స‌న్నీ క్యారెక్ట‌ర్ గుట్టు విప్పిన డాక్ట‌ర్ బాబు

బిగ్‌బాస్ రియాలిటీ షో సీజ‌న్ 5 ముగిసినా కంటెస్టెంట్ల‌ కార‌ణంగా ఇంకా వార్త‌ల్లో వైర‌ల్ అవుతూనే వుంది. తాజాగా `కార్తీక‌దీపం` ఫేమ్ డాక్ట‌ర్ బాబు అలియాస్ నిరుప‌మ్ ప‌రిటాల బిగ్‌బాస్ సీజ‌న్ 5పై స్పందించాడు. త‌న‌దైన స్టైల్లో బిగ్‌బాస్ పై మినీ రివ్యూ ఇచ్చాడు. ఇదే సంద‌ర్భంగా ఈ సీజ‌న్ విన్న‌ర్ వీజే స‌న్నీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్‌బాస్ 5లో ఎంట్రీ సాధించిన వీజే స‌న్నీ, ఉమాదేవి, మాన‌స్‌, సిరి, విశ్వ‌, యాంక‌ర్ ర‌విల‌తో నిరుప‌మ్ కు మంచి అనుబంధం వుంది. ఆ కార‌ణంగానే త‌ను బిగ్‌బాస్ సీజ‌న్ 5ని ఫాలో అయ్యాడ‌ట‌. మొద‌ట్లో విశ్వ విన్న‌ర్ అవుతాడ‌ని అనుకున్నాన‌ని.. అత‌నిపై హోప్ వుండేద‌ని, ఆ త‌రువాత ఆట ముందుకు వెళ్లేకొద్దీ లెక్క‌లు మారిపోయాయ‌ని, మాన‌స్ బ్యాలెన్స్డ్ గా ఆడుతున్నాడ‌నిపించింద‌ని చెప్పుకొచ్చాడు నిరుప‌మ్‌. ఇక ఒక స్టేజ్ లో ర‌వి, ష‌ణ్ముఖ్‌ బాగా పుంజుకున్నార‌ని, అయితే స‌న్నీ విన్న‌ర్ అవుతాడ‌ని తాను అస‌లు ఊహించ‌లేద‌ని మ‌న‌సులో మాట చెప్పాడు. Also read: చిరు, ప్ర‌భాస్, ర‌వితేజ.. సేమ్ టు సేమ్! అరుపులు కేక‌ల‌తో స‌న్నీ చాలా అగ్రెసివ్‌గా క‌నిపించాడ‌ని.. అది అత‌ని రియ‌ల్ క్యారెక్ట‌ర్ కాద‌ని చెప్పాడు. అయితే ఊహించ‌ని విధంగా సెకండ్ హాఫ్ లో అత‌నిలో వున్న జోవియ‌ల్ యాంగిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని, అదే అత‌ని రియ‌ల్ క్యారెక్ట‌ర్ అని అస‌లు గుట్టు విప్పేశాడు. అదే అత‌న్ని విజేత‌ని చేసింద‌ని, అయితే మొద‌ట్లో త‌ను ఎందుకంత అగ్రెసివ్‌గా వుంటున్నాడో త‌న‌కు అర్థం కాలేద‌ని, ఆ త‌రువాతే త‌న‌లోని జోవియ‌ల్ యాంగిల్‌ని సెకండ్ హాఫ్ కోసం దాచేశాడ‌ని అనిపించింద‌ని, అది బాగా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని చెప్పుకొచ్చాడు. ఇంత‌కీ మీరు బిగ్ బాస్ షోకి వెళ‌తారా అన‌డిగితే, "న‌న్నయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అడ‌గ‌లేదు. ఒక వేళ అడిగితే ఆలోచిస్తా.. బిగ్‌బాస్ షో నుంచి కాల్ వ‌స్తే నాకున్న క‌మిట్‌మెంట్స్ ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటా. కానీ చేస్తున్న ప్రాజెక్ట్ ల‌ని మాత్రం బిగ్‌బాస్ కోసం వ‌దిలేయ‌ను. అలా వదిలేస్తే అవి మ‌ధ్య‌లోనే ఆగిపోవాల్సి వ‌స్తుంది.. అది ప‌ద్ద‌తికాదు" అని చెప్పుకొచ్చాడు నిరుప‌మ్‌. 

"నా వెనుక నిలిచింది నా తండ్రి ప్రేమ‌!" వైర‌ల్ అయిన‌ దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!!

  ఆరు రోజుల క్రితం, కొత్త సంవ‌త్స‌రారంభం సంద‌ర్భంగా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో త‌న అనుబంధాన్ని తుంచేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించి అంద‌రికీ షాకిచ్చింది దీప్తి సునయ‌న‌. త‌మ ఇద్ద‌రివీ వేర్వేరు దారుల‌ని గుర్తించ‌డంతో ఐదు సంవ‌త్స‌రాల త‌మ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నామ‌ని ఆమె చెప్పింది. దీంతో బిగ్ బాస్ 5 హౌస్‌లో సిరి హ‌న్మంత్‌తో ష‌ణ్ణు క్లోజ్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అత‌ను త‌న‌ను క‌ల‌వ‌డానికి రాక‌పోవ‌డం దీప్తిని తీవ్రంగా బాధించింద‌నీ, అత‌ని ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే ఆమె ఈ డెసిష‌న్ తీసుకుందంటూ సోష‌ల్ మీడియాలో విరివిగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. Also read:  ష‌న్ను బండారం బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్‌ ఆ త‌ర్వాత ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి.. బ్రేకప్‌ గురించి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బ్రేకప్‌ గురించి ఓ నెటిజన్‌ దీప్తిని ప్రశ్నించగా.. జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని లేదని.. కెరీర్‌పరంగా ఏదైనా సాధించాలనుకుంటున్నానని.. ఇప్పటి వరకూ నా గురించి నేను ఆలోచించుకోలేదని.. అలాగే నా కెరీర్‌ని కూడా పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవాలనుకుంటున్నానని.. కెరీర్‌లో రాణించాలనుకుంటున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కన్నీరు పెట్టుకుంది.  Also read: సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు! తాజాగా దీప్తి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అందులో ఆమె త‌న తండ్రితో కులాసాగా గ‌డిపిన క్ష‌ణాల‌కు సంబంధించిన‌వి. బ్యాగ్రౌండ్‌లో ఎన్నెన్నో ఆశ‌ల‌తో పెంచాన‌మ్మా గుండెల్లో అనే పాట వ‌స్తుండ‌గా, తండ్రికి వెనుక ఉన్న త‌న వినైల్ పోస్ట‌ర్‌ను చూపిస్తూ ఏదో చెప్పింది దీప్తి. దానికి త‌లాడించి, కూతురి త‌ల‌పై ఆప్యాయంగా త‌ట్టాడు తండ్రి. దాంతో ఆశ్చ‌ర్య‌పోయిన దీప్తి ముందుకు వంగి ఆయ‌న కాలిపై త‌న త‌ల ఆన్చింది. ఆ వీడియో ఆ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం ప‌డుతోంది. "ఆమె ఒంటరిగా నిలబడలేదు, కానీ ఆమె వెనుక నిలిచింది, ఆమె జీవితంలో అత్యంత శక్తిమంతమైన నైతిక శక్తి, ఆమె తండ్రి ప్రేమ." అంటూ ఆ వీడియోకు క్యాప్ష‌న్‌గా రాసుకొచ్చింది దీప్తి.

హోస్ట్‌గా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ రికార్డ్‌

మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా స్టార్ హీరోలు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ ఆక‌ట్టుకుంటున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ జాబితాలో కింగ్ నాగార్జున‌, మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాని, రానా, త‌మ‌న్నా వంటి వారు రియాలీటీ షోల‌కు హోస్ట్ లుగా వ్య‌వ‌హ‌రించి త‌మ స‌త్తా చాటుకున్నారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షోతో అల‌రిస్తున్నారు. రానా `నెం.1 యారీ` టాక్ షోతో ఆక‌ట్టుకోగా.. ఇదే త‌ర‌హాలో స‌మంత `సామ్ జామ్‌` షోతో ముందుకొచ్చింది. అయితే ఈ జాబితాలో హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఎంటర‌వుతార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ ఆయ‌న హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బికె`కు ఊహించ‌ని స్థాయిలో హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో ఇండియ‌న్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) విడుద‌ల చేసిన టాప్ రేటింగ్స్ లో టాప్ 10 రియాలిటీ షోల్లో ఒక‌టిగా నిలిచి రికార్డు నెల‌కొల్పింది. Also Read: బిగ్‌బాస్ ఓటీటీ అత‌ని చేతికా? ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో చాలా టాక్ షోలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి కానీ `ఆహా` ఓటీటీ వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బికే' టాక్ షో సాధించినంత విజ‌యాన్ని ఇంత వ‌ర‌కు ఏ టాక్ షో సాధించ‌లేదు. వెండితెర‌పై ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన బాల‌య్య ఇప్పుడు `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బికె` అంటూ త‌న‌దైన స్టైల్లో స్టార్స్ ని ఇంట‌ర్వ్యూ చేస్తూ ఓ రేంజ్ లో ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. అంతే కాకుండా సెల‌బ్రిటీల‌ను బాల‌య్య  స‌ర‌దాగా ఆట‌ప‌ట్టిస్తున్న తీరు కూడా ఈ షోకి ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తోంది. ఇప్ప‌టికే 7 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో మ‌రో మూడు ఎపిసోడ్ ల‌తో తొలి సీజ‌న్ ని కంప్లీట్ చేసుకోబోతోంది.  

బుల్లితెర స్టార్‌.. అంత‌ వీజీకాద‌ట‌!

  `కార్తీక దీపం` సీరియ‌ల్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు డాక్ట‌ర్ బాబు అలియాస్ నిరుప‌మ్ ప‌రిటాల‌. బుల్లితెర శోభ‌న్‌బాబుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారాయ‌న‌. ప్ర‌స్తుతం స్టార్ మాలో 'కార్తీక దీపం', జీ తెలుగులో `హిట్ల‌ర్ గారి పెళ్లాం` సీరియ‌ల్స్ తో అల‌రిస్తున్నారు. బుల్లితెర న‌టుడిగా కోట్లాది మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నిరుప‌మ్ బుల్లితెర స్టార్‌డ‌మ్‌.. అంత వీజీ కాదు అంటున్నాడు. ఓ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌ర‌దాగా స‌మాధానాలు చెప్పాడు. మీ అభిమాన హీరో ఎవ‌రంటే 'విక్ట‌రీ వెంక‌టేష్' అని చెప్పిన నిరుప‌మ్ ఆయ‌న‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని, త‌ను సినిమాలు చేయ‌డానికి ఎప్పుడూ రెడీగానే వున్నాన‌ని, ప్ర‌స్తుతం రెండు మూడు ప్ర‌పోజ‌ల్స్ న‌డుస్తున్నాయ‌ని.. అయితే సీరియ‌ల్స్ లో త‌న‌ని డాక్ట‌ర్ బాబు, హిట్ల‌ర్ గా చూసిన జ‌నం ఎలా చూడాల‌నుకుంటున్నారో తెలియ‌డం లేద‌ని అందుకే ముందు సేఫ్ గేమ్ ఆడాల‌నుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు. Also Read: 'బంగార్రాజు'లో నామీద‌ చైతూ పైచేయి సాధిస్తాడు! ఇక బుల్లితెర స్టార్... అనే గుర్తింపు రావ‌డం అంత వీజీ కాద‌ని .. ఆ ట్యాగ్ పెద్ద రిస్క్ అని చెప్పాడు. ఒక సీరియ‌ల్ హిట్ట‌వ‌గానే బుల్లితెర స్టార్ అదీ ఇదీ అని పెద్ద పెద్ద ట్యాగ్ లు త‌గిలేస్తార‌ని.. అవి వింటానికి బాగానే వుంటాయి కానీ వాటితో రిస్కే కానీ పెద్ద‌గా ఉప‌యోగం అంటూ ఏమీ వుండ‌ద‌ని తేల్చేశాడు. "సినిమాల్లోకి రావాల‌ని చాలా రోజులుగా ట్రై చేస్తున్నా.. ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో చూడాలి. ఎలాంటి పాత్ర‌లు వ‌స్తాయో వాటిని ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలి" అంటున్నాడు నిరుప‌మ్‌.  

య‌శోధ‌ర్ - వేదల‌కు షాకిచ్చిన పేరెంట్స్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. స్టార్ మాలో ప్ర‌తీ రోజు రాత్రి 9:30 గంట‌ల‌కు సోమ‌వారం నుంచి శనివారం వ‌ర‌కు ప్ర‌సారం అవుతోంది. బేబీ ఖుషీ బాధ్య‌త‌ల్ని జ‌డ్జి డా.వేద‌కు అప్ప‌గించ‌డంతో త‌న‌ని త‌మ వైపు తిప్పుకోవాల‌ని అభిమ‌న్యు , మాళివిక మాస్ట‌ర్ ప్లాన్ లు వేస్తుంటారు. ముందు ఖ‌రీదైన నెక్లెస్ ని బ‌హుమ‌తిగా ఇచ్చి వేదని బుట్ట‌లో వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది మాళ‌విక . కానీ త‌ను ఇచ్చిన ఆఫ‌ర్ ని బుధ‌వారం ఎపిసోడ్ లో సున్నితంగా వేద తిర‌స్క‌రించ‌డంతో మాళ‌విక అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. గురువారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. అభిమ‌న్యు డ‌బ్బులు ఎర‌గా చూపించి వేద‌ని త‌మ వైపుకి తిప్పుకోవాల‌ని త‌న మేనేజ‌ర్‌ని డ‌బ్బు ఇచ్చిర‌మ్మ‌ని పంపిస్తాడు. అయితే అది య‌శోధ‌ర్ పంపించాడ‌ని వేద త‌ప్పుగా అర్థం చేసుకుంటుంది. Also Read: య‌ష్‌, వేద మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణం? వెంట‌నే య‌శోధ‌ర్ ఆఫీస్‌కి వెళ్లి త‌న‌ని నిల‌దీస్తుంది. య‌శోధ‌ర్‌ని అవ‌మానిస్తుంది. విష‌యం తెలియ‌ని య‌శోధ‌ర్ కూడా వేద‌ని అవ‌మానించి పంపించేస్తాడు. క‌ట్ చేస్తే .. ఈ కోపంలో య‌శోధ‌ర్ త‌న తండ్రికి ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూశాన‌న్నారు క‌దా అదే ఓకే చేయండి, పెళ్లి చూపులు ఎక్క‌డో చెబితే వ‌స్తానంటాడు..  ఇదే త‌ర‌హాలో వేద కూడా త‌న తండ్రి ఫోన్ చేయ‌డంతో పెళ్లి చూపుల‌కు నేను రెడీ అని చెప్పేస్తుంది. 7 గంట‌ల‌కు పెళ్లి చూపుల‌ని చెప్పి రిసార్ట్ కి రమ్మంటాడు. ఓ వైపు య‌శోధ‌ర్ ఫ్యామిలీ, మ‌రో వైపు వేద ఫ్యామిలీ ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు అదే రిసార్ట్ కి వ‌చ్చేస్తారు. పెళ్లి చూపులు వేద‌కు, య‌ష్ కి అని వీరిద్ద‌రి ఫాద‌ర్‌ల‌కు ముందే తెలుసు. కానీ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌రు. అయితే పెళ్లి చూపులు త‌మకే అని తెలుసుకున్న వేద , య‌ష్ ఏం చేశారు? .. ఖుషీ కోసం ఒక్క‌ట‌య్యారా..? ల‌ేక మ‌ళ్లీ రిజెక్టెడ్ అంటూ ఒకరిపై ఒక‌రు బుర‌ద‌జ‌ల్లుకున్నారా? .. గిల్లికజ్జాల‌కు దిగారా? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.   

దాని కోసం ర‌ష్మి-సుధీర్ క్రేజ్‌ను వాడుకోకండి.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వార్నింగ్‌!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో వైర‌ల్ అయిన జోడీ ర‌ష్మీ గౌత‌మ్ - సుడిగాలి సుధీర్‌. వీరిద్ద‌రిపై వ‌చ్చిన‌న్ని రూమ‌ర్స్‌ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ టీవీ జోడీపై రాలేదు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై వ‌ర్క‌వుట్ కావ‌డంతో అంతా వీరు ప్రేమ‌లో వున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. ఎన్ని సార్లు ర‌ష్మీ - సుధీర్ ఇదంగా షో కోస‌మే అని, తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని వివ‌ర‌ణ ఇచ్చినా వీరిపై ఇప్ప‌టికీ రూమ‌ర్స్‌ ఆగ‌డం లేదు. వారికున్న పాపులారిటీ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. Also read: సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్! అయితే గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో వీరిపై వ‌స్తున్న కామెంట్ ల‌కు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌యత్నం చేశాడు. జ‌బ‌ర్ద‌స్త్ లో లేడీ వేషాల‌తో ఆక‌ట్టుకుంటున్న శాంతి స్వ‌రూప్ టీవీ సెల‌బ్రిటీల‌పై వ‌స్తున్న వ‌దంతుల‌కు కౌంట‌ర్ ఇచ్చాడు. ర‌ష్మీ - సుధీర్ జోడీకున్న పాపులారిటీని వాడేస్తూ శాంతి స్వ‌రూప్ డ్రెస్ విష‌య‌మై కొన్ని ఫేక్ వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాటిపై శాంతి స్వ‌రూప్ మండిప‌డ్డాడు. యాంక‌ర్ ర‌ష్మీ.. తాను ధ‌రించిన కాస్ట్యూమ్స్ శాంతి స్వ‌రూప్ కి ఇచ్చిందంటూ నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది. శాంతి స్వ‌రూప్ లేడీ గెట‌ప్ కు సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ ఇదిగో ప్రూఫ్ అంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. అంతే కాకుండా ర‌ష్మీ ఈ డ్రెస్ ని శాంతి స్వ‌రూప్ కు ఇవ్వ‌డం వెన‌క ఓ కార‌ణం కూడా వుందంటూ కామెంట్ లు చేశారు. ఈ పోస్ట్ లు చూసిన శాంతి స్వ‌రూప్ ట్రోల‌ర్స్ కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.   Also read: హైప‌ర్ ఆది పెళ్లి సీక్రెట్ చెప్పేశాడు "త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌కండి. ఆ కాస్ట్యూమ్స్ నచ్చి నేనే రెడీ చేయించుకున్నాను. కానీ నిజానిజాలు తెలియ‌కుండా మీరు ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం దారుణం. మీ పేజీని పాపుల‌ర్ చేసుకోవ‌డం కోసం ఇలాంటి పోస్ట్ లు పెట్ట‌కండి... మా లాంటి వారితో ఆడుకోకండి.. అంతే కాకుండా మీరు పాపుల‌ర్ కావ‌డం కోసం సుధీర్ - ర‌ష్మీల క్రేజ్ ని వాడుకోకండి" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శాంతి స్వ‌రూప్‌. ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

 ష‌న్ను బండారం బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్‌

  బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసినా దాని ర‌చ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే వుంది. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్జే కాజ‌ల్ తాజాగా ష‌న్నుబండారం బ‌య‌ట‌పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట‌ర్ కావ‌డ‌మే త‌న క‌ల‌గా భావించిన కాజ‌ల్ అనుకున్న‌ట్టుగాను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి త‌న క‌ల‌ని నిజం చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్న ఈ షోలో కాజ‌ల్ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంద‌నే చెప్పాలి. ఎంత మంది త‌న‌ని హౌస్ నుంచి బ‌య‌టికి పంపించాల‌ని ప్ర‌య‌త్నాలు చేసినా టాప్ 6లో నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. హౌస్ లో కాజ‌ల్ ని చాలా మంది చాలా ర‌కాలుగా ఆడుకున్నారు. యానీ మాస్ట‌ర్ అయితే త‌న‌ని నాగిన్ అంటూ ఏడిపించే ప్ర‌య‌త్నం చేసింది. ఇక ష‌న్ను ఏకంగా కాజ‌ల్ బ‌య‌టికి వెళితేనే హౌస్ లో గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు కూడా. ఇలా ర‌క ర‌కాల దాడుల త‌రువాత కాజ‌ల్ ఫైన‌ల్ గా స‌న్నీ, మాన‌స్ ల తో క‌లిసిపోయింది. ముందు ష‌న్నుతో క్లోజ్ గా వున్నా త‌ను క‌రెక్ట్ కాద‌ని తెలియ‌డంతో స‌న్నీ, మాన‌స్ ల తో గ్రూప్ క‌ట్టేసింది. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ చాలా మంది హౌస్ లో జ‌రిగిన విష‌యాల‌పై ఓపెన్ అవుతుంటే కాజ‌ల్ చాలా లేట్ గా రియాక్ట్ అయింది. ఈ సంద‌ర్భంగా ష‌ణ్ముఖ్ అస‌లు బండారం బ‌య‌ట‌పెట్టింది. హౌస్ లో ష‌న్ను ఎలా వుండేవాడు, త‌న‌తో ఏమ‌న్నాడు?.. ముందు త‌న‌తో వున్న కాజ‌ల్ ఎందుకు సన్నీ, మాన‌స్‌ల వ‌ద్ద‌కు చేరాల్సి వ‌చ్చిందో మొత్తానికి బ‌య‌ట‌పెట్టేసింది. Also read: నెటిజ‌న్ ప్ర‌శ్న‌కి యానీ ఆన్స‌ర్ అదిరింది నేను నా రియ‌ల్ లైఫ్ లో ఎలా వుండేదాన్నో హౌస్ లోనూ అలాగే వున్నాను. నాకు ఏది అనిపిస్తే అదే చేశా. ష‌ణ్ముఖ్ కు ఫాలోయింగ్ వుంద‌ని అత‌న్ని ముందు ఫాలో కాలేదు. స్టార్టింగ్ లో అలా క‌నెక్ట్ అయ్యా. అప్పుడు ష‌న్ను ఏమ‌న్నాడంటే .. నువ్వు వుంటే నాతో మాత్ర‌మే వుండాలి.. అంద‌రితో ఉంటూ నాతో వుంటే నాకు ఇష్టం వుండ‌దు.. దాన్ని నేను తీసుకోలేను.. నువ్వు నాతోనే వుండాలి అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అది నాకు న‌చ్చ‌లేదు. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ వుంది. కాబ‌ట్టే అత‌నికి దూరంగా వున్నాను` అంటూ ష‌న్ను బండారం బ‌య‌ట‌పెట్టింది కాజ‌ల్‌.   

`కార్తీక దీపం`: అస‌లు నిజం తెలుసుకున్న దీప‌

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ కార్తీక దీపం. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిగా సాగుతున్న ఈ సీరియ‌ల్ గురువారం మ‌రో మ‌లుపు తిర‌గ‌బోతోంది. రుద్రాణి కుట్ర‌లో ఇరుక్కుపోయిన డాక్ట‌ర్ బాబు ఆ కుట్ర నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి మ‌ద‌న ప‌డుతుంటాడు. కానీ దారి తెలియ‌క ఏం చేయాలో అర్థం కాక త‌న‌లో తానే కుమిలిపోతుంటాడు. ఈ నేప‌థ్యంలో ఈ గురువారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ రోజు 1242వ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. Also Read: దీప‌కు నిజం చెప్పేసిన కార్తీక్!  రుద్రాణికి ఆవేశంలో ఇచ్చిన మాట గురించి తెలుసుకుని కార్తీక్ లోలోన మ‌ద‌న ప‌డుతుంటాడు. దీప క‌నిపెట్టి ఆరా తీస్తుంది. స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేసే ప్ర‌య‌త్నం చేయ‌డంతో దీప ఒట్టుపెట్టించుకుని అస‌లు విష‌యం ఏంటో చెప్ప‌మ‌ని కార్తీక్ ని నిల‌దీస్తుంది. దీంతో త‌ను చేసిన పొర‌పాటుని చెప్పేస్తాడు. రుద్రాణి రెచ్చ‌గొట్ట‌డంతో ఆవేశంలో సంత‌కం చేశాన‌ని, కానీ త‌రువాత త‌న‌కు ఇష్ట‌మొచ్చింది తాను రాసుకుంద‌ని చెబుతాడు. Also read: ష‌న్ను, దీప్తి ఇలా.. సిరి, శ్రీ‌హాన్ అలా.. "ఏంటీ మీరు సంత‌కం పెడితే తాను నా కూతురుని తీసుకెళ్లిపోతుందా? ఏంటీదీ డాక్ట‌ర్ బాబు? అంతా మీ ఇష్ట‌మేనా?" అని కార్తీక్ ని నిల‌దీస్తుంది. "ఏంటీ దేవుడా నాకీ ప‌రీక్షా ఇంకా నామీద‌ కోపం పోలేదా?" అంటూ దీప బోరున విల‌పిస్తుంది. హిమ నా కూతురు అని తెలిసినా ఆ విష‌యం చెప్పలేక త‌ల్ల‌డిల్లాన‌ని అలాంటిది ఇప్పుడు నా పిల్ల‌ల‌ని నా నుంచి రుద్రాణి దూరం చేస్తుందా? .. నా పిల్ల‌ల‌పై రుద్రాణి క‌న్ను ప‌డిందా? అని కార్తీక్ ని నిల‌దీస్తుంది దీప‌. దీంతో స‌మాధ‌నం చెప్ప‌లేక బ‌య‌టికి వెళ్లిపోతాడు కార్తీక్‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. రుద్రాణి రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

నవ్య స్వామి క్ష‌మించ‌మంటోంది ఎందుకు?  

బుల్లితెర తార‌ల్లో న‌వ్య స్వామికి ఉన్న పాపులారిటీ వేరే రేంజ్‌. `ఆమె క‌థ‌` సీరియ‌ల్ తో న‌వ్య స్వామి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇదే సీరియ‌ల్ ద్వారా న‌వ్య స్వామికి, ర‌వికృష్ణ‌కు మధ్య మంచి స్నేహం ఏర్ప‌డిన విష‌యం తెలిసిదే. ఈ జోడీ మ‌ధ్య కెమిప్ట్రీ బాగా కుద‌ర‌డంతో ఇద్ద‌రిపై చాలా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆ రూమ‌ర్ ల‌కు త‌గ్గ‌ట్టే బ‌య‌ట కూడా వీరిద్ద‌రు బాగా క్లోజ్‌గా క‌నిపించ‌డంతో ఈ జంట బాగుందంటూ ఆడియ‌న్స్ కామెంట్ లు చేశారు.   Also read: బాల‌య్యా మ‌జాకా.. రానాని ఆడేసుకున్నాడుగా! బుల్లితెర‌పై మ్యాజిక్ చేసిన ఈ జంట ప్ర‌తీ షోలోలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ప్ర‌తీ ఈవెంట్ లోనూ ఇద్ద‌రు క‌లిస్తే ర‌చ్చ మామూలుగా వుండేది కాదు. ఈ ఇద్ద‌రిపై వ‌స్తున్న రూమ‌ర్ ల‌కు ర‌వికృష్ణ ఓ షో సాక్షిగా ఆజ్యం పోశాడు. టీవీ రియాలిటీ షోలోనే న‌వ్య స్వామికి ఏకంగా ముద్దు పెట్టేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. `ఆమె క‌థ‌` సీరియ‌ల్ స‌మ‌యంలో న‌వ్య స్వామికి కోవిడ్ సోక‌డం... ఆ త‌రువాత ర‌వికృష్ణ‌కు సోక‌డంతో ఇద్ద‌రూ చాలా ఇబ్బందులు ప‌డ్డారు. Also read: సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు! ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా న‌వ్య స్వామి త‌న అభిమానుల‌ని ఉద్దేశించి సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. ఈ కొత్త ఏడాదిలోకి క్లీన్ మైండ్‌, హార్ట్ తో అడుగుపెడుతున్నాన‌ని చెప్పుకొచ్చింది. గ‌త ఏడాది త‌న‌కు బాగా గ‌డిచింద‌ని చెప్పిన న‌వ్య ఈ విష‌యంలో మీరు నాకు రుణ‌పడి వుంటే దాని గురించి మ‌ర్చిపోండ‌ని, అయితే మీకు నేను అన్యాయం చేశాన‌ని అనిపిస్తే అందుకు నేను మీకు క్ష‌మాప‌ణ‌లు కోరుకుంటున్నాన‌ని తెలిపింది. "అస‌లే ఈ జీవితం చాలా చిన్న‌ది.. పెండింగ్ లో వున్న కోపం, ప‌గ‌లు అద‌న‌పు ఒత్తిడిని వ‌దిలేయండి.. 2022ని ఎంజాయ్ చేయండి" అని త‌న అబిమానుల‌కు తెలిపింది.

`కామెడీ స్టార్స్`లో థ‌ర్డ్ వేవ్ క‌ల‌క‌లం!

ప్ర‌తీ ఆదివారం హాస్యప్రియుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తున్న కామెడీ షో `కామెడీస్టార్స్‌`. `స్టార్ మా`లో గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ స‌మ‌ర్పిస్తున్న ఈ షోకి శేఖ‌ర్ మాస్ట‌ర్‌, హీరోయిన్ శ్రీ‌దేవి జ‌డ్జెస్ గా వ్య‌వ‌హ‌రించేవారు కానీ సీజ‌న్ మారింది. శ్రీ‌దేవి స్థానంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌డ్జ్ గా వ‌చ్చేశారు. అదే స‌మ‌యంలో ఈ షోలోకి అదిరే అభి అండ్ టీమ్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. Also read: సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్! ఈ ఆదివారం అదిరే అభి టీమ్ హంగామా చేయ‌బోతున్నారు. ఈ టీమ్ ప్ర‌త్యేకంగా చేసిన స్కిట్ న‌వ్వులు పూయించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని రిలీజ్ చేశారు. `సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్ వేర్‌` అనే కాన్సెప్ట్ తో ఈ ఆదివారం అదిరే అభి టీమ్ చేసే హంగామా ఓ రేంజ్ లో వుండ‌బోతోంది. సౌత్ ఆఫ్రికా నుంచి వ‌చ్చిన సాఫ్ట్ వేర్ హంగామాతో అదిరే అభి టీమ్ న‌వ్వులు పూయించ‌బోతోంది. ఇదే సంద‌ర్భంగా సౌత్ ఆఫ్రికాలో థ‌ర్డ్ వేవ్ అంటూ వీళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. Also read: వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌ ఇంత‌కీ థ‌ర్డ్ వేవ్ సృష్టించిన క‌ల‌క‌లం ఏంటీ? వైర‌స్ రాకుండా సౌత్ ఆఫ్రికా సాఫ్ట్ వేర్‌కి అదిరే అభి క్రియేట్ చేసిన డ్రెస్ ఏంటీ? .. అది వైర‌స్ నుంచి అత‌న్ని ఎలా కాపాడింది? .. ఈ క్ర‌మంలో అదిరే అభి టీమ్ చేసిన ర‌చ్చ ఏంటీ అన్న‌ది చూడాలంటే ఈ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న కామెడీ స్టార్స్ చూడాల్సిందే. ప్రోమో చివర్లో హ‌రిపై యాద‌మ్మ రాజు వేసిన పంచ్ న‌వ్వులు పూయిస్తోంది. ఈ షోకి నాగ‌బాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. శ్రీ‌ముఖి హోస్ట్ గా ఆక‌ట్టుకుంటోంది.

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కి యానీ ఆన్స‌ర్ అదిరింది

బిగ్‌బాస్ సీజ‌న్ 5 షో ముగిసినా దాని వ‌ల్ల కంటెస్టెంట్ ల చుట్టూ ఏర్ప‌డిన వివాదాలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఇటీవ‌ల ష‌న్ను, దీప్తిలు బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం... సిరి వారి బ్రేక‌ప్ కి నేను కార‌ణం కాదంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే బిగ్‌బాస్ హౌస్ లో త‌నదైన స్టైల్లో డ్యాన్యుల‌తో ఇత‌ర కంటెస్టెంట్ ల‌పై విరుచుకుప‌డిన యానీ మాస్ట‌ర్ తాజాగా వార్త‌ల్లో నిలిచింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ని ట్రోల్ చేస్తున్న వారికి అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో స‌న్నీ, మాన‌స్‌, కాజ‌ల్ ల‌తో యానీ మాస్ట‌ర్ గొడ‌వ‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కాజ‌ల్ తో యానీ ప్ర‌తీ సారి ఏదో ఒక విధంగా గొడ‌వ‌కు దిగి నాగిన్ అంటూ ఎద్దేవా చేయ‌డం, అరుపులు కేక‌ల‌తో త‌న‌పైకి వెళ్ల‌డం తెలిసిందే. హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక ఇవ‌న్నీ వ‌దిలేసిన కంటెస్టెంట్ లు వీకెండ్ స‌మ‌యాల్లో క‌లిసి పార్టీలు చేసుకుంటున్నారు. కానీ కాజ‌ల్‌, స‌న్నీ మాత్రం పెద్ద‌గా ఏ పార్టీల్లో క‌నిపించ‌డం లేదు. ఇక యానీ మాస్ట‌ర్ మాత్రం పార్టీల్లో నే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ య‌మ యాక్టీవ్ గా వుంటోంది. Also read: వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌ అయితే యానీ మాస్ట‌ర్ ని ఫాలో అవుతున్న ఓ నెటిజ‌న్ మీకు స‌న్నీ, మాన‌స్‌, కాజ‌ల్ గ్రూప్ అంటే ఎందుకంత ద్వేష‌మ‌ని, వారితో మీరు క‌లిస్తే చూడాల‌ని వుంద‌ని అడిగాడు. ఈ ప్ర‌శ్న‌కు స్ట‌న్నింగ్ రిప్లై ఇచ్చింది యానీ మాస్ట‌ర్. `నాకు ఎవ్వ‌రి మీద ద్వేషం లేదు. జీవితం చాలా చిన్న‌ది.. వాళ్లు మంచి స్నేహితులు. క‌ష్టాల్లో ఒక‌రికొక‌రు తోడుగా వున్నారు. నాకూ వాళ్ల‌తో క‌ల‌వాల‌ని వుంది కానీ కాస్త స‌మ‌యం ప‌డుతుంది. నాకు అంద‌రితో క‌ల‌వాల‌ని వుంది. కానీ అంద‌రూ బిజీగా వున్నారు అందుకే క‌ల‌వ‌లేక‌పోతున్నాం` అని చెప్పుకొచ్చింది.   

య‌ష్‌, వేద మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణం?

  బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఓ పాప‌ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ బుధ‌వారం స‌రికొత్త మ‌లుపు తీసుకోబోతోంది. వేద‌ని మచ్చిక చేసుకొని ఖుషీని ద‌క్కించుకోవాల‌ని అటు మాళ‌విక‌, ఇటు య‌కశోధ‌ర్ త‌ల్లి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడతారు. Also read: వేద‌..య‌ష్ కి అండ‌గా నిలుస్తుందా? ఆ ప్ర‌య‌త్నంలో య‌శోధ‌ర్ త‌ల్లి మాలిని అడ్డంగా వేద త‌ల్లికి దొరికిపోతుంది. క‌ట్ చేస్తే బుధ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. ఖుషీ కోసం వేద మ‌ధ‌న‌ప‌డుతున్న తీరు, య‌ష్ ని మార్చాల‌ని చూపిస్తున్న కేర్ ని గ‌మ‌నించిన య‌ష్ తండ్రి, ఖుషీపై వేద చూపిస్తున్న ప్రేమ‌ని గ‌మ‌నించిన ఆమె తండ్రి ... ఇద్ద‌రూ క‌లిసి వేద‌, య‌ష్ ల‌కు వివాహం చేస్తే బాగుంటుంద‌ని భావిస్తారు. ఇదే విష‌యాన్ని ఇరు కుటుంబాల వాళ్ల‌కు చెప్పాల‌ని స్వీట్ లు పంచేస్తారు. Also read: వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌ ఇదే విష‌యాన్నివేద‌కు చెబితే త‌న డిక్ష‌న‌రీలోనే పెళ్లి అనే ప‌దం లేద‌ని చెబుతుంది. య‌ష్ కూడా త‌న‌కు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదంటాడు. క‌ట్ చేస్తే వేద‌, య‌ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు.. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రుగుతుంది... ఇద్ద‌రూ ఆఫీస్ ల‌కి వెళ్లిపోతారు. అయితే య‌ష్ ఫాద‌ర్ పెళ్లి ప్ర‌పోజ‌ల్ తీసుకొచ్చాడ‌ని వేద‌కు తెలుస్తుంది. ఇదంతా య‌ష్ కి తెలిసే జ‌రిగింద‌ని వేద ఆగ్ర‌హిస్తుంది. ఆవేశంతో ర‌గిలిపోతూ య‌ష్ ని నిల‌దీస్తుంది. ఈ గొడ‌వ ఈ ఇద్ద‌రి మ‌ధ్య దూరాన్ని పెంచిందా? .. లేక ద‌గ్గ‌ర చేసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

దీప‌కు నిజం చెప్పేసిన కార్తీక్! 

  బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ ల‌తో సాగుతోంది. సిటీ వ‌దిలేసిన దీప కుటుంబం తాటికొండ గ్రామంలో త‌ల‌దాచుకుంటుంటుంది. ఇక్క‌డే వారికి రుద్రాణి రూపంలో మ‌రో ప్ర‌మాదం వెంటాడుతూ వేధిస్తూ వుంటుంది. దీప‌, కార్తీక్ ల‌ని టార్గెట్ చేసిన రుద్రాణి త‌న‌ని కాద‌ని, త‌న‌పై పోలీస్ కేసు పెట్టిన శ్రీ‌వ‌ల్లి, కోటేషుల‌ని హ‌త్య చేయిస్తుంది. Also read: సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు! అప్ప‌టి నుంచి కార్తీక్ .. రుద్రాణి గురించి భ‌య‌ప‌డుతూ వుంటాడు. దీప ఇంటికి రాక‌పోవ‌డంతో ఏమై వుంటుందా? అని ఆలోచిస్తూ రుద్రాణి అన్న మాట‌ల్ని గుర్తు చేసుకుంటుంటాడు. ఇదే స‌మ‌యంలో బాబుకి జ్వ‌రం వ‌స్తుంది. ఆల‌స్యంగా గ‌మ‌నించిన కార్తీక్ ఏం చేయాలో తెలియ‌క పిల్లాడి ఒళ్లు కాలిపోతుండ‌టంతో త‌డి గుడ్డ‌తో తుడుస్తుంటాడు. ఈ లోగా దీప వ‌చ్చేస్తుంది. రాగానే "ఏంటీ దీపా ఇంత ఆల‌స్య‌మా.. ఎంత కంగారు ప‌డ్డానో తెలుసా?" అంటూ నిల‌దీస్తాడు కార్తీక్‌. Also read: కార్తీక్ ని టెన్ష‌న్ పెడుతున్న రుద్రాణి.. దీప ఏం చేసింది? కార్తీక్ కంగారు గ‌మ‌నించిన దీప .. "ఏంటంట‌డీ రుద్రాణి మ‌ళ్లీ ఏమైనా అందా?" అని అడుగుతుంది. దీంతో అస‌లు విష‌యం చెప్పేస్తాడు కార్తీక్‌. త‌న‌ని రుద్రాణి ఏవిధంగా బెదిరించిందో చెప్పేస్తాడు. ఇంత‌లో హిమ‌, రౌడీ అమ్మా అంటూ వ‌చ్చేస్తారు. రుద్రాణి త‌మ‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు, అన్నం తిన‌మ‌ని బ‌ల‌వంతం చేసింద‌ని చెబుతారు. క‌ట్ చేస్తే.. సౌంద‌ర్య .. ఆదిత్య‌తో మోనిత గురించి చెబుతుంటుంది.. "మ‌మ్మీ మ‌నం మోనిత గురించి అవ‌స‌రానికి మించి భ‌య‌ప‌డుతున్నాం. త‌న గురించి ఆలోచించ‌డ‌మే మానేద్దాం" అంటాడు. క‌ట్ చేస్తే బ‌స్తీలో మోనిత‌కు వార‌ణాసి చుక్క‌లు చూపిస్తుంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది తెలియాలంటే ఖ‌చ్చితంగా చూడాల్సిందే. 

సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్!

  జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై ఆక‌ట్టుకున్న జోడీ సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్. బుల్లితెర‌పై ఈ జంట ఏ స్థాయిలో పాపుల‌ర్ అయ్యారో అంద‌రికి తెలిసిందే. సెల‌బ్రిటీల స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకుని బుల్లితెర‌పై హాట్ ఫేవ‌రేట్ గా మారిపోయారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి 'ఢీ', 'జ‌బ‌ర్ద‌స్త్‌', 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' వంటి షోల్లో చేసే హంగామా మామూలుగా వుండ‌దు. వీళ్లున్నారంటే ఆ షో సూప‌ర్ హిట్టే. ఇదే ఈ జంట ప్ర‌త్యేక‌త‌. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో స‌హ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ష్మీ గౌత‌మ్‌.. సుడిగాలి సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  "నేను లేన‌ప్పుడు చేసింది చాలు... నీ హ‌ద్దుల్లో మ‌ర్యాద‌గా వుండు" అంటూ సుధీర్‌కు ర‌ష్మీ వార్నింగ్ ఇవ్వ‌డంతో అక్క‌డే వున్న హైప‌ర్ ఆది షాక్ కు గుర‌య్యాడు. అయితే సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ మ‌ధ్య ఈ స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏంటీ?.. ఎందుకు సుధీర్‌కి వార్నింగ్ ఇచ్చింది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ‌ధ్య జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ నుంచి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ త‌ప్పుకున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌లకు త‌గ్గ‌ట్టే ర‌ష్మీ, సుడిగాలి సుధీర్ గ‌త కొన్ని ఎపిసోడ్ లుగా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ లో క‌నిపించ‌లేదు. దీంతో వారి ఫ్యాన్స్ కొంత హ‌ర్ట్ అయ్యార‌ట‌. నెట్టింట ఇదే విష‌యాన్ని కొంత మంది కామెంట్ ల రూపంలో తెలియ‌జేశారు కూడా. సుధీర్‌, ర‌ష్మీ త‌మ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా రెమ్యున‌రేష‌న్ లు పెంచాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం వ‌ల్లే జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు వీరిని లైట్ తీసుకున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌చారంలో నిజం లేద‌ని నిరూపిస్తూ సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మ‌ళ్లీ హంగామా చేయ‌డం మొద‌లుపెట్టారు. Also Read: లైవ్ లో ఏడ్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ హార్ట్ బ్రేక్! ఈ సంద‌ర్భంగా `ఉప్పెన`లోని `జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు..` అంటూ సాగే పాట‌కు ర‌ష్మీ, సుధీర్ హంగామా చేశారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య చిన్న సంభాష‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగానే ర‌ష్మీ.. సుడిగాలి సుధీర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఉత్త‌దే అని కొట్టి పారేశారు. అంతే కాకుండా ఈ జోడీని `ఢీ14`కి తీసుకురావాల్సిందే అంటూ నిర్వాహ‌కుల‌కు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 

మాన‌స్ హౌస్ లో చెప్పిందే చేశాడుగా!

బిగ్‌బాస్ సీజ‌న్ 5తో మాన‌స్ కు మంచి పేరొచ్చింది. మిగ‌తా కంటెస్టెంట్ ల‌కు పూర్తి భిన్నంగా కామ్ అండ్ సెటిల్డ్ .. మెచ్చూర్డ్ గా వ్య‌వ‌హ‌రించి మాన‌స్ అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు. టైటిల్ గెల‌వ‌లేక‌పోయినా టాప్ 5లో నిలిచి త‌న స‌త్తా చాటాడు. ఇక ప్రియాంక విష‌యంలో అత‌నిపై కొంత నెగ‌టివిటీ స్ప్రెడ్ అయింది. అయితే త‌న‌ని నొప్పించినా ఆమెని మెప్పించిన తీరు.. సున్నితంగానే ప్రియాంక‌ని హెచ్చ‌రించిన తీరు వీక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఇక హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన వారికి క్రేజ్ వుంటుంది కానీ దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటేనే వారి కెరీర్ ముందుకు సాగుతుంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే కొంతమంది స‌క్సెస్ అయితే మ‌రి కొంతమంది ఫెయిల్ అయిపోయారు. తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన కంటెస్టెంట్ ల‌లో అయితే కొంతమంది ఇప్ప‌టికే సినిమాల ఛాన్స్ లు కొట్టేశారు. ఇంకొంత‌ మంది ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రి కొంతమంది ఏది చేస్తే బాగుంటుంద‌ని ఇంకా ఆలోచిస్తూనే వున్నారు. ఇదిలా వుంటే త‌ను హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లాక ఏం చేయ‌బోతున్నానో మాన‌స్ ముందే చెప్పేసిన విష‌యం తెలిసిందే. తాను ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని స్టార్ట్ చేస్తాన‌ని, కొత్త వారికి అవ‌కాశాలు ఇస్తూ కొత్త త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుడ‌తాన‌ని చెప్పాడు. చెప్పిన ప్ర‌కార‌మే సినిమా ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని మాన‌స్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. 

ష‌న్ను, దీప్తి ఇలా.. సిరి, శ్రీ‌హాన్ అలా..

  బిగ్‌ బాస్ సీజ‌న్ 5లో సిరి హ‌న్మంత్‌, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. జెస్సీ హెల్త్ కార‌ణాల వ‌ల్ల హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లిపోవ‌డంతో సిరి, ష‌న్నుల ఎపిసోడ్ ప‌రాకాష్ట‌కు చేరింది. ఊ అంటే హ‌గ్గులు.. ఆ అంటే హ‌గ్గులు.. ముద్దులు.. ఒక ద‌శ‌లో వీరి హ‌గ్గులు చూడ‌లేక జ‌నాల‌కే వెగ‌టు పుట్టేసింది. అంతలా వీరి హ‌గ్గుల పురాణం న‌డిచింది. అయితే అదే ఇప్పుడు ష‌న్ను పాలిట విల‌న్ గా మారి త‌న నుంచి దీప్తి విడిపోయేలా చేసింది. ఇటీవ‌ల దీప్తి త‌ను ష‌న్నుతో విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చిన విష‌యం తెలిసిందే. Also read: వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌ తాజాగా లైవ్ లో కొచ్చిన దీప్తి త‌న‌ని ష‌న్ను గురించి అడిగే స‌రికి ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిపోయింది. భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక లైవ్ లో నుంచి ఏడుస్తూనే వెళ్లిపోయింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన వారంతా సిరిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సిరి హౌస్ లో త‌న‌ని తాను కాపాడుకోవ‌డం కోస‌మే ష‌న్నుతో హ‌గ్గుల డ్రామా ఆడింద‌ని, ఇప్ప‌డు అదే ష‌న్ను, దీప్తిల బ్రేక‌ప్ కు కార‌ణంగా మారింద‌ని మండిప‌డుతున్నారు. Also read: సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు! ఈ కామెంట్ ల నేప‌థ్యంలో సిరికి ఆమె ప్రియుడు శ్రీ‌హాన్ కూడా బ్రేక‌ప్ చెప్పేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అనూహ్యంగా శ్రీ‌హాన్ మాత్రం సిరికి స‌పోర్ట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా ఆమెకు బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇన్ స్టా స్టోరీస్ లో.. సిరికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తూ శ్రీ‌హాన్‌ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశాడు. ఈ ఏడాది నీకు అన్నీ శుభాలే క‌ల‌గాలంటూ శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. అయితే శ్రీ‌హాన్ పోస్ట్ పై సిరి ఏమాత్రం స్పందించ‌కపోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక వైపు ష‌న్ను, దీప్తి బ్రేక‌ప్ తో విడిపోతే సిరికి శ్రీ‌హాన్ బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డం.. దానికి సిరి నుంచి ఎలాంటి రిప్లై రాక‌పోవ‌డం పలు అనుమానాల‌కి తావిస్తోంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వేద‌..య‌ష్ కి అండ‌గా నిలుస్తుందా?

  బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా బెంగ‌ళూరు ప‌ద్మ‌, ప్ర‌ణ‌య్ హ‌నుమాండ్ల‌, ఆనంద్‌, శ్రీ‌ధ‌ర్ జీడిగుంట కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బేబీ మిన్ను, నైనిక చుట్టూ తిరిగే క‌థ‌గా రూపొందుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. కోర్టులో య‌శోధ‌ర్‌, మాళ‌విక‌కు విడాకులు మంజూర‌వుతాయి. అయితే ఈ క్ర‌మంలో వారి పాప ఖుషీ ఎవ‌రి వ‌ద్ద వుండాల‌న్న‌ది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారుతుంది. ఈ నేప‌థ్యంలో పాప‌నే తేల్చుకోమందామ‌ని నిర్ణ‌యించిన న్యాయ‌మూర్తి ఖుషీని తీసుకుర‌మ్మంటుంది. నువ్వు ఎవ‌రి ద‌గ్గ‌ర వుండాల‌నుకుంటున్నావు, నీకు ఎవ‌రు కావాల‌ని అడిగితే వేద కావాల‌ని, తాను ఆమె ద‌గ్గ‌రే వుంటాన‌ని చెబుతుంది. అప్ప‌టి నుంచి వేద‌ని బుట్ట‌లో వేసుకోవాల‌ని మాళ‌విక, ఆమె ప్రియుడు అభిమ‌న్యు ప్లాన్ లు వేస్తుంటారు. Also Read: ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం: య‌శోధ‌ర్‌కు వేద షాకిస్తుందా? ఈ విష‌యం తెలిసి య‌ష్ త‌ల్లి మాలిని త‌న కూతురితో క‌లిసి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడుతుంది. వేద‌ని త‌మ వైపు తిప్పుకుని ఖుషీని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం మొద‌లుపెడుతుంది. ఈ క్ర‌మంలో క‌డుపునొప్పి నాట‌కం ఆడుతుంది. ఆ నాట‌కాన్ని వేద త‌ల్లి ప‌సిగ‌ట్టడం.. అదే స‌మ‌యానికి వేద ఇంటికి మాళ‌విక రావ‌డంతో మాలిని పెద్ద గొడ‌వ చేస్తుంది.. ఈ క్ర‌మంలో మాలిని క‌త్తితో మాళ‌విక‌పై దాడికి దిగుతుంది.. ఈ పెనుగులాట‌లో వేద‌కు గాయ‌మ‌వుతుంది. ఇది గ‌మ‌నించిన య‌ష్ త‌ల్లిని మంద‌లించి అక్క‌డి నుంచి వెళ్లిపొమ్మంటాడు. Also Read: య‌ష్‌, మాళ‌విక‌ల‌కు షాకిచ్చిన ఖుషీ ఆ త‌రువాత ఏం జ‌రిగింది? మాలిని, అభిమ‌న్యుల ప‌న్నాగాన్ని వేద ప‌సిగ‌డుతుందా?.. కేవ‌లం ఖుషీని, మాళ‌విక‌ని అడ్డుపెట్టుకుని య‌శోధ‌ర్ ని దెబ్బ‌తీయాల‌ని ప్లాన్ వేస్తున్న అభిమ‌న్యు.. ఎలాంటి ప్లాన్ వేశాడు?.. ఆ ప్లానేంటీ?.. ఈ క్ర‌మంలో వేద .. య‌ష్ కి అండ‌గా నిలిచిందా? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

కార్తీక్ ని టెన్ష‌న్ పెడుతున్న రుద్రాణి.. దీప ఏం చేసింది?

`కార్తీక దీపం` బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అత్యంత ఇష్ట‌మైన సీరియ‌ల్ గా విశేష ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ సీరియ‌ల్ ద్వారా న‌టీన‌టులు నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్‌, శోభాశెట్టి సెల‌బ్రిటీలుగా మారిపోయారు. అంత‌లా ఈ సీరియ‌ల్ పాపుల‌ర్ అయిపోయింది. టీఆర్పీ లోనూ అగ్ర భాగాన నిలుస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగుతోంది. ప్ర‌తీ రోజు ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న `కార్తీక దీపం` ఈ మంగ‌ళ‌వారం కూడా స‌రికొత్త ట్విస్ట్ ల‌తో ఆక‌ట్టుకోబోతోంది.Also Read: రుద్రాణికి చుక్క‌లు చూపించిన మాధురి! రుద్రాణి అప్పు తీరుస్తామ‌ని మాటిచ్చిన‌ కార్తీక్‌, దీప అందు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తారు. దీప పిండి వంట‌లు చేస్తూ మ‌ళ్లీ వంట‌ల‌క్క అవ‌తారం ఎత్తేస్తుంది. ఇది గ‌మ‌నించిన రుద్రాణి... 'పిండి వంట‌లు చేస్తుందా..? వాటితో వ‌చ్చిన డ‌బ్బుల‌తో నా అప్పు తీసుస్తుందా?' అని ఆగ్ర‌హంతో ఊగిపోతూ వుంటుంది. ఎలాగైనా దీప‌ని ఆపాల‌ని, ఈ విష‌యంలో కార్తీక్ ని రెచ్చ‌గొడితే ఆ ప‌ని సులువు అవుతుంద‌ని ప్లాన్ చేస్తుంది. వెంట‌నే కార్తీక్ ఇంటికి వెళ్లి అత‌ను బాబుకు పాలు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టంతో అత‌న్ని భ‌య‌పెట్ట‌బోతుంది. Also Read: రుద్రాణి కుట్ర‌.. ఏం జ‌ర‌గ‌బోతోంది? 'ఇంట్లో రంగ‌రాజుని బాగానే ఆడిస్తున్నావ్ కానీ బ‌య‌టికి వెళ్లిన నీ వాళ్ల ప‌రిస్థితి ఏంటీ?.. స్కూల్ కి వెళ్లిన నీ పిల్ల‌ల ప‌రిస్థితి ఏంటీ?' అంటూ కార్తిక్ ని ఎమోష‌నల్ బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. కార్తీక్ సీరియ‌స్ కావ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిన రుద్రాణి స్కూల్ లో వున్న కార్తీక్ పిల్ల‌ల వ‌ద్ద‌కు చేరుతుంది. అన్నం తిన‌మంటూ వారిని ఇబ్బంది పెడుతుంది. విష‌యం గ్ర‌హించిన కార్తిక్ వెంట‌నే అక్క‌డికి చేరుకుని రుద్రాణిని ఎదిరిస్తాడు. పిల్ల‌ల‌ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. దీప ఇంటికి రాక‌పోవ‌డంతో భ‌య‌ప‌డుతుంటాడు. కార్తీక్‌ని భ‌య‌పెడుతున్న రుద్రాణికి దీప ఎలాంటి గుణ‌పాఠం చెప్పింది? .. రుద్రాణి అప్పు తీర్చేసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

లైవ్ లో ఏడ్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ హార్ట్ బ్రేక్!

ఐదేళ్ల తమ ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జ‌స్వంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరి దారులు వాళ్లు చూసుకుంటామని.. ఎవరి కెరీర్‌పై వాళ్లు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తాము విడిపోతున్నట్లు ఇటీవల దీప్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ పోస్ట్ పెట్టాడు. నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు దీప్తికి ఉంద‌ని చెప్పాడు. ఆమె చాలా క‌ష్టాలు ప‌డింద‌నీ, ఆమె సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నానని తెలిపాడు. దీప్తి, షణ్ముఖ్ బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి.. బ్రేకప్‌ గురించి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బ్రేకప్‌ గురించి ఓ నెటిజన్‌ దీప్తిని ప్రశ్నించగా.. జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని లేదని.. కెరీర్‌పరంగా ఏదైనా సాధించాలనుకుంటున్నానని.. ఇప్పటి వరకూ నా గురించి నేను ఆలోచించుకోలేదని.. అలాగే నా కెరీర్‌ని కూడా పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవాలనుకుంటున్నానని.. కెరీర్‌లో రాణించాలనుకుంటున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ దీప్తి  కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.  మరోవైపు షణ్ముఖ్ సైతం తాజాగా ఇన్‌స్టాలో డల్ గా ఉన్న తన ఫొటోని షేర్ చేసి.. హృదయం ముక్కలైన ఎమోజీలను ఎటాచ్ చేయడం గమనార్హం.