అప్పుడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్.. మహేషే ఫినిషర్!

టాలీవుడ్ లో పలువురు స్టార్స్ హోస్ట్ లుగా మారి అలరిస్తుంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ షోస్ లో గెస్ట్ గా పాల్గొని వినోదాన్ని పంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ముగింపు ఎపిసోడ్ లో పాల్గొని సందడి చేసిన మహేష్.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ముగింపు ఎపిసోడ్ తో ఎంటర్టైన్ చేయనున్నారు. మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ విషయంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోనే 'అన్ స్టాపబుల్' ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. మహేష్ ఎపిసోడ్ షూట్ చాలారోజుల క్రితమే జరిగినా.. ఆ ఎపిసోడ్ ని కావాలని హోల్డ్ చేసి.. ముగింపు ఎపిసోడ్ గా ప్రసారం చేశారు ఈఎంకే నిర్వాహకులు. ఇప్పుడు 'అన్ స్టాపబుల్' షో నిర్వాహకులు కూడా అదే చేస్తున్నారు. 'అన్ స్టాపబుల్'లో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ షూట్ ఇప్పటికే జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ ని 'అన్ స్టాపబుల్' షో మొదటి సీజన్ ముగింపు ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేయనున్నామని తాజాగా ఆహా ప్రకటించింది. 'అన్ స్టాపబుల్' షోకి సంబంధించి ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ విడుదలయ్యాయి. అల్లు అర్జున్ పాల్గొన్న ఆరో ఎపిసోడ్ డిసెంబర్ 25 నుండి, క్రాక్ కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని పాల్గొన్న ఏడో ఎపిసోడ్ డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. మరి మహేష్ పాల్గొన్న ముగింపు ఎపిసోడ్ ఎనిమిదవ ఎపిసోడ్ గా ప్రసారమవుతుందా? లేక ఇతర సెలెబ్రిటీలతో ఈ సీజన్ లో మరికొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

దీప్తి హింట్ ఇచ్చిన వీడియో వైర‌ల్‌!

బుల్లితెర రియాలీటీ షో ముగిసినా ఇది చేసిన ర‌చ్చ‌కు మాత్రం ఇంకా తెర‌ప‌డ‌టం లేదు. సీజ‌న్ 5 విన్న‌ర్ గా వీజే ప‌స‌న్ని నిలిచిన విష‌యం తెలిసిందే. గ్రాండ్ ఫనాలే ముగిసి నాలుగు రోజులు గ‌డుస్తున్నా ఇంకా దీనిపై నెట్టింట చ‌ర్చ కొన‌సాగుతూనే వుంది. అప్నా టైమ్ ఆయేగా.. క‌ప్పు ముఖ్యం బిగులూ.. క‌ళావ‌తి అడిగింది అమ్మ‌కు క‌ప్పు ఇవ్వాల్సిందే మ‌చ్చా.. అంటూ స‌న్నీ హౌస్ లో చేసిన ర‌చ్చ‌ని ఫైన‌ల్ లో నిజం చేశారు అత‌ని అభిమానులు. అయితే షో స్టారింగ్ నుంచి ఈ సీజ‌న్ విన్న‌ర్ ష‌న్ను అంటూ అత‌ని అభిమానులు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఆ ప్ర‌చారాన్ని, యూట్యూబ‌ర్ గా అత‌నికున్న ఫాలోయింగ్‌ని చూసి ఈ సీజ‌న్ విన్న‌ర్  ఇత‌నే అని అంతా భావించ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌తీ సారి నామినేష‌న్స్‌లో వుంటూ వ‌చ్చిన ష‌న్ను సేఫ్ గా బ‌య‌ట‌ప‌డుతూ వ‌చ్చాడు. దీంతో ఇతనే విన్న‌ర్ అన్న‌ది మ‌రింత బ‌లంగా ప్ర‌చారం కావ‌డం మొద‌లైంది. అయితే స‌రితో చేసిన ర‌చ్చ కార‌ణంగా రేసులో వెన‌క‌బ‌డిన ష‌న్ను టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో నిలిచి షాకిచ్చాడు. అయితే ఇది తాను ముందే ఊహించాన‌ని, 11 వ వారంలోనే స‌న్నీ ఈ సీజ‌న్ విజేత అని గ్ర‌హించాన‌ని అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ బ‌జ్ కార్య‌క్ర‌మంలో ష‌న్ను బ‌య‌ట‌పెట్టాడు. అయితే ఇదే సంద‌ర్భంగా హౌస్ లోకి వ‌చ్చిన దీప్తి త‌ను రెండ‌వ స్థానానికి ప‌డిపోతున్నాడ‌ని రెండు వేళ్ల‌తో మైక్ ప‌ట్టుకుని హింట్ ఇచ్చింద‌ని ప్ర‌స్తుతం నెట్టింట ఓ వీడియో వైర‌ల్ గా మారింది. దీనిపై స్పందించిన ష‌న్ను మా అమ్మ మీద ఒట్టు నాకు ఆ విష‌యం తెలియ‌ద‌ని చెప్పుకొచ్చాడు. అయినా దీప్తి అలా చెప్పి ఉండ‌దు. ఒక‌వేళ నిజంగానే త‌ను అలా చెప్పి వుంటే సిరితో ఎందుకు కంటిన్యూ అవుతా.. నా నా పొజిష‌న్ గురించి నాకు ముందే తెలుసు. 11వ వారంలోనే స‌న్నీ విజేత అని గ్ర‌హించాను` అని షాకిచ్చాడు. త‌ను చెప్పానంటూ వైర‌ల్ గా మారిన వీడియోపై దీప్తి వివ‌ర‌ణ ఇచ్చినా నెట్టింట ఆమెని, ష‌న్నుని నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌డం మాత్రం ఆప‌డం లేదు. ఆ వీడియో మీరూ చూసేయండి.

సిరి ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచిందా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. అయితే ఈ సీజ‌న్ లో సిరి, ష‌న్ను చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. కెమెరాల ముందే హ‌గ్గులు.. ముద్దులు.. అవ‌స‌రం లేకున్నా.. హ‌గ్గిస్తానంటూ సిరి, ష‌న్ను చేసిన అరాచ‌కంపై నెటిజ‌న్స్ ఎన్ని సార్లు మొట్టికాయ‌లు వేసినా ఈ జంట లైట్ తీసుకుంది. హౌస్‌లో ఏందిరా ఈ గ‌లీజ్ ప‌ని అంటూ స‌న్నీ కామెంట్ చేసినా.. ఇద్ద‌రి పేరెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మీ హ‌గ్గులు న‌చ్చ‌లేద‌ని ఓపెన్‌గా చెప్పినా ఈ సిరి, ష‌న్ను `న‌వ్వి పోదురు గాక మాకేటి సిగ్గు` అన్న‌ట్టుగానే ప్ర‌వ‌ర్తించారే కానీ త‌ప్పు చేస్తున్నామ‌ని మాత్రం గ్ర‌హించ‌లేదు. ఇదే ష‌న్నుని, సిరిని బిగ్‌బాస్ హౌస్‌లో క్యారెక్ట‌ర్ కోల్పోయేలా చేసింది. కెమెరాల ముందు కోట్ల మంది చూస్తున్నార‌న్న భ‌యం లేకుండా విచ్చిల‌విడిగా రెచ్చిపోయిన వీరిని చీద‌రించుకోని ఆడియ‌న్ ,నెటిజ‌న్ లేడంటే వీరు చేసిన ర‌చ్చ ఏస్థాయిలో వెగ‌టు పుట్టించిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆకులు కాలాక చేతులు ప‌ట్టుకున్న‌చందంగా జ‌రిగిన నష్టం జ‌రిగాక ఇప్పుడు సిరి ఎమోష‌న‌ల్ అవుతోంది. త‌న‌పై జ‌రుగుతున్న నెగ‌టివిటీకి బావురు మంటోంది. ష‌న్నుతో త‌న‌ది ఫ్రెండ్షిప్ మాత్ర‌మే న‌ని హౌస్ లో త‌న‌తో ఎలా వున్నానో బ‌య‌ట కూడా అలాగే వుంటాన‌ని మ‌ళ్లీ అదే పాట పాడింది. నిజంగా అమ్మ వ‌చ్చి చెప్పిన త‌రువాత నుంచి నా ప‌ద్ద‌తిని మార్చుకుని వుంటే నిజంగానే నేను చేసింది త‌ప్ప‌ని ఒప్పుకున్న‌ట్టు అయ్యేది.. అందుకే అమ్మ చెప్పినా నా మ‌న‌సు మార్చుకోలేదు. అది జ‌నానికి న‌చ్చ‌లేదు. అందుకే వారికి సారీ చెబుతున్నాను. ఈ విష‌యంలో నాపై వ‌స్తున్న కామెంట్స్ ని చూడ‌లేక‌పోతున్నా.. నా లైఫ్ లో ఇంత నెగ‌టివిటీని ఎప్పుడూ చూడ‌లేదు. ఈ సంద‌ర్భంగా నాపై కామెంట్స్ చేస్తున్న వారికి నేను ఒక‌టే చెబుతున్నాను. నిజంగానే మా ఇద్ద‌రిలో చెడు వుంటే కెమెరాల ముందు ఎందుకు చేస్తాం. . ఇంకేదైనా ప్లేస్ లో చేసే వాళ్లం క‌దా?  మాకు నిజంగా చెడు ఉద్దేశ్యం లేదు. మేం లోప‌ల ఎంత నిజాయితీగా వున్నామో బ‌య‌ట కూడా అలాగే వుంటాం. మా అనుబంధం అలాగే కొన‌సాగుతుంది. ద‌య‌చేసి నెగిటివ్ గా తీసుకోకండి` అని సిరి నెటిజ‌న్ ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. అయినా ఆమెపై ట్రోలింగ్ ఆగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వీజే స‌న్నీ అలా గెలిచాడా.. అరె ఏంట్రా ఇదీ..!

బిగ్‌బాస్ రియాలీటీ షో ముగిసింది. ఈ సీజ‌న్ లో ఆల్ రౌండ‌ర్ గా ప్ర‌తిభ చాటిన వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. ఓ సాధార‌ణ యాంక‌ర్‌గా త‌న జ‌ర్నీ మొద‌లైంది. ఆ త‌రువాత లైఫ్ స్టైల్ రిపోర్ట‌ర్‌గా ఓ ఛాన‌ల్ లో ప‌ని చేశాడు. ఆ త‌రువాతే అత‌నికి న‌ట‌న‌పై ఇంట్రెస్ట్ మొద‌లైంది. బుల్లితెర‌పై స‌న్నీ చేసిన తొలి సీరియ‌ల్ `క‌ల్యాణ వైభోగ‌మే`. దీన్ని `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ నిర్మించాడు. ఇదే అత‌న్ని స‌ట‌గు ప్రేక్ష‌కుడికి చేరువ‌య్యేలా చేసింది. సీజ‌న్ 5లో విజేత‌గా నిలిచేలా చేసింది. Also Read:సిరి, ష‌న్ను రిలేష‌న్ పై స‌న్నీ కామెంట్ అయితే స‌న్నీని విజేత‌గా నిలిపింది అది కాద‌ని మ‌రో అంశ‌మే అత‌న్ని విజేత‌ని చేసింద‌ని ప్ర‌చారం మొద‌లైంది. సన్నీ గెలుపు కొంత మందికి చెంప పెట్టులా మారింద‌న్న‌ది గుర్తించాల్సిన అంశం. హౌస్ లో ఎలా వుండాలో ఎలా వుండ కూడ‌దో స్నేహానికి ఎంత విలువ ఇవ్వాలో.. త‌ల్లికిచ్చిన మాట కోసం ఎలాంటి త్యాగాల‌కైనా సిద్ధ‌ప‌డాల‌ని స‌న్నీ చూపించిన తీరు స‌గ‌టు ప్రేక్ష‌కుడిని క‌ట్టిప‌డేసింది. స‌న్నీ ఎవ‌రో తెలియ‌క‌పోయినా హౌస్ లో త‌న ప్ర‌వ‌ర్త‌న తీరుతో కోట్లాది మంది హృద‌యాల్ని గెలుచుకున్నాడు. అదే అత‌న్ని ఫైన‌ల్ లో విజేత‌గా నిల‌బెట్టింది. Also Read:హీరో అవుతున్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌! అయితే ఓ వ‌ర్గం మాత్రం స‌న్నీని విజేత‌గా నిల‌బెట్టింది.. అత‌నికి భారీ స్థాయిలో ఓట్లు ప‌డేలా చేసింది అది కాద‌ని కొంత మంది కుల పిచ్చోళ్లు సన్నీ కులం గురించి వెతుకుతున్నారు. ఈ వెతికారు. అప్పుడే వారికి స‌న్నీ అస‌లు పేరు అరుణ్ రెడ్డి అని తెలిసింది. ఇంకే ముందు కుల ప్ర‌చారం మొద‌లుపెట్టారు. స‌న్నీ గెలుపుని కులానికి ఆపాదించి ప్ర‌చారం చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అలా ప్ర‌చారం చేస్తున్న వారిని విమ‌ర్శిస్తూ.. మ‌రీ ఇంత‌గా దిగ‌జారాలా అని నెట్టింట కామెంట్ లు మొద‌ల‌య్యాయి. నెట్టింట స‌న్నీపై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని చూసి అత‌ని అభిమానులు `అరె ఏంట్రా ఇదీ` అని దుమ్మెత్తిపోస్తున్నారు. Also Read:స‌న్నీని బిగ్ బాస్ 5 విజేత‌గా చేసింది.. ఈ మాటే!

రుద్రాణి చెంత‌కు చేరిన మోనిత బిడ్డ‌

బుల్లితెర‌పై మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ టాప్ లో కొన‌సాగుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`.ఈ బుధ‌వారం 1229 వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఎపిసోడ్ లోప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. త‌న బిడ్డ ఎక్క‌డున్నాడో అని ఆలోచిస్తూ వుంటుంది మోనిత‌.. అంతే కాకుండా మీ అమ్మ నిన్ను ఖ‌చ్చితంగా కనిపెడుతుంద‌ని ఎందుకంటే మీ అమ్మ పేరు మోనితా కార్తీక్ కాబ‌ట్ట‌ని .. మోనిత త‌న‌లో తానే మైండ్వాయిస్ వేసుకుంటుంది. Also read:స‌న్నీని బిగ్ బాస్ 5 విజేత‌గా చేసింది.. ఈ మాటే! ఇంత‌లో శ్రావ్య రావ‌డాన్ని గ‌మ‌నించి నేను కాఫీ క‌లిపివ్వ‌నా అంటుంది మోనిత‌.. నువ్వు కాఫీనే కాదు వ‌రుస‌లు కూడా బాగా క‌లుపుతావ్‌.. అవ‌స‌ప‌రం లేని వ‌రుస‌ల‌న్నీ ఈ ఇంటి ని వ‌దిలేపి వెళితే.. మేం చాలా ప‌సంతోషిస్తాం అంటాడు ఆదిత్య‌. వెంట‌నే నువ్వే బాబుని దాచావంటూ ఎదురుదాడికి దిగుతుంది మోనిత‌.. నాకేం అవ‌స‌రం నేనెందుకు దాస్తానంటూ ఫైర్ అవుతాడు ఆదిత్య‌... క‌ట్ చేస్తే శ్రీ‌వ‌ల్లి ఇంట్లో మోనిత కొడుకు ఆనంద‌రావు గుక్క‌ప‌ట్టి ఏడుస్తుంటాడు.. శ్రీ‌వ‌ల్లి, దీప పిల్ల‌లు పిల్లాడి ఏడుపు మాన్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. Also read:పెళ్లి ఒక‌రితో, ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో.. తమన్ సంచలన వ్యాఖ్యలు! పిల్లాడి ఏడుపు విన్న కార్తీక్ నిద్ర‌కొచ్చాడేమో అని అక్క‌డికి వ‌చ్చి ఎత్తుకుంటాడు. వెంట‌నే పిల్లాడు ఏడుపు ఆపేస్తాడు. ఇది పిల్ల‌ల‌కు ఏమీ అర్థం కాదు. క‌ట్ చేస్తే శ్రీ‌వ‌ల్లి భ‌ర్త‌తో క‌లిసి బ‌య‌టికి వెళుతుంది. ఎదురుగా వ‌స్తున్న రుద్రాణి శ్రీ‌వ‌ల్లి, కోటేశ్వ‌ర‌రావు చేతుల్లో వున్న బిడ్డ‌ని చూసి త‌న‌కు చూపించ‌మంటుంది. ఆ త‌రువాత కోటేశ్వ‌ర్ రావు, శ్రీ‌వ‌ల్లి దంప‌లకు దీప‌ని, కార్తీక్‌ ని చూసుకుని ఎగిరెగిరిప‌డ‌కంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మోనిత .. సౌంద‌ర్య తో ఏమంది?.. ఆమెకు కోపం ఎందుకు తెప్పించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

స‌న్నీని బిగ్ బాస్ 5 విజేత‌గా చేసింది.. ఈ మాటే!

  బిగ్ బాస్ తెలుగు ఐదో సీజ‌న్ విజేత‌గా వీడియో జాకీ స‌న్నీ నిలిచాడు. రూ. 50 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీతో పాటు ట్రోఫీని అందుకున్నాడు. మిగ‌తా 18 మంది కంటెస్టెంట్ల‌తో పోటీప‌డి, ఆడియెన్స్ అభిమానాన్ని చూర‌గొని, టాప్ 5 ఫైన‌లిస్టుల్లో ఒక‌డిగా నిలిచి, చివ‌ర‌కు విన్న‌ర్ అయ్యాడు స‌న్నీ. అత‌ని విజ‌య ర‌హ‌స్యం ఏమిటి? దానికి ఆన్స‌ర్ అత‌నే చెప్పాడు. ఒక మాట త‌న‌ను బిగ్ బాస్ హౌస్‌లో న‌డిపించింద‌నీ, అదే త‌న‌ను విజేత‌గా నిలిపింద‌నీ అత‌ను చెప్పాడు. Also read: సిరి, ష‌న్ను రిలేష‌న్ పై స‌న్నీ కామెంట్ "బిగ్ బాస్ హౌస్‌లో ఒక వార్ ఉండె. అక్క‌డ జ‌రిగిన ఫైట్‌కి మేమంతా మా బెస్ట్ ఇచ్చాం. టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మ‌రీ చెప్పాలంటే హౌస్ లోప‌ల‌ వెరీ వెరీ హార్డ్‌. ఒక్క‌టే ఒక్క వ‌ర్డ్ న‌న్ను న‌డిపించింది. అది.. 'క‌ప్పు ముఖ్యం బిగులూ' అన్న‌ది." అని తెలిపాడు స‌న్నీ. సోమ‌వారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా మీట్‌లో అత‌ను హుషారుగా, ఒకింత ఉద్వేగంగా త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. Also read: బిగ్‌బాస్ 'వీజే'త స‌న్నీకి ద‌క్కింది ఎంత‌? "మా అమ్మ వ‌చ్చి న‌న్న‌డిగింది. 'బేటా.. నీ చిన్న‌ప్పట్నుంచీ నేనేమీ అడ‌గ‌లేదు, క‌ప్పు ఇయ్య‌రా' అని. దాంతో నేను ఫిక్స‌యిపోయా, వార్ వ‌న్‌సైడ్ చేద్దామ‌ని. జెన్యూన్‌గా, నాకు నేనులాగా ఉండాల‌ని అనుకున్నా. మ‌న‌స్ఫూర్తిగా మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డేవాళ్లుంటే, నువ్వెక్క‌డుంటే అక్క‌డే నీ రాజ్యం స్టార్ట‌వుద్ది. దాన్ని నేను ఫీల‌య్యాను." అని స‌న్నీ తెలిపాడు.

పెళ్లి ఒక‌రితో, ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో.. తమన్ సంచలన వ్యాఖ్యలు!

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఓ వైపు సాంగ్స్ తో సంచలనం సృష్టిస్తూ.. మరో బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొడుతూ.. ప్రస్తుతం తనకి తిరుగులేదు అనిపించుకుంటున్నాడు. సౌత్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న తమన్.. బాలీవుడ్ అంటే మాత్రం నా వల్ల కాదు అంటున్నాడు. హిందీ సినిమాలకు మ్యూజిక్ చేయడం 'పెళ్లి ఒక‌రితో ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో' లాగా అనిపిస్తుందని తమన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తమన్ గెస్ట్ గా పాల్గొన్నాడు. డిసెంబర్ 27 న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో తమన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆరో తరగతి వరకు మాత్రమే చదువుతున్న తాను.. అప్పుడు కూడా చదువుకోకుండా డ్రమ్స్ వాయించేవాడినని అన్నారు. తండ్రి మరణంతో చదువు ఆపేశానని చెప్పిన తమన్.. అప్పుడు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో తన తల్లి డ్రమ్స్ కొనిచ్చిందని చెప్పాడు. బాలకృష్ణ నటించిన 'భైరవ ద్వీపం' సినిమా తన మొదటి సినిమా అని తమన్ తెలిపాడు. ఆ సినిమాలో రోజా గారి బెడ్ గాల్లోకి లేచినప్పుడు డ్రమ్స్ కొట్టింది తానేనని, ఆ సినిమాకి 30 రూపాయలు ఇచ్చారని అన్నాడు. 20 ఏళ్ళ క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' సినిమాలో నటించిన తాను.. ఇప్పుడు ఆయన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. హిందీలో ఏ సినిమాలు చేశావని ఆలీ అడగగా.. గోల్ మాల్, సింబా, సూర్యవంశీ సినిమాలకు పని చేశానని తమన్ చెప్పాడు. ఎందుకు అక్కడ సెటిల్ కాలేదు అని ఆలీ అడగగా.. తమన్ ఊహించని సమాధానం చెప్పాడు. "సినిమాకు ఆరు మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఎలా ప‌ని చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. ఓ రీల్ రీరికార్డింగ్ చేయండి, ఓ పాట చేయండి అని అడుగుతారు. అలా చేయ‌డం నా వ‌ల్ల కాదు. అంటే.. పెళ్లి ఒక‌రితో ఫ‌స్ట్ నైట్ ఇంకొక‌రితో లాగా అయిపోతుంది" అని తమన్ వ్యాఖ్యానించాడు. బాలీవుడ్ గురించి తమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

రుద్రాణికి దిమ్మ‌దిరిగే షాకిచ్చిన దీప‌

  బుల్లితెర మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `కార్తీక దీపం`. మోనిత కుట్ర కార‌ణంగా డాక్ట‌ర్ వృత్తికి దూర‌మై అవ‌మాన భారంతో దీప‌, పిల్ల‌ల‌తో క‌లిసి కార్తీక్ ఇల్లు వ‌దిలి, సిటీ వ‌దిలి వేరే గ్రామానికి చేరుకున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ దాక్షాయ‌ణి కార‌ణంగా కార్తీక్ కుటుంబం మ‌ళ్లీ ఇబ్బందుల్లో ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ బాబు .. రుద్రాణికి ఓ నోటు రాసిస్తాడు. Also read:నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం? అత‌నికే తెలియ‌కుండా త‌ను డ‌బ్బు క‌ట్ట‌ని ప‌క్షంలో ఇద్ద‌రు పిల్ల‌ల్లో ఒక పాప‌ని తాను తీసుకొచ్చాసుకుంటాన‌ని అగ్రిమెంట్ చేసుకుంటుంది దాక్షాయ‌ణి. క‌ట్ చేస్తే.. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. అవ‌మాన భారంతో ఊరు విడిచి, సొంత వారిని కాద‌నుకుని తెలియ‌ని చోటుకి వ‌చ్చి త‌ల‌దాచుకుంటున్న కార్తీక్ , దీప‌లని దాక్షాయ‌ణి టార్గెట్ చేస్తుంది. త‌న కుటుంబాన్ని టార్గెట్ చేసింద‌ని తెలుసుకున్న దీప .. రుద్రాణికి ఎలాంటి షాకిచ్చింద‌న్న‌ది ఓసారి చూద్దాం. Also read:ఎలిమినేట్ అయిన సిరి.. హౌస్ బ‌య‌ట‌కు తెచ్చిన ర‌ష్మిక‌-దేవి! కార్తీక్ ఇద్ద‌రు పాప‌లు క‌నిపించ‌లేద‌ని కంగారుప‌డుతూ దీప‌ని అడుగుతాడు.. ఇంత‌లో అత‌నికి రుద్రాణి అన్న మాట‌లు గుర్తొస్తాయి. వెంట‌నే దీప బ‌య‌ట చూశారా? అని అడుగుతుంది. చూశాను దీప కనిపించ‌లేదంటాడు కార్తీక్. దీంతో కంగారు ప‌డిన దీప బ‌య‌ట చూద్దామంటూ బ‌య‌టికి వ‌చ్చేస్తుంది. అక్క‌డే చెట్టుకింద ఇద్ద‌రు పిల్ల‌లు కూర్చుని క‌నిపిస్తారు. మ‌నం నాన‌న‌మ్మ ద‌గ్గ‌రికి వెళ్లిపోదామ‌ని రౌడీ అంటుంది. క‌ట్ చేస్తే .. దీప త‌న న‌గ‌ల‌మ్మి డ‌బ్బు తీసుకురావడానికి వెళుతుంది. కానీ తాక‌ట్టుపెట్టుకోవ‌డానికి న‌గ‌ల వ్యాపారి ఇష్ట‌ప‌డ‌డు. రుద్రాణి చెప్పడంతో దీప న‌గ‌లు తీసుకోవ‌డానికి నిరాక‌రిస్తాడు. కార‌ణం రుద్రాణి అని తెలుసుకున్న దీప వెంట‌నే ఫోన్ చేసి షాకిస్తుంది. వెంట‌నే రుద్రాణి దీప‌కు డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని సేటుతో చెబుతుంది.. ఇంత‌కీ దీప ఏం చేసింది? ఎందుకు రుద్రాణి సేటుతో డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని చెప్పింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

'అన్‌స్టాపబుల్'కి అల్లు అర్జున్.. వెనక్కి తగ్గిన రవితేజ!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకి సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రసారమైన ఐదు ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. దీంతో ఆరో ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆరో ఎపిసోడ్ గెస్ట్ లుగా మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆహా.. ఇప్పుడు ఆరో ఎపిసోడ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుందని ట్విస్ట్ ఇచ్చింది. 'అన్ స్టాపబుల్' షో ఆరో ఎపిసోడ్ గా పక్కా మాస్ ఎపిసోడ్ లోడ్ అవుతుందని.. ఇందులో బాలయ్యతో కలిసి క్రాక్ కాంబో రవితేజ, గోపీచంద్ సందడి చేయనున్నారని ఆదివారం నాడు ఆహా ప్రకటించింది. అంతేకాదు, ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కూడా కానుందని తెలిపింది. అయితే తాజాగా ఆరో ఎపిసోడ్ విషయంలో ఆహా ట్విస్ట్ ఇచ్చింది. అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ఆరో ఎపిసోడ్ గా ప్రసారం కానుందని మంగళవారం నాడు ప్రకటించింది. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుండి ప్రసారం కానుందని పేర్కొంది. 'అన్ స్టాపబుల్ మీట్స్ తగ్గేదేలే' అంటూ అఖండ ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య, బన్నీ కలిసి దిగిన ఫోటోని ఆహా పంచుకుంది. రవితేజ, గోపీచంద్ పాల్గొన్న ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ ని కూడా ఆహా ఇచ్చింది. ఈ క్రాకింగ్ మాస్ ఎపిసోడ్ లో న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'తో బన్నీ డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బన్నీ ఎపిసోడ్ ని ముందుకి తీసుకొచ్చి రవితేజ ఎపిసోడ్ ని పోస్ట్ పోనే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ లో బన్నీతో పాటు సుకుమార్, రష్మిక కూడా పాల్గొనే అవకాశముందని సమాచారం.

 వేద‌ని అడ్డంగా బుక్ చేసిన య‌ష్‌

బుల్లితెర ప్రేమికుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. య‌ష్.. వేద‌, ఖుషీల మ‌ధ్య సాగే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సీరియ‌ల్ సాగుతోంది. గ‌త కొన్ని వారాలుగా స‌రికొత్త మ‌లుపులు తిరుగుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ సీరియ‌ల్ సోమ‌వారం మ‌రింత ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో సాగింది. ఖుషీ త‌న వ‌ద్ద‌కే రావ‌డంతో ఆ విష‌యాన్ని య‌ష్ కి తెలియ‌జేస్తుంది వేద‌. Also read:బిగ్‌బాస్ 'వీజే'త స‌న్నీకి ద‌క్కింది ఎంత‌? పాప‌ని ఏదూనా వెకేష‌న్ కి తీసుకెళ‌దామ‌ని చెప్పిన వేద వండ‌ర్ లాకి తీసుకెళుతుంది. త‌న వెంటే య‌ష్ కూడా వెళ‌తాడు. అక్క‌డ వేద .. ఖుషీని అడ్డంపెట్టుకుని ఓ ఆట ఆడుకుంటుంది. అయితే త‌న కంప‌నీ కోసం ఓ ముఖ్య‌మైన డీల్ ని ఫైన‌ల్ చేయాల్సిన య‌ష్ వేద ప‌క్క‌నే వుండి పోవ‌డంతో స‌ద‌రు డీల్ కుదుర్చుకోవాల‌నుకున్న జంటే వండ‌ర్ లాకు వ‌చ్చేస్తుంది. Also read:గ్రాండ్ ఫినాలే సాక్షిగా వ‌క్ర‌బుద్ది చూపించిన ష‌ణ్ముఖ్‌ వారిని అక్క‌డ చూసిన య‌ష్ ఎక్క‌డ దొరికి పోతానో అని త‌న భార్యగా వేద‌ని న‌టించ‌మ‌ని కోర‌తాడు. ముందు స‌సేమీరా అన్నా ఆ త‌రువాత ఓకే చెబుతుంది. దీంతో ప్ర‌తీ సీన్ ఫ‌న్ ని క్రియేట్ చేస్తూ వేద‌కు కోపాన్ని తెప్పించేలా సాగుతుంది. ఇంత‌కీ య‌ష్ కంప‌నీతో డీల్ కుదుర్చుకోవాల‌నుకున్న భార్యా భ‌ర్త‌ల జంట వేద‌, య‌ష్ భార్యా భ‌ర్త‌లు కాద‌ని తెలుసుకుంటుందా? .. ఈ విష‌యం తెలిసి య‌ష్ ని వేద ఎలా ఆడుకుంది అన్న‌ది తెలియాలంటే మంగ‌ళ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే. 

 సుడిగాలి సుధీర్‌కి షాకిచ్చిన తార‌క‌ర‌త్న‌

  బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ బ్యాచ్ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. కామెడీ చేస్తూనే డ‌బుల్ మీనింగ్ డైలాగ్ ల‌తో వీరు చేసే ర‌చ్చ చాలా సంద‌ర్భాల్లో ట్రోలింగ్ కి గురైంది కూడా. ఈ షో లో సుడిగాలి సుధీర్ ది ప్ర‌త్యేక శైలి. ర‌ష్మీతో గ‌త కొన్నేళ్లుగా ఆన్ స్క్రీన్ ల‌వ్ ట్రాక్ న‌డుస్తోంది. ఆఫ్ స్క్రీన్ కూడా వీరి మ‌ధ్య ల‌వ్ న‌డుస్తోంద‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో సుడిగాలి సుధీర్ మ‌రింత‌గా పాపుల‌ర్ అయ్యాడు. Also read:ర‌ష్మీ గౌనుతో ఆది స్కిట్ అంటా? ఇదిలా వుంటే ఈ పాపులారిటీనే సుడిగాలి సుధీర్‌ని తార‌క‌ర‌త్న చేతిలో అడ్డంగా బుక్క‌య్యేలా చేసింది. సుడిగాలి సుధీర్ టీమ్ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ తో పాటు `శ్రీ‌దేవి డ్రామా సెంట‌ర్`లోనూ త‌మ‌దైన స్కిట్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ షోకు హోస్ట్ గా ఇంద్ర‌జ వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా టీమ్ స‌భ్యులుగా హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. Also read:సిరికి ద‌క్కింది ఎంతో తెలుసా? ఈ షోకి గెస్ట్‌గా తార‌క‌ర‌త్న‌ని ఆహ్వానించారు. షోలోకి ఎంట్రీ ఇస్తూనే సుడిగాలి సుధీర్‌పై పంచ్‌లేశారు. `కొంచెం యాంక‌రింగ్ చేయండి సుధీర్ గారు` అన్నారు దీనికి రిప్లై ఇచ్చిన సుధీర్ తాను యాంక‌ర్ ని కాద‌ని, ఎంట‌ర్‌టైన‌ర్ ని అని వెంట‌నే చెప్పేశాడు. ఆ వెంట‌నే `స‌రే ఏద‌న్నా చేయండి` అని తార‌క రత్న షాకివ్వ‌డంతో ఏంటీ ఈయ‌న ఇలా త‌గులుకున్నాడ‌ని సుడిగాలి సుధీర్ బిత్త‌ర చూసులు చూసిన తీరు న‌వ్వులు పూయిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ నెల 26న ప్ర‌పారం కానున్న ఈ ప్రొగ్రాం న‌వ్వులు కురిపించ‌డం ఖాయం అని అంతా అంటున్నారు. ఈ ప్రోమోలో గెట‌ప్ శ్రీ‌ను వేసిన త‌లైవా గెట‌ప్‌, అత‌ని హావ‌భావాలు.. హిజ్రాల బాధ‌ల్ని తెలియ‌జేస్తూ వేసిన స్కిట్ ఆక‌ట్టుకుంటోంది. 

అరియానాకు సిరి అడ్డంగా దొరికిందిగా

  బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. అయినా ఇంకా వార్త‌ల్లో నానుతూనే వుంది. కార‌ణం ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు వ్య‌వ‌హ‌రించిన తీరే. హౌస్‌లో సిరి, షన్నుల మ‌ధ్య జ‌రిగిన ట్రాక్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్ గానే కొన‌సాగుతోంది. దీనిపై బిబి4 సీజ‌న్ కంటెస్టెంట్, బిగ్‌బాస్ బ‌జ్ హోస్ట్ అరియానా గ్లోరి త‌న‌దైన స్టైల్లో స్పందించింది. సిరితో ప్ర‌త్యేకంగా మాట్లాడిన అరియానా ఓ విధంగా చెప్పాలంటే సిరిని చెడుగుడు ఆడేసుకుంద‌ని చెప్పొచ్చు. హౌస్‌లో సిరి, ష‌న్ను స‌మ‌యం చిక్కితే చాలు ఫ్రెండ్షిప్ హ‌గ్ అంటూ వ‌రుస హ‌గ్గుల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో వీరిపై నెటిటివిటీ మొద‌లైంది. అంత వ‌ర‌కు స‌పోర్ట్ గా నిలిచిన ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా స‌న్నీ వైపు తిరిగి అత‌న్ని స‌పోర్ట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ సిరిని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసింది అరియానా. హౌస్ లో స‌న్నీని టార్గెట్ చేశావా? అని అరియానా అడిగితే లేదు అని చెప్పింది సిరి. టాస్కుల్లో గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌టంతో అత‌నితో ఫ్రెండ్షిప్ చేసే అవ‌కాశం ఎలా వుంటుంద‌ని సిరి చెప్ప‌డంతో మ‌రి ష‌న్నుతో కూడా జ‌రిగింది అంత‌కు మించి క‌దా అని పంచ్ ఏసింది. Also read:సిరి, ష‌న్ను రిలేష‌న్ పై స‌న్నీ కామెంట్ ర‌విని నామినేట్ చేశారు. అత‌ను వెళ్లిపోగానే అత‌ని కోస‌మే గేమ్ ఆడుతున్నామ‌ని అని చెప్ప‌డం ఏంటీ?  అని అడిగింది అరియానా.. దీంతో సిరికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఇక ఫైన‌ల్ గా చోటు కావాలా? ష‌న్ను కావాలా అంటే ఇద్ద‌రిలో ఎవ‌రిని ఎంచుకుంటావ‌ని సిరికి దిమ్మ‌దిరిగే పంచ్ వేసింది అరియానా. అయితే అరియానా ఊహించిన‌ట్టే ఆ ప్ర‌శ్న‌కు ఏం స‌మాధానం చెప్పాలో తేల్చుకోలేక మౌనంగానే చూస్తుండి పోయింది సిరి. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.  

హీరో అవుతున్న బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌!

  బిగ్ బాస్ సీజ‌న్ 5లో వీక్ష‌కుల అభిమానాన్ని పొందిన కంటెస్టెంట్ల‌లో జ‌స్వంత్ అలియాస్ జెస్సీ ఒక‌డు. మోడ‌ల్ అయిన జెస్సీ 8వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి, త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో మంచివాడ‌నిపించుకున్నాడు. తోటి కంటెస్టెంట్ల అభిమానాన్నీ పొందాడు. ముఖ్యంగా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, సిరి హ‌న్మంత్‌ల‌కు అత‌ను స‌న్నిహిత స్నేహితుడ‌య్యాడు. అయితే స‌డ‌న్‌గా అనారోగ్యం బారిన‌ప‌డి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు జెస్సీ.  Also read: బిగ్‌బాస్ 'వీజే'త స‌న్నీకి ద‌క్కింది ఎంత‌? కాగా, తాను హీరోగా ఓ సినిమా చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఆనంద‌ప‌రిచాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఎక్స్ కంటెస్టెంట్‌గా హాజ‌రైన అత‌ను ఈ విష‌యాన్ని చెప్పాడు. అయితే అత‌ను బ్యాన‌ర్ పేరు త‌ప్పుగా ప్ర‌స్తావించాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించే సినిమాలో తాను సినిమా చేస్తున్న‌ట్లు అత‌ను చెప్పాడు. కాగా ఈరోజు త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసిన పోస్టులో బ్యాన‌ర్ పేరును క‌రెక్ట్‌గా చెప్పాడు. మైత్రేయ‌ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మించే, సందీప్ మైత్రేయ డైరెక్ట్ చేసే సినిమాలో హీరోగా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు జెస్సీ. Also read: మీకు న‌చ్చిన‌ట్లు కాకుండా వాడికి న‌చ్చిన‌ట్లు ఉండ‌నివ్వండి.. దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌! "గైస్‌.. త్వ‌ర‌లో నా ఫ‌స్ట్ మూవీ ప్రాజెక్ట్ మొద‌ల‌వుతుంద‌నే విష‌యం షేర్ చేసుకోవ‌డానికి సంతోషిస్తున్నా. ఈ మూవీని సందీప్ మైత్రేయ డైరెక్ష‌న్‌లో మైత్రేయ‌ మోష‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది" అని అత‌ను రాసుకొచ్చాడు. సో.. యాక్ట‌ర్‌గానూ అత‌ను ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటాడ‌ని ఆశిద్దాం.

ర‌వితేజ‌ను ఆడుకున్న బాల‌య్య‌!

  'అఖండ' మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌ను అందుకున్న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఓటీటీ వేదిక‌పై కూడా చెల‌రేగిపోతున్నారు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'ఆహా'లో ఆయ‌న ఫ‌స్ట్ టైమ్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సెల‌బ్రిటీ షో 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' ఇన్‌స్టంట్ హిట్ట‌యింది. ఇప్ప‌టికి స్ట్రీమింగ్ అయిన ఐదు ఎపిసోడ్లను ఆడియెన్స్ బాగా ఆద‌రించిన‌ట్లు, ఆస్వాదించిన‌ట్లు రిపోర్టులు వ‌చ్చాయి. మొద‌టి ఎపిసోడ్‌లో మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌లో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌లో బోయ‌పాటి శ్రీ‌ను, ఐదో ఎపిసోడ్‌లో రాజ‌మౌళి, కీర‌వాణి వ‌చ్చారు. వారితో బాల‌య్య జ‌రిపిన స‌ర‌దా సంభాష‌ణ వీక్ష‌కుల‌కు బాగా న‌చ్చేసింది. అస‌లు బాల‌య్య‌లో ఈ త‌ర‌హా కోణం ఒక‌టి ఉంద‌నే విష‌యం ఇప్ప‌టిదాకా తెలియ‌లేద‌నీ, హోస్ట్‌గా బాల‌య్య చాలా బాగా ఆక‌ట్టుకుంటున్నార‌నీ వీక్ష‌కులు అంటున్నారు. Also read: బిగ్‌బాస్ 'వీజే'త స‌న్నీకి ద‌క్కింది ఎంత‌? కాగా ఆరో ఎపిసోడ్‌లో 'క్రాక్' జోడీ ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని గెస్టులుగా క‌నిపించ‌నున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను ఆహా త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోల ప్ర‌కారం బాల‌య్య త‌న గెస్టుల‌తో గేమ్‌లు కూడా ఆడిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఒక తాడును గోపీచంద్ న‌డుముకు చుట్టి, అత‌డిని మ‌ధ్య‌లో నిల‌బెట్టి, తాడు ఒక కొస‌ను త‌ను ప‌ట్టుకొని, రెండో కొస‌ను ర‌వితేజ చేతికి అందించారు బాల‌య్య‌. గోపీచంద్‌ను ఆయ‌న ఎలా ఆడుకుంటాడ‌నేది ఈ నెల 24న స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్‌లో మ‌న‌కు తెలుస్తుంది. అన్న‌ట్లు గోపీచంద్ డైరెక్ష‌న్‌లోనే త‌న నెక్ట్స్ మూవీని చేయ‌నున్నాడు బాల‌య్య‌. Also read: 'ఎవరు మీలో కోటీశ్వరులు'.. మహేష్ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగా!! ఇదిలా ఉంటే.. బాల‌య్య షోకు ర‌వితేజ రావ‌డం కూడా చాలామందిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే గ‌తంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏవో గొడ‌వ‌లు ఉన్న‌ట్లు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారమైంది. త‌న స‌ర‌స‌న హీరోయిన్‌గా చేసిన ఒక న‌టి, ఆ త‌ర్వాత బాల‌కృష్ణ సినిమాలో హీరోయిన్‌గా న‌టించేందుకు అంగీక‌రించిన‌ప్పుడు, వ‌ద్ద‌ని ర‌వితేజ వారించాడ‌నీ, ఇది తెలిసి ర‌వితేజ‌కు బాల‌య్య గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడ‌నీ వ‌దంతులు వ‌చ్చాయి. అందులో ఎంత నిజ‌ముందో తెలీదు. ఇప్పుడు బాల‌య్య షోకు ర‌వితేజ రావ‌డంతో ఆ ఇద్ద‌రు ఏం మాట్లాడుకుంటారో చూడ్డానికి చాలామంది ఎదురుచూస్తున్నారు.

సిరికి ద‌క్కింది ఎంతో తెలుసా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 మొత్తానికి ముగిసింది. ఈ సీజ‌న్‌లో అంతా ఊహించిన‌ట్టుగానే వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. క‌ప్పు ముఖ్యం బిగులూ అంటూ గ‌త కొన్ని వారాలుగా సంద‌డి చేసిన స‌న్నీ అన్న‌ట్టుగానే క‌ప్పు ని ద‌క్కించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌నికి ప్రైజ్ మ‌నీ కింద భారీ మొత్తమే ద‌క్కింది. విజేత‌గా 50 ల‌క్ష‌ల ప్ర‌నైజ్ మ‌నీన‌ని సొంతం చేసుకున్న స‌న్నీ 15 వారాల‌కు గానూ మ‌రో 25 ల‌క్ష‌లు.. సువ‌ర్ణ కుటీర్ వారు అందించే 300 గ‌జాల ఫ్లాట్.. టీవీఎస్ బైక్ ల‌ని ద‌క్కించుకుని దాదాపు కోటికి మించి అందుకున్నాడు. దీంతో ఫైన‌ల్ వ‌ర‌కు వున్న వారు ఎంత గెలుచుకుని వుంటార‌నే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. స‌న్నీ బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని, 300 గ‌జాల ఫ్లాట్ ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ తో పాటు 15 వారాల‌కు గానూ 25 ల‌క్ష‌ల‌ని కూడా ద‌క్కించుకుని అంద‌రికి షాకిచ్చాడు. గ‌త సీజ‌న్ కంటెస్టెంట్ ల‌తో పోలిస్తే స‌న్నీ భారీగా సొంతం చేసుకోవ‌డంతో ఇత‌ర స‌భ్యుల ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది. చివ‌రి వ‌ర‌కు నిలిచిన టాప్ 5లోని కంటెస్టెంట్ ల గురించి ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. వీరికి 15 వారాల‌కు గాను ద‌క్కింది ఎంత అన్న‌ది ఇప్పుడు హాట్ న్యూస్‌. చివ‌రి వ‌ర‌కు నిలిచిన వ్య‌క్తులు శ్రీ‌రామ‌చంద్ర‌, మాన‌స్ , సిరి. ఈ ముగ్గురిలో సిరి సొంతం చేసుకున్న రెమ్యున‌రేష‌న్ బ‌య‌టికి వ‌చ్చింది. గ్రాండ్ ఫినాలే ప్రారంభం కాగానే ముందు ఎలిమినేట్ అయిన వ‌క్తి సిరి. ఆమెకు 15 వారాల‌కు గాను 25 ల‌క్ష‌లు ద‌క్కిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వారానికి 1.5 ల‌క్ష‌ల నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషికంగా నిర్ణ‌యించాయ‌ర‌ట‌. ఆ లెక్కల ప్ర‌కారం సిరికి 25 ల‌క్ష‌లు ద‌క్కింద‌ని చెబుతున్నారు.

సిరి, ష‌న్ను రిలేష‌న్ పై స‌న్నీ కామెంట్

క‌ప్పు ముఖ్యం బిగులూ.. అప్నా టైమ్ ఆయేగా.. అమ్మ‌కు క‌ప్పు బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని మాటిచ్చా.. అంటూ వీక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న వీజే స‌న్నీ అలియాస్ అరుణ్ రెడ్డి అన్న‌ట్టుగానే బిగ్‌బాస్ సీజ‌న్ 5 విజేత‌గా నిలిచాడు. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో విజేత ఎలా వుండాలో చూపించి ఫైన‌ల్ గా క‌ప్పు కొట్టాడు. ప్రైజ్ మ‌నీనీ కూడా భారీగానే ద‌క్కించుకుని అంద‌రి చేత ఔరా అనిపించుకున్న స‌న్నీ స్టేజ్ పై చెప్పిన మాట‌లు అంద‌రిని క‌దిలించాయి. ఇక హౌస్ లో స‌రి, స‌న్నీల మ‌ధ్య జ‌రిగిన స‌న్నివేశాల‌ని, వారి మ‌ధ్య వున్న అనుబంధంపై వ‌స్తున్న ఊహాగాల‌కు క్లారిటీ ఇచ్చాడు. ఈ జ‌ర్నీలో త‌న‌ని సిరి, ష‌న్ను వాంటెడ్ గా ఇంబ్బందుల‌కు గురిచేసినా.. అత‌న్ని విల‌న్ గా చిత్రీక‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చేసినా వాట‌న్నింటినీ న‌వ్వుతూనే భ‌రించాడు.. మ‌ళ్లీ వాళ్ల స్నేహం కోసం త‌పించాడు. త‌న‌ని ఎంత దూరం పెట్టాల‌ని స‌రి - ష‌న్ను ప్ర‌య‌త్నిస్తే తాను వారికి అంత ద‌గ్గ‌ర‌య్యేందుకు తాప‌త్ర‌య‌ప‌డ్డాడు.. అక్క‌డే స‌న్నీ గెలిచాడు. ఇక హౌస్ లో త‌న‌ని ఎంత‌గా అన్ పాపుల‌ర్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా వారి స్నేహం కోస‌మే ముందుకు వెళ్లిన స‌న్నీ గ్రాండ్ పినాలే సాక్షిగా వాళ్ల క‌ళ్లు తెరిపించే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. త‌న‌ని ద్వేషించినా వారికి మంచే చేయాల‌న్న ఉద్దేశంతో స‌న్నీ.. సిరి - ష‌న్నుల బంధంపై వ‌స్తున్న కామెంట్స్‌కి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ష‌న్ను - సిరిల బంధం గురించి క్లారిటీ ఇవ్వాలి సార్ అని నాగ్ కు చెబుతూనే వారిది మాన‌స్ కు త‌న‌కు ఉన్న బంధం లాంటిద‌ని స్ప‌ష్టం చేశాడు. అంతే కాకుండా సిరి - ష‌న్నుల పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఫైన‌ల్ స్టేజ్ పై స‌న్నీ అన్న మాట‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ర‌ష్మీ గౌనుతో ఆది స్కిట్ అంటా?

కోవిడ్ కార‌ణంగా ఓటీటీల హ‌వా మ‌రీ ఎక్కువైపోయింది. అదే త‌ర‌హాలో బుల్లితెర పై రియాలిటీ షోలు కూడా సంద‌డి చేస్తూ ఆక‌ట్టుకుంటున్నాయి. కొత్త కొత్త కాన్సెప్ట్ ల‌తో ఓటీటీల‌తో పాటు బుల్లితెర‌పై కూడా విభిన్న‌మైన రియాలిటీ షోలు మొద‌లుపెట్టేశారు. ఊహ‌కంద‌ని వ్య‌క్తులు హోస్ట్ లు గా తెర‌పైకొస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ `అన్ స్టాప‌బుల్‌`ని ప్ర‌సారం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా కూడా మాస్ట‌ర్ చెఫ్ ఛాలెంజ్ కోసం హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించి ఆ త‌రువాత అన‌సూయ పోటీతో త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక ఈ షోల‌కు ముందే బుల్లితెర‌పై హాస్య ప్రియుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌.. తాజాగా ఇదే పంథాని అనుస‌రిస్తూ `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` షోని ప్రారంభించారు. ఇదిలా వుంటే న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేస‌న్స్ కోసం ప్ర‌త్యేకంగా ఓ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ని `పెళ్లాం వ‌ద్దు.. పార్తీ ముద్దు`గా డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హైప‌ర్ ఆది.. ర‌ష్మీనై వేసిన పంచ్‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ షోకి ఛీఫ్ గెస్ట్ గా వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఆహ్వానించారు. ఆయ‌న ముందే హైప‌ర్ ఆది.. ర‌ష్మీ గౌన్‌లో స్కిట్ చేసుకుంటానంటూ ఓవ‌ర్ డోస్ పంచ్‌లు వేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. నెట్టెడ్ గౌన్ వేసుకొచ్చిన ర‌ష్మీ ముందు నా గౌన్‌ని సెట్ చేయండి అన‌డం... ప్రొడ‌క్ష‌న్ వాళ్లె టెంట్ ఎగిరిపోయింద‌న్నారు ఇక్క‌డుందా? అని ర‌ష్మి గౌన్ ని తాక‌డం..వంటి స‌న్ని వేశాల‌తో తాజా ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ షోలో వ‌రుణ్ సందేశ్, వితిక షేరు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

గ్రాండ్ ఫినాలే సాక్షిగా వ‌క్ర‌బుద్ది చూపించిన ష‌ణ్ముఖ్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలేలో వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. ఆల్ ఎమోష‌న్స్‌ని ప‌లికించిన ప‌రిపూర్ణ‌మైన వ్య‌క్తిగా ఆక‌ట్టుకున్న స‌న్నీత‌న ప్ర‌వ‌ర్త‌న‌తో కోట్లాది మంది హృద‌యాల్ని గెలుచుకుని విజేత అయ్యాడు. బిగ్‌బాస్ టైటిల్ తో పాటు భారీ స్థాయిలోనే ప్రైజ్ మ‌నీని ద‌క్కించుకుని బిగ్‌బాస్ సీజ‌న్ విజేత‌ల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఈ ప‌రిణామం ముందు నుంచి టైటిల్ విజేత‌ను తానే అనుకుంటూ వ‌స్తున్న యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్‌బాస్ స్టేజ్ పై త‌న వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టాడు. స‌న్నీ విజేత‌గా నిలిచి షాకివ్వ‌డంతో మైండ్ బ్లాక్ అయిన ష‌న్ను స్టేజ్ పై త‌న వ‌క్క బుద్దిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు. దీంతో అత‌నిపై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది. ష‌న్ను ర‌న్న‌ర్‌గా నిల‌వ‌డానికి అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో పాటు సిరితో వ్య‌వ‌హ‌రించిన తీరే ప్ర‌ధాన కార‌ణం. యూట్యూబ్‌లొ భారీ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న ష‌ణ్ముక్ అస‌లు బండారం బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చాకే బ‌య‌ట‌కి తెలిసింది. సిరితో బాత్రూమ్ వ‌ద్ద చేసిన ప‌నుల‌కు, మోజ్ రూమ్  సాక్షిగా సిరిని టార్చ‌ర్ పెట్టిన తీరుకే ష‌న్నుని ప్రేక్ష‌కులు ర‌న్న‌ర్ గా నిల‌బెట్టారు. అయితే ఇంత జ‌రిగినా.. త‌న‌ని విజ‌యం అప‌హాస్య‌వం చేసినా స‌న్నీని విజేత‌గా నిలిపినా త‌న త‌ప్పేంటో తెలుసుకోలేక గ్రాండ్ ఫినాలే స్టేజ్ సాక్షిగా మ‌రోసారి ష‌న్ను త‌న వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టాడు. స‌న్నీని విజేత‌గా ప్ర‌క‌టించిన త‌రువాత ర‌న్న‌ర్ స్పీచ్ కావాల‌ని నాగార్జున అడిగితే ష‌ణ్నూ మాట్లాడిన తీరు అత‌ని వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టింది. `ప‌ర్లేదు.. ప‌ర్లేదు.. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్న‌దే ముఖ్యం` అంటూ త‌న‌లో దాగి వున్న విషాన్ని వెల్ల‌గ‌క్కాడు. దీంతో నెట్టింట ష‌న్నూని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు నెటిజ‌న్స్. విన్నింగ్ ముఖ్యం కాదు అన్న‌ప్పుడు ఇన్ని రోజులు హౌస్ లో ఎందుకున్నావ‌ని ర‌న్న‌ర్ గా మిగిలినా ఇంకా బుద్ది రాలేద‌ని తిట్టిపోస్తున్నారు.

బిగ్‌బాస్ 'వీజే'త స‌న్నీకి ద‌క్కింది ఎంత‌?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 మొత్తానికి ముగిసింది. ఈ సీజ‌న్ లో గ‌త రెండు మూడు వారాలుగా విజేత ఎవ‌ర‌న్న‌ది ముందుగానే తెలిసిపోయింది. న‌వ‌ర‌సాల‌ని పండించి.. అనుభవించిన వాడిదే ప‌రిపూర్ణ జీవితం అంటారు. బిగ్‌బాస్ జ‌ర్నీలో స‌న్నీ ఆట తీరుని గ‌మ‌నిస్తే అదే క‌నిపించింది. అందుకే అత‌ను విజేత‌గా నిలిచాడు. అంతే కాకుండా త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో క‌ప్పు తో పాటు కోట్ల మంది హృద‌యాల్ని గెలుచుకున్నాడు. అంతే కాకుండా భారీ స్థాయిలో ప్రైజ్ మ‌నీని కూడా సొంతం చేసుకున్నాడు. గ‌త సీజ‌న్‌ల తో పోలిస్తే తాజా సీజ‌న్ విజేత‌గా వీజే స‌న్నీ ద‌క్కించుకుందే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్రైజ్ మ‌నీ కింద 50 ల‌క్ష‌ల‌తో పాటు సువ‌ర్ణ‌భూమి వారి 300 గ‌జాల స్థ‌లం, ట‌వీఎస్ స్పోర్ట్స్ బైక్‌.. అలాగే డైలీ ఇచ్చే రెమ్యున‌రేష‌న్ అంతా కలిపి చూస్తే భారీగానే స‌న్నీకి అందిన‌ట్టుగా తెలుస్తోంది. దాదాపుగా కోటికి మించే స‌న్నీకి అందిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. ఇలా ఇంత వ‌ర‌కు ఓ కంటెస్టెంట్ ఈ స్థాయిలో ప్రైజ్ మ‌నీని అందుకున్న దాఖ‌లాలు లేవు. టైమ్‌... మాన‌వ ప్ర‌య‌త్నం.. దానికి దైవం అండ‌గా నిలిస్తే అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చ‌ని ప‌క్క‌వారు ద్వేషిస్తున్నా...వారికి ప్రేమ‌ని పంచి వారి హృద‌యాల్ని గెలుచుకోవాల‌ని బిగ్‌బాస్ వేదిక‌గా వీజే స‌న్నీ నిరూపించాడు. అందుకే 19 మంది కంటెస్టెంట్ ల‌తో మొద‌లైన ఈ షోలో ఫైన‌ల్ గా ఆల్ ఎమోష‌న్స్‌ని పండించిన వ్య‌క్తిగా నిలిచి స‌న్నీ విజేత అయ్యాడు. విజేత‌గా స‌న్నీని ప్ర‌క‌టించిన వేళ అత‌నిలో వున్న చిన్న త‌నం బ‌య‌టికి వ‌చ్చి గెంతులేసింది. ప‌క్క‌న నాగ్ స‌ర్ వున్నాడ‌న్న విష‌యాన్ని మ‌రిచి త‌న్మ‌య‌త్వంతో సాధించాన‌న్న సంబ‌రం స‌న్నీ క‌ళ్ల‌ల్లో క‌నిపించింది. క‌ప్పు ముఖ్యం బిగులూ.. అప్నా టైమ్ ఆయేగా ... మ‌చ్చా.. అంటూ స‌న్నీ ప‌లికిన మాట‌లే బిగ్‌బాస్ ఫైన‌ల్ లో అక్ష‌ర స‌త్యాలుగా నిల‌వ‌డం.. ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది.