బిగ్ బాస్ 5 విన్న‌ర్ స‌న్నీ! రూ. 50 ల‌క్ష‌లు గెలిచాడు!!

  బిగ్ బాస్ తెలుగు ఐదో సీజ‌న్ విజేత‌గా వీజే స‌న్నీ నిలిచాడు. ఎక్కువ‌మంది విశ్లేష‌కులు ఊహించిన‌ట్లుగానే, సోష‌ల్ మీడియా ట్రెండ్స్ ప్ర‌కారంగానే వీజే స‌న్నీ త‌న నెవ‌ర్ గివ‌ప్ యాటిట్యూడ్‌తో అత్య‌ధిక వీక్ష‌కుల అభిమానాన్నీ, వారి ఓట్ల‌నూ గెలుచుకొని బిగ్ బాస్ తెలుగు 5 ట్రోఫీని అందుకున్నాడు. వాటితో పాటు రూ. 50 ల‌క్ష‌ల న‌గ‌దు, షాద్‌న‌గ‌ర్‌లోని సువ‌ర్ణ‌భూమి వెంచ‌ర్‌లో రూ. 25 ల‌క్ష‌ల విలువ క‌లిగిన ఫ్లాట్‌ను, అపాచీ మోటార్ బైక్‌ను గెలుచుకున్నాడు. అత‌నికి చివ‌రిదాకా గ‌ట్టిపోటీ ఇచ్చిన ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ర‌న్న‌ర్‌గా నిలిచాడు. యూట్యూబ‌ర్‌గా ఉన్న క్రేజే అత‌డిని ఇక్క‌డిదాకా తీసుకువ‌చ్చింది. Also read: ఎలిమినేట్ అయిన సిరి.. హౌస్ బ‌య‌ట‌కు తెచ్చిన ర‌ష్మిక‌-దేవి! మొద‌ట ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌నీ, వారిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల్సిందిగా జాతిర‌త్నాలు హీరోయిన్, బంగార్రాజులో పార్టీ సాంగ్‌లో డాన్స్ చేసిన ఫ‌రియా అబ్దుల్లాను పంపారు హోస్ట్ నాగార్జున‌. ఆమె హౌస్‌లోకి వెళ్లి, ఇద్ద‌రు ఫైన‌లిస్టుల‌తో స‌ర‌దాగా డాన్సులు వేసింది. స‌న్నీ, ష‌ణ్ణుల ముందు చెరో బాక్స్ పెట్టి, ఆ బాక్స్‌లో చేతులు ముంచి, పైకి తియ్యాల‌నీ, ఎవ‌రికి రెడ్ క‌ల‌ర్ వ‌స్తే వారికి ఫ‌రియా చేతిలోని రెడ్ హార్ట్‌ను ఇచ్చి, హౌస్ బ‌య‌ట‌కు తీసుకురావాల‌నీ చెప్పారు నాగ్‌. ఫైన‌లిస్టులు అలాగే చేశారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇద్ద‌రి చేతుల‌కూ ఆ రెండు రంగుల్లో ఏ ఒక్క‌టీ కాకుండా, బ్లూ క‌ల‌ర్ అంటుకుంది. దాంతో ఫ‌రియాను బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌మ‌న్నారు నాగ్‌. Also read: నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం? ఆ త‌ర్వాత నాగ్ స్వ‌యంగా హౌస్‌లోకి వెళ్లి, లివింగ్ రూమ్‌లో క‌లియ‌తిరిగి, అక్క‌డ సోఫాలో కూర్చున్నారు. ష‌ణ్ణు, స‌న్నీల‌ను చెరో ప‌క్క‌న కూర్చోపెట్టుకొని క‌బుర్లు చెప్పారు. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రినీ ప‌ట్టుకొని బయ‌ట‌కు తీసుకువ‌చ్చారు. స్టేజ్ మీద అంద‌రూ ఊపిరి బిగ‌ప‌ట్టుకొని ఉత్కంఠ‌తో ఎదురుచూస్తుండ‌గా, స‌న్నీని విన్న‌ర్‌గా, ష‌ణ్ణును ర‌న్న‌ర్‌గా ప్ర‌క‌టించారు నాగ్‌. ఆ మ‌రుక్ష‌ణం స‌న్నీ ఆనందం త‌ట్టుకోలేక భావోద్వేగానికి గురై స్టేజిమీద మోకాళ్ల‌మీద కూర్చున్నాడు. ఆ త‌ర్వాత ఎగిరి గంతులేశాడు. కోటును తీసేసి ఎదురుగా కూర్చున్న తోటి కంటెస్టెంట్ల వైపు విసిరేశాడు. నాగ్‌ను ముద్దు పెట్టేసుకున్నాడు. ష‌ణ్ణు త‌న‌లోని ఎమోష‌న్స్‌ను బ‌య‌ట‌పెట్ట‌కుండా గంభీరంగా క‌నిపించాడు. స‌న్నీ వాళ్ల‌మ్మ క‌ళావ‌తిని స్టేజి మీద‌కు ఆహ్వానించారు. ఆమె రాగానే స‌న్నీ ఆమెను బుగ్గ‌మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చేతికి ట్రోఫీ అందించాడు.

హౌస్ నుంచి శ్రీ‌రామ‌చంద్ర కూడా వ‌చ్చేశాడు! క‌న్నీరు పెట్టిన అమ్మ‌!!

  ఐదుగురు ఫైన‌లిస్టుల్లో మొద‌ట సిరి, త‌ర్వాత మాన‌స్‌ ఎలిమినేట్ అయ్యాక మిగిలిన ముగ్గురిలో ఎవ‌రు ముందుగా ఎలిమినేట్ అవుతారా అని వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఎక్స్ కంటెస్టెంట్స్‌తో పాటు వీక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురుచూస్తుండ‌గా, శ్రీ‌రామ‌చంద్ర ఎలిమినేష‌న్‌కు గురై, హౌస్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అత‌డిని హౌస్ నుంచి హీరో నాగ‌చైత‌న్య‌ తీసుకువ‌చ్చాడు. ఆడియెన్స్ పోల్ ప్ర‌కారం టాప్ 3 ఫైన‌లిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒక‌రిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చే బాధ్య‌త‌ను చైతూకు అప్ప‌గించారు హోస్ట్ నాగార్జున‌. Also read: నా దునియాల నేను హీరోనే: స‌న్నీ హౌస్‌లోకి త‌న‌తో ఒక గోల్డ్ బాక్స్‌ను కూడా త‌న‌తో తీసుకువెళ్లాడు చైతూ. ముగ్గురిలో ఎవ‌రైనా ఆ గోల్డ్ బాక్స్‌ను తీసుకొని హౌస్ నుంచి త‌న‌తో పాటు బ‌య‌ట‌కు రావ‌చ్చ‌నీ, అందులో అప్పుడు ఎలిమినేష‌న్‌కు గుర‌య్యే వారికి ఇచ్చే డ‌బ్బు కంటే మూడు రెట్లు ఎక్కువ అమౌంట్ అందులో ఉంద‌నీ, దానితో అదృష్ట‌వంతుడు కావ‌చ్చ‌నీ అత‌ను ఆఫ‌ర్ చేశాడు. కానీ ఆ ముగ్గురిలో ఎవ‌రూ ఆ బాక్స్‌ను అందుకోవ‌డానికి ముందుకు రాలేదు. వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని కూడా నాగ్ అడిగాడు. వారు కూడా బాక్స్ తీసుకోవ‌డం ఇష్టంలేద‌నీ, చివ‌రిదాకా పోటీలో త‌మ పిల్ల‌లు నిల‌వాల‌నుకుంటున్నామ‌నీ చెప్పారు. Also read: నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం? అప్పుడు నాగ్ వారికి ఓ టాస్క్ ఇచ్చాడు. త‌న ద‌గ్గ‌ర స్టేజ్ మీదే మూడు బిందెల‌ను ఏర్పాటుచేసి, వాటిలో ఒక స్పిరిట్ లాంటిది పోశాడు. ఆ బిందెల్లోంచి పొగ‌లు వ‌స్తుండ‌గా, ఆ మూడింటిలో రెడ్ క‌ల‌ర్ వ‌చ్చిన‌వాళ్లు ఎలిమినేట్ అయిన‌ట్ల‌ని నాగ్ చెప్పాడు. స‌న్నీ, ష‌ణ్ణు బిందెల ద‌గ్గ‌ర గ్రీన్ లైట్‌, శ్రీ‌రామ‌చంద్ర బిందె ద‌గ్గ‌ర రెడ్ లైట్ వెలిగింది. దాంతో అత‌ను ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ అనౌన్స్ చేశారు. శ్రీ‌రామచంద్ర‌ను తీసుకొని చైతూ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అలా టాప్ 3 ఫైన‌లిస్టుగా బిగ్ బాస్ హౌస్‌లో శ్రీ‌రామ‌చంద్ర జ‌ర్నీ ముగిసింది. బ‌య‌ట‌కు వ‌చ్చాక, నాగ్‌ను క‌లిసిన అత‌ను పెద‌వే ప‌లికిన మాట‌ల్లోన తియ్య‌ని మాటే అమ్మ పాట ఆల‌పించాడు. అత‌డు పాడుతున్నంత సేపూ వాళ్ల‌మ్మ ఉబికివ‌స్తున్న క‌న్నీటిని తుడుచుకుంటూనే ఉంది.

బిగ్ బాస్ నుంచి మాన‌స్ ఔట్‌! అత‌ని దృష్టిలో స‌న్నీ విన్న‌ర్‌!!

  ఐదుగురు ఫైన‌లిస్టుల్లో మొద‌ట సిరి ఎలిమినేట్ అయ్యాక మిగిలిన న‌లుగురిలో ఎవ‌రు ముందుగా బ‌య‌ట‌కు వెళ్తారా అని వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఎక్స్ కంటెస్టెంట్స్‌తో పాటు వీక్ష‌కులు ఆత్రుత‌గా ఎదురుచూస్తుండ‌గా, మాన‌స్ ఎలిమినేట్ అయ్యి, బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అత‌డిని హౌస్ నుంచి శ్యామ్ సింగ రాయ్ హీరో హీరోయిన్లు.. నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి తీసుకువ‌చ్చారు. ఆడియెన్స్ పోల్ ప్ర‌కారం టాప్ 4 ఫైన‌లిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒక‌రిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చే బాధ్య‌త‌ను వారికి అప్ప‌గించారు హోస్ట్ నాగార్జున‌. Also read: శ్రీ‌రామ‌చంద్ర‌ను గెలిపించ‌మంటూ ఆటో తోలిన ర‌వి! వీడియో వైర‌ల్‌!! హౌస్‌లోకి మొద‌ట సాయిప‌ల్ల‌వి, కృతిల‌కు పంపారు నాగ్‌. ఆ ఇద్ద‌రూ వెళ్లి కంటెస్టెంట్ల‌తో మాట్లాతుండ‌గా, నాని చేతికి ఒక మ‌నీ బాక్స్ ఇచ్చి అత‌డిని కూడా హౌస్‌లోకి పంపారు. న‌లుగురిలో ఎవ‌రైనా ఆ బాక్స్‌లోని డ‌బ్బును తీసుకొని వెళ్ల‌వ‌చ్చ‌ని నాని ఆఫ‌ర్ చేశాడు. ఎలిమినేష‌న్‌కు గుర‌య్యేవారికి ఇచ్చే డ‌బ్బు కంటే అందులో ఎక్కువ ఉంటుంద‌ని కూడా చెప్పాడు. కానీ న‌లుగురిలో ఎవ‌రూ ఆ బాక్స్‌ను అందుకోవ‌డానికి ముందుకు రాలేదు.  Also read: నాగ్.. విన్న‌ర్‌గా అత‌న్నే చూడాల‌నుకుంటున్నారా? అప్పుడు నాగ్ వారికి ఓ టాస్క్ ఇచ్చాడు. నాలుగు గేట్‌ల‌ను పెట్టి వాటిని లాగ‌మ‌ని ఒక్కో కంటెస్టెంట్‌కు చెప్పారు. మొద‌ట స‌న్నీ లాగ‌గా, అత‌డు సేఫ్ అయ్యాడు. త‌ర్వాత ష‌ణ్ముఖ్ కూడా సేఫ్ అయ్యాడు. దాంతో మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర ఇద్ద‌రినీ ఒకేసారి గేట్లు లాగ‌మ‌ని చెప్పారు నాగ్‌. ఆ ఇద్ద‌రూ గేట్లు పుల్ చేయ‌గా, మాన‌స్ బొమ్మ కింద‌ప‌డిపోయింది. దాంతో అత‌ను ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ అనౌన్స్ చేశారు. అత‌న్ని తీసుకొని గెస్టులు ముగ్గురు.. సాయిప‌ల్ల‌వి, కృతి, నాని బ‌య‌ట‌కు వ‌చ్చారు. Also read: సోహైల్ ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పేశాడు ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌ని అనుకుంటున్నావ‌ని మాన‌స్‌ను నాగ్ ప్ర‌శ్నించ‌గా, అత‌ను స‌న్నీ పేరు చెప్పాడు. ఎందుక‌ని నాగ్ అడిగితే, అత‌నిలో ఆ ప‌ట్టుద‌ల‌, క‌సి ఎక్కువ‌గా ఉన్నాయ‌ని జ‌వాబిచ్చాడు మాన‌స్‌.

ఎలిమినేట్ అయిన సిరి.. హౌస్ బ‌య‌ట‌కు తెచ్చిన ర‌ష్మిక‌-దేవి!

  బిగ్ బాస్ 5వ సీజ‌న్ తుది అంకానికి వ‌చ్చింది. ఇవాళ ఐదుగురు ఫైన‌లిస్టుల్లో విజేత ఎవ‌రో తేల‌నున్నారు. అంద‌రికంటే ముందుగా ఫైన‌లిస్టుల్లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సిరి హ‌న్మంత్ ఎలిమినేట్ అయ్యింది. ఆమెను హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చిందెవ‌రో తెలుసా? యువ‌త‌రం క‌ల‌ల‌రాణి ర‌ష్మికా మంద‌న్న‌, రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్‌. ఆడియెన్స్ పోల్ ప్ర‌కారం ఫైన‌లిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒక‌రిని హౌస్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చే బాధ్య‌త‌ను ర‌ష్మిక‌, దేవికి అప్ప‌గించారు హోస్ట్ నాగార్జున‌. Also read: నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం? హౌస్‌లోకి ర‌ష్మిక‌, దేవి వెళ్ల‌గాను 'పుష్ప' మూవీలోని "సామి సామి" పాట‌ను ప్లే చేశారు. దానికి ర‌ష్మిక‌తో పాటు సిరి, మిగతా కంటెస్టెంట్లు డాన్స్ చేశారు. ఐదుగురు కంటెస్టెంట్ల‌ను ఒక‌చోట నిల‌బెట్టారు. పైనుంచి ఐదు డ్రోన్లు ఎగురుకుంటూ హౌస్‌లోకి వ‌చ్చాయి. ఒక్కో డ్రోన్‌కు ఒక్కో కంటెస్టెంట్ ఫొటో ఉంది. నాలుగు డ్రోన్లు అక్క‌డే ఉండ‌గా, సిరి ఫొటో ఉన్న డ్రోన్ హౌస్ బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. దాంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించారు.  Also read: శ్రీ‌హాన్ ని తిట్టి అడ్డంగా బుక్కైన ష‌ణ్ముఖ్ అయితే దీన్ని ముందుగానే ఊహించిన‌ట్లు సిరి ఎక్కువ ఎమోష‌న్ కాలేదు. స్పోర్టివ్‌గా తీసుకొని, తోటి కంటెస్టెంట్ల‌కు వీడ్కోలు ప‌లికి, ర‌ష్మిక‌-దేవితో పాటు బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న చిన్న‌త‌నంలోనే తండ్రి చ‌నిపోవ‌డంతో అమ్మే క‌ష్ట‌ప‌డి పెంచింద‌నీ, అయితే ఆమె బిజినెస్ చేసుకుంటూ ఉండ‌టంవల్లా ఆమెతోనూ తాను స‌న్నిహితంగా గ‌డ‌ప‌లేద‌నీ చెప్పింది సిరి. అందువ‌ల్లే ఎవ‌రైనా త‌న‌తో ప్రేమ‌గా మాట్లాడితే, వారికి స‌న్నిహిత‌మైపోతాన‌ని తెలిపింది. ఫైన‌లిస్టుల్లో ఒక‌రిని అవుతాన‌ని ముందుగా తాను ఊహించ‌లేద‌నీ, ఇక్క‌డిదాకా రావ‌డ‌మే త‌న‌కు పెద్ద అచీవ్‌మెంట్ అనీ చెప్పింది సిరి.

బిగ్ బాస్-5 లో ఊహించని ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన సిరి!

'బిగ్ బాస్ 5 తెలుగు' చివరి దశకు చేరుకుంది. టైటిల్ రేసులో సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్ చంద్ర, సిరి, మానస్ ఉన్నారు. అయితే సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్ చంద్ర ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 5 టైటిల్ గెలిచే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాజాగా టాప్ 5 లో ఉన్న సిరిని ఎలిమినేట్ చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. Also Read: నా దునియాల నేను హీరోనే: స‌న్నీ బిగ్ బాస్ 5 శుక్రవారం(ఈరోజు) ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో సిరిని ఎలిమినేట్ చేసినట్లు చూపించారు. ప్రోమోలో మొదట బిగ్ బాస్ ఐదుగురు ఇంటి సభ్యులని తమ లగేజ్ తీసుకొని గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు. ఆ తర్వాత, 'ఈ ఇంట్లో మీలోని ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుంది.. మీ అభిప్రాయం ప్రకారం ఎలిమినేట్ అయ్యే సభ్యులు ఎవరో చెప్పండి' అని బిగ్ బాస్ అడగగా.. మానస్, సన్నీ లు షణ్ముఖ్ పేరు చెప్పారు. అలాగే షణ్ముఖ్ సన్నీ పేరు చెప్పగా.. శ్రీరామ్ సిరి పేరు చెప్పాడు. అనంతరం 'ఇంటి నుండి బయటకు వెళ్తున్న సభ్యులు సిరి' అని బిగ్ బాస్ చెప్పగా.. మొదట 'నేను వెళ్ళను.. బిగ్ బాస్ మీరు జోక్ చెయ్యట్లేదు కదా' అని అడిగిన సిరి.. ఆ తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోతూ ఏడ్చేసింది. సిరి వెళ్లిపోవడంతో షణ్ముఖ్ ఏడుస్తూ కనిపించాడు. Also Read: నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం? విన్నర్ ఎవరో తెలియడానికి కేవలం 48 గంటల ముందు బిగ్ బాస్ నిజంగా సిరిని ఎలిమినేట్ చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరిని సీక్రెట్ రూమ్ లో ఉంచి.. ఎపిసోడ్ చివరిలో బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి.

నా దునియాల నేను హీరోనే: స‌న్నీ

  బిగ్‌బాస్ క‌థ క్లైమాక్స్ కి చేరింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్ ల‌లో విజేత ఎవ‌ర‌న్న‌ది ఓ ప‌క్క ఉత్కంఠ రేపుతున్నా విజేత ఎవ‌రేది ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. గ్రాండ్ ఫినాలేకు మ‌రో రెండు రోజులే వుండ‌టంతో బిగ్ బాస్ పాత టాస్కుల‌ని కంటెస్టెంట్ ల‌కి మ‌రోసారి గురువారం గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇది స‌న్నీ, సిరిల మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. స‌న్నీ ఓడిపోయావ్ అని అన‌గానే ఆ మాట విన‌డం ఇష్టంలేని సిరి స‌న్నీపై చిందులు తొక్కింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నా? అంటూ నాతో జోకులొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఐదో టాస్క్ లో తాళ్ల‌ను ఎక్కువ సేపు క‌ద‌పాల్సి వుంటుంది. ఇందులో స‌రి, స‌న్నీ, ష‌న్ను ఆడ‌గా స‌న్నీ గెలిచాడు. దీంతో ఓడిపోయావు క‌దా మ‌ళ్లీ ఆడ‌దామా అంటూ సిరిని స‌న్నీ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు. కానీ దాన్ని సీరియ‌స్ గా తీసుకున్న సిరినువ్వే ఓడిపోయావ్ .. ష‌న్ను ఒక్క‌డే క‌రెక్ట్ గా ఆడాడ‌ని రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చింది. నేను జోక్ గా అన్నాన‌ని స‌న్నీ అన‌గా ఓడిపోయావ‌న్న మాట స‌ర‌దా కాద‌ని తేల్చేసింది. మ‌జాక్ గా అన్నాన‌ని స‌న్నీ ఎంత చెప్పినా స‌ర్తిచెప్పినా సిరి ప‌ట్టించుకోలేదు. తిందాం రా అని పిలిచిన‌ప్ప‌టికీ రానంటూ మొండిగా ప్ర‌వ‌ర్తించింది. Also read:శ్రీ‌హాన్ ని తిట్టి అడ్డంగా బుక్కైన ష‌ణ్ముఖ్ ప‌క్క‌నోడు గెలిస్తే స‌హించ‌లేడంటూ ఆవేశంతో ర‌గిలిపోయింది. నాతో జోకులొద్దు అని స‌న్నీకి వార్నింగ్ ఇచ్చింది సిరి. అలా సిరి అర‌వ‌డంతో స‌హ‌నం కోల్పోయిన స‌న్నీ ఆమెని ఇమిటేట్ చేయ‌గా సిరి మ‌రింత‌గా రెచ్చిపోయింది. ప్ర‌తిసారి వ‌చ్చి ఇమిటేట్ చేయ‌డ‌మేంటి అని మండిప‌డింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా?.. తోపు అని ఫీల‌వుతున్నావా? అంటూ స‌న్నీపై ఫైర్ అయింది. ఆ త‌రువాత స‌న్నీ.. మానస్ తో మాట్లాడుతూ ఎప్పుడు ఏ గొడ‌వైనా కూడా నేనే వెళ్తాను. ఇంత ఓవ‌రాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? .. వెళ్లేముందు న‌న్ను బ్యాడ్ చేస్తే ఏమొస్తుందిరా?  నువ్వు పెద్ద హీరోవా? అంటు న‌న్ను ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు, నా దునియాల నేను హీరోనే `అని స‌న్నీ క్లారిటీ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ గొడ‌వ‌కు ఎండ్ కార్డ్ ప‌డిందా లేదా? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం రాత్రి ఎపిసోడ్ చూడాల్సిందే.   

నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం?

బిగ్‌బాస్ లో ష‌న్ను, సిరిల అరాచ‌కం ప‌రాకాష్ట‌కు చేరింది. మ‌రో రెండు రోజుల్లో సీజ‌న్ ఎండ్ అవుతున్న నేప‌థ్యంలో హౌస్ లో వీరి చేష్ట‌లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ఎంత‌లా అంటే చూసే  ఆడియ‌న్స్ కి వెగ‌టు పుట్టించేలా. గ‌త కొన్ని వ‌రాలుగా పేరెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వీళ్ల అతి చేష్ట‌ల‌కు చివాట్లు పెట్టినా `న‌వ్విపోదురుగాక మాకేటి సిగ్గు` అన్న‌ట్టుగా ష‌న్ను, సిరి వ్య‌వంహ‌రిస్తూ హౌస్ లో గ‌బ్బు లేపుతున్నారు. పేరెంట్స్ హ‌గ్గులు మితిమీరు తున్నాయ‌ని, అది మాకు న‌చ్చ‌డం లేద‌న్నా.. ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హ‌గ్ మాత్ర‌మే అంటూ నిస్సిగ్గుగా సిరిని హ‌గ్ చేసుకుంటూనే వున్నాడు ష‌న్ను. Also Read:మీకు న‌చ్చిన‌ట్లు కాకుండా వాడికి న‌చ్చిన‌ట్లు ఉండ‌నివ్వండి.. దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌! గురువారం వీరి ఎపిసోడ్ మ‌రీ ప‌రాకాష్ట‌కు చేరింది. గురువారం ఎపిసోడ్ `గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా..` అనే హుషారైన సాంగ్ తో మొద‌లైంది. ఆ వెంట‌నే సిరి - ష‌ణ్ముఖ్ లు త‌మ రెగ్యుల‌ర్ ప‌నికి తెర‌లేపారు. సోఫాలో సిరి - ష‌ణ్ముఖ్ లు కూర్చుని ఉండ‌గా ష‌ణ్ముఖ్ బిగ్ బాస్‌ని ఇమిటేట్ చేస్తూ సిరిని ఉద్దేశించి `బిగ్‌బాస్ కోరిక మేర‌కు సిరి పెళ్లాం ఇచ్చిన‌ట్టు అడ‌క్కుండానే కాఫీ ఇవ్వ‌కండి` అని అన్నాడు. పెళ్లాం అన‌గానే సిరి సిగ్గుల మొగ్గైంది. ముసి ముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ `ఏంటి సార్ మీకు అలా అనిపిస్తుందా? ప‌ఒద్దు పొద్దున్నే ఏమైంది మీకు` అని అడిగింది. ఈ దృశ్యం.. ఈ మాట‌లు చూసి బిగ్‌బాస్ వీక్ష‌కుల ఫీజులు అవుట్‌.. మ‌రీ ఇంత ప‌రాకాష్ట‌కు చేరుకోవ‌డం ఏంటి సామీ.. నాగార్జున సార్ చూస్తున్నారా? .. ఈ మాట‌లు వింటున్నారా? .. ఏంటీ అరాచ‌కం?.. ఏంటీ మా క‌ర్మ‌.. అంటూ నెటిజ‌న్స్ నెట్టింట వీరంగం మొద‌లుపెట్టారు. బిగ్‌బాస్ ఎండింగ్ కి చేరుకున్నా వీరి అరాచ‌కాల‌కి మాత్రం తెర‌ప‌డ‌టం లేదంటూ ఓ రేంజ్ లో సిరిని, ష‌న్నుని ఏకిపారేస్తున్నారు. మ‌రి దీనిపై శ‌నివారం నాగార్జున కౌంట‌ర్ ఇస్తారా? లేక ఇంకా ముందుకు వెళ్లుంటే బాగుండేది.. వైఫ్ అండ్ హజ్బెండ్ టాస్క్ ఇస్తాలే ఎంజాయ్ చేయిండి అని ఎంక‌రేజ్ చేస్తాడా? అని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.   

'ఎవరు మీలో కోటీశ్వరులు'.. మహేష్ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగా!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల బుల్లితెరపై 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాగా ఆ ఎపిసోడ్ కి 11.4 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత ఈ షోకి ఆ స్థాయిలో రేటింగ్ రాకపోయినా.. సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చినప్పుడు ఓ మాదిరి రేటింగ్ వచ్చింది. ఇక ముగింపు ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయడంతో ఈ ఎపిసోడ్ కి.. ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చిన రేంజ్ రేటింగ్ వస్తుందని భావించారంతా. కానీ అనూహ్యంగా అందులో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఈఎంకేలో మహేష్ సందడి చేసిన ఎపిసోడ్ కి కేవలం 4.9 టీఆర్పీ మాత్రమే నమోదైంది. ఇద్దరు స్టార్స్ ఉన్నప్పటికీ ఈ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగ్ రావడానికి అనేక కారణాలున్నాయి. మహేష్ ఈఎంకే షో షూట్ లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో ముందే లీక్ అయ్యాయి. దీంతో ఆ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ నిర్వాహకులు మాత్రం దసరా, దీపావళి ఇలా ఎన్నో అకేషన్స్ వచ్చినా మహేష్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయకుండా చివరి ఎపిసోడ్ కోసం హోల్డ్ చేసి ఉంచారు. దీంతో ఈ ఎపిసోడ్ పై రోజురోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఈ షో మిగతా ఎపిసోడ్స్ ప్రతివారం సోమవారం నుంచి గురువారం వరకు  ప్రసారమైతే.. మహేష్ ఎపిసోడ్ మాత్రం ఆదివారం టెలికాస్ట్ అయింది. అది కూడా ఎపిసోడ్ రేటింగ్ పై ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఓవరాల్ గా కూడా ఆశించినస్థాయిలో రేటింగ్స్ ని రాబట్టలేదని తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ షోతో తారక్ ఆకట్టుకున్నాడు. ఆ షోకి రికార్డ్ రేటింగ్స్ వచ్చాయి. అయితే ఈఎంకే షో ఓల్డ్ ఫార్మాట్ కావడంతో అంచనాలకు తగ్గ రేటింగ్స్ ని సాధించలేక పోయిందని అంటున్నారు.

'బిగ్ బాస్ 5'.. శ్రీరామ్ చంద్రకు మద్దతుగా ప్రభాస్ ఫ్యామిలీ!

'బిగ్ బాస్ 5 తెలుగు' చివరి దశకు చేరుకుంది. టైటిల్ రేసులో శ్రీరామ్ చంద్ర, సన్నీ, షణ్ముఖ్‌, సిరి, మానస్ ఉన్నారు. ఎక్కువగా శ్రీరామ్ చంద్ర లేదా సన్నీ బిగ్ బాస్ 5 టైటిల్ గెలిచే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ గా నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ చంద్రకు సినీ ప్రముఖుల నుంచి సైతం మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సోనూసూద్‌, శంకర్‌ మహదేవన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ వంటి వారు శ్రీరామ్ చంద్రకు మద్దతు తెలపగా.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ మద్దతు తెలపడం విశేషం. Also Read: రాజ‌మౌళితో సినిమా ఎప్పుడని అడిగితే "అప్ర‌స్తుతం" అన్న‌బాల‌య్య‌! రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య,  ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామల దేవి తాజాగా ఓ వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌ కు మద్దతు తెలిపారు. "హాయ్‌ శ్రీరామ్‌. బిగ్‌ బాస్‌ చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ సింగింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు బాగా లైక్ చేస్తాం. అప్పుడు ఇండియన్‌ ఐడెల్‌ లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావు‌. అలాగే నువ్వు బిగ్‌ బాస్‌ లో కూడా గెలవాలని, అందరూ నీకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా విన్ అవుతావ్‌. ఆల్‌ ది బెస్ట్‌" అంటూ శ్రీరామ్‌ కు మద్దతుగా శ్యామల దేవి వీడియో సందేశం ఇచ్చారు. Also Read: మ‌ళ్లీ రెచ్చిపోయిన రోజా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోతో ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు శ్రీరామ్ కు లభించే అవకాశముంది. అదే జరిగితే బిగ్ బాస్ 5 టైటిల్ రేసులో శ్రీరామ్ చంద్ర ముందున్నట్లే.

చూపించ‌లేను.. త‌ట్టుకోలేరు : విష్ణు ప్రియ‌

యాంక‌ర్ విష్ణు ప్రియ బుల్లితెర‌పై చేసే హంగామా.. అల్ల‌రి అంద‌రికి తెలిసిందే. ఇక సోష‌ల్ మీడియాలో మాత్రం ఆమె చేసే హంగామాకు హ‌ద్దే వుండ‌దు. హాట్ హాట్ ఫొటో షూట్ ల‌కు సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది. సెక్సీ డ్యాన్సింగ్ వీడియోల‌తో కుర్రాళ్ల‌కు షాకులిస్తుంటుంది. ఆహా వెబ్ సిరీస్ కోసం చాలా హాట్ గా మారి హీటెక్కించే అందాల‌తో షాకిచ్చింది విష్ణు ప్రియ‌. Also Read:మ‌ళ్లీ రెచ్చిపోయిన రోజా తాజాగా సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా విష్ణు ప్రియ పెట్టిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. చూపించ‌లేను.. చూపిస్తే త‌ట్టుకోలేరు అంటూ విష్ణు ప్రియ పెట్టిన తాజా పోస్ట్ ఓ రేంజ్ లో వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే `ది బేక‌ర్స్ అండ్ బ్యూటీ` అంటూ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేసిన విష్ణు ప్రియ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా మారిపోయింది. తాజాగా షూటింగ్ కి వెళ్లిన విష్ణు ప్రియ ఉద‌యం మొద‌లైన షూటింగ్ రాత్రి ఓవ‌ర్ నైట్ అయినా పూర్తి కాలేద‌ని, దాంతో తాను చాలా టైడ్ అయిపోయాన‌ని, క‌ళ్లు మండుతున్నాయ‌ని, వాటిని చూపించ‌లేన‌ని, అవి చూస్తే మీరు త‌ట్టుకోలేర‌ని షాకింగ్ పోస్ట్ పెట్టింది. నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని చెబుతూ త‌న క‌ళ్ల‌కు చేతులు అడ్డుపెట్టుకున్న ఓ ఫొటోని షేర్ చేసింది. ఇప్పుడ‌ది నెట్టింట వైర‌ల్ గా మారింది.

యాంక‌ర్ ర‌వి ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా

యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా బిగ్‌బాస్ సీజ‌న్ 5 నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఊహించ‌ని విధంగా ర‌వి ఎలిమినేట్ కాండం ప‌లువురిని షాక్ కు గురిచేసింది. అత‌ని ఎలిమినేష‌న్ అక్ర‌మ‌మ‌ని, అన్యాయ‌మ‌ని అత‌న్ని కావాల‌నే ఇంటి నుంచి పంపించార‌ని చాలా మంది బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై  ర‌వి ఫ్యాన్స్ దుమ్మెత్తిపోశారు. కొంత మంది నెటిజ‌న్స్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. Also Read: అక్ష‌రం రాయాలంటే వ‌ణుకు పుట్టాలే అయితే ఈ ఎపిసోడ్ లో కొంత మంది ప‌నిగ‌ట్టుకుని మ‌రీ యాంక‌ర్ ర‌విని, అత‌ని కుటుంబ స‌భ్యుల‌ని టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేయ‌డం... అస‌భ్య ప‌ద‌జాలంతో కించ‌ప‌ర‌చ‌డం జ‌రిగింది. దీనిపై యాంక‌ర్ ర‌వి త‌గ్గేది లే అంటూ యుద్ధానికి దిగాడు. త‌న‌ని టార్గెట్ చేసిన ప్ర‌తీ ఒక్క అకౌంట్ ని ప‌రిశీలించి ఆ వివ‌రాల‌ని పోలీసుల‌కు అంద‌జేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న భార్య‌, కూతురు తో పాటు త‌న‌పై త‌న ఇంటి స‌భ్యుల‌పై నెటిజ‌న్ లు కొంత మంది అస‌భ్య ప‌ద‌జాలంతో చేసిన దూష‌ణ‌ల‌పై సీరియ‌స్ అయిన యాంక‌ర్ ర‌వి వారి భ‌ర‌తం ప‌ట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేప‌థ్యంలో సైబ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించిన ఆయ‌న వారికి త‌న‌ని టార్గెట్ చేసిన అకౌంట్ ల తాలూకూ వివ‌రాల్ని తాజాగా అందించాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు అండ‌గా నిలిచిన సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు యాంక‌ర్ ర‌వి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఓ వీడియోని ఇన్ స్టా వేదిక‌గా పోస్ట్ చేశాడు. ఇప్పుడ‌ది నెట్టింట వైర‌ల్ గా మారింది.

శ్రీ‌హాన్ ని తిట్టి అడ్డంగా బుక్కైన ష‌ణ్ముఖ్

గ‌త కొన్ని రోజులుగా నెటిజ‌న్ ల‌కి అడ్డంగా దొరికి పోయి త‌న‌ని తానే త‌గ్గించుకుంటూ టార్గెట్ అవుతున్నాడు ష‌ణ్మ‌ఖ్‌. కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం బిగ్‌బాస్ స్టేజ్ పై సిరి ప్రియుడు శ్రీ‌హాన్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సిరితో మాట్లాడిన శ్రీ‌హాన్ ఆ త‌రువాత హౌస్ లో వున్న వాళ్ల‌కు నెంబ‌ర్ లు కేటాయించ‌మ‌న్నాడు. ఈ నేప‌థ్యంలో శ్రీ‌హాన్ .. ష‌న్నుకి గ‌ట్టి ఝ‌ల‌కే ఇచ్చాడు. Also Read: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు ఊహించ‌ని స్టార్స్ అత‌న్ని ప‌క్క‌న పెట్టి స‌న్నీకి నెం.1 ఇచ్చాడు. ఆ త‌రువాత వ‌చ్చిన సిరి త‌ల్లి కూడా ష‌న్నుని హ‌గ్గుల విష‌యంలో ఓ రేంజ్ లో చుక్క‌లు చూపించి హ‌గ్గులు అతిగా వున్నాయ‌ని ష‌న్నుకు చుర‌క‌లంటించింది. ఇదే అంశాన్ని తాజా ఎపిసోడ్ లో పాయింగ్ అవుట్ చేస్తూ ష‌న్ను మ‌ళ్లీ సిరిని టార్చ‌ర్ చేయ‌డం మొంద‌లుపెట్టాడు. ష‌న్నుకి సంబంధించిన జ‌ర్నీ వీడియోని చూపించిన ఎపిసోడ్ స‌మ‌యంలో సిరి, ష‌న్నుల మ‌ధ్య జ‌రిగిన అన్ సీన్ వీడియో తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఈ వీడియోలో ష‌న్ను.. స‌న్నీని టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా శ్రీ‌హాన్ పై చిందులు తొక్క‌డం అభిమానుల‌ని షాక్ కు గురిచేస్తోంది. నాపై నీకు రెస్పెక్ట్ వుంద‌న్న‌ది చేత‌ల్లో క‌నిపించ‌దు మాట‌లే త‌ప్ప అని సిరి అంటుంది. అంతే కాకుండా స‌న్నీ మాట‌ల్లో.. చేత‌ల్లో నా పై రెస్పెక్ట్ ని చూపించాడ‌ని చెబుతుంది. దీంతో ష‌న్ను ర‌గిలిపోయి శ్రీ‌హాన్ పై విష‌యం వెళ్ళ‌గ‌క్కాడు. శ్రీ‌హాన్ .. స‌న్నీకి ఫ‌స్ట్ ప్లేస్ ఇవ్వ‌డంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. స‌న్నీకి ఫ‌స్ట్ ప్లేస్ ఇచ్చావ్‌.. ఇలాగే త‌న‌ని ఎంక‌రేజ్ చేయి అని చెప్పు.. అని ష‌న్ను ఫైర్ అయి ఆడియ‌న్స్ ముందు మ‌రోసారి అడ్డంగా బుక్క‌య్యాడు. మ‌రో మూడు రోజుల్లో బిగ్‌బాస్ ముగియ నున్న నేప‌థ్యంలో ష‌న్ను త‌న టెంప‌ర్ మెంట్ తో సెల్ఫ్ గోల్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

మీకు న‌చ్చిన‌ట్లు కాకుండా వాడికి న‌చ్చిన‌ట్లు ఉండ‌నివ్వండి.. దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

  బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కొచ్చేసింది. డిసెంబ‌ర్ 19న (వ‌చ్చే ఆదివారం) ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోనుంది. బ‌రిలో ఐదుగురు కంటెస్టెంట్లు.. స‌న్నీ, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, మాన‌స్‌, సిరి హ‌న్మంత్ మిగిలారు. వీరిలో స‌న్నీ, ష‌ణ్ణు మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఆ ఇద్ద‌రిలో స‌న్నీయే విజేత అంటూ సోష‌ల్ మీడియాలో ప‌లువురు ప్ర‌చారం కూడా చేస్తున్నారు. సిరితో ష‌ణ్ణు గేమ్స్ ఆడుతున్నాడ‌నీ, ఆమెతో కావాల‌ని ల‌వ్ ట్రాక్ న‌డుపుతున్నాడ‌నీ ఇటీవ‌ల నెగ‌టివ్ ప్ర‌చారం వ‌చ్చింది.  Also read:  నాగ్.. విన్న‌ర్‌గా అత‌న్నే చూడాల‌నుకుంటున్నారా? అయితే బిగ్ బాస్ హౌస్‌లో ష‌ణ్ణు బిహేవియ‌ర్‌ను అత‌డి గాళ్ ఫ్రెండ్ దీప్తి సున‌య‌న వెన‌కేసుకు వ‌స్తోంది. అది కేవ‌లం షో అనీ, అందులో గెల‌వ‌డానికి ష‌ణ్ణు గేమ్స్ ఆడుతున్నాడే త‌ప్ప‌, దాన్ని బేస్ చేసుకొని అత‌డి క్యారెక్ట‌ర్‌ను డిసైడ్ చేయ‌వ‌ద్ద‌నీ అంటోంది. Also read:  ష‌న్ను - సిరిల‌కు జెస్సీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ష‌ణ్ణును ఉద్దేశించి ఆమె చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. ష‌ణ్ముఖ్ నిల్చొని ఉన్న ఒక ఫొటోను షేర్ చేసిన ఆమె, "నిర్ధారణలకు రాకండి. బిగ్ బాస్‌ని చూస్తూ అతని క్యారెక్ట‌ర్ మొత్తాన్ని అంచనా వేయకండి. ఇది కేవలం ఒక షో మాత్రమే అని గుర్తుంచుకోండి. అతను చాలా మంచి మ‌నిషి. అతనేం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. అతన్ని డిసైడ్ చేసుకోనివ్వండి. అతను మీ అంచనాలను అందుకుంటాడ‌ని ఆశించకండి. మీకు న‌చ్చిన‌ట్లు కాకుండా వాడికి న‌చ్చిన‌ట్లు ఉండ‌నివ్వండి. అతను అత‌నే. ఎవ‌రూ ద్వేషానికి అర్హులు కారు. ద‌య‌చేసి మీ ఫేవ‌రేట్ కంటెస్టెంట్‌కు స‌పోర్ట్ చేయండి. ఇప్పుడూ, ఎప్పుడూ నేను ష‌ణ్ముఖ్‌నే స‌పోర్ట్ చేస్తాను. అత‌న్ని సంతోషంగా చూడాల‌నుకుంటున్నాను." అని రాసుకొచ్చింది.

మీసం తిప్పిన రాజమౌళికి పంచ్.. మీ హీరోల సినిమాలు ఫసక్కేగా!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఐదో ఎపిసోడ్ లో దర్శకధీరుడు రాజమౌళి పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేసింది ఆహా. ప్రోమోలో బాలయ్య, రాజమౌళి మధ్య సంభాషణ ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి ఎప్పటిలానే అన్ స్టాపబుల్ కి కూడా తెల్ల గడ్డంతో వచ్చారు. రాజమౌళి గడ్డం చూసిన బాలయ్య.. 'మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని, అచీవర్ అని అందరికీ తెలుసు.. మరి ఇంకెందుకు ఈ తెల్ల గడ్డం' అని అడగగా.. రాజమౌళి ఏ సమాధానం చెప్పకుండా గడ్డం సరిచేసుకుంటూ కనిపించారు. 'ఇప్పటిదాకా మన కాంబినేషన్ లో సినిమా పడలేదు. నా అభిమానులు నిన్ను బాలయ్యతో సినిమా ఎప్పుడని అడిగారు. మీ సమాధానం ఏంటి అసలు' అని బాలయ్య అడగగా.. రాజమౌళి మళ్ళీ సమాధానం చెప్పకుండా మీసం మెలేస్తూ ఓ లుక్ ఇచ్చారు. 'మీతో సినిమా చేస్తే హీరోకి, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఫసక్కేగా' అని బాలయ్య అనడంతో.. రాజమౌళి జుట్టు సరిచేసుకుంటూ కనిపించారు. 'సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి?'.. అని బాలయ్య అడగగా.. 'అందరికీ తెలుసు ఇది ప్రోమో అని.. నా సమాధానాలు ఎపిసోడ్ లో చెప్తాను అని' రాజమౌళి సమాధానం ఇచ్చారు. ప్రోమో సరదాగా ఆకట్టుకునేలా ఉంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ లో రాజమౌళితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూడా సందడి చేయనున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

బాలయ్య 'అన్ స్టాపబుల్' షోలో 'ఆర్ఆర్ఆర్' టీమ్.. బాబాయ్ తో అబ్బాయి?

'అఖండ' సక్సెస్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో మరింత ఎనర్జీతో పాల్గొంటున్నారు. మొదటి మూడు ఎపిసోడ్స్ లో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందంతో అలరించిన బాలయ్య.. నాలుగో ఎపిసోడ్ లో అఖండ మూవీ టీమ్ తో సందడి చేశారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ ని రంగంలోకి దింపారు. Also Read:  బ‌న్నీకి జ‌క్క‌న్న స్మూత్ వార్నింగ్‌! 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఐదో ఎపిసోడ్ లో దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సందడి చేయనున్నారని తెలుపుతూ తాజాగా పోస్టర్స్ ను విడుదల చేసింది ఆహా. ఈ పోస్టర్స్ లో బాలకృష్ణ మరింత ఎనర్జీతో కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' జనవరి 7 న విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే రాజమౌళి షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి.. బాలయ్య ఒక ఆటమ్ బాంబు లాంటోడు అంటూ ప్రశంసించారు. మరి ఇప్పుడు ఆ ఆటమ్ బాంబుతో కలిసి ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. Also Read: మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో 'అఖండ‌'! మోహన్ బాబు గెస్ట్ గా వచ్చిన మొదటి ఎపిసోడ్ లో మంచు లక్ష్మి, మంచు విష్ణు మెరిశారు. అదేవిధంగా ఐదో ఎపిసోడ్ లో తారక్, చరణ్ మెరుస్తారేమో చూడాలి. అదే జరిగితే నందమూరి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బాబాయ్ అబ్బాయిలు తమ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడం ఖాయం. మరి తారక్, చరణ్ ఈ ఎపిసోడ్ లో సందడి చేస్తారో లేదో చూడాలి.

అక్ష‌రం రాయాలంటే వ‌ణుకు పుట్టాలే

బిగ్‌బాస్ హౌస్ నుంచి 12వ వారం యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా బ‌య‌టికి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న అత‌ని ఫ్యాన్స్ తో పాటు ప్ర‌తీ ఒక్క‌రినీ షాక్ కు గురిచేసింది. ర‌వి ఎలిమినేట్ కావ‌డం ఏంట‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. దీనిపై ర‌వి ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు దిగ‌గా.. సోష‌ల్ మీడియాలో ర‌వి ఎలిమినేష‌న్ పై అనుమానాలున్నాయంటూ పెద్ద ర‌చ్చే జ‌రిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ర‌వి ఎలిమ‌నేష‌న్ పై అనుమానాలున్నాయ‌ని, అత‌న్ని కావాల‌నే తొక్కేశార‌ని మండిప‌డ్డారు.  Also Read:సిరి - ష‌న్నుల హ‌గ్గుల యుద్ధం అన్ స్టాప‌బుల్‌ ఇదిలా వుంటే ర‌వి హౌస్ లో వున్న స‌మ‌యంలో యాంటీ ఫ్యాన్స్ అత‌న్ని దారుణంగా ట్రోల్ చేశారు. అంతే కాకుండా అత‌ని కుటుంబ స‌భ్యుల‌ని, చివ‌రికి అత‌ని పాప‌ని కూడా అస‌భ్య ప‌ద‌జాలంతో ట్రోల్ చేయ‌డం ర‌వికి మ‌న‌స్తాపాన్ని, ఆగ్ర‌హాన్ని తెప్పించాయి. దీంతో ఆగ్ర‌హించిన ర‌వి త‌నని, త‌న వారిని అస‌భ్య ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేసిన వారిపై యుద్ధం ప్ర‌క‌టించాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారిని విడిచి పెట్టే ప్ర‌స‌క్తి లేదంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇన్ స్టా, ఎఫ్ బీ, ట్విట్ట‌ర్‌.. యూట్యూబ్ వేదిక‌గా త‌న‌ని, త‌న వారిని వేధించిన వారిపై కంప్లైంట్ రైజ్ చేశాడు ర‌వి. త‌ను కంప్లైంట్ ఇస్తున్న ఫొటోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. త‌ప్పు మాట మాట్లాడాలి.. టైప్ చేయాలంటే భ‌యం పుట్టాల‌ని.. త‌ప్పుడు రాత‌లు రాయాలనుకునే వారి వెన్నులో ఇప్ప‌టి నుంచే వ‌ణుకు పుట్టాలి` అంటూ యాంక‌ర్ ర‌వి త‌న పోస్ట్ లో షేర్ చేశాడు. ఇప్పుడిది సెట్టింట వైర‌ల్ గా మారింది.   

మోనిత బాబు శ్రీ‌వ‌ల్లి ఒడికి .. ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర వీక్ష‌కుల్ని గ‌త కొంత కాలంగా ఎంట‌ర్‌టైన్ చేస్తూనే చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు, ట్విస్ట్ ల‌తో చిరాకు తెప్పిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఎండింగ్ అనుకున్న సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు కాపు గంటి రాజేంద్ర సాగ‌దీస్తుండ‌టం ప్రేక్ష‌కుల్లో అస‌హ‌నాన్ని తెప్పిస్తోంది. ఇదిలా వుంటే బుధ‌వారం 1223వ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం Also Read: నిజం తెలుసుకున్న మోనిత‌..రౌడీల‌కు చుక్క‌లు చూపించిన కార్తీక్‌ కారులో వున్న త‌న బాబు క‌నిపించ‌కుండా పోవ‌డంతో ఆదిత్య‌ పై అనుమానంతో ఆనంద‌రావు ఇంటికి వ‌స్తుంది మోనిత‌. `నా బాబుని మీ ఆదిత్యే ఎత్తుకొచ్చాడు. కోపం వుంటే తిట్టండి.. కొట్టండి.. కానీ ఇలా నా బిడ్డ‌ని దూరం చేస్తారా? ` అని అరుస్తుంది మోనిత‌. వెంట‌నే `ఏం మాట్లాడుతున్నావ్‌` అని తిరిగి ప్ర‌శ్నిస్తుంది సౌంద‌ర్య‌.. కానీ మోనిత మాత్రం ఆమె మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోదు. `నా కొడుకుని ఎత్తుకెళితే నేను ఏడుస్తూ కూర్చుంటాన‌నుకుంటున్నారా? .. త‌న‌ని ఎత్తుకెళ్లింది ఎవ‌రో తెలిసేదాకా ఇక్క‌డే కూర్చుంటాను. మీ కొడుకు, నా కొడుకు దొరికే వ‌ర‌కు ఇక్క‌డే వుంటాను` అంటూ అరుస్తుంది మోనిత‌. క‌ట్ చేస్తే... ఆసుప‌త్రిలో శ్రీ‌వ‌ల్లి ఏడుస్తూ వుంటుంది. ఈ సారి కూడా కాన్పు పోయింద‌ని కుమిలిపోతూ వుంటుంది. ఇంత‌లో శ్రీ‌వ‌ల్లి భ‌ర్త కోటేష్ ఒక బాబుని తీసుకుని వ‌చ్చి శ్రీ‌వ‌ల్లి చేతుల్లో పెడుతూ `వ‌ల్లీ ఇదే ఆసుప‌త్రిలో త‌ల్లి చ‌నిపోయిన బిడ్డ అట‌.. మ‌గ బిడ్డే .. మ‌నం పెంచుకుందాం ` అంటాడు. వెంట‌నే బాబుని అందుకుని ముద్దాడిన‌ శ్రీ‌వ‌ల్లి దేవుడికి థ్యాంక్స్ చెబుతుంది. శ్రీ‌వ‌ల్లి ఆనందంతో వుండ‌గా అస‌లు ఆ బాబుని తాను ఎక్క‌డి నుంచి తీసుకొచ్చానో గుర్తు చేసుకుంటాడు కోటేష్‌. త‌ను వ‌ల్లి చేతుల్లో పెట్టిన బాబు మోనిత కొడుకు. ఈ ట్విస్ట్ ఏంటీ? .. అత‌ని చేతుల్లోకి మోనిత బాబు ఎలా వ‌చ్చాడు? .. అస‌లు ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.     

హైప‌ర్ ఆదిపై జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ షాకింగ్ కామెంట్స్‌

జ‌బ‌ర్ద‌స్త్ వేదిక ఎంతో మంది క‌మెడియ‌న్ ల‌కు అవ‌కాశాల్ని క‌ల్పించి వారిని పాపుల‌ర్ చేసింది. ఏ ఆధారం లేని వారికి అండ‌గా నిలిచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ వేదిక‌పై ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేసిన ఎంత మంది ఈ షో వ‌ల్ల పాపుల‌ర్ అయ్యారు. కొంత మంది స్థిర‌ప‌డ్డారు కూడా. అంతే కాకుండా సినిమాల్లో అవ‌కాశాల్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. ఈ వేదిక‌పై హైప‌ర్ ఆదిది స‌క్సెస్ ఫుల్ ప్ర‌యాణం. Also read:ఢీ 14: సుధీర్ పోయి సార్థ‌క్ వ‌చ్చె.. ఏం జ‌రిగిందో!? అత‌ని పంచ్ ల‌కు చాలా మంది అభిమానులున్నారు. ఆ పంచ్ లు న‌చ్చి త‌మ సినిమాల్లో అవ‌కాశాలు ఇచ్చిన ద‌ర్శ‌కులూ వున్నారు. అంతే కాకుండా హైప‌ర్ ఆది టైమింగ్ న‌చ్చి క‌థా చ‌ర్చ‌ల్లో అత‌న్ని భాగ‌స్వామి చేసిన వెంకీ అట్లూరి లాంటి యువ ద‌ర్శ‌కులు కూడా వున్నారు. అలాంటి ఆదిపై జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ శాంతి స్వ‌రూప్ కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తాను చ‌నిపోయే సంద‌ర్భంలోనూ ఆది పేరునే త‌లుస్తానంటూ శాంతి స్వ‌రూప్ అన్న మాట‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. Also read:ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ : మ‌ళ్లీ రెచ్చిపోయిన రోజా ప్ర‌స్తుతం హైప‌ర్ ఆది `శ్రీ‌దేవీ డ్రామా కంప‌నీ` పేరుతో ప్ర‌సారం అవుతున్న కామెడీలో స్కిట్ లు చేస్తూ నవ్విస్తున్నారు. అయితే ఇదే వేదిక‌పై శాంతి స్వ‌రూప్ అనే క‌మెడియ‌న్ .. హైప‌ర్ ఆది త‌న జీవితంలో ఎంత ముఖ్య‌మో వివ‌రిస్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న తీరు ప‌లువురిని క‌దిలిస్తోంది. పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా వున్న రోజుల్లో రెండు అర‌టి ప‌ళ్లు తిని ప‌డుకున్న రోజులు వున్నాయ‌ని.. తాను ఇప్పుడు ఈ స్థాయిలో వున్నానంటే దానికి కార‌ణం హైన‌ర్ ఆదినే అని శాంతి స్వ‌రూప్ భావోద్వేగానికి లోన‌య్యాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

అప్పుడు మెగాస్టార్‌.. ఇప్పుడు మెగా ప‌వర్‌స్టార్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ఈ ద‌ఫా కొంత నిరాశే ప‌రుస్తోంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ షోకి ఊపుని తీసుకొచ్చిన కంటెస్టెంట్ వీజే స‌న్నీ. అత‌ని కార‌ణంగానే తాజా సీజ‌న్ కి ప్రేక్ష‌కుల్లో మ‌ళ్లీ ఊపొచ్చింది. అత‌ని వ‌ల్లే షో పై మ‌ళ్లీ ఆస‌క్తి మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో చివ‌రి అంకానికి చేరిని బిగ్‌బాస్ మ‌రో ఐదు రోజుల్లో అంటే ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగియ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ షో గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ లుగా హాజ‌ర‌య్యే సెల‌బ్రిటీల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్నాయి. 19 మందిలో మొద‌లైన ఈ షోలో చివ‌రి వారం వ‌చ్చేసరికి  5 మెంబ‌ర్స్ మిగిలారు. స‌న్నీ , మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి, ష‌ణ్ముఖ్ వున్నారు. వీళ్ల‌లో విజేత ఎవ‌ర‌న్న‌ది మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ తేల్చేశాడు. దీంతో గ్రాండ్ ఫినాలే రోజు హాజ‌ర‌య్యే గెస్ట్ లు ఎవ‌ర‌నేదానిపై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. గ‌త సీజ‌న్ గ్రాండ్ ఫినాలేతో పోలిస్తే తాజా సీజ‌న్ ఫైన‌ల్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నార‌ని, ఇందు కోసం బాలీవుడ్ క్రేజీ స్టార్ల‌ని ఆహ్వానిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. Also Read: 'బిగ్ బాస్' హౌస్ నుంచి రాగానే '5జి లవ్' చేయనున్న మానస్! కాగా గ‌త సీజ‌న్ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా పాల్గొని విజేత‌ని అభినందించ‌డ‌మే కాకుండా సోహైల్ కి త‌న సినిమాలో గెస్ట్ పాత్ర‌లో న‌టించ‌డానికి తాను సిద్ధ‌మ‌ని మాట కూడా ఇవ్వ‌డం, మెహ‌బూబ్ కు ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ ఫినాలేకు చిరు రావ‌డం లేద‌ని.. మెగా ప‌వ‌ర్ స్టార్ వ‌స్తున్నార‌న్న‌ది తాజా వార్త‌.  చ‌ర‌ణ్  తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, కొంత మంది బాలీవుడ్ క్రేజీ స్టార్స్ కూడా ఫినాలేలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. దీనిపై మ‌రో రెండు మూడు రోజుల్లో బిగ్ బాస్ నిర్వాహ‌కులు హింట్ ఇచ్చే అవ‌కాశం వుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.