతాడు. లేద‌ని చెప్ప‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య కొంత చ‌ర్చ జ‌రుగుతుంది. ఆ త‌రువాత అర్ధ‌రాత్రి ఉన్న‌ట్టుండి నిద్ర లేచిన అను నా ఆర్య‌కి నేనుండ‌గా ఏమీ జ‌ర‌గ‌నివ్వ‌ను.. దీని వెన‌క వున్న‌ది ఎవ‌రో తెలుసుకుంటాను` అంటూ రాత్రి న‌డుచుకుంటూ వెళుతుంది. అది వ‌శిష్ట గ‌మ‌నించి ఎవ‌రికో ఫోన్ చేస్తాడు.. Also Read: 'ఆహా' మరో ట్విస్ట్.. బన్నీ 'అన్ స్టాపబుల్'కి బ్రేక్! గ‌తంలో రాజ‌నందిని వాడిన కారు దుమ్ము ప‌ట్టి వుంటుంది. గేట్ ఓపెన్ చేసిన అను.. కార్ క‌వ‌ర్ తీసేసి ఒంట‌రిగా ఆ కారులో బ‌య‌టికి బ‌య‌లు దేరుతుంది. అది గ‌మ‌నించిన మాన్సి.. ఇంత రాత్రివేళ ఒంట‌రిగా అను ఎక్క‌డికి వెళుతోంది అని అనుమానిస్తుంది. అను కారు నందిని నిల‌యం ముందు ఆగుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం: య‌శోధ‌ర్‌కు వేద షాకిస్తుందా?

బుల్లితెర‌పై మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న స‌రికొత్త సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ప‌రభాషా న‌టులు నిరంజ‌న్‌, డెబ్‌జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు పద్మ‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నిహారిక‌, ఆనంద్‌, శ్రీ‌ధ‌ర్ జీడిగుంట కీల‌క పాత్ర‌ల్ని పోషించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటోంది. డాక్ట‌ర్ వేద‌ని బుట్ట‌లో వేసుకుని ఎలాగైనా ఖుషీని త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని అభిమ‌న్యు, య‌ష్ మాజీ భార్య మాళివిక విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తుంటారు. య‌ష్ విడాకులకు ఎలాంటి అడ్డు చెప్ప‌కుంటే నీ కూతురుని నీకు ఇచ్చేస్తాన‌ని అభిమ‌న్యు .. య‌ష్‌కి ఆఫ‌ర్ ఇస్తాడు. అయినా య‌ష్ ఆ ఆఫ‌ర్ ని అంగీక‌రించడు. ఈ క్ర‌మంలో డాక్ట‌ర్ వేద‌ని బుట్ట‌లో వేయాల‌ని అభిమ‌న్యు, మాళ‌విక ట్రై చేస్తారు. ఈ క్ర‌మంలో ఆమెకు డైమండ్ నెక్లెస్ ఆఫ‌ర్ చేస్తారు. అందుకు వేద తిర‌స్క‌రిస్తుంది. అయితే కోర్టుకు వ‌చ్చిన త‌మ త‌రపున నిల‌బ‌డ‌మ‌ని.. వేద‌ని కోర‌తారు అభిమ‌న్యు, మాళ‌విక. అందుకు త‌న‌కు టైమ్ కావాలంటుంది వేద‌. దీంతో త‌న‌ని కోర్టుకు అయినా ర‌ప్పించాల‌ని, త‌మ‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పించి య‌ష్ ని ఇరికించాల‌ని ప్లాన్ చేస్తారు. Also Read: దీప్తి హింట్ ఇచ్చిన వీడియో వైర‌ల్‌! అయితే బుధ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిగా మార‌బోతోంది. కోర్టులో క‌థ కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతోంది. కోర్టులో య‌ష్‌, మాళ‌విక‌ల విడాకుల కేసు హియ‌రింగ్ మొద‌ల‌వుతుంది ఈ నేప‌థ్యంలో పాప ఖుషీని తీసుకుర‌మ్మంటారు. పాప‌ని తీసుకొస్తూ `ఎవ‌రు ఎన్ని అడిగినా మ‌మ్మీ మాత్ర‌మే కావాల‌ని చెప్ప‌మ‌ని` మాళ‌విక ఖుషీకి చెబుతుంది. కానీ ఖుషీ ఏమీ మాట్లాడ‌దు. అదే స‌మ‌యంలో బోన్‌లోకి వ‌చ్చిన వేద త‌ను ఖుషీకి ఏమీ కాన‌ని, అయితే త‌న‌కు అన్నీ ఖుషీనే అని చెబుతూ ఈ వ‌య‌సులో తల్లి కావాలా?  తండ్రి కావాలా? అంటే ఈ ప‌సి హృద‌యం ఇద్ద‌రు కావాలంటుంద‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. Also Read:  సిరి ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచిందా? ఇద్ద‌రు పంతాల‌కు పోయి ప‌సి హృద‌యాన్ని గాయ‌ప‌రుస్తున్నార‌ని య‌ష్‌, మాళ‌వికల‌ని నిల‌దీస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఖుషీ.. య‌ష్ ని చేరిందా? .. లేక అభిమ‌న్యు ప‌న్నిన కుట్ర కార‌ణంగా మాళ‌విక‌కే ద‌క్కిందా?.. య‌ష్ పై కోపంతో కోర్టుకి వ‌చ్చిన వేద ..య‌ష్ కి చేసింది ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

దీప్తితో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్!

బిగ్ బాస్ 5 తెలుగు రెండు జంటల బ్రేకప్ కి కారణమైందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ అయిన షణ్ముఖ్, సిరి.. హౌస్ లో వారి బిహేవియర్ కారణంగా పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నారని న్యూస్ వినిపిస్తోంది. షణ్ముఖ్ కి బ్రేకప్ అయిందని, సిరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన బ్రేకప్ వార్తలపై షణ్ముఖ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. బిగ్‏బాస్ హౌస్ లోకి వెళ్లకముందే షణ్ముఖ్, దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. సిరి కూడా బిగ్‏బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీహాన్‍ ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే హౌస్ లో షణ్ముఖ్, సిరిల బిహేవియర్ పై ట్రోల్ల్స్ వచ్చాయి. ఫ్రెండ్ షిప్ పేరుతో హగ్స్ తో హద్దు దాటారు అంటూ పలువురు తప్పుబట్టారు. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమే అని హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ బ్రేకప్ న్యూస్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా షణ్ముఖ్ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ కి రాగా దీప్తితో బ్రేకప్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో దీప్తితో బ్రేకప్ జరగదు అని తేల్చి చెప్పాడు. "దీపూ నన్ను బ్లాక్ చేసింది. అలిగినప్పుడు అలా బ్లాక్ చేస్తూ ఉంటది. ప్రజెంట్ వైజాగ్ లో ఉన్నాను. త్వరలోనే హైదరాబాద్ వెళ్లి దీపూని కలుస్తాను. దీపూ నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్‌ చేసింది. అయినప్పటికీ నాకోసం నిలబడింది. తనతో బ్రేకప్‌ మాత్రం జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపూని వదలను" షణ్ముఖ్ అన్నాడు. అలాగే దీప్తిని ఇన్ స్టాలో అన్ ఫాలో ఎందుకు చేసావని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చాడు షణ్ముఖ్. బిగ్ బాస్ కి వెళ్ళకముందు నుండే తనని ఫాలో అవ్వడం లేదని చెప్పాడు. పెళ్లి తర్వాత ఒకరినొకరం ఫాలో అవుతామని నవ్వుతూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.

మ‌ళ్లీ షాకిచ్చిన మోనిత‌.. కీల‌క మ‌లుపు

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ 'కార్తీక దీపం'. ప్ర‌తీ రోజు ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు ఊహ‌కంద‌ని ట్విస్ట్ ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ఈ శ‌నివారం మ‌రో ట్విస్ట్ ని అందించ‌బోతూ కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతోంది. ఈ శ‌నివారం 1232వ ఎపిసోడ్ లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగే నాట‌కీయ ప‌రిణామాలు.. కీల‌క మ‌లుపులు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త థ్రిల్ ని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌బోతున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం. `మ‌నం ఎన్ని పోగొట్టుకున్నా ఒక‌రికి ఒక‌రం ఉన్నాం క‌దా డాక్ట‌ర్ బాబు .. ఎంత క‌ష్ట‌ప‌డితే ఏముంది అంటుంది దీప‌. వెంట‌నే డాక్ట‌ర్ బాబు దీప ఒడిలో ప‌డుకుంటాడు. త‌ల‌ని నిమురుతూ కార్తీక్ కి ప్రేమ‌గా చాలా ధైర్యాన్ని నింపుతుంది.. అయినా స‌రే కార్తీక్ .. రుద్రాణి అప్పు గురించే ఆలోచిస్తూ వుంటాడు. కాసేప‌టికి అదే ఆలోచించుకుంటూ రోడ్డుమీద న‌డుచుకుంటూ వెళుతుంటాడు కార్తీక్‌.. అత‌నికి  ఎదురుగా హిమ‌.. సౌర్య వ‌స్తారు. ఇంత‌లో హిమ క‌డుపులో తిప్పుతోంది అంటూ వంఆతి చేసుకుంటుంది. .. దీంతో షాక్ కు గురైన కార్తీక్ ఏం కాలేదు.. ఏంప‌ర్లేదు అంటూ వారిని ఇంటికి తీసుకెళ‌తాడు.. ఇదిలా వుంటే రుద్రాణి కార్తీక్ కిచ్చిన టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతూ వుంటుంది. ఇదే విష‌యాన్ని రుద్రాణి .. కార్తీక్ ని అడుగుతుంది. రోజులు గ‌డుస్తున్నాయే కానీ నీ నుంచి బాకీ వ‌సూల‌య్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. నిన్ను చూస్తే జాలేస్తోంది. అంత డ‌బ్బు ఎలా క‌డ‌తావ్ అంటుంది రుద్రాణి.. సంత‌కం పెట్టాను క‌దా.. ఎలా తీరుస్తాను అన్న‌ది మీకు అన‌వ‌సరం అంటూ అక్క‌డి నుంచి పిల్ల‌ల‌ని తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్‌.. క‌ట్ చేస్తే...బ‌స్తీలో `వంట‌ల‌క్క ప్ర‌జా వైద్య‌శాల‌` అంటూ బోర్డు వెలుస్తుంది. దీప వాళ్లు గ‌తంలో ఉన్న ఇంటి ముందు మోనిత ఆ బోర్డ్ పెట్టిస్తుంటుంది. వార‌నాసితో స‌హా అంతా అక్క‌డికి వ‌స్తారు.. బ‌స్తీ వాసుల‌కు శుభ‌వార్త అంటూ మోనిత షాకిస్తుంది..ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.

`ఢీ` షో భామ దీపిక పిల్లికి ఊహించ‌ని షాక్‌

టిక్ టాక్ తో పాపుల‌ర్ అయిన సోయ‌గం దీపిక పిల్లి. టిక్ టాక్ బ్యాన్ కావ‌డంతో కొంత నిరుత్సాహానికి గురైన దీపిక పిల్లికి పాపుల‌ర్ డ్యాన్స్ షో `ఢీ`లో చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత `శ్రీ‌దేవి డ్రామా సెంట‌ర్‌`లోనూ అప్పుడ‌ప్పుడు మెరుస్తోంది దీపిక‌. టిక్ టాక్‌లో ఫేమ‌స్ అయిన దీపిక ఆ త‌రువాత `ఢీ` షో దీపిక‌గా మారింది. ఇదే షోలో ఆక‌ట్టుకుంటూ త‌న అందంతో ఆడియ‌న్స్‌ని ఫిదా చేస్తోంది. ఇప్ప‌టికే ఈ షో ద్వారా భారీ స్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకుంది. వ‌ర్షిణి త‌రువాత ఆ స్థానంలోకి ఎంట్రీ ఇచ్చి అంద‌రికి షాకిచ్చింది. దీపిక అందాన్ని అవ‌కాశంగా తీసుకుని త‌న‌కు, హైప‌ర్ ఆదీల‌కు మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ని న‌డిపించాల‌ని, త‌ద్వారా షోకు మ‌రింత పాపులారిటీని తీసుకురావాలని ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌ల్లెమాల టీం ఎంత‌గా ట్రై చేసినా హైప‌ర్ ఆది, దీపిక పిల్లి కెమిస్ట్రీ కుద‌ర‌లేదు. దీంతో ఈ జోడీ ఫెయిలైపోయింది. దీంతో దీపిక చేతిలో వున్న ఈ ఒక్క షో కూడా పోయింది. టిక్ టాక్ లో 10 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ని సొంతం చేసుక‌రుని మాయ‌చేసిన దీపిక పిల్లి మ‌ళ్లీ అదే బాట‌లోకి వెళ్లాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో దీపిక పిల్లి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. త‌న సోయ‌గాల‌తో నెటిజ‌న్ ల‌కి వ‌ల వేస్తూ ఆక‌ట్టుకుంటోంది. వ‌రుస ఫొటో షూట్‌ల‌తో క‌వ్విస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ర‌ష్మితో దీపిక బాండింగ్ బాగా కుదిరినా హైప‌ర్ ఆదితో సెట్ట‌వ్వ‌క‌పోవ‌డంతో దీపిక ఢీ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. అయినా స‌రే నెట్టింట త‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అదే జోరుని కొన‌సాగిస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ త‌మాషా ప‌ని దీపికనే షాక్ కు గుర‌య్యేలా చేసింది. నీకు ఏ వ‌య‌సులో పెళ్లి అవుతుంది? అని ఓ ప్ర‌శ్న దీపిక పిల్లికి ఎదురైంది. ఆ ప్ర‌శ్నకు ఇన్‌స్టా గ్రామ్ లోని యాప్ లు ర‌క‌ర‌కాలు స‌మాధానాలు చెప్పాయి. చివిరికి నీకు ఎప్ప‌టికీ పెళ్లి కాదు అని స‌మాధానం రావ‌డంతో దీపిక షాక్ కు గుర‌వుతోంద‌ట‌. ఇది చూసి నెటిజ‌న్ లు దీపిక‌పై సెటైర్లు వేస్తున్నారు. నీకు పెళ్లి కాక‌పోతే నా ప‌రిస్థితి ఏంటీ? అని చిలిపిగా స్పందిస్తుండ‌టం న‌వ్వులు పూయిస్తోంది.

'ఆహా' మరో ట్విస్ట్.. బన్నీ 'అన్ స్టాపబుల్'కి బ్రేక్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆరో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుండి ప్రసారం కానుందని ఇటీవల ఆహా ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది ఆహా. నిజానికి ఆరో ఎపిసోడ్ గా మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని పాల్గొన్న ఎపిసోడ్ రానుందని మొదట ఆహా ప్రకటించింది. అయితే ఈ డిసెంబర్ 31 కి వాయిదా వేసి, ఆ ప్లేస్ లో బన్నీ ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'తో బన్నీ డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బన్నీ ఎపిసోడ్ ని ముందుకి తీసుకొచ్చి రవితేజ ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వినిపించింది. అయితే తాజాగా బన్నీ ఎపిసోడ్ ని కూడా పోస్ట్ పోన్ చేసి షాక్ ఇచ్చింది ఆహా. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప ఎపిసోడ్ ని కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు(డిసెంబర్ 25) విడుదల చేయలేకపోతున్నామని ఆహా తెలిపింది. కాస్త ఆలస్యమైనా బెస్ట్ అవుట్ పుట్ తో వస్తామని చెప్పింది. చిన్న బ్రేక్ అంతే, అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుంది అని ఆహా పేర్కొంది.

బిగ్ బాస్ 6 అప్డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జునే కానీ?

తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లు పూర్తయ్యాయి. ఇటీవలే ఘనంగా ముగిసిన ఐదో సీజన్ లో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. అయితే మరో రెండు నెలల్లో బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ ప్రారంభం కానుందని బిగ్‏బాస్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై నాగార్జున అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున చెప్పినట్లుగానే బిగ్ బాస్ షో నెక్స్ట్ సీజన్ అప్డేట్ వచ్చింది. ఈసారి బిగ్ బాస్ షో ఓటీటీలో అలరించనుంది. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీలో ఒక సీజన్ పూర్తి చేసుకుంది. దీనికి కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా బిగ్ బాస్ ఓటీటీలో అలరించనుంది. బిగ్ బాస్ లైవ్.. ఓటీటీలో మొదటిసారిగా ప్రసారం కాబోతోంది. దీనికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ రోజంతా ఉన్నా అక్కడా జరిగే కొన్ని హైలైట్స్ ని మాత్రమే ఎడిట్ చేసి ఎపిసోడ్ గా ఆడియన్స్ కి చూపిస్తారు. అయితే ఓటీటీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ లైవ్ లో మాత్రం కంటెస్టెంట్స్ హౌస్ లో డే అంతా ఎలా ఉంటున్నారో చూపించనున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ లైవ్ తో పాటు పలు సిరీస్ లు, ఓటీటీ సినిమాలతో అలరించడానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్ధమవుతోంది. తెలుగులో రాబోతోన్న ఫస్ట్ ఒరిజినల్ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ 'పరంపర'తో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర అలరించబోతన్నారు. క్రిష్ డైరెక్షన్‌లో తారక రత్న, అజయ్ కాంబినేషన్‌లో థ్రిల్లింగ్ బ్యాంక్ రాబరీ '9 అవర్స్' అనే చిత్రం రాబోతోంది. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో సైతాన్ అనే హారర్ సినిమా రెడీగా ఉంది.

కార్తీక‌దీపం: ర‌త్న‌సీత రీఎంట్రీ.. మోనిత‌కు షాక్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొం కాలంగా టాప్ రేటింగ్ తో రికార్డులు సృష్టిస్తోంది. ప్ర‌తీ వారం చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సిరియ‌ల్  ఈ శుక్ర‌వారం స‌రికొత్త ట్విస్ట్ ఇవ్వ‌బోతోంది. ఈ శుక్ర‌వారం ఈ సీరియ‌ల్ 1231వ ఎపిసోడ్ లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటి? .. ఇంత‌కీ ఈ రోజు సీరియ‌ల్ ఏ మ‌లుపు తీసుకోబోతోంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. త‌న కొడుకుని కావాల‌నే సౌంద‌ర్య కుటుంబం త‌ప్పించి దాచేసింద‌ని ర‌గిలిపోతున్న మోనిత ఆ ప‌గ‌తో శ్రావ్య కొడుకుని దాచేసి కొంత సేపు భ‌య‌పెడుతుంది. ఆ త‌రువాత శ్రావ్య ఏడుపు చూడ‌లేక బిడ్డ క‌నిపించ‌క‌పోతే త‌ల్లి ఎంత‌గా త‌ల్ల‌డిల్లుతుందో ఇప్ప‌టికైనా అర్థ‌మైందా? అంటూ `ఎలా వుంది ఆంటీ నేనిచ్చిన ఝ‌ల‌క్‌` అని సౌంద‌ర్య‌ని ఆట‌ప‌ట్టిస్తుంది. క‌ట్ చేస్తే `హిమ‌, రౌడీ బ్యాగ్స్ త‌గిలించుక‌ని స్కూల్ కి వెళుతూ దీప‌కు బాయ్ చెబుతుంటారు. వారిని చూసి ఎలా పెర‌గాల్సిన పిల్ల‌లు ఎలా అయిపోయార‌ని కార్తీక్ మ‌ద‌న ప‌డుతుంటాడు. Also read:అమ్మ బాల‌య్యా.. నాగ్ సీట్ కే ఎర్త్ పెట్టావే! క‌ట్ చేస్తే ... సౌంద‌ర్య .. మోనిత‌కు స‌హాయం చేసిన ర‌త్న‌సీత‌ని క‌లుస్తుంది. `నువ్వు మోనిత‌కి ఏ స్థితిలో సాయం చేశావో .. ఎందుకు చేశావో అవ‌న్నీ నేను అడ‌గ‌ను. నువ్వు చేసిన సాయానికి మేము చాలా న‌ష్ట‌పోయాం. అయినా నీ సాయం కోరి వ‌చ్చాను. ఆ మోనిత బాబుని అడ్డం పెట్టుకుని మాతో ఆడుకుంటోంది. ఆ బాబుని నీద‌గ్గ‌ర దాచిందేమోన‌నే అనుమానంతో వ‌చ్చాను. నిజం చెప్పు ప్లీజ్ అంటుంది సౌంద‌ర్య‌. మేడం నాకు తెలియ‌దు. మోనిత‌కు సాయం చేసినందుకు ఇప్ప‌టికీ ఫీల‌వుతున్నా. మీకు హెల్ప్ చేయ‌మ‌న్నా చేస్తా.. అప్పుడైనా నా గిల్టీ ఫీలింగ్ కొంచ‌మైనా పోతుంది. అని చెబుతుంది ర‌త్న సీత‌. Also read:ష‌న్నుకి దీప్తి షాక్‌.. వైర‌ల్ అవుతున్న పోస్ట్‌ అయితే మోనిత క‌ద‌లిక‌ల‌పై ఓ క‌న్నేసి వుంచ‌మ‌ని, త‌న క‌ద‌లిక‌ల‌ని గ‌మ‌నించ‌మ‌ని, త‌ను ఎవ‌రిని ఎక్క‌డ ఎప్పుడు క‌లుస్తుందో... ఎలాంటి ప్లాన్ లు వేస్తుందో క‌నిపెట్ట‌మ‌ని ర‌త్న సీత‌కు చెబుతుంది సౌంద‌ర్య‌. ఇక నుంచి అదే ప‌నిలో వుంటాన‌ని, మీకు నా వంతు స‌హాయం చేస్తాన‌ని రంగంలోకి దిగుతుంది ర‌త్న‌సీత‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

ష‌న్నుకి దీప్తి షాక్‌.. వైర‌ల్ అవుతున్న పోస్ట్‌

యూట్యూబ్ క్రేజీ ల‌వ‌ర్స్ ష‌న్ను, దీప్తి విడిపోతున్నారా? .. ఇద్ద‌రి మ‌ధ్య బిగ్‌బాస్ సీజ‌న్ 5 మంట పెట్టిందా? దీనికి ప్ర‌ధాన కార‌ణం సిరి హ‌న్మంతేనా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. దీప్తి సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏం చెబుతోంది? .. ప్ర‌స్తుతం ఇదే సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ‌ర్స్ దీప్తి సునైనా, ష‌ణ్ముఖ్‌ జ‌స్వంత్ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో వున్న విష‌యం  తెలిసిందే. ఇద్ద‌రం ప్రేమ‌లో వున్నామ‌న్న విష‌యాన్నిఇప్ప‌టికే బ‌య‌ట‌పెట్టేశారు కూడా. అంతే కాకుండా ష‌న్నుని గెలిపించ‌డం కోసం సునైనా భారీగానే క్యాంపెయిన్‌ని ర‌న్ చేసింది. హౌస్ బ‌య‌ట ష‌న్ను కోసం సునైన చేయ‌ని హంగామా లేదు. కానీ ష‌న్ను మాత్రం సిరితో హౌస్ లో హ‌గ్గుల‌తో గ‌బ్బు లేపాడు. టైటిల్ విజేత‌గా నిల‌వాల్సిన ష‌న్ను.. సిరి మాయ‌లో ప‌డి ర‌న్న‌ర‌ప్ గా నిల‌వాల్సి వ‌చ్చింది. Also read: దీప్తి హింట్ ఇచ్చిన వీడియో వైర‌ల్‌! వీరిద్ద‌రి వ్య‌వ‌హారం శృతిమించింద‌ని సిరి త‌ల్లి ఓపెన్ గానే చెప్పినా.. దీప్తీ వెన‌క‌బ‌డుతున్నావ‌ని హింట్ ఇచ్చినా ష‌న్ను ప‌ట్టించుకోలేదు. మ‌ళ్లీ సిరితో ప‌దే ప‌దే హ‌గ్గుల కోసం వెంర్లాడాడు. ఇదే దీప్తికి ఆగ్ర‌హాన్ని తెప్పించింద‌ని చెబుతున్నారు. ఆ కార‌ణంగానే ష‌న్నుకు దూరం కావాల‌ని దీప్తి భావించి అత‌న్ని దూరం పెట్ట‌డం మొద‌లుపెట్టిన‌ట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. Also Read: నాగ్ జోడీగా `లెజెండ్` బ్యూటీ! ఇన్ స్టా వేదిక‌గా దీప్తి పెట్టిన పోస్ట్ ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది. `క‌నీసం నీ మ‌న‌స్సాక్షితో అయినా నిజాయితీగా వుండు. నా చుట్టూ వున్న ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారాయ‌ని తెలిసినా నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. ఈ సంవ‌త్స‌రం నాకేమీ బాగా అనిపించ‌లేదు` అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ని బ‌ట్టి ష‌న్ను - సిరిల వ్య‌వ‌హారం దీప్తిని బాగా హ‌ర్ట్ చేసింద‌ని అందుకే ష‌న్నుకి దీప్తి బ్రేక‌ప్ చెబుతోంద‌ని నెట్టింట ప్ర‌చారం ఊపందుకుంది.   

అమ్మ బాల‌య్యా.. నాగ్ సీట్ కే ఎర్త్ పెట్టావే!

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లే పూర్త‌యింది. గ్రాండ్ ఫినాలేలో వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. అయితే ఈ సీజ‌న్ మాత్రం గ‌త సీజన్ ల త‌ర‌హాలో యావ‌రేజ్ అని కూడా అనిపించుకోలేదు. హ‌డావిడిగా మొద‌లైన ఈ షో నిజంగా చెప్పాలంటే అదే స్థాయిలో అట్ట‌ర్ ఫ్లాప్ అనిపించుకుంది. అదే గ్రాండ్ ఫినాలేని నిర్వ‌హించిన తీరులోనూ క‌నిపించింది. ప్ర‌తీ సీజ‌న్ కి ఛీఫ్ గెస్ట్ అంటూ మెగాస్టార్ వ‌చ్చేవారుకానీ ఈ సీజ‌న్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ అంటూ ఎవ‌రూ లేరు.. పైగా తూ తూ మంత్రం అనే స్థాయిలోనే ముగించార‌నిపించింది. ఈ సీజ‌న్ ప‌రంగా హోస్ట్ గా షోని నిర్వ‌హించ‌డంలో కంటెస్టెంట్ ల‌ని గాడిలో పెట్ట‌డంలో నాగార్జున విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి. ఏదో వీకెండ్ లో రెండు రోజులు క‌నిపించామా... ప‌ని ముగించామా? అన్న‌ట్టుగా నాగార్జున వ్య‌వ‌హ‌రించిన తీరు.. సిరి - ష‌న్నుల హ‌గ్గుల సీరియ‌ల్ కి ఎండ్ కార్డ్ వేయ‌కుండా కంటిన్యూ చేయిస్తూ వారిని మ‌రింత‌గా ప్రోత్స‌హించిన తీరు వీక్ష‌కుల‌కు చిరాకు తెప్పించింది. అంతే కాకుండా స‌న్నీని టార్గెట్ చేయ‌డం.. అత‌న్ని ఇబ్బంది పెడుతున్నా సిరి - ష‌న్నుల‌ని నాగ్ వెన‌కేసుకు వ‌చ్చిన తీరు కూడా ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. దీంతో హోస్ట్ గా నాగ్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యార‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఇక గ్రాండ్ ఫినాలే వేదిక‌పై సీజ‌న్ 6 మ‌రో రెండు నెల‌ల్లోనే ప్రారంభం కాబోతోందంటూ నాగార్జున ప్ర‌క‌టించేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో హోస్ట్ గా నాగ్ ఫెయిల‌య్యార‌ని.. ఆ స్థానంలో మ‌రో స్టార్ తెర‌పైకి రాబోతున్నారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. నిర్వాహ‌కులు కూడా కొత్త హోస్ట్ ని సీజ‌న్ 6కి మార్చేయాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చింద‌ట‌. Also Read:వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్.. శేఖర్ కమ్ముల సినిమా వెనక్కి! ఈ ఊహాగానాల మ‌ధ్య నంద‌మూరి బాల‌కృష్ణ సీజ‌న్ 6కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. కార‌ణం `ఆహా` ఓటీటీ కోసం బాల‌య్య `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ షో పేరుకు త‌గ్గ‌ట్టే దూసుకుపోతోంది. తొలి సారి హోస్ట్ గా రంగంలోకి దిగిన బాల‌య్య త‌న దైన స్టైల్లో చెడుగుడు ఆడేస్తున్నారు. బాల‌య్య సీజ‌న్ 6కి క‌రెక్ట్ అని బిగ్‌ బాస్ నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. అందుకే ఆయ‌న‌ని హోస్ట్ గా ఫైన‌ల్ చేయాల‌ని భావిస్తున్నారంటూ వార్త‌లు విపిస్తున్నాయి. అంతే కాకుండా సీజ‌న్ 6ని ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసి ఆ త‌రువాతే స్టార్ మా లో ప్ర‌సారం చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇది ఎంతవ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

ర‌ష్మీ కార‌వాన్ లో క‌మెడియ‌న్.. ఏమా క‌థ‌!

బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్ హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ అన్ లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కామెడీ షోల‌కు బుల్లితెర‌పై వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కామెడీ షోల్లో యాంక‌ర్ ర‌ష్మీ.. జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నో, రోజాలు వేసే పంచ్‌లు మామూలుగా పేల‌వు. అందుకే ఈ షో అంటే య‌మ క్రేజ్. ఆ క్రేజ్ కి తగ్గ‌ట్టే ప్ర‌తీ ఎపిసోడ్ ని కొత్త‌గా మ‌లుస్తున్నారు నిర్వాహ‌కులు. ఇక షోల‌ని మించి ప్రోమోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోని వ‌దిలారు. అది నెట్టింట ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తోంది. ఈ ప్రోమోలో రోహిణి, హైమా, రాకింగ్ రాకేష్‌, వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌, సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్ అద‌ర‌గొట్టేశారు. రోహిణి .. రాకింగ్ రాకేష్ ని ఆడుకున్న వైనం న‌వ్వులు పూయిస్తోంది. ఈ సంద‌ర్భంగా రాకింగ్ రాకేష్ పై మ‌నో వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలి ప్రోమోని వైర‌ల్ అయ్యేలా చేసింది. Also read:నేను పడిన కష్టాలు 'వాసు' పడలేదు! ఈ ప్రోమో స్టార్టింగ్ లో రాకింగ్ రాకేష్.. ర‌ష్మీతో క‌లిసి డ్యాన్సులు చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఎండింగ్ లో ర‌ష్మీ కాళ్ల‌కి మొక్కుతున్న‌ట్టుగా వంగ‌డం.. ఇదే అద‌నుగా భావించిన ర‌ష్మీ ఆశీర్వ‌దిస్తున్న‌ట్టుగా పోజు పెట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది. అయితే దీనిపై మ‌నో వేసిన పంచ్ మామూలుగా పేల‌లేదు. పొద్దున కార‌వాన్‌లో కాళ్ల మీద ప‌డ్డావ్‌.. డ్యాన్స్‌కా? అని సింగ‌ర్ రాకింగ్ రాకేష్ గాలి తీసేశాడు.. రాకింగ్ రాకేష్ నిజంగానే ర‌ష్మీ కార‌వాన్ లోకి వెళ్లాడా? .. ఏమాక‌థ‌? అని నెటిజ‌న్ లు తెగ కామెంట్ లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

కార్తీక దీపం: ఊహించ‌ని షాకిచ్చిన మోనిత‌

    బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ కార్తీక దీపం. గ‌త కొన్ని వారాలుగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతున్న కార్తీక దీపం ఈ గురువారం మ‌రో మ‌లుపు తీసుకుంది. ఈ గురువారం 1230వ ఎపిసోడ్ లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా త‌న‌కే షాకిచ్చిన సౌంద‌ర్య‌కు మోనిత ఎలాంటి ఝ‌ల‌క్ ఇచ్చింది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ రోజు ఎపిసోడ్ వివ‌రాలేంటో ఒక‌సారి లుక్కేద్దాం. Also read:'కృతి శెట్టి'కి ఏం తెలీదు.. నేను, సాయి పల్లవి అప్పుడే అనుకున్నాం! దీప‌, కార్తీక్‌లు ఎక్క‌డున్నాకో చెప్ప‌మ‌ని వార‌ణాసిని సౌంద‌ర్య ప్రాధేయ‌ప‌డుతుంటుంది. అది చూసిన మోనిత కోడ‌లి కోసం ఎంత ఏడుస్తున్నారు కానీ నా బాబు ఏం చేశాడు ఆంటీ? వాడు మీ మ‌న‌వ‌డే క‌దా? వాడి కోసం మీరు ఇలా తాప‌త్ర‌య‌ప‌డ్డారా? అంటుంది మోనిత‌. దీంతో సౌంద‌ర్య అన‌వ‌స‌రంగా మాట్లాడ‌కు అంటూ సీరియ‌స్ అవుతుంది. "ఆ రోజు మీరు త‌ల్లిని బిడ్డ‌ని వేరు చేసి హిమ‌ని ఎత్తుకొచ్చారు. వాళ్ల‌ని క‌ల‌ప‌డానికి అలా చేసిన మీరు ఈ రోజు న‌న్ను - కార్తీక్ ని విడ‌దీయ‌డానికి నా బిడ్డ‌ని ఎత్తుకురాలేద‌ని ఎలా అనుకోమంటారు?" అని నిల‌దీస్తుంది మోనిత‌. దీంతో సీరియ‌స్ అయిన సౌంద‌ర్య "నోర్ముయ్ మోనిత.. నీ బాబు క‌నిపించక‌పోతే వెళ్లి వెతుక్కో ..ఇలాగే వాగావ‌నుకో నీకు కాల్చిన అట్ల కాడ‌తో ఆటోగ్రాఫ్ ఇస్తా" అంటుంది. క‌ట్ చేస్తే ... పిల్ల‌ల‌తో క‌లిసి మొక్క‌లు నాటుతుంటాడు డాక్ల‌ర్ బాబు. ఆ త‌రువాత `బంగారం అమ్మేశావా?  నేను చేత‌గాని వాడిలా అయిపోయాను. న‌న్ను ఏ ప‌ని చేయెద్దు అంటావ్ నువ్వేమో ఇలాంటి పనులు చేస్తుంటావ్' అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు డాక్ట‌ర్ బాబు.. ఇదిలా వుంటే శ్రావ్య  ఏడుస్తూ "దీపు దీపుగాడు క‌నిపించ‌ట్లేదు అత్త‌య్య" అని అరుస్తూ  సౌంద‌ర్య ద‌గ్గ‌రికి వ‌స్తుంది. ఇదంతా సైలెంట్ గా మోనిత గ‌మ‌నిస్తూ వుంటుంది. దీపుని మోనితే దాచి వుంటుంద‌ని శ్రావ్య చెబుతుంది. దీంతో అనుమానం వ‌చ్చిన సౌంద‌ర్య మోనిత‌ని నిల‌దీసి పీక ప‌ట్టుకుని చంపేస్తానంటుంది. నిజంగానే మోనిత దీపుని దాచేసిందా? .. ఇంత‌కీ విష‌యం తెలిసి సౌంద‌ర్య ఏం చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.