ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట
Publish Date:Jan 5, 2026
ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.
జనసేన తెలంగాణ కమిటీలు రద్దు
Publish Date:Jan 5, 2026
హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్
Publish Date:Jan 4, 2026
2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?
Publish Date:Jan 3, 2026
అందెశ్రీ కుటుంబానికి అండ!
Publish Date:Jan 3, 2026
భోగాపురం ఎయిర్ పోర్ట్.. క్రెడిట్ వార్.. వాస్తవమేంటంటే?
Publish Date:Jan 5, 2026
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి తదితరులు ప్రయాణించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థ జీఎంఆర్ జూన్ నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండిగ్ ఒక మైలు రాయిగా చెప్పొచ్చు. అయితే ఈ విమానాశ్రయం ఘనత తనదేనంటూ వైసీపీ క్రెడిట్ కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం ఒక రాజకీయ చర్చకు దారి తీసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ విమానాశ్రయానికి అవసరమైన కీలక అనుమతులన్నీ తన హయాంలోలో వచ్చాయని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ కోసం తన హయాంలోనే దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేశామని అంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాటలను టీడీపీ కొట్టి పారేస్తోంది. భోగాపురం విమానాశ్రయం 2015లోనే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడి హయాంలోనే ప్రణాళికలు రూపొందాయనీ, దీనికి కేంద్ర అనుమతులు, భూ సేకరణ, ప్రాథమిక నిర్మాణాలూ చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయనీ చెబుతోంది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పడకేసిందనీ, జగన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వేగం పుంజుకుందనీ చెబుతోంది.
ఈ రాజకీయ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలూ పక్కన పెడితే.. అసలు వాస్తవమేంటంటే.. రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం, ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, వచ్చే జూన్ నాటికి ఈ విమానాశ్రయం ప్రయాణీకులకు అందుబాటులో రావడానికి ప్రధాన కారణం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నది నిర్వివాదాంశం. శ్రీకాకుళం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యంవహిస్తున్న ఆయన భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో వ్యక్తిగత శ్రద్ధ పెట్టి, నిర్దుష్ట వ్యవధిలో పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకుసాగడం వల్లనే ఇంత వేగంగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన చొవర, వ్యక్తిగత పర్యవేక్షణ కారణంగానే గత ఏడాది కాలంగా భోగాపుర విమానాశ్రయ నిర్మాణ పనులు రోజూ మూడు షిప్టులలో నిరంతరాయంగా జరిగాయని అంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా భోగాపురం విమానాశ్రయం రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలను ఆరంభించేందుకు రెడీ కావడం ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన దశ నుంచి న నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఒక్కో సారి అంతకు మించి కూడా సమయం పడుతుంది. ఇందుకు ఉదాహరణ ముంబైలో ఇటీవలే ప్రారంభమైన రెండో అంతర్జాతీయ విమానాశ్రయమే. ఈ విమానాశ్రయం ప్రతిపాదన దశ దాటి, అన్ని అనుమతులూ పొంది.. నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రయాణీకులకు అందుబాటులోకి రావడానికి పాతికేళ్లు పట్టింది. ఇక గత దశాబ్ద కాలంగా బెంగళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ గత దశాబ్ద కాలంగా ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.
అయితే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆఘమేఘాల మీద పూర్తయ్యింది. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఆపరేషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో దశాబ్దాలు పట్టిన పని ఏపీలో రెండేళ్ల లోపే పూర్తయ్యిందంటే.. అది చంద్రబాబు ఫాస్టెస్ట్ గవర్నెన్స్ ఫలితమే అనడంలో సందేహం లేదు.
కొండగట్టు, కోనసీమ ఓ పవన్ కళ్యాణ్?
Publish Date:Jan 3, 2026
దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా జగన్ తీరు!
Publish Date:Jan 2, 2026
వైసీపీ వారికి అప్పనంగా వైకుంఠ ద్వార దర్శనాలు!?
Publish Date:Dec 30, 2025
140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?
Publish Date:Dec 29, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులు ఇవి..!
Publish Date:Jan 2, 2026
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోతే అది జీవితం మీద చాలా గట్టి దెబ్బ అవుతుంది. కానీ ఈ విషయంలో అమ్మాయిలకు ఒక అవకాశం ఉంది. అదే ముందు జాగ్రత్త.. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆ అబ్బాయిలు చేసే పనులే వారిని పట్టిస్తాయి. వీటిని అర్థం చేసుకుంటే అమ్మాయిలు జాగ్రత్తపడి మోసగాళ్ల బారినుండి తప్పించుకోవచ్చు. ఇంతకీ.. అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులేంటో తెలుసుకుంటే..
ప్రవర్తన..
అబ్బాయి అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో ఉంటే వెంటనే కనిపించే మొదటి మార్పు.. ప్రవర్తన మారిపోవడం. అబ్బాయి ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మునుపటిలాగా ప్రేమించకపోవడం, శ్రద్దగా ఉండకపోవడం చేస్తారు.
అవసరాలు..
కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే అబ్బాయి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఇతరుల అవసరాల గురించి, వారి భావాల గురించి అస్సలు పట్టదు. వారికి కావాల్సింది దక్కనప్పుడు వారు సింపుల్ గా దూరం పెడతారు.
నిజాలు..
మొదట చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకున్న వ్యక్తి ఆ తరువాత ఏ విషయాలు చెప్పకుండా గోప్యత మెయింటైన్ చేస్తుంటే, పైగా ఏదైనా విషయం అడిగినప్పుడు నిజం చెప్పకుండా అబద్దాలు చెబుతుంటే అలాంటి వారిని నమ్మడం కష్టం.
సమయం..
ప్రేమలో ఉన్నవారు, ప్రేమిస్తున్న వారు.. తమ పార్ట్నర్ కోసం తప్పకుండా ఏదో ఒక విధంగా సమయాన్ని కేటాయిస్తారు. వారు ఎంత బిజీ అయినా సరే.. సమయాన్ని కేటాయిస్తారు. కానీ మోసం చేసే ఉద్దేశ్యం ఉన్నవారు ఏదో ఒక సాకు చెబుతుంటారు. అలాంటి వారికి బంధం పట్ల సీరియస్ నెస్ ఉండదు.
మాటలు.. చేష్టలు..
మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిల మాటల్లోనూ, చేష్టలలోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. మాటల్లో చాలా తియ్యగా మాట్లాడతారు. గొప్పలు చెబుతారు, తాము చాలా అత్యుత్తమం అనేలా నమ్మిస్తారు. కానీ ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి పూర్తీగా సీన్ మారిపోతుంది. తాము చెప్పిందే చేయాలన్నట్టు డిమాండ్ చేస్తారు. లేకపోతే నిర్లక్ష్యం చూపిస్తారు.
సహాయం..
మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిలు పూర్తీగా స్వార్థంతో ఉంటారు. అమ్మాయి ఏదైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయకపోవడం లేదా తప్పించుకున్నా అతను అమ్మాయిని కేవలం వాడుకుంటున్నాడని అర్థం.
స్వప్రయోజనం..
అబ్బాయి డబ్బు లేదా ఏదైనా సహాయం వంటి వాటికోసం అమ్మాయిని ఒత్తిడి చేసి మరీ ఇబ్బంది పెడుతుంటే అతను మోసం చేసే ఉద్దేశం ఉన్నవాడని అర్థం. నిజంగా ప్రేమించే అబ్బాయిలు తమ వల్ల తను ప్రేమించే అమ్మాయికి ఎలాంటి కష్టం రాకూడదు అనుకుంటారు.
నియంత్రణ..
అమ్మాయి తన కుటుంబానికి, తన సన్నిహితులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసే అబ్బాయిలు ఎప్పుడూ నిజమైన ప్రేమ కలిగి ఉండరు. అమ్మాయిని నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు ఆమెను తమకు అనుగుణంగా వాడుకుంటారు.
బాధ్యత..
ప్రతి అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యత ఉంటుంది. కానీ అతను అమ్మాయి పట్ల బాధ్యతతో ఉండకుండా కేవలం తన సొంత సంతోషం గురించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే అతను అమ్మాయి పట్ల సీరియస్ నెస్ లేనట్టే..
ఎమోషన్స్..
అమ్మాయిలకు సాధారణంగానే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ను పట్టించుకోకుండా , అర్థం చేసుకోకుండా ఉంటే అతను సరైన పార్ట్నర్ కాడని అర్థం.అలాంటి వాడితో ఏ అమ్మాయి సంతోషంగా ఉండలేదు.
- రూపశ్రీ
కొత్త ఏడాదిలో జీవితాన్ని మార్చే 5 మ్యాజిక్ టిప్స్ ఇవి..!
Publish Date:Dec 31, 2025
నార్సిసిస్టులు.. వీళ్లను గుర్తించడానికి ఇవే సరైన మార్గాలు..!
Publish Date:Dec 30, 2025
ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా నాశనం చేసే విషయాలు ఇవి..!
Publish Date:Dec 29, 2025
మనసులోని మాటను దైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారా... ఈ నిజం తెలుసుకోండి..!
Publish Date:Dec 27, 2025
బాదం పప్పు తినే వారికి అలర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుండా తినకండి..!
Publish Date:Jan 2, 2026
డ్రై ప్రూట్స్ కోవలో చాలామంది తమకు తెలియకుండానే నట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో బాదం, వాల్నట్ వంటివి ప్రధానంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని అనుకుంటారు. చాలా రకాల వ్యాధులు రాకుండా చేయడంలో ఈ డ్రై నట్స్ చాలా సహాయపడతాయి. బాదం పప్పులు అటువంటి డ్రై నట్స్ లో ఒకటి. బాదం పప్పులు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి కలిగి ఉంటాయి. ప్రతిరోజూ రాత్రి బాదం పప్పులు నీటిలో నానబెట్టుకుని వాటిని ఉదయాన్నే తినేవారు అధికంగా ఉంటున్నారు. అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని రోజూ అధికంగా బాదం పప్పు తినేవారు కొందరు ఉంటారు. అసలు బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
బాదం తో ఆరోగ్యం..
బాదం అధికంగా తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను కూడా కలిగిస్తుందని కూడా చెబుతున్నారు. ఇది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందట. కాబట్టి బాదం పప్పులు ఎన్ని తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బాదం పప్పుతో నష్టాలు..
బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, బరువు పెరగడం, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వస్తాయి. రోజువారీ సిఫార్సు చేయబడిన బాదం పప్పు తీసుకోవడం వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి మారుతుంది. అయితే వీటిని తక్కువగానే తీసుకోవాలి.
బాదం పప్పును అధికంగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు. బాదం పప్పులో కరిగే ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల వైఫల్యం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
బాదం ఎక్కువగా తినేవారికి బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణ ఆహారంతో పాటు పెద్ద మొత్తంలో బాదం (20 కంటే ఎక్కువ) తీసుకుంటే, అదనపు కేలరీలు చేరి వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇతర ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. బాదంను పెద్ద మొత్తంలో తీసుకుంటే అది శరీరంలోని ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా అలసట, బలహీనత, అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
-రూపశ్రీ
కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా?
Publish Date:Jan 2, 2026
ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే మ్యాజిక్కే!
Publish Date:Dec 30, 2025
శీతాకాలంలో ఉసిరికాయతో ఈ కాంబినేషన్లు ట్రై చేయండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!
Publish Date:Dec 29, 2025
వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!
Publish Date:Dec 27, 2025