ఈ సీజ‌న్ విన్న‌ర్ అత‌నేనా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!

  బిగ్ బాస్ సీజ‌న్ 5 రియాలిటీ షో క్లైమాక్స్‌కి చేరుకుంది. దీంతో ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ చ‌ర్చ‌లో ఎవ‌రికి న‌చ్చిన వ్య‌క్తిని వారు విన్న‌ర్ అంటూ చెప్ప‌డం మొద‌లుపెట్టారు. ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఫైన‌ల్ డేన ష‌ణ్ణు టైటిల్ విన్న‌ర్‌గా నిల‌వ‌డం.. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీని అందుకుంటున్న‌ట్టుగా పిక్స్‌ని మార్ఫింగ్ చేసి నెట్టింట ప్ర‌చారం మొద‌లుపెట్టారు. Also read:  `బిగ్‌బాస్‌` నుంచి ఆమె ఎలిమినేట్‌! గ‌త సీన్ విజేత అభిజీత్ ఫొటోల‌ని మార్ఫింగ్ చేసి ఆ ఫొటోల్లో ష‌ణ్ణుని చేర్చి ఆ ఫొటోల‌ని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. ఇదిలా వుంటే మెజారిటీ వ‌ర్గం ఆడియ‌న్స్ టాక్ మాత్రం మ‌రోలా వుంది. .జెన్యూన్‌గా ఆడుతున్న కంటెస్టెంట్ ఈ సీజ‌న్ విజేత‌గా నిల‌వ‌బోతున్నాడ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నారు. ప‌బ్లిక్ యునానిమ‌స్‌గా ఈ సీజ‌న్ విన్న‌ర్ అని చెబుతున్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు స‌న్నీ. స‌న్నీ టాస్క్‌ల‌లొ ఫైర్‌గా , అగ్రెసీవ్‌గా క‌నిపించినా త‌ను ఎలాంటి యాక్టింగ్ చేయ‌డం లేద‌ని, త‌న‌కు ఏం అనిపించిందో అది నిజాయితీగా చేస్తున్నాడ‌ని.. గేమ్ పూర్త‌యిన త‌రువాత గేమ్‌లో జ‌రిగిన‌వ‌న్నీ ప‌క్క‌న పెట్టి చాలా స‌ర‌దాగా వుంటున్నాడని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. Also read:  ఓట‌మి భ‌యంలో ష‌న్ను.. స‌న్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్‌ తాజాగా ఓ మీడియా నిర్వ‌హించిన ప‌బ్లిక్ టాక్ లో మెజారిటీ వ‌ర్గం స‌న్నీపై ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డంతో స‌న్నీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా స‌న్నీనే నిలిచే అవ‌కాశాలు వున్నట్టుగా ఓటింగ్ స‌ర‌ళి కూడా తెలియ‌జేస్తోంది. టిక్కెట్ టు ఫినాలే ని శ్రీ‌రామ‌చంద్ర సొంతం చేసుకోవ‌డానికి కార‌ణం ఇటీవ‌ల జ‌రిగిన ఐస్ బౌల్ టాస్క్‌. ఈ టాస్క్ త‌రువాత ప్రియాంక చేసిన సొంత వైద్యం కార‌ణంగా శ్రీ‌రామ చంద్ర న‌డ‌డానికి ఇబ్బందిప‌డిన విష‌యం తెలిసిందే. అదే అత‌న్ని టిక్కెట్ టు ఫినాలేలోకి ఎంట‌ర్ అయ్యేలా చేసింద‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఓవ‌రాల్‌గా మాత్రం స‌న్నీనే ఈ సీజ‌న్ విజేత అని మెజారిటీ వ‌ర్గం ప్రేక్ష‌కులు చెబుతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 

బిగ్ బాస్ హౌసా, హ‌గ్ బాస్ హౌసా.. నాగ్ పై మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

  బిగ్‌ బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ నెట్టింట విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే బిగ్‌బాస్ సీజ‌న్ 5 క్లైమాక్స్‌కి చేరింది. అయితే కంటెస్టెంట్‌ల ప‌రంగానూ.. హోస్ట్ ప‌రంగానూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే వుంది. ఇటీవ‌ల ష‌ణ్ణు, సిరిల కార‌ణంగా హోస్ట్‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న కింగ్ నాగార్జున తాజాగా మరోసారి వారి కార‌ణంగానే ట్రోలింగ్‌కి గురవుతున్నారు. శ‌నివారం ఎపిసోడ్ కార‌ణంగా మ‌రోసారి నాగార్జున నెటిజ‌న్‌ల‌కు అడ్డంగా దొరికి పోయారు. Also read:  ఓట‌మి భ‌యంలో ష‌న్ను.. స‌న్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్‌ శ‌నివారం 91వ ఎపిసోడ్ సంద‌ర్భంగా కంటెస్టెంట్‌ల ముందుకొచ్చిన నాగార్జున ష‌ణ్ణు, సిరిల‌పై ప్ర‌త్యేక ప్రేమ‌ని చూపించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు స‌భ్యులున్నారు. ఇందులో ఐదుగురు స‌భ్యులు నామినేష‌న్స్‌లో వున్నారు. టిక్కెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలుపొందిన శ్రీ‌రామ‌చంద్ర టైటిల్‌ని ద‌క్కించుకుని టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట‌మొద‌టి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అంత‌కు ముందు హౌస్‌లో ఏం జ‌రిగింది? .. స‌భ్యుల మ‌ధ్య ఎలాంటి సంవాదం నెల‌కొంద‌న్న‌ది చూపించిన నాగార్జున ఈ సంద‌ర్భంగా సిరి, ష‌ణ్ణుల‌పై ప్ర‌త్యేక ప్రేమ‌ని చూపించ‌డం ప్రేక్ష‌కుల‌తో పాటు నెటిజ‌న్‌ల‌కు న‌చ్చ‌లేదు. Also read:  ష‌ణ్ణు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కౌగ‌లించుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని మొండికేసిన సిరి! కంప్లైంట్ బాక్స్ టాస్క్ సంద‌ర్భంగా సిరిని ప్ర‌త్యేకంగా అడిగారు నాగార్జున‌. వెంట‌నే ష‌ణ్ణుపై కంప్లైంట్ అంటూ అత‌ని ఫొటో తీసి కంప్లైంట్ రాసింది సిరి. అయితే "ఏంటా కంప్లైంట్?" అని నాగ్ అడిగితే... "న‌న్ను బాగానే చూసుకుంటున్నాడు కానీ.,. తిడుతున్నాడు" అని చెప్పింది. `ఏం చేస్తాడు.. నువ్వు ఫ్రెండ్ అని చెప్ప‌డానికి సిగ్గుప‌డుతున్నాడు.. అయినా నువ్వు ఫ్రెండ్లీ హ‌గ్‌లు ఇస్తూనే వున్నావ్ క‌దా` అని నాగ్ అనడంతో.. సిరి పెద్ద‌గా న‌వ్వుతూ... `మా మ‌మ్మీకి ఫ్రెండ్షిప్ హ‌గ్ అని చెబుతూనే వున్నాడు సార్' అంది సిరి. వెంట‌నే నాగ్ `ష‌ణ్ణూ జాగ్ర‌త్త‌గా చూసుకోరా?' .. అన‌డంతో నెటిజ‌న్స్ ఇదేంటీ నాగ్ వాళ్ల హ‌గ్గుల‌ని ఎంక‌రేజ్ చేయ‌డం ఏంటీ.. ఇది బిగ్ బాస్ హౌస్‌నా లేక హ‌గ్‌బాస్ హౌస్‌నా అని సెటైర్లు వేస్తున్నారు. ఈ అరాచ‌కం ఇంకెన్ని రోజులు బాబోయ్ అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 

కొవిడ్ నుంచి కోలుకున్న క‌మ‌ల్ బిగ్ బాస్ హోస్ట్‌గా తిరిగొచ్చారు!

  క‌మ‌ల్ హాస‌న్ బిగ్ బాస్ త‌మిళ్ సీజ‌న్ 5కి హోస్ట్‌గా తిరిగొచ్చారు. కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో గ‌త రెండు వారాలుగా ఆయ‌న చెన్నైలోని శ్రీ‌రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్‌లో ఐసోలేష‌న్‌లో ఉన్నారు. అందువ‌ల్ల రెండు వారాల పాటు వీకెండ్ ఎపిసోడ్‌ల‌ను ఆయ‌న హోస్ట్ చేయ‌లేక‌పోయారు. ఇప్పుడు కొవిడ్ నుంచి కోలుకున్న ఆయ‌న ఆ రియాల్టీ షోకు హోస్ట్‌గా మ‌ళ్లీ వ‌చ్చేశారు.  డిసెంబ‌ర్ 4న ఉద‌యాన్నే క‌మ‌ల్ చెన్నై హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌న ప‌నిలోకి రావ‌డం, బిగ్ బాస్ త‌మిళ్ సీజ‌న్ 5 శ‌నివారం (డిసెంబ‌ర్ 4) ఎపిసోడ్‌ను హోస్ట్ చేయ‌డం జ‌రిగిపోయాయి. విజ‌య్ టెలివిజ‌న్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ క‌మ‌ల్ న‌టించిన ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ప్ర‌సారం చేసింది. 'హే రామ్' థీమ్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్‌లో న‌డుస్తుండ‌గా, క‌మ‌ల్ హాస‌న్‌, "మీ ప్రేమ కార‌ణంగా నేనిక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. నేనెప్పుడూ మీ వాడినే. నా అబ్జ‌ర్వేష‌న్ ప్ర‌కారం, ఈ సీజ‌న్‌లోని కంటెస్టెంట్లు వారి ఇండివిడ్యువ‌ల్ గేమ్స్‌ను ఆడుతుండ‌టం చూస్తున్నాను. వారంద‌రికీ త‌మ‌వైన వ్యూహాలు ఉన్నాయి. దాని ప‌రిణామాల‌ను ఈరోజు ఎపిసోడ్‌లో చూస్తాం" అని చెప్ప‌డం విన‌వ‌చ్చు. న‌వంబ‌ర్ 22న‌ క‌మ‌ల్‌కు కొవిడ్ 19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ అవ‌డంతో చెన్నైలోని శ్రీ‌రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేరారు. 'హౌస్ ఆఫ్ ఖ‌ద్ద‌ర్' అనే సొంత బ్రాండ్ క్లాతింగ్‌ను ప్రారంభించేందుకు అమెరికా వెళ్లిన‌ప్పుడు త‌న‌కు వైర‌స్ సోకింద‌ని ఆయ‌న చెప్పారు. క‌మ‌ల్‌ హాస్పిట‌ల్‌లో ఉన్నందున, ఆయ‌న ప్లేస్‌లో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌మ్య‌కృష్ణ త‌న ప‌నిని అద్భుతంగా నిర్వ‌ర్తించింది.

`బిగ్‌బాస్‌` నుంచి ఆమె ఎలిమినేట్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి చేరుకుంది. మ‌రో కొన్ని వారాల్లో ఈ సీజ‌ర్ ముగియ‌బోతోంది. ఇక గ‌తంలో ఏ సీజ‌న్‌పై రాన‌న్ని విమ‌ర్శ‌లు ఈ సీజ‌న్‌పై వినిపిస్తున్నాయి. స్వ‌యంగా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కింగ్ నాగ్‌పై కూడా ఇటీవ‌ల విమ‌ర్శ‌లు వినిపించాయి. అంతే కాకుండా ఇటీవ‌ల 12వ వారం జ‌రిగిన యాంక‌ర్ ర‌వి ఎలిమినేష‌న్ కూడా వివాదాస్ప‌దంగా మారింది. అత‌న్ని కావాల‌నే ఎలిమినేట్ చేశారంటూ అత‌ని ఫ్యాన్స్ అన్న‌పూర్ణ స్టూడియోస్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ 13వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌ర‌న్న‌దివి ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ 13 వారం ఎలిమినేష‌న్స్‌లో శ్రీ‌రామ‌చంద్ర‌, మాన‌స్‌, సిరి, కాజ‌ల్‌, ప్రియాంక వున్నారు. అయితే ఈ ఐదుగురిలో ఒక‌రు మాత్రం ఈ శ‌నివారం ఎలిమినేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి ప్రాచారం జ‌రుగుతున్న‌ట్టుగా ఈ వారం కాజ‌ల్ ఎలిమినేట్ కావ‌డం లేదు. పింకీ.. ప్రియాంక ఎలిమినేట్ అయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎలిమినేష‌న్ రౌండ్‌లో వున్న శ్రీ‌రామ‌చంద్ర అత్య‌ధిక ఓట్ల‌తో ముందు వ‌రుస‌లో నిల‌బ‌డి ఎలిమినేష‌న్ క‌రౌండ్‌లో విజ‌యం సాధించాడు. అత‌ని త‌ర‌హాలోనే మాన‌స్‌, సిరి కూడా అత్య‌ధిక ఓటింగ్ కార‌ణంగా సేఫ్ అయ్యారు. ఇక మిగిలిన ఇద్ద‌రు కాజ‌ల్‌, ప్రియాంక‌. ఈ ఇద్ద‌రిలో ఓటింగ్ శాతం దారుణంగా ప‌డిపోయిన కార‌ణంగా ప్రియాంక శ‌నివారం ఎలిమినేట్ అవుతున్నట్టు తెలిసింది. అస‌లు ఏం జ‌రిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

`కార్తీక దీపం` :  కార్తీక్ జీవితం త‌ల‌కిందులు

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని మ‌రీ ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నసీరియ‌ల్ `కార్తీక దీపం`.  గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం షాకింగ్ ట్విస్ట్‌ల‌తో సాగుతోంది. ఈ శ‌నివారం ఈ సీరియ‌ల్ 1214వ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సంవ‌ద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటుచేసుకోబోతున్నాయి. కార్తీక్ గుండె ఆప‌రేష‌న్ చేయ‌డానికి రెడీ అవుతున్న స‌మ‌యంలో పేషెంట్ భార్య‌, పిల్ల‌లు.. కార్తీక్‌ని క‌ల‌సి అత‌ని కాళ్ల‌పై ప‌డి వేడుకోవ‌డం తెలిసిందే. క‌ట్ చేస్తే `ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో పేషెంట్‌కి ఆప‌రేష‌న్ చేస్తూ కార్తీక్ క‌ళ్ల‌కు బైర్లు క‌మ్మేస్తాయి.. ఆ స్థితి నుంచి కార్తీక్ తేరుకోకుండానే ఆప‌రేష‌న్ చేయ‌డానికి సిద్ధ‌మై ఆప‌రేష‌న్ చేసేస్తాడు. ఏదో త‌ప్పు జ‌రుగుతోంద‌ని గ‌మ‌నించిన ర‌వి .. ఆ మ‌త్తు నుంచి తేరుకో కార్తీక్‌.. చంపేశావ్ కార్తీక్‌.. అత‌ను చ‌నిపోయాడు` అని అరుస్తాడు. ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌ కార్తీక్? .. ఇప్పుడు ఆ బాధ్య‌త ఎవ‌రిది? అంటూ కార్తీక్‌ని నిల‌దీస్తాడు. `అరె ప్రియ‌మ‌ణి.. మీ కార్తీకయ్య ప‌ని ఔట్ ప్రియ‌మ‌ణి.. అత‌డి జీవితాన్ని తీర‌గ‌రాసేశాను. నువ్వు ఇచ్చిన ఈ కాఫీతోనే తిర‌గ‌రాసేశాను. నువ్వు వెళ్లు ప్రియ‌మ‌ణి.. నువ్వు వెళ్లు నీకు అర్థం కావ‌డానికి ఇంకా కొంత టైమ్ ప‌డుతుంది` అంటుంది మోనిత‌. ప్రియ‌మ‌ణి వెళ్ల‌గానే .. కార్తీక్ ఆప‌రేష‌న్‌కి వెళ్లే ముందు ఏం జ‌రిగిందో త‌లుచుకుంటుంది. మోనిత‌కి  మెసేజ్ పెట్టిన జ‌యంతి.. కార్తీక్ ఆప‌రేష‌న్‌కి వెళ్లేముందు త‌ను తాగిన కాఫీలో రెండు నిద్ర మాత్ర‌లు క‌లుపుతుంది. అది తాగిన మ‌త్తులో కార్తీక్ గుండె ఆప‌రేష‌న్‌కి వెళ‌తాడు.. ఆ త‌రువాత జ‌రిగింది తెలిసిందే.. ఇదే విష‌యాన్ని తలుచుకుంటూ మోనిత ఏం చేస్తుందిలే అనుకున్నావ్ క‌దా కార్తీక్‌.. చేసి చేపించాను క‌దా,, నీ ప‌ని ఔట్ అంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ఆప‌రేష‌న్ త‌రువాత కార్తీక్ ప‌రిస్థితి ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.    

ఈ ఇద్ద‌రిలో ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు?

బిగ్‌బాస్ సీజ‌న్‌5 ఎండింగ్‌కు చేరుకుంది. విమ‌ర్శ‌లు నేప‌థ్యంలో ముందుకు సాగుతున్న బిగ్‌బాస్ తాజాగా 13వ వారం ఎలిమినేష‌న్ రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ నేప‌థ్యంలో కంటెస్టెంట్‌ల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ శ‌నివారం ఎలిమినేష‌న్స్‌లోవున్న వాళ్ల‌లో ఎవ‌రు ఎలిమినేట్ కాబోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 19 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షోలో ప్ర‌స్తుతం 7 స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. ఇందులో ఎవ‌రు టాప్ ఫైకి చేర‌తార‌న్న‌ది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ 13వ వారం ఎలిమినేష‌న్ లో వున్న వాళ్ల‌లో ఈ ఇద్ద‌రు కంటెస్టెంట్‌ల‌లో ఒక‌రు బ‌య‌టికి వెళ్లే అవ‌కాశం వుంద‌ని తాజాగా తెలుస్తోంది. ఆ ఇద్ద‌రు స‌భ్యులు మ‌రెవ‌రో కాదు ఒక‌రు కాజ‌ల్‌, మ‌రొక‌రు ప్రియాంక‌.ఈ వారం స‌న్నీ, ష‌ణ్మ‌ఖ్ మిన‌హా మిగిలిన ఇంటి స‌భ్యులైన ప్రియాంక‌, కాజ‌ల్‌, సిరి, మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర వున్నారు. ఈ స‌భ్యుల్లో శ్రీ‌రామ‌చంద్ర కు ఓటింగ్ భారీ స్థాయిలో వుంది. అంటే ను ఈవారం సేఫ్ అవుతాడ‌న్న‌మాట‌. మాన‌స్ కూడా కొంత ఓటింగ్ ప‌రంగా ముందు వ‌రుస‌లోనే వున్నాడు. ఇక మిగిలిన సిరి, ప్రియాంక‌, కాజ‌ల్‌లే వెన‌క‌బ‌డి వున్నారు. ఈ ముగ్గురిలో గ‌త వార‌మే ఒక‌రు ఎలిమినేట్ కావాల్సింది. కానీ కాజ‌ల్‌ని స‌న్నీ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌తో కాపాడిన విష‌యం తెలిసిందే. సిరిని ప‌క్క‌న పెడితే ఈ వారం ప్రియాంక లేదా కాజ‌ల్ బ‌య‌టికి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కార‌ణం వారి ఓటింగ్. అయితే ఎలిమినేష‌న్ జ‌న్యూన్‌గా జ‌రిగితే మాత్రం ప్రియాంక కాకుండా కాజ‌ల్ ఈ వారం బ‌య‌టికి వెళ్లే అవ‌కాశాలు వున్న‌ట్టుగా తెలుస్తోంది. ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

ఓట‌మి భ‌యంలో ష‌న్ను.. స‌న్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్‌

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌రైన ప్ర‌తీ ఒక ఇంటి స‌భ్యుల‌కు ఏదో ఒక నిక్‌నేమ్‌ని పెట్టిన విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో ష‌ణ్ముఖ్‌కి బ్ర‌హ్మ అని పేరు పెట్టారు. ఏ ముహూర్తాన ఆ పేరుని త‌న‌కి పెట్టారో కానీ ష‌న్ను మాత్రం బిగ్‌బాస్ హౌస్‌కి తానే బ్ర‌హ్మ అన్న‌ట్టుగా ఫీల‌వుతున్నాడు. చాలా వ‌ర‌కు సిరితో క‌లిసి సేఫ్ గేమ్ ఆడుతూ టాస్కుల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూపిచ‌ని ష‌న్ను త‌న‌కే అంతా తెలుసున‌ని, అంతా తానేని అపోహ‌ప‌డుతూ మిగ‌తా వారిని మ‌రీ ముఖ్యంగా స‌న్నీ, అత‌నికి ఓట్లు వేసేవారిని విమ‌ర్శిస్తుంద‌డ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. అంతే కాకుండా స‌న్నీని ఉద్దేశించి త‌ప్పులు చేస్తున్న‌వారికి ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు వేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని కామెంట్ చేశాడు. ఇప్పుడిది అత‌నికి పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. ఎలిమినేష‌న్ విష‌యంలో ప్రియాంక‌, ష‌న్నుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. ఈ సంద‌ర్భంగా ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌ని ప్రియాంక‌ని అడ‌గ్గా .. నాకు కె (కాజ‌ల్‌) , పి ( ప్రియాంక‌)ల పైన డౌటుగా వుంద‌ని, ఈ ఇద్ద‌రిలో ఎవ‌రైనా ఎలిమినేట్ కావ‌చ్చున‌ని తెలిపింది. ఈ సంద‌ర్భంగా ష‌న్ను త‌న మ‌న‌సులోని మాట‌ని బ‌య‌ట‌పెట్టాడు. నాకో డౌట్ మాన‌స్ ఎలిమినేట్ కావ‌చ్చు క‌దా అన్నాడు. అంతేనా స‌న్నీని ఉద్దేశిస్తూ ఎవ‌రు ఎన్ని త‌ప్పులు చేసినా ఫైన‌ల్‌గా విజ‌యం సాధిస్తార‌ని, నా దృష్టిలో అత‌ను ఎలిమినేట్ అవుతాడ‌ని తాను అనుకోవ‌డం లేద‌ని తెలిపాడు. ఒక‌రిని హ‌ర్ట్ చేసిన‌వాళ్లే విన్ అవుతార‌ని అన‌డం క‌రెక్ట్ కాద‌ని ప్రియాంక అన‌డంతో.. `ఎన్ని త‌ప్పులు చేసినా స‌న్నీకి కాజ‌ల్ హైప్ ఇస్తుంది` అని ష‌న్ను అన్నాడు. దానికి ప్రియాంక `అది ఆమె గేమ్ ప్లాన్ అయ్యివుండొచ్చుక‌దా.. అంది. వెంట‌నే `వాళ్లది త‌ప్పు అని చెప్పారు. కానీ బ‌య‌ట‌కు వెళ్ల‌డం లేదు క‌దా వీళ్లు.. చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. వాళ్లు ఏం చేసినా ఏమీ అన‌రు.. ఓట్లు వేస్తూనే వున్నారు.. నేను హ‌ర్ట్ అయ్యాను` అన్నాడు ష‌న్ను. దీంతో స‌న్నీ ఫ్యాన్స్ ష‌న్నునీ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఓడిపోతాన‌నే భ‌యంతోనే ష‌న్ను ఇలా మాట్లాడుతున్నాడ‌ని కామెంట్‌లు చేస్తున్నారు.

చిన్న‌ప్పుడు ఇందిరా పార్క్‌లో ఆడుకుంటుంటే ఒక‌డు లాక్కెళ్లిపోయాడు!

  సింగ‌ర్ నుంచి న‌టిగా మారిన అమ్మాయి స్నిగ్ధ‌. నందినీరెడ్డి డైరెక్ట్ ఫ‌స్ట్ ఫిల్మ్ 'అలా మొద‌లైంది' న‌టిగా స్నిగ్ధ‌కు ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఆ మూవీలో హీరో హీరోయిన్లు నాని, నిత్యా మీన‌న్‌కు కామ‌న్ ఫ్రెండ్ అయిన పింకీ పాత్ర‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత పాతిక పైగా సినిమాల్లో క‌నిపించిందామె. ఈ ఏడాది 'యు ఆవ‌కాయ్ మి ఐస్ క్రీమ్' అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం జీ తెలుగులో ప్ర‌తి ఆదివారం ప్ర‌సార‌మ‌వుతున్న 'సూప‌ర్ క్వీన్' షోలో ఒక కంటెస్టెంట్‌గా ఆమె పార్టిసిపేట్ చేస్తోంది. ఈ షోకు ప్ర‌దీప్ మాచిరాజు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చూడ్డానికి టామ్ బాయ్‌లా, చాలా జోవియ‌ల్‌గా క‌నిపించే స్నిగ్ధ కూడా చిన్న‌త‌నంలోనే వేధింపుల‌కు గుర‌య్యిందంటే సాధార‌ణంగా ఎవ‌రూ న‌మ్మ‌రు. కానీ ఆమే స్వ‌యంగా చెప్పింది కాబ‌ట్టి న‌మ్మాల్సిందే. 'సూప‌ర్ క్వీన్' షోలో ల‌వ్ స్టోరీ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు, "ల‌వ్ స్టోరీస్ లాంటివి ఎక్కువ ఉండేవి కావు. ఎందుకంటే నా ద‌రిదాపుల్లోకి ఎవ‌రూ వ‌చ్చేవాళ్లు కాదు. కొడ‌తానేమోన‌ని భ‌యం. స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జ‌రిగింది. మాకు రెండు బిల్డింగుల మ‌ధ్య‌లో ఒక ర్యాంప్ ఉండేది. అక్క‌డ్నుంచి ఒక‌బ్బాయి అరుస్తున్నాడు. చూశా.. చూశా.. ఆ త‌ర్వాత నా పేరు చెప్పి ఐ ల‌వ్యూ అని అరిచాడు. పేరు విన‌ప‌డ‌గానే, దొరికిందే సంద‌ని ఒక్క‌సారిగా ప‌రిగెట్టుకొని వెళ్లాను." అని చెప్పింది స్నిగ్ధ‌. Also read:  ష‌ణ్ణు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కౌగ‌లించుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని మొండికేసిన సిరి! ఇదే సంద‌ర్భంగా చిన్న‌త‌నంలో త‌న‌కు ఎద‌రైన ఓ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించింది. "ప్ర‌తి అమ్మాయీ ఏదో ఒక వ‌య‌సులో వేధింపుల‌కు గుర‌వుతుంది. నాక్కూడా ఏమీ తెలీని వ‌య‌సులో హెరాస్‌మెంట్ ఎదుర‌య్యింది. అప్ప‌ట్నుంచీ నేను స్ట్రెంగ్తెన్ అవుతూ వ‌చ్చాను. నేను సైలెంట్‌గా ఉండ‌కూడ‌దు. అనుకున్నాను. నేనా మ‌నిషిని ఎలా త‌న్న‌గ‌లిగానో నాకు తెలీదు. ఫిఫ్త్ క్లాస్‌లో హెరాస్‌మెంట్ జ‌రిగిన‌ప్పుడు ఆ ట్రామా నుంచి కోలుకోవ‌డానికే చాలా టైమ్ ప‌ట్టింది. నిజానికి అది జ‌రిగింది కూడా ఇందిరా పార్కులో. నేను ఆడుకోవ‌డానికి వెళ్తుంటే ఒక‌త‌ను లాక్కెళ్లిపోయాడు. సో.. ఇందిరా పార్క్ వేపు నుంచి వెళ్తున్న‌ప్పుడ‌ల్లా నాకు బ‌ట‌ర్‌ఫ్లై ఫీలింగ్ వ‌చ్చేది." అని చెప్పుకొచ్చిందామె. Also read:  రోజాకు అడ్డంగా దొరికి పోయిన జ‌బ‌ర్ద‌స్త్ జోడీ! "అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో 2007లో హిమాయ‌త్ న‌గ‌ర్ ఏరియాలోనే ఇంట్లో ఉండాల్సి వ‌చ్చింది. అప్పుడు రోజూ కావాల‌ని ఇందిరా పార్క్ వేపు వెళ్లేదాన్ని. దానికి ఆనుకొని ఉన్న టెన్నిస్ కోర్టులో నేను టెన్నిస్ నేర్చుకున్నాను. 'దాన్ని అధిగ‌మించాలి. టిమిడ్‌గా ఉండొద్దు.' అని దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను. మా చెల్లివాళ్ల‌కు కూడా చెప్పేదాన్ని.. 'ఊరుకోవ‌ద్దు, తిరిగిచ్చెయ్యండి' అని. ప్ర‌తి అమ్మాయికీ అదే చెప్తాను.. ఊరుకొనే కొద్దీ ఇలాగే ఉంట‌ది. ధైర్యంగా ఉండండి. శ‌క్తిమంతంగా ఉండండి." అంటూ సందేశం ఇచ్చింది స్నిగ్ధ‌.

అన‌సూయ‌, ఆది.. వారం వారం డిన్న‌ర్‌కు వెళ్తారా?

  బుల్లితెర‌పై పాపుల‌ర్ అయిన జంట‌ల్లో అన‌సూయ‌, ఆది ఒక‌టి. 'జ‌బ‌ర్ద‌స్త్‌'లో అన‌సూయ ప్ర‌స్తావ‌న లేకుండా ఆది స్కిట్ ఉండ‌దు. త‌ర‌చూ ఆమెను త‌న స్కిట్‌ల‌లో భాగం చేస్తుంటాడు ఆది. ఎప్ప‌టిలాగే రానున్న జ‌బ‌ర్ద‌స్త్‌ ఎపిసోడ్‌లో ఆది చేసిన స్కిట్ న‌వ్వుల పువ్వుల‌ను పూయించ‌డం గ్యారంటీ. ఈసారి 'మ‌హ‌ర్షి' మూవీలోని వ్య‌వ‌సాయం కాన్సెప్ట్‌తో స్కిట్ చేశాడు ఆది.  "రైతుల వేళ్లు మ‌ట్టిలోకి వెళ్తేనే మ‌న చేతి ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయండీ.. అందుకే రైతే రాజు అంటారు" అని చెప్పాడు ఆది. తోటి క‌మెడియ‌న్ "మేం కూడా రైతుల‌మేగా.. రైతే రాజ‌ని ఈయ‌న ఒక్క‌డి పేరే చెప్తారేంటి?" అని అడిగాడు, రైజింగ్ రాజును చూపిస్తా. "రైతే రాజంటే రైజింగ్ రాజు కాదురా యెద‌వా.. నీలాంటోడే అన‌సూయ ఆదివారం డిన్న‌ర్‌కు వెళ్తార‌ని చెప్తే.. అన‌సూయ‌, ఆది.. వారం వారం డిన్న‌ర్‌కు వెళ్తార‌ని రాశాడంట‌." అని త‌న మార్క్ పంచ్‌ వేసేశాడు.  Also read:  అన‌సూయ అడ‌గాలే కానీ ఆది లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు!   "నాలాంటి అంద‌గ‌త్తె దొర‌కాల‌నంటే కొండ‌మీద కోతినైనా తెచ్చిచ్చేవాడిలా ఉండాలి" అని రీతు చౌద‌రి చెప్ప‌గానే, "అయితే ముందు నువ్వు కొండ‌మీద‌కు వెళ్లాలి" అని ఇంకో పంచ్ వేశాడు. దాంతో రీతు కూడా ఆ పంచ్‌లోని అర్థాన్ని గ్ర‌హించి పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వేసింది. రోజా అయితే మ‌నో మీద ప‌డీ ప‌డీ న‌వ్వింది. Also read:  స్టేజ్‌పై అంద‌రూ చూస్తుండ‌గా సుధీర్ గ‌ల్ల‌ప‌ట్టి క‌న్ను కొట్టేసింది! ఈ ఎపిసోడ్‌లో చ‌లాకీ చంటి, రాఘ‌వ ఒకే స్కిట్‌లో న‌వ్వులు పూయించ‌నున్నారు. ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు చూసుకొని పారిపోతే, "ఆయ‌న స్కిట్ అనుకొని ఈయ‌న పారిపోయాడు, ఈయ‌న స్కిట్ అనుకొని ఆయ‌న పారిపోయాడు" అని ఆ స్కిట్‌లోని క‌మెడియ‌న్ చెప్పాడు. డిసెంబ‌ర్ 9న ఈ ఎపిసోడ్ మ‌న ముందుకు రానున్న‌ది.

'చిన్నారి పెళ్లికూతురు 2'లో స‌రికొత్త‌ ఆనంది ఈమే!

  ప్ర‌స్తుతం టీవీ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న బిగ్గెస్ట్ నేమ్స్‌లో శివంగి జోషి ఒక‌టి. ఇటీవ‌లే ఆమె పాపుల‌ర్ టీవీ షో 'బాలికా వ‌ధు 2' (చిన్నారి పెళ్లికూతురు 2)లో పెరిగి పెద్ద‌దైన ఆనంది పాత్ర‌లోకి అడుగుపెట్టింది. అంత‌కు ముందు ఆమె 'యే రిష్తా క్యా కెహ్‌లాతా హై' సీరియ‌ల్‌లో సీర‌త్/ నైరా పాత్ర‌లో క‌నిపించింది. ఆరేళ్ల‌పాటు అందులో హీరోయిన్‌గా న‌టించాక‌, దాన్నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది శివంగి. ఆమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఎనిమిదేళ్లు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ త‌ర్వాత లీడ్ రోల్స్ చేస్తూ వ‌స్తోంది. ఇంత‌కాలం ఆమె ఇండ‌స్ట్రీలో ఉండ‌టంతో ఆమె ఏజ్ 26 లేదా 27 ఏళ్లు ఉంటుంద‌ని జ‌నాలు అనుకుంటున్నారు. కానీ ఆమె వ‌య‌సు అంత కాదు. Also read:  రోజాకు అడ్డంగా దొరికి పోయిన జ‌బ‌ర్ద‌స్త్ జోడీ! ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో వికీపీడియాలో త‌న వ‌య‌సు 26 లేదా 27 ఏళ్లు ఉంటుంద‌ని వెల్ల‌డించ‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పింది శివంగి. దాన్ని స‌రిచేయ‌డానికి ప‌లుసార్లు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేద‌ని ఆమె వెల్ల‌డించింది. "అయితే ఏదో ఒక‌రోజు ఆ వ‌య‌సుకు వ‌స్తాను. ఈలోగా నేను సాధించాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు నా వ‌య‌సు 23 సంవ‌త్స‌రాలే" అని ఆమె వెల్ల‌డించింది. Also read:  బిగ్‌బాస్‌పై ర‌వి సంచ‌ల‌న కామెంట్స్‌! సో.. ఇప్పుడు జ‌నాల‌కు శివంగి అస‌లు వ‌య‌సెంతో తెలిసిపోయింది. అంటే మ‌నం ఊహించిన‌దాని కంటే ఆమె చాలా చిన్న‌ద‌న్న మాట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, 'బాలికా వ‌ధు 2'లో ఆమె 17 ఏళ్ల ఆనంది పాత్ర‌ను పోషిస్తోంది. ఆనంది పాత్ర గ‌తంలో తాను పోషించిన పాత్ర‌ల కంటే చాలా భిన్నంగా ఉంటుంద‌నీ, ఆనందికీ త‌న‌కూ మ‌ధ్య చాలా పోలిక‌లున్నాయ‌నీ శివంగి చెప్పింది.

ష‌ణ్ణు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కౌగ‌లించుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని మొండికేసిన సిరి!

  టికెట్ టు ఫినాలే రేసులో ష‌ణ్ముఖ్ సైతం వెన‌క‌ప‌డి పోయాడు. ఫ‌స్ట్ ప్లేస్‌లో మాన‌స్‌, రెండో ప్లేస్‌లో శ్రీ‌రామ్‌చంద్ర నిల‌వ‌గా, సిరి మూడో స్థానాన్ని ద‌క్కించుకుంది. ఆరు, ఏడు స్థానాల్లో నిలిచిన ప్రియాంక‌, కాజ‌ల్ పోటీ నుంచి త‌ప్పుకున్నారు. స‌న్నీ, ష‌ణ్ముఖ్ మ‌ధ్య టై కాగా, నాలుగో స్థానానికి జ‌రిగిన పోటీలో స‌న్నీ గెలిచాడు. దీంతో ష‌ణ్ణు ఐదో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డిని హ‌గ్ చేసుకొని ఓదార్చింది సిరి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కౌగిలింత‌ల ప‌రంప‌ర కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఆ ఇద్ద‌రూ కౌగిలించుకొని స‌న్నీ త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చినా ప‌ట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. స‌న్నీ వ‌చ్చి, ష‌ణ్ణు చేయిప‌ట్టుకోవ‌డంతో అప్పుడు ఈలోకంలోకి వ‌చ్చి, సోఫాలో కూర్చున్న‌వాడ‌ల్లా లేచి నిల్చున్నాడు. స‌న్నీ, ష‌ణ్ణు హ‌గ్ చేసుకున్నారు. ఐస్ టాస్క్‌లో సిరికి దెబ్బ‌ల త‌గిలిన ద‌గ్గ‌ర్నుంచీ ఆమెను కాలు కింద‌పెట్ట‌నీయ‌కుండా ఎత్తుకొని తిప్పుతూ వ‌చ్చాడు ష‌ణ్ణు. దాంతో ఎప్ప‌టిక‌ప్పుడు అత‌డిని కౌగ‌లించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వ‌స్తోందామె. పైగా అత‌డు చూపిస్తున్న అభిమానం లేదా ప్రేమ‌తో అత‌డి ద‌గ్గ‌ర తెగ మారాం చేస్తూ వ‌స్తోంది కూడా. ఒక‌సారైతే త‌ను పిలిచినా ష‌ణ్ణు త‌న ద‌గ్గ‌ర‌కు రాక‌పోవ‌డంతో, నువ్వు నన్ను హ‌గ్ చేసుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ చేసింది కూడా. దీంతో ష‌ణ్ముఖ్ ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, హ‌త్తుకున్నాడు. అయితే దాన్ని ఎవ‌రూ వేరే ర‌కంగా తీసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డానిక‌న్న‌ట్లు దాన్ని ఫ్రెండ్‌షిప్ హ‌గ్ అని చెప్పాడు షణ్ణు, కెమెరాల వంక చూస్తూ. ష‌ణ్ణు త‌న‌ను బాగా చూసుకుంటున్నాడ‌ని చెప్తూ, అత‌డిని త‌న మీద‌కు లాక్కుని, ముద్దుకూడా ఇచ్చింది సిరి. Also read:  సిరిపై జెస్సీ షాకింగ్ కామెంట్స్‌ సిరి త‌ల్లి వ‌చ్చి ష‌ణ్ణుది సోద‌ర‌ప్రేమ అని చెప్పినా, లిమిట్స్‌లో ఉండ‌మంటూ ష‌ణ్ణు త‌ల్లి త‌లంటుపోసినా.. ఆ ఇద్ద‌రి రొమాన్స్‌కు ఫుల్‌స్టాప్ ప‌డ‌లేదు. పైగా మ‌రింత ఎక్కువ‌య్యాయి! సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీ‌హాన్ త‌న‌ను వ‌దిలేస్తున్నావా? అని డైరెక్టుగా అడిగిన‌ప్పుడు, రియ‌లైజ్ అయిన‌ట్లు గుంజీలు తీసిన సిరి, య‌థావిధిగా ష‌ణ్ణుపై త‌న ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. హోస్ట్ నాగార్జున‌తో త‌ను ష‌ణ్ణుకు బాగా క‌నెక్ట్ అయిన‌ట్లు చెప్ప‌డానికి ఆమె సంకోచించ‌లేదు. హౌస్‌లో వారిద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత‌త్వం గురించి ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి కూడా చెప్పేశాడు. నిజానికి అత‌డు చెప్పింది చాలా త‌క్కువ‌నీ, హౌస్‌లో ఆ ఇద్ద‌రూ అత్యంత స‌న్నిహితంగా ఉంటున్నార‌నీ, వారిమ‌ధ్య బంధం వేరే లెవ‌ల్‌కు వెళ్లింద‌నీ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగిశాక‌, సిరి-ష‌ణ్ణు ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చాక వారి మ‌ధ్య బంధం ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బాలయ్య 'అన్ స్టాపబుల్' గెస్ట్ గా మహేష్ బాబు!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రెండు ఎపిసోడ్స్ కి మోహన్ బాబు ఫ్యామిలీ, నాని గెస్ట్ లుగా రాగా.. మూడో ఎపిసోడ్ కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్ లుగా వచ్చారు. ఇక షో నాలుగో ఎపిసోడ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. 'అన్ స్టాపబుల్'తో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. బాలయ్య ఎనర్జీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ షోకి వస్తున్న రెస్పాన్స్ చూసి పలువురు స్టార్స్ ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తాజాగా షో నిర్వాహకులు షోలో గెస్ట్ గా పాల్గొనాలని మహేష్ ని సంప్రదించగా.. ఆయన వెంటనే ఓకే చెప్పాడని సమాచారం. మహేష్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. బాలయ్య ఎనర్జీకి మహేష్ సెటైర్స్ తోడైతే ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. బాలయ్య తాజాగా 'అఖండ' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.ఈ సినిమాకి మొదటి షో నుంచే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పై మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. మూవీ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పాడు. బాలయ్య-మహేష్ మధ్య మంచి బాండింగ్ ఉండటం, అఖండ సక్సెస్ పై మహేష్ సంతోషం వ్యక్తం చేయడం వంటి వాటిని దృష్టిలో బాలయ్య షోలో మహేష్ పాల్గొనే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో కూడా మహేష్ పాల్గొన్నాడు. ఇప్పుడు మరో నందమూరి హీరో షోలో మహేష్ సందడి చేస్తాడేమో చూడాలి.

షాకింగ్ ట్విస్ట్ .. టాప్ 5 లోకి ఆ ఇద్ద‌రు ఎంట్రీ?

బిగ్‌బాస్ సీజ‌న్ 5లో హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు వారి సంఖ్య 7కు ప‌డిపోయింది. తాజాగా 13వ వారం నామినేష‌న్స్‌లో ఇద్ద‌రు స‌భ్యులు స‌న్నీ, ష‌ణ్ముఖ్  మిన‌హా సిరి, మాన‌స్‌, ప్రియాంక‌, శ్రీ‌రామ‌చంద్ర‌, కాజ‌ల్ వున్నారు. 12వ వారం అనూహ్యంగా యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ కావ‌డంతో హౌస్‌లో 7 గురు స‌భ్యులు మిగిలిపోయారు. దీంతో బిగ్‌బాస్ చివ‌రి అంకంలోకి వ‌చ్చేసింది. త్వ‌ర‌లో షో ముగియ‌బోతున్న నేప‌థ్యంలో టాప్ 5లో ఎవ‌రుంటారు?  టైటిల్ ఫేవ‌రేట్ ఎవ‌రు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. దానికి తోడు ఈ 13వ వారం ఇంట్లో వున్న స‌బ్యుల్లో స‌న్నీ, ష‌న్ను మిన‌హా మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి, ప్రియాంక‌, కాజ‌ల్ నామినేష‌న్స్‌లో వుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో టిక్కెట్ టు ఫినాలేలో భాగంగా టాప్ ఫైకి నేరుగా ఇద్ద‌రు స‌భ్యులు స‌న్నీ, ష‌ణ్ముఖ్ నామినేట్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక నామినేష‌న్స్‌లో వున్న వాళ్ల‌లో సిరి, ప్రియాంక అత్యంత డేంజ‌ర్ జోన్‌లో వున్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులోనూ ప్రియాంక‌కు మ‌రీ అత్యల్పంగా ఓట్లు వ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు. గ‌త కొన్ని వారాలుగా స‌న్నీ ఓటింగ్ ప‌రంగా.. గేమ్ ప‌రంగా త‌న ఆదిప‌త్యాన్నికొన‌సాగిస్తున్నాడు. ష‌ణ్ముఖ్‌ని మించి ఓటింగ్‌ని సాధించ‌డ‌మే కాకుండా గేమ్ ప‌రంగానే స‌న్నీది పై చేయి వుండ‌టంతో అత‌ను నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే టైటిల్ విజేత ఎవ‌ర‌న్న‌ది ఆలోచించ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమీ కాద‌ని నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది. టాప్ 5 విష‌యానికి వ‌స్తే స‌న్ని, ష‌ణ్ముఖ్‌ల త‌రువాత శ్రీ‌రామ‌చంద్ర నిల‌వ‌నున్నాడు. ఆ త‌రువాత స్థానాన్ని అంటే 4వ స్థానాన్ని కాజ‌ల్ ఆక్ర‌మించిన‌ట్టుగా చెబుతున్నారు. ఇక ఐద‌వ స్థానంలో మాన‌స్ నిలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది. సిరి .. ష‌న్నుతో హ‌గ్గుల‌కే కాలాన్ని క‌రిగించేయ‌డంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ దారుణంగా ప‌డిపోయింది. ఇదే మాన‌స్‌ని 5వ స్థానంలో నిల‌బెట్టేలా చేసింద‌ని టాక్‌. గురువారం హౌస్‌లో ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది తెలియాలంటేఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే  

లాస్య‌కు తుల‌సి ఇచ్చిన మాట ఏంటీ?

  బుల్లితెర‌పై ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతున్న సీరియ‌ల్ `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. కస్తూరి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వ‌రాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ గురువారం 492వ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోబోతున్నాయి. అవేంట‌నేది ఒక‌సారి చూద్దాం. గ‌త ఎపిసోడ్‌లో లాస్య `వెల్‌నెస్ సెంట‌ర్‌`కి వ‌చ్చి నందుని క‌డిగిపారేసిన విష‌యం తెలిసిందే. `నీకు నేను కావాలో లేక తుల‌సి కావాలో తేల్చుకో.. తులసిని న‌న్ను బాధ‌పెడుతున్నావ్‌.. మా ఇద్ద‌రిలో ఎవ‌రు కావాలో ఇప్ప‌టికైనా తేల్చుకో` అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఏమీ మాట్లాడ‌లేక నందు బోరుమంటాడు. అదే స‌మ‌యంలో వాట‌ర్ బాటిల్ అందిస్తూ `ఆంటీ మిమ్మ‌ల్ని తుల‌సి ఆంటి పిలుస్తోంది` అంటుంది అంకిత‌. వెంట‌నే `నేను రాను అని చెప్పు అంటుంది లాస్య‌. `మ‌న‌ల్ని క‌ల‌వాలి అనుకునేవారిని క‌ల‌వ‌క‌పోతే మ‌నం చాలా కోల్పోతాం` అంటుంది అంకిత‌. దాంతో లాస్య మ‌న‌సు మార్చుకుని తుల‌సి ద‌గ్గ‌రికి వెళుతుంది. మ‌న మ‌ధ్య ఇదంతా జ‌రిగి వుండ‌క‌పోతే మ‌నం మంచి ఫ్రెండ్స్ అయ్యే వాళ్ల‌మేమో లాస్య. కానీ నిన్ను నేను ఫ్రెండ్ లాగే అనుకున్నాను. నందుకి న‌టించ‌డం రాదు. ఇక నందు నా జీవితంలోకి రావ‌డం సాధ్యం కాదు.  అంటుంది తులసి. నందు అనే వ్య‌క్తి ఇక నుంచి లాస్య‌తోనే క‌లిసి బ‌త‌కాలి.. అలా జ‌రిగేలా నేను చేస్తాను` అంటూ లాస్య‌కు తుల‌సి మాటిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. నందు డాక్ట‌ర్ అద్వైత కృష్ణ‌పై ఎందుకు సీరియ‌స్ అయ్యాడు? .. తుల‌సి ప‌రిస్థితి ఏంటీ.. ఆమె క‌థ ఏ మ‌లుపు తీసుకుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

సిరిపై జెస్సీ షాకింగ్ కామెంట్స్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్ సిరి హ‌న్మంత్ గ‌త కొంత కాలంగా శ్రీ‌హాన్ ప్రేమ‌లో మునిగితేలుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల బిగ్‌బాస్ హౌస్‌లో సిరికి, ష‌న్నుకి మ‌ధ్య త‌రుగుతున్న దూరం.. పెరుగుతున్న బంధంపై ర‌క ర‌కాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇటీవ‌ల యాంక‌ర్ ర‌వి కూడా క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే సిరిని జెస్సీ కూడా ఇష్ట‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంటి హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన జెస్సీ తాజాగా సిరిపై షాకింగ్ కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. హౌస్‌లో ష‌న్నుతో పాటు సిరితో చ‌నువుగా వున్న జెస్సీ ఒక ముద్దు నెట్టొచ్చుక‌దా అంటూ అల్ల‌రి చేసిన విష‌యం.. కొన్ని సంద‌ర్భాల్లో టాస్క్ పూర్త‌యిన త‌రువాత హ‌గ్ చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా సిరిపై జెస్సీ షాకింగ్ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం హౌస్‌లో వున్న సిరి.. త‌న ఫ్రెండ్ ష‌న్నుతో క్లోజ్‌గా వుంటున్న విష‌యం తెలిసిందే. సిరి త‌ల్లి, ష్ను త‌ల్లి ఈ ఇద్ద‌రూ సిరి - ష‌న్నుల‌ హ‌గ్గులు హ‌ద్దులు దాటుతున్నాయ‌ని అవి కాస్త త‌గ్గించుకుంటే మంచ ఇద‌ని హెచ్చ‌రించినా సిరి మాత్రం ష‌న్నుని హ‌గ్ చేసుకోకుండా వుండ‌టం లేదు. దీంతో సిరిని, ష‌న్నుని నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా వుంటే సిరిపై జెస్సీ చేసిన కామెంట్స్ మ‌రింత ఆజ్యం పోసేవిగా వున్నాయి. తన‌కు పిరిలాంటి అమ్మాయి భార్య‌గా రావాలి. అలాంటి అమ్మాయి అయితే పెళ్లి  చేసుకుంటాన‌ని సిరిని ఉద్దేశించి జెస్సీ తాజాగా అన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సిరి న‌న్ను హౌస్‌లో ఎలా చూసుకుందో అంతా చూశారు అలా త‌న‌ని చూసుకునే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటాన‌ని జెస్సీ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.    

కార్తీక్‌, దీప‌ల‌కు సౌంద‌ర్య విడాకులిప్పిస్తుందా?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న ఫ్యామిలీ డ్రామా `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా ట్విస్ట్‌లు.. మ‌లుపులతో ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా వింత పోక‌డ‌లు పోతూ ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తోంది. అయితే రేటింగ్ ప‌రంగా మంచి ఫేజ్‌లో వున్న ఈ సీరియ‌ల్ ఈ గురువారం ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో ఆకట్టుకోబోతోంది. ఈ గురువారం 1212వ ఎపిపోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సంద‌ర్భంగా ఏం జ‌ర‌గ‌నుందో ఒక‌సారి లుక్కేద్దాం. డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఎల‌క్ష‌న్ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో స్టేజ్‌పై మాట్లాడుతున్న సౌంద‌ర్య‌ని ప‌క్క‌కు త‌ప్పించి డాక్ట‌ర్ కార్తీక్ అధ్య‌క్షుడిగా వుండాలంటే నాకు న్యాయం చేయాల్సిందే అంటూ కండీష‌న్ పెడుతూ కార్తీక్ గురించి చెడుగా మాట్లాడుతుంది మోనిత‌. వెంట‌నే చ‌ప్ప‌ట్లు కొడుతూ స్టేజ్‌పైకి వెళ్లిన దీప .. మైక్ ముందున్న మోనిత‌ని ప‌క్క‌కు నెట్టి తను చేసిన మోసాల గురించి చెబుతుంది. ఇన్ని మోసాలు చేసిన ఈవిడ అస‌లు డాక్ట‌ర్ వృత్తికే ప‌నికిరాద‌ని మోనిత‌కు షాకిస్తుంది. ఈ మాట‌ల‌కు కోపంతో ఊగిపోయిన మోనిత అక్క‌డి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. ఆ త‌రువాత కార్తీక్, దీప , సౌంద‌ర్య‌, ఆనంద‌రావు బ‌య‌టికి రావడంతో వారిని త‌న మాట‌ల‌తో రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది మోనిత‌. కార్తీక్ ఆగ్ర‌హంతో ఊగిపోతుందే సౌంద‌ర్య ఆపేస్తుంది. అది గ‌మ‌నించిన దీప .. మోనిత ద‌గ్గ‌రికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌బోగా.. వెంట‌నే సౌంద‌ర్య క‌ల‌గ‌జేసుకుని దీప‌ని ఆపుతుంది. క‌ట్ చేస్తే అంతా ఇంటికి వెళ‌తారు. ఇంటికి వ‌చ్చిన వారిని ఆదిత్య ప్ర‌శ్న‌ల‌తో ప్రోగ్రామ్ ఎలా జ‌రిగింద‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. క‌ట్ చేస్తే మోనిత .. దీప మాట్లాడిన మాట‌లు త‌లుచుకుంటూ వుండ‌గా లాయ‌ర్ ఫోన్ చేస్తాడు. ఇక అన్ని ప‌నులు పూర్త‌యిన‌ట్టే అని చెప్ప‌డంతో మోనిత శుభ‌వార్త అంటూ పొంగిపోతోంది. ఆ త‌రువాత దీప‌తో కార్తీక్‌కు విడాకులు ఇప్పించాల‌ని సౌంద‌ర్య ఎందుకు అనుకుంది? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ర‌ష్మీ మందు పార్టీ ఇస్తుంద‌ట‌!

ప్ర‌స్తుతం సెల‌బ్రీటీలంతా మందు పార్టీల‌ని ఎంక‌రేజ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల జానీవాక‌ర్ లేటెస్ట్ వెర్ష‌న్ ని ప్ర‌మోట్ చేస్తూ ఓ పెగ్గు క‌లిపి చిందులేస్తున్న వీడియోని బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే షేర్ చేయ‌డం అది నెట్టింట వైర‌ల్‌గా మార‌డం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ లిక్క‌ర్‌కి సంబంధించిన వీడియోని `జ‌బ‌ర్ద‌స్త్‌` ఫేమ్ ర‌ష్మీ గౌత‌మ్ ఇన్ స్టా వేదిగా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. `స‌మ్మ‌టి విస్కీ క‌మ్మ‌టి వాస‌న.. అందుకే ఎంసీ నంబ‌ర్ వ‌న్‌..` అంటూ ర‌ష్మీ చేసిన ఈ వీడియోలో చాలాకీ చంటి, ముక్కు అవినాష్ కూడా క‌నిపించారు.ఇదే వీడియోలో అవినాష్‌కి వీడియో కాల్ చేసిన చ‌లాకీ చంటి `ఏంరా అవినాష్ ఫుల్‌ ఫేమ‌స్ అయిన‌వ్.. దావ‌త్ ఎప్పుడిస్తున్న‌వ్‌...` అని అడిగాడు. వెంట‌నే ర‌ష్మీ గౌత‌మ్ అందుకుని `దావ‌త్ అంటే తెలుసు క‌దా...జ‌బ‌ర్ద‌స్త్‌గా వుండాలి అంటే నంబ‌ర్ వ‌న్ వుండాలి` అన‌డం.. దానికి ముక్కు అవినాష్ స‌రె స‌రే నేను పోవాలి.. త్వ‌ర‌లోనే చేసుకుందాం.. ఓకేనా మ‌న దోస్త్‌లంద‌ర్ని పిలువుర్రి రైట్` అంటూ వీడియో కాల్‌ని క‌ట్ చేశాడు. అనివాష్ దోస్త్ లంద‌ర్ని పిల‌వ‌మ‌న్నాడు అంద‌ర్నీ అంటే మ‌న నంబ‌ర్ వ‌న్ ఫ్యాన్స్ అంద‌రిని అంటూ ర‌ష్మీ ఈ వీడియోకి ఎండ్ డైలాగ్ చెప్పింది. ప్ర‌స్తుతం ఈ వీడియోని చూసిన నెటిజ‌న్స్ ర‌ష్మీ మందు పార్టీ ఇస్తుంద‌ట‌` అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. నెట్టింట్లో ర‌ష్మీ మందు పార్టీ వీడియో అంటూ ఈ వీడియోని నెటిజ‌న్స్ వైర‌ల్ చేస్తున్నారు. మందు ప్రాచారం కోసం ర‌ష్మీ చేసిన ఈ వీడియోలో ఓ రేంజ్‌లో నెట్టింట పంచ్‌లు వినిపిస్తున్నాయి.

రోజాకు అడ్డంగా దొరికి పోయిన జ‌బ‌ర్ద‌స్త్ జోడీ!

గ‌త కొంత కాలంగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో ఆక‌ట్టుకుంటున్న జోడీ వ‌ర్ష , ఇమ్మాన్యుయేల్‌. వీరిద్ద‌రి నేప‌థ్యంలో వ‌చ్చే కామెడీ స్కిట్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తూనే వున్నాయి. దీంతో వీరిద్ద‌రూ షార్ట్ టైమ్‌లోనే పాపుల‌ర్ అయిపోయారు. బుల్లితెర‌పై ఈ జంట ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకుంటూ త‌మ‌దైన స్కిట్‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది. దీంతో వీరిద్ద‌రిని జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు బాగానే వాడేస్తున్నారు. వీరిద్దరు ఫేమ‌స్ కావ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఈ వార్త‌ల్ని మ‌రింత‌గా వాడుఏకోవాల‌ని ప్లాన్ చేసిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ జంట‌కు స్టేజ్‌పై ప‌బ్లిసిటీ పెళ్లి చేసిన‌ట్టుగానే వ‌ర్ష - ఇమ్మాన్యుయేల్ జంట‌కి పెళ్లి చేసేసి షాకిచ్చారు నిర్వాహ‌కులు. అయితే వీరిద్ద‌రిపై రొమాంటిక్ ట్రాక్‌లు మ‌రీ ఎక్కువ కావ‌డంతో రొటీన్ పీలైన నిర్వాహ‌కులు గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రి వేరు వేరుగా ప్ర‌జెంట్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే తాజాగా మ‌ళ్లీ ఈ జోడీని ఒక్క‌టి చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా జబ‌ర్ద‌స్త్ షోకు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా తాజాగా వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ గుట్టుని ర‌ట్టు చేసిన‌ట్టుగా తెలిసింది. డిసెంబ‌ర్ 3న ప్రాసారం కానున్న `ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్` ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో యాంక‌ర్ ర‌ష్మీతో పాటు వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ కూడా క‌నిపించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇదే ప్రోమోలో రోజా ... వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్‌ల‌ని ఉద్దేశించి రెండు రోజుల క్రితం మీరు ఎక్క‌డ వున్నార‌ని అడిగి వారి గుట్టు బ‌య‌ట‌పెట్టేసి అడ్డంగా బుక్ చేసింది. అయితే వెంట‌నే తేరుకున్న వ‌ర్ష `నేను ఆరోజు షూటింగ్‌లో వున్నాన‌ని, ఇమ్మార్యుయేల్ వేరేచోట వున్నాడ‌ని చెప్పేసింది. వెంట‌నే వ‌ర్ష , ఇమ్మాన్యుయేల్‌ల‌కు సంబంధించిన ఓ సీక్రెట్ ఫొటోని బ‌య‌ట‌పెట్టి షాకిచ్చింది. ప్ర‌స్తుతం ఈ దృశ్యాల‌కు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

బిగ్‌బాస్‌పై ర‌వి సంచ‌ల‌న కామెంట్స్‌!

బిగఃబాస్ సీజ‌న్ 5 టైటిల్ ఫేవ‌రేట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా 12వ వారంలోనే ఇంటి నుంచి బ‌య‌టికి రావ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. అత‌ని ఎలిమినేష‌న్ అన్ ఫేర్ అని.. అత‌న్ని కావాల‌నే ఎలిమినేట్ చేశార‌ని ర‌వి ష్యాన్స్ ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా బిగ్‌బాస్ నిర్వ‌హ‌కుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా వుంటే హౌస్ నుంచి అర్థాంత‌రంగా బ‌య‌టికి వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి బిగ్‌బాస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. టాప్ 5లో వుండాల్సిన ర‌వి ఇలా అక‌స్మాత్తుగా ఎలిమినేట్ కావడం ఏంటి అని అంతా అవాక్క‌య్యారు కూడా. యాంక‌ర్ ర‌వి కూడా ఊహించ‌ని ప‌రిణామానికి ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడ‌ట‌. హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక తొలిసారి ఇన్‌స్టా వేదిక‌గా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించాడు ర‌వి. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు షాకిచ్చాడు. త‌న ఎలిమినేష‌న్‌పై అనుమానాలున్నాయ‌న్నాడు. అంతే కాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో జ‌రిగేది ఒక‌టి కానీ చూపించేది మ‌రోట‌ని విమ‌ర్శ‌లు గుప్పించాడు. తానొక‌టి చేస్తే బ‌య‌టికి మ‌రోలా ప్రొజెక్ట్ చేశారన్నాడు. హౌస్‌లోకి వెళ్లేముందు మీమ్స్‌, ట్రోల్స్ గురించి త‌న‌ని వాడుకోమ‌ని చెప్పాన‌ని, అయితే హ‌ద్దులుదాటి నాభార్య‌ని కూడా ఇందులోకి లాగార‌న్నారు. చివరికి నా పాప మీద కూడా ఓ బ్యాచ్ మీమ్స్‌, ట్రోల్స్ వేసింది. వాళ్ల‌ని ఏమ‌నాలి? .. వాళ్ల‌కు ఓ రెండువేల రూపాయ‌లు ఇస్తే వాళ్ల ఇంట్లో వాళ్ల‌ని కూడా ట్రోల్ చేస్తార‌ని యాంక‌ర్ ర‌వి మండ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.