వసుధార పెళ్ళి గురించి రిషి తెలుసుకున్నాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ "గుప్పెడంత మనసు" ఎపిసోడ్ -679 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో.. జగతి, మహేంద్రలకి  నిజం తెలియడం తో ఆనందంగా ఉంటారు. రిషి కాలేజీకి వచ్చి "వసుధార మెడ లో ఎవరు తాళి కట్టారు" అని ఆలోచిస్తాడు. అప్పుడే వసుధార వచ్చి రిషికి వెనకాల వైపు కూర్చుంటుంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు.  కాసేపటికి ఎక్కడున్నావ్ వసుధార అని రిషి మెసేజ్ చేస్తాడు. దాంతో అక్కడే ఉన్న వసుధార.. రిషిని చూస్తూ మెసేజ్ చేస్తుంది. కొద్దిసేపు వాళ్లిద్దరి చాటింగ్ సీన్ చూడటానికి బాగుంటుంది. ఒకరినొకరు చూసుకున్నా మాట్లాడుకోకుండా చాటింగ్ కంటిన్యూ చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి, మహేంద్రలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి నవ్వుతూ మాట్లాడుతుంది వసుధార. అదంతా దూరం నుండి గమనించిన రిషి.. "వీళ్ళేంటి బాగా మాట్లాడుకుంటున్నారు.. వసుధార తన పెళ్లి గురించి చెప్పిందా" అని మనసులో అనుకుంటాడు. కాసేపటికి వసుధార అక్కడ నుండి వెళ్ళడంతో.. జగతి, మహేంద్రల దగ్గరికి రిషి వస్తాడు. "వసుధార మీకేమైన చెప్పిందా" అని అడుగగా.. "లేదు మాకేం చెప్పలేదు.. నీకేమైనా చెప్పిందా" అని జగతి అంటుంది. అంతలోనే ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేస్తాడు మహేంద్ర. రిషి వెళ్ళిపోయాక.. "నాకు రిషి, వసుధారలను కలిపే ఆలోచన వచ్చింది" అని జగతితో అంటాడు మహేంద్ర. అదేంటో చెప్పండి అని జగతి అడుగగా.. "వాళ్ళిద్దరిని ప్రాజెక్ట్ మీద టూర్ కి పంపించాలి" అని మహేంద్ర చెప్తాడు. మరొకవైపు వసుధార మెడలో ఎవరు తాళి కట్టారో  ఎలాగైనా నిజం తెలుసుకోవాలని రిషి, వసుధార క్యాబిన్ కి వెళ్తాడు. రిషి ఇండైరెక్ట్ గా తన పెళ్లి గురించి అడిగితే... వసుధార డైవర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఆకలి అవుతుంది రిషి సర్ అని వసుధార అనగానే.. సరే తిను అంటాడు రిషి. మీరు తినకుండా నేను తినను అని వసుధార అనగానే, మొండిదానివి అంటూ సరే పదా తిందాం అని ఇద్దరూ కలసి వెళ్తారు. ఇక మినిస్టర్ గారిని కలిసిన జగతి, మహేంద్ర లను ప్రాజెక్ట్ గురించి మెచ్చుకుంటాడు. ఆ తర్వాత దేవాయానికి ఫోన్ చేసి.. "మేము నాలుగు రోజులు బయటికి వెళ్తున్నాం" అని జగతి చెప్తుంది. "ఎక్కడకి? ఎందుకు వెళ్తున్నారు" అని దేవాయాని అడుగగా.. తర్వాత చెప్తానని ఫోన్ కట్ చేస్తుంది జగతి. దేవయాని మాత్రం వీళ్ళ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వర్ష మీద ఫైర్ అవుతున్న నెటిజన్స్...స్కూల్ కి అలాగా వెళ్ళేది అంటూ...

ఈ మధ్య కాలంలో బుల్లితెర కమెడియన్స్ హంగామా మాములుగా ఉండడం లేదు. సినిమాలు చూసి చాలా ఎక్కువగా ఊహించేసుకుంటూ ఉన్నారు. ఈమధ్య మూవీ సాంగ్స్ ని రీషూట్ చేయించుకుని వాటిల్లో మూవీ హీరోయిన్స్ కంటే ఎక్కువ స్టైల్ గా బుల్లితెర కమెడియన్స్ నటించి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.  ఐతే కొన్ని సందర్భాల్లో అవి వివాదాస్పదమవుతున్నాయి. రీసెంట్ గా వర్ష "మాస్టారు మాస్టారు" సాంగ్ కి డాన్స్ చేసిన ఒక వీడియోని తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్  చేసింది.   "ఘర్షణ" మూవీలో ఆసిన్ స్కూల్ టీచర్ రోల్ లో కాటన్ శారీ కట్టుకుని వెళ్లినట్టు ఇక్కడ వర్ష కూడా అలాగే శారీ కట్టుకుని బుక్ పట్టుకుని వీడియోలో కనిపించింది. ఐతే ఈ వీడియో ఒక స్కూల్ లో షూట్ చేశారు. ఇక ఒక అబ్బాయి వచ్చి "ఐ లవ్ యు మేడం" అని బుక్ లో రాసి వర్షకి ఇవ్వడం మాత్రం నెటిజన్స్ కి అస్సలు నచ్చలేదు. అంతేకాదు వర్ష వేసుకున్న బ్లౌజ్ మీద కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. "అలాంటి బ్లౌజ్ వేసుకుని స్కూల్ కి వెళ్తే చండాలం, యాక్టింగ్ ఓకే కానీ స్కూల్ టీచర్ లా ఉంటే ఇంకా బాగుంటుంది, స్కూల్ ని ఖరాబ్ చేస్తున్నారు, మేడం స్పెల్లింగ్ తప్పు రాసాడు, మంచి సాంగ్ ని చెడగొట్టావ్, మొత్తానికి బుక్ ఇచ్చినతన్ని చూపించలేదు" అంటూ మండిపడుతున్నారు.

వంటలక్కని మళ్ళీ రమ్మని కోరుతున్న నెటిజన్స్

బుల్లితెర మీద టాప్ రేటింగ్ లో దూసుకుపోయిన సీరియల్ "కార్తీక దీపం". ఈ సీరియల్ ప్రతీ ఇంట్లో ఒక ఫామిలీ మెంబర్ లా చక్రం తిప్పింది. ఆడియన్స్  వంటలక్కని సొంత మనిషిలా చూసుకునేవారు. ఆమె సీరియల్ లో ఏడిస్తే ఇక్కడ ఆడియన్స్ కూడా ఏడ్చేవారు. మోనితను సొంత శత్రువుల ఫీలయ్యి తిట్టేవాళ్ళు. డాక్టర్ బాబుని నిజమైన డాక్టర్ లా అనుకుని హారతులిచ్చారు.  ఇలాంటి సీరియల్ కి శుభం కార్డు పడేసరికి ఆడియన్స్ ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ సీరియల్ ఎంత పేరు సంపాదించుకుంది అంటే రీసెంట్ గా రిలీజ్ ఐన వెబ్ సిరీస్ లో కూడా దీని ప్రస్తావన వినిపిస్తుంది. అలాంటి సీరియల్ కాస్త ఐపోయేసరికి ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తోంది. దాని ప్లేస్ లో వచ్చిన బ్రహ్మముడికి ఇంకా ఎవరూ కనెక్ట్ కాలేదు. మరి మన వంటలక్క ఇప్పుడు తన ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. చిల్ అవుతోంది. హాయిగా రిలాక్స్ అవుతోంది. ఆ రిలాక్సింగ్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఫుల్ కామెంట్స్ పెడుతున్నారు.  "మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాం దీప గారు మీరు ఒక్క సీరియల్ తీయోచ్చు కదా మళ్లీ మాటీవీలో..మిస్ యు దీప" అని వాళ్ళ బాధను షేర్ చేసుకున్నారు. కార్తీక దీపం 2 ఎంత తొందరగా వస్తే అంత బాగుండు అనుకుంటున్నారు.

టీఆర్పీ చార్ట్ లో టాప్ లో దూసుకుపోతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'

"కార్తీకదీపం" సీరియల్ ఉన్నన్ని రోజులు కూడా టీఆర్పీ రేటింగ్స్ లో అదే ముందు వరసలో నిలబడేది. కానీ ఇప్పుడు ఆ సీరియల్ కి శుభం కార్డు పడిపోయాక దాని ప్లేస్ లో "గుప్పెడంత మనసు" సీరియల్ మొదటి స్థానంలో నిలబడింది. లేటెస్ట్ టీఆర్పీ రిపోర్ట్స్ ప్రకారం ఫామిలీ అండ్ లవ్ డ్రామాతో నడుస్తున్న ఈ సీరియల్ లో ముఖేష్, రక్షాగౌడ, సాయి కిరణ్ రామ్, జ్యోతి రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మానస్, దీపికా రంగరాజు, హమీదా ఖాతూన్ తదితరులు నటించిన  "బ్రహ్మముడి" సీరియల్ మాత్రం సెకండ్ ప్లేస్ లో నిలబడింది.  ఇక కస్తూరి శంకర్, హరికృష్ణ, ప్రశాంతి తదితరులు నటించిన "ఇంటింటి గృహలక్ష్మి" మూడవ స్థానంలో నిలబడింది. దీంతో పాటు  "కృష్ణ ముకుంద మురారి" కూడా థర్డ్ ప్లేస్ కి వచ్చేసింది. ఆషికా పదుకొణె, చందూ గౌడ నటించిన "త్రినయని" టాప్ 5 లో ఎంటరయ్యింది. అలాగే కామెడీ షోస్ లో జబర్దస్త్ ముందు వరసలో ఉండగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కి రేటింగ్ లో కొంచెం వెనకబడింది. "సుమ అడ్డా" షోకి పూర్తిగా టీఆర్పీ పడిపోయింది. మరోవైపు  శ్రీముఖి హోస్ట్ చేస్తోన్న 'BB జోడి' రేటింగ్ కాస్త పెరిగింది. కన్నడ సినిమా 'కాంతారా' మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది.

నేను ఇల్లు ఎలా కొన్నానంటే...ఇదిగో ఇలా

దీప్తి సునైనా..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి తెలియని వారు లేరు. సోషల్ మీడియా స్టార్ గా ఈమెకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంది. దీప్తీ యూట్యూబ్ లో వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటుంది.  బిగ్ బాస్  సీజన్ 2 లో కంటెస్టెంట్ గా చేసి హీరో తనిష్ తో కొన్ని రోజులు స్క్రీన్ లవ్ ట్రాక్ ని నడిపింది. అప్పట్లో ఈ అమ్మడిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కూడా వచ్చాయి. దీప్తి సోషల్ మీడియాలో ఫాన్స్ అడిగే ప్రశ్నలకు కొన్ని సార్లు ఘాటైన సమాధానాలే చెప్తుంది. లేటెస్ట్ గా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు  ఆమె ఇలా  సమాధానం చెప్పింది.   " ఇల్లు ఎలా కొన్నావ్" అని అడిగేసరికి "నాకు వచ్చే ఆదాయంలో 30 శాతం ఖర్చు పెట్టి 70 శాతం సేవ్ చేసి ఇల్లు కొన్నా" అని ఆన్సర్ ఇచ్చింది. ఇక మరో నెటిజన్ " మీరు చెన్నైకి ఎప్పుడొస్తున్నారు అని అడగడంతో.. త్వరలో వస్తాను అని రిప్లై  ఇచ్చింది. దీప్తికి షన్నుకి మధ్య బ్రేకప్ ఐన దగ్గర నుంచి ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా బిజీ ఇపోయారు. దీప్తి ఫోటో షూట్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఉంటే షన్ను వెబ్ సిరీస్, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ రకరకాల ప్రోగ్రామ్స్ లో ఎంగేజ్ అవుతూ కనిపిస్తున్నారు.  ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ తో చిట్ చాట్ చేయడం వాళ్లకు సరైన సమాధానం ఇవ్వడం వంటివి చేస్తున్నారు ఈ ఇద్దరూ. ఐతే చాలా మంది వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండు అనుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం కలిసేటట్టే లేరు. ఎవరికి వాళ్ళు సొంత కార్లు, ఇల్లు కొనుక్కుని హ్యాపీగా ఉంటున్నారు.  

జెమినీ టీవీలో త్వరలో 'గీతాంజలి' కొత్త సీరియల్ ప్రారంభం!

ఫేమస్ టీవీ యాక్టర్, వదినమ్మ సీరియల్ ఫేమ్ సుజిత ధనుష్ సరికొత్త సీరియల్ తో త్వరలో బుల్లితెర మీద కనిపించబోతోంది. 'గీతాంజలి' అనే టైటిల్‌తో రూపొందిన ఈ కొత్త సీరియల్ లో రవికిరణ్, నరసింహరాజు, లహరి తదితరుల తారాగణం ఇందులో కనిపించింది. త్వరలో ప్రసారం కాబోతున్న ఈ డైలీ సీరియల్ లో  సుజిత ధనుష్ , రవికిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా లహరి మరికొంత మంది సపోర్టింగ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ ఐన ఈ టీజర్ లో గీతాంజలి కుటుంబం, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు ఏమిటి అనేది అర్ధమవుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వారి  వారి సొంత ఆశలు ఉన్నాయి ఐతే  గీతాంజలి చురుకైన భార్య కాబట్టి తన భర్త కోరిక నెరవేరాలని కోరుకుంటుంది. ఇక గీతాంజలి భర్త కూడా భార్య ఆశే తన ఆశ అని చెప్తాడు.   తమిళంలో మంచి రేటింగ్ సంపాదించుకున్న "సెవ్వంతి"కి తెలుగు రీమేక్ ఈ సీరియల్. సుజిత సీరియల్స్ లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్ లో నటించింది. ఈమె డైరెక్టర్ సూర్యకిరణ్ సిస్టర్. సుజిత చైల్డ్ ఆర్టిస్ట్‌గా  తెలుగు వారికి సుపరిచితమే. చిరంజీవి సినిమా  పసివాడి ప్రాణంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. తరువాత జై చిరంజీవి మూవీలో  చిరంజీవి చెల్లిగానూ నటించింది. అలా వెండితెరపై సుజిత సందడి చేసింది. సుజిత సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెర మీద ఎక్కువగా చీరకట్టులో కనిపించే సుజిత.. అప్పుడప్పుడు మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో అదరగొడుతూ ఉంటుంది.

సుమ మీద తారక్ ఫైర్.. కంట్రోల్ చేసిన కళ్యాణ్ రామ్!

రీసెంట్ గా జరిగిన ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ మీద ఫైర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్.  కళ్యాణ్ రామ్ నటించిన "అమిగోస్" మూవీ ఆడియన్స్ ముందుకు   రాబోతున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ టీమ్ . ఈ కార్యక్రమానికి  జూనియర్‌ ఎన్టీఆర్‌ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇంతలో సుమ మాట్లాడుతూ "సొంత పర్సనల్ కానీ  ఫామిలీ అప్ డేట్స్ కోసం మీరు ఎదురు చూడరు కానీ ఎన్టీఆర్@30 ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రతీ ఫ్యాన్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడబోతున్నారు" అంటూ సుమ మైక్ ఇచ్చేసరికి అప్పటికే సుమ మీద సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మైక్ తీసుకుని "వాళ్ళు అడగకపోయినా నువ్వు చెప్పేసేలా ఉన్నావ్"  అన్నాడు. ఆమె  వైపు చాలా కోపంగా చూస్తూ..కళ్యాణ్‌రామ్‌ తన తమ్ముడుని కాస్త కూల్ చేయడానికి ట్రై చేశారు. ఇక మూవీ అప్ డేట్ గురించి మాట్లాడుతూ ఇంట్లో ఉండే మా భార్యకంటే ముందుగా మీకు చెప్తాం అని విన్నవించారు. ఇక ఈ ఎన్టీఆర్@30 మూవీ ఈ నెలలో మొదలుపెడతాం.  మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం 2024 ఏప్రిల్ 5 న ఈ మూవీని రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. మేము చేసే చిత్రాలకు ఎన్ని అవార్డులు వచ్చినా అది మీ గొప్పతనం..మీ ఆశీర్వచనం వలెనే మేము ఇప్పుడు ఇలా ఉన్నాం అని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.  ఇక సుమ చేసిన పనికి నెటిజన్స్ కూడా నెగటివ్ కామెంట్స్ తో ఆమెను ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు.

ఈ యాంకర్ వద్దు అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పిన కమెడియన్స్.. ఫైర్ ఐన రష్మీ!

బుల్లితెర మీద యాంకర్ ల గోల ఎక్కువైపోయింది. యాంకర్ లా గోలా అంటే యాంకర్ లు చేసే హడావిడి కాదు. ఆ విషయం తెలియాలి అంటే ఇటీవల ప్రసారమైన "శ్రీదేవి డ్రామా కంపెనీ" షో చూస్తే అర్ధమవుతుంది. రష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ఈ వారం "నాటి నరేష్ పెళ్లి గోల" కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అలాగే ఈ షోకి "రైటర్ పద్మభూషణ్" మూవీ టీం కూడా ప్రమోషన్స్ లో భాగంగా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది. సుహాస్, టీనా, గౌరీ, ప్రశాంత్ వచ్చారు. తర్వాత ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ "సుహాస్ ఈ షో మొత్తం నువ్వు, రష్మీ యాంకరింగ్ చేస్తే చూడాలని ఉంది" అన్నాడు. "నేను చేయలేనండి" అని సుహాస్ అనేసరికి "ఆ అమ్మాయి కూడా ఏమీ చేయదండి బాబు" అని రాంప్రసాద్ అనడంతో  రష్మీ ఒక ఫన్నీ లుక్ ఇచ్చింది.  "నేను ఒక లింక్ చెప్తాను అది చెప్పండి" అని రష్మీ సుహాస్ తో చెప్పేసరికి "నాకు బ్రాండ్ పేర్లు వరసగా చదవడం రాదండి" అన్నాడు. "ఆ అమ్మాయి కూడా చదవదండి చెవిలో చెప్తారు" అని కామెడీ చేసాడు రాంప్రసాద్. అలా యాంకరింగ్ ఎలా చేయాలో సుహాస్ కి, టీనాకి, గౌరీకి నేర్పించింది. గౌరీ మాత్రం సూపర్ గా తనకు వచ్చినట్టు యాంకరింగ్ చేసేసరికి "శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త యాంకర్ వచ్చింది" అని రాంప్రసాద్ గట్టిగా అరిచాడు. "ఈ షో వాళ్లకు గౌరీని చూపించకండి" అని ఆట పట్టించింది రష్మీ. " నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరే యాంకర్...ఇది ఫిక్స్ " అన్నాడు నాటీ నరేష్. ఆ మాటకు కోపం వచ్చిన రష్మీ "హే కూర్చో" అంది. "యాంకర్ ని  మార్చాలి అనేసరికి ఎంత కోపం వచ్చిందిరా" అన్నారు నరేష్.

యాంకర్స్‌ని తొక్కేసి.. ప్రీరిలీజ్ ఈవెంట్స్‌ని మింగేస్తున్న సుమ!

ఈ మధ్య బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ లో సుమ మీద సెటైర్లు వేయడం ఎక్కువగా చూడొచ్చు. లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఒక షోలో తాను యాంకరింగ్ నుంచి తప్పుకుని రెస్ట్ తీసుకుంటాను అని చెప్పిన దగ్గర నుంచి ఈ సరదా సెటైరికల్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ ఐన "సుమ అడ్డా" షోలో కూడా ఆ కామెంట్స్ ని వినవచ్చు. "బింబిసార" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన మరో లేటెస్ట్ మూవీ 'అమిగోస్' 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ టీం ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతలో కమెడియన్ తాగుబోతు రాజమౌళి మరో లేడీ కమెడియన్ సత్యశ్రీతో వచ్చి "కళ్యాణ్ రామ్..ఏ టీవీ షోకి రామ్ అనే అతన్ని కూడా తీసుకుని ఈ షోలో కూర్చోబెట్టిన మీరు అనేసరికి ఇది సుమ అడ్డా" అనే ఒక రేంజ్ లో చెప్పింది సుమ. "ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని ఆ తాగుడేంటి అని సత్య అడిగేసరికి "మేడం ఈ ప్రోగ్రాంకి రాజీవ్ కనకాల సర్ కూడా రాలేదు కదా..ఎందుకంటే ఆయనకు అందమైన పెళ్ళాం లేదు కదా" అనేశాడు ..ఆ మాటలకు సుమ షాక్ లో ఉండిపోయింది. ఇక ఫైనల్ గా లేడీ కమెడియన్ విద్యుల్లేఖ వచ్చి కళ్యాణ్ రామ్ పక్కన కూర్చుని "కళ్యాణ్ గారు నేను ట్రిపుల్ ఆర్ ఆడిషన్ కి వెళ్లాను " అనేసరికి " హీరోయిన్ కోసమా" అని సుమ అడిగింది. "కాదు కొమ్మా ఉయ్యాలా పాప క్యారెక్టర్ కోసం" అని విద్యు చెప్పేసరికి అందరూ పడీ పడీ నవ్వేశారు. "బ్రహ్మాజీ గారి వైకుంఠపాళీలో పెద్ద పాము ఉంది తెలుసా అదే మన సుమ" అని విద్యు సుమ మీద సెటైర్ వేసేసరికి "నేనెందుకు పామయ్యాను" అని సుమ డౌట్ గా అడిగింది. "అంతమంది యాంకర్స్ ని తొక్కేసి ప్రతీ ప్రీరిలీజ్ ఈవెంట్స్ ని మింగేశారు కదా" అని మరో రియల్ జోక్ వేసేసింది. దానికి సుమ కూడా చాలా ఫన్నీగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.

కనకం గాలిమేడలు రుద్రాణి కూల్చనుందా!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్-11లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణమూర్తికి రాజ్ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాన్ని అప్పు చెప్తుంది. మన స్థాయిలో సంబంధం చూసుకోవాలి కానీ గాల్లో మేడలు కట్టొద్దని కృష్ణమూర్తి అంటాడు. మనలాగే మన పిల్లలు బ్రతకడం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి మంచి జీవితం ఇస్తాను.. నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదని అంటుంది కనకం.  మన గురించి వాళ్ళకి చెప్పావా అని అడుగుతుంది కావ్య. "చెప్పలేదు.. ఎక్కడ మనం ధనవంతులం కాదని తెలిస్తే దగ్గరికి కూడా రానివ్వరని.. వాళ్ళకి మనం ధనవంతులం అనే చెప్పినా" అని అంటుంది కనకం. "ఒక వేళ మనం వాళ్ళ స్థాయి వాళ్ళం కాదని తెలిస్తే.. అక్క పరిస్థితి ఆలోచించావా" అని అడుగుతుంది కావ్య. అవన్నీ నేను చూసుకుంటా అంటూ.. "కొంపదీసి మనం పేదవాళ్ళమని చెప్పేలా ఉన్నావ్..  నువ్వు అలా చెప్తే నా మీద ఒట్టే" అని కనకం తన మీద ఒట్టేసుకుంటుంది. మరొక వైపు రాజ్ ఇంట్లో అందరు.. "నీ కలల స్వప్న సుందరి గురించి ఆలోచిస్తున్నావా" అంటూ రాజ్ ని ఆటపట్టిస్తారు. రాజ్ కి స్వప్న అంటే ఇష్టమని వాళ్ళ అమ్మకు చెప్పడంతో.. ఆమె హ్యాపీ గా ఫీల్ అవుతుంది. రుద్రాణి మాత్రం.. మీరందరు అనుకుంటున్నట్టు వాళ్ళు కోటీశ్వరులు కాదు. నేను అనుకున్నది జరగాలంటే ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని అనుకుంటుంది. స్వప్న కావాలనే తన చెవి కమ్మ రాజ్ ఇంట్లో వదిలేసి ఆ వంక తో మళ్ళీ రెడీ అయి రాజ్ ఇంటికి వెళ్తుంది. అయితే స్వప్న ఫోన్ మర్చిపోవడం చూసిన కావ్య, అప్పులు.. "స్వప్న అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో" అని అనుకొని ఫోన్ స్వప్నకి ఇవ్వాలని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ముకుంద మీద అనుమానపడిన భవాని!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -72 లోకి అడుగు పెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. మనం పూజలో కూర్చొని వ్రతం చేస్తామని భవాని అత్తయ్యకి మాటిచ్చాను అని మురారితో చెప్తుంది కృష్ణ. "ఏంటీ కృష్ణ.. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు. ఇంట్లో ఏ విషయమైనా అమ్మ, పెద్దమ్మ చూసుకుంటారు. నువ్వు ఎందుకు అన్నింటిని పట్టించుకుంటున్నావ్" అని మురారి అంటాడు. ఎలాగైనా పూజలో కూర్చోవాలని మురారిని ఒప్పిస్తుంది కృష్ణ. నీతో కూర్చుంటే ముకుందకి ఇష్టం ఉండదని మనసులో అనుకుంటాడు మురారి. ముకుంద అమ్మవారి చీరని తీసి దాచిపెడుతుంది. ఇక పూజకి అంత సిద్దమై అందరూ కృష్ణ, మురారిల కోసం ఎదురు చూస్తుండగా వాళ్ళు వస్తారు. అయితే కృష్ణ అమ్మవారి చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకోవడంతో.. "అమ్మవారి చీర కట్టుకునే కదా పూజ లో కూర్చోమని చెప్పింది.. ఇప్పుడేంటి ఇలా చేసావ్" అని అంటుంది భవాని. "చీర ఏంటీ అత్తయ్యా.. నాకు ఏ చీర ఇవ్వలేదు" అని కృష్ణ అనగానే.. "రేవతి నువ్వు కృష్ణ కి చీర ఇవ్వలేదా" అని అడుగుతుంది భవాని.  దానికి రేవతి.. "పూజకి అన్నీ సిద్ధం చేసే హడావిడిలో ఇవ్వడం మర్చిపోయా" అంటుంది. అలేఖ్య వెళ్లి చీరని తీసుకు రావడానికి వెళ్లేసరికి.. అక్కడ లేకపోవడంతో చీర లేదని భవానీతో చెప్తుంది. నేను తీసాక అక్కడ చీర ఎలా ఉంటుందని ముకుంద మనసులో అనుకుంటుంది.  అంతలోనే నందు చీర తీసుకొని వస్తుంది. ఎక్కడ నుండి తెచ్చావే ఈ చీర అని ఇంట్లో వాళ్ళు అడగడంతో ముకుంద గదిలోకి ఆడు కోవడానికి వెళ్తే.. అక్కడ ఈ చీర కనిపించింది అని చెప్తుంది నందు. ఆ చీర ముకుంద గదిలో ఏంటని అనుమానపడుతుండగా.. నా భర్త గురించి పూజ చేస్తుండగా నేను ఇలా చేస్తానా అని అంటుంది ముకుంద. ఇక కృష్ణ నువ్వు వెళ్లి చీర కట్టుకొని రా అని భవాని అనగానే కృష్ణ వెళ్లి చీర కట్టుకొని వస్తుంది. ఆ తర్వాత పూజలో కృష్ణ, మురారిలు పాల్గొంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జగతి, మహేంద్రలకు నిజం చెప్పేసిన వసుధార!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్-678 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో... కాలేజీలో రాజీవ్ చేసిన గొడవని జగతి, మహేంద్రలు గుర్తుచేసుకుంటారు. "అసలు వసుధార ఎందుకు ఇలా చేస్తుంది.. పెళ్లి చేసుకుంది.. తన లైఫ్ చూసుకోకుండా, మళ్ళీ రిషి జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది.. చక్రపాణి మన ఇంటికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు.. మనం వెళ్లి చక్రపాణిని అడిగితే అసలు నిజం బయట పడుతుంది" అని జగతితో మహేంద్ర అంటాడు. అలా అనుకుంటూ ఇద్దరు బయలుదేరుతారు. అలా ఇద్దరు వెళ్ళగానే.. "రండి సర్.. రండి టీచరమ్మా" అంటూ కూర్చోమంటాడు. చక్రపాణికి కాలేజీకి వచ్చి రాజీవ్ చేసిన గొడవ గురించి చెప్తారు. అసలు వసుధార మెడలో తాళి ఎవరు కట్టారు అంటూ ప్రశ్నిస్తుంది జగతి. వసుధార ఎవరికీ చెప్పొద్దూ అని ఒట్టు వేయించుకున్న మాటలు గుర్తు చేసుకుంటాడు చక్రపాణి. అంతలోనే వసుధార వస్తుంది. రాజీవ్ తనని రూమ్ లో బంధించిన విషయం దగ్గర నుండి రిషిని చంపేస్తానని బెదిరించిన విషయం వరకు అంతా చెప్తుంది‌‌ వసుధార. ఈ తాళి ఏంటని జగతి అడుగగా.. "అప్పుడు ఏం చెయ్యాలో తెలియక నేనే తాళి మెడలో వేసుకున్నాను. ఇది మీరు పంపిన తాళి. రిషి సర్ నా మెడలో వేశారని అనుకొని నా ఇష్టప్రకారంగా నాకు నేను నా మెడలో వేసుకున్న తాళి. అమ్మేమో హాస్పిటల్ లో, నేనేమో పోలీస్ స్టేషన్ లో.. నిజానిజాలు చెప్పే పరిస్థితిలో నేను లేను" అంటూ చెప్తుంది వసుధార. ఇప్పటికైనా ఈ నిజం రిషికి చెప్పు వసు అని జగతి అంటుంది. "లేదు మేడం.. రిషి సర్ కి మనసులో ఒకటుంది. అది తనంతట  తానే తెలుసుకొని, వాస్తవం తెలుసుకోవాలి.. రిషి సార్ మా ప్రేమని బ్రతికించుకుంటాడు. దయచేసి మా ఇద్దరి మధ్యలో ఎవరు కలుగుజేసుకోవద్దు" అని వసుధార చెప్తుంది. వసుధార మాటలు విన్న జగతి, మహేంద్రలు.. సారీ వసు అని దగ్గరికి తీసుకుంటుంది జగతి. "నిన్ను అర్ధం చేసుకోకుండా తప్పుగా మాట్లాడాం వసుధార" అని మహేంద్ర అంటాడు..  "రిషి సర్ లేకపోతే నేను బతకలేనని నేను ఎలా తెలుసుకున్నానో,‌ రిషి సర్ కూడా తెలుసుకోవాలి. వసుధార చివరి శ్వాస వరకు రిషి సర్ కోసమే జీవిస్తుందని తెలుసుకోవాలి.. నా మెడలో ఎవరో తాళి కట్టారని ఎలా అనుకుంటారు? నిజం తెలుసుకోవాలి మేడం.. మీరు మాత్రం రిషి సర్ కి నిజం చెప్తే మా ప్రేమ మీద ఒట్టే" అని జగతి చేతిని తన నెత్తి మీద పెట్టుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అలా జరిగింది నా జబర్దస్త్ యాంకరింగ్ ఆడిషన్ అన్న సౌమ్యరావు!

సౌమ్యరావు జబర్దస్త్ యాంకర్ గా ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ప్రేక్షకులు కూడా ఆమెకు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సౌమ్య తనకు ఈ జబర్దస్త్ ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయాన్ని ఒక వీడియోగా చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ డేట్ చేసింది. " ఈటీవీలో నేను చేసిన "భలే మంచి రోజు" అనేది నా ఫస్ట్ స్టేజి షో. అదే టైంలో నేను ఒక జబర్దస్త్ టీమ్ తో ఫన్నీగా మాట్లాడానట. అది చూసిన జబర్దస్త్ మేకర్స్ నా గురించి కనుక్కోమని చెప్పారట. ఐతే అప్పటికి నాకు సీరియల్స్ తప్ప జబర్దస్త్ అనే ఇంత పెద్ద షో ఉందన్న విషయం కూడా తెలీదు. అలాగే సెప్టెంబర్ లో నాకు ఒక కాల్ వచ్చింది. తీరా చూస్తే యాంకరింగ్ లో ఇంటరెస్ట్ ఉంది..వస్తారా అని అడిగారు. నేను ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని అనుకుని నేను సీరియస్ గా మాట్లాడాను. ఇక చివరికి ఆ కాల్ నిజమని అది మల్లెమాల వాళ్ళ నుంచి వచ్చింది అని తెలిసింది. అప్పుడు నేను వాళ్లకు ముందుగా చెప్పిన విషయం నాకు తెలుగు రాదు మీరు ఓకే అంటే ఆడిషన్ కి వస్తాను అని నేను చెప్పేసరికి పర్వాలేదు తర్వాత తెలుగు వచ్చేస్తుంది మీ తెలుగు ప్రెటీగా ఉంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు రండి అని చెప్పారు. అలా ఆడిషన్ కి వెళ్ళాను. తర్వాత ఫోర్ కాస్ట్యూమ్స్ లో నన్ను టెస్ట్ చేశారు. మోడరన్, ఇండో వెస్ట్రన్, టిపికల్, ట్రెడిషనల్ అన్నిట్లో చూసారు. నాతో డైలాగ్స్, స్పాన్సర్స్ నేమ్స్ చెప్పించారు. ఇంకో ఫన్నీ థింగ్ ఏమిటి అంటే అన్ని కాస్ట్యూమ్స్ వేయించి మూడు కెమెరాలు పెట్టి నవ్వమని చెప్పారు. అలా నేను కూడా నవ్వాను. అలా వారం తర్వాత ఫోన్ చేసి రెండు రోజుల్లో షూట్ ఉంది వచ్చేయండి అన్నారు. నాకు డాన్స్ అంత బాగా రాదు. నాది కొంచెం షై క్యారక్టర్...అనసూయ, రష్మీ గారు సూపర్ గా డాన్స్ చేస్తారు. నాకు సీరియల్స్ లో నటించడం తెలుసు కానీ ఇలా డాన్స్ చేయడం అనేది నాకు చాలా భయం. డాన్స్ క్లాసెస్ కి వెళ్తున్నా..త్వరలోనే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాను. ఇంకా చెప్పాలి అంటే మల్లెమాల వాళ్ళు నాకు కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు. కానీ నేను అంత మోడరన్ కాదు. మోడరన్ డ్రెస్సెస్ వేసుకోవడం కూడా త్వరలో అలవాటు చేసుకోవాలి. ఏది నేర్చుకోవాలి అన్నా కొంచెం టైం పడుతుంది కదా..టైం ఇస్తే పర్ఫెక్ట్ గా చేస్తాను" అని చెప్పింది సౌమ్యరావు.

స్వప్న మీద మనసు పారేసుకున్న రాజ్!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ -10 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో... స్వప్నతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు రాజ్. తన దగ్గరే ఉండి తన గురించి తెలుసుకోవాలనుకుంటాడు రాజ్. స్వప్న తో రాజ్  ప్రేమగా  మాట్లాడడం చూసిన కనకం.. "నా కూతురు ఎలాగైనా ఈ ఇంటికి కోడలు అయ్యేలా ఉంది"  అంటూ మురిసిపోతుంది. అలాగే సీతారామయ్యతో రాజ్.. "స్వప్న మన ఇంటి పూజ ఆగకూడదని డాన్స్ చేసింది. అంత చేసిన స్వప్నకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న తాతయ్య" అని చెప్తాడు. సరే రాజ్ సంగీతానికి సత్కారం జరిగినట్లు ఉంటుంది. మంచిదే కదా ఇవ్వు అంటాడు సీతరామయ్య. దాంతో రాజ్ స్వప్నకి డైమండ్ నెక్లెస్ ఇస్తాడు.  కనకం మాటల్లో ఏదో తేడా ఉందని గమనించిన రాజ్ అత్తయ్య రుద్రాని.. అన్ని ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటుంది. కనకం మాట దాటే ప్రయత్నం చేస్తుంటుంది. మళ్ళీ ఎలాగైనా రాజ్ ని కలవాలని భావించిన స్వప్న తన చెవి కమ్మని బెడ్ మీద పడేసి వెళ్తుంది. అందరూ ఆటోలో వెళ్లడం చూసిన రుద్రాని.. "ఇంత రిచ్ పీపుల్ ఆటోలో వెళ్లడం ఏంటీ.. వీళ్ళ సంగతి ఏంటో చూస్తా" అని అనుకుంటుంది. నా డ్యాన్స్ కి బహుమతిగా ఈ నెక్లెస్ ఇచ్చారంటూ స్వప్న మురిసిపోతుంది. "ఆ నెక్లెస్ కావ్య అక్కకి చెందాలి.. అక్కే డాన్స్ నేర్పించింది" అంటూ అప్పు దానిని స్వప్న చేతినుండి తీసుకొని కావ్య మెడలో వేస్తుంది. నాకు వద్దని కావ్య చేతిలోకి తీసుకోగా.. "నేను డ్యాన్స్ చేస్తే వచ్చింది" అని బలవంతంగా లాక్కుంటుంది స్వప్న. ఆ తోపులాటలో కావ్య చేతికి గాయం అవుతుంది. ఇదంతా విన్న వాళ్ళ నాన్న "అక్కడ ఏదో జరిగింది... ఏం జరిగింది చెప్పు అప్పు" అంటూ అడుగుతాడు. అప్పు అక్కడ  జరిగిందంతా చెప్తుంది. దాంతో కనకం మీద కోప్పడతాడు కనకం భర్త. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆదర్శ్ ఆచూకి కోసం వ్రతం చేయనున్న కృష్ణ, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ - 71 లో అడుగుపెట్టింది. రోజుకో ట్విస్ట్ తో సినిమాని తలపిస్తున్న  ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో.. ఆదర్శ్ గురించి కుటుంబసభ్యులు అంతా చర్చించుకుంటారు.  పోలీసులచేత వెతికిస్తే సరిపోదు.. మనం దగ్గరుండి ఎక్కడికి దాకా వచ్చిందని గమనిస్తూ ఉండాలని కృష్ణ చెప్పగా.. "నీకే తెలుసు అనుకుంటున్నావా ఇంట్లో ఇంతమంది ఉన్నారు వారికి తెలియదా.. వాళ్ళంతా ఎప్పటినుంచో వెతికిస్తూనే ఉన్నారని రేవతి కోప్పడుతుంది. పక్కనే ఉన్న భవానీ రేవతిపై కోప్పడుతుంది. అడవిపిల్ల అయినా కరెక్ట్ గా మాట్లాడింది. వెతకండి అని చెప్పడం వేరు.. మనం దగ్గర ఉండి గమనించడం వేరు.. మొదటిది ఆల్రెడీ చేశాం.. రెండవది చేయడం మర్చిపోయాం" అని భవానీ అంటుంది. భవానీ కుటుంబం పంతులుని పిలిపిస్తుంది. ఆదర్శ్ తిరిగిరావాలంటే సౌభాగ్యవతి వ్రతం చేపించాలి. ఆ వ్రతాన్ని ఇద్దరు దంపతులు కలిసి చేపించాలని పంతులు చెప్తాడు. వెళ్ళేముందు భవానీకి ఒక చీరని ఇస్తాడు పంతులు.  "అష్టలక్ష్మీ అమ్మవారి గుడిలో పూజలో ఉంచిన చీర ఇది. వ్రతంలో కూర్చొనే దంపతులు ఈ చీరని కట్టుకొని పూజ చేయాలి" అని పంతులు చెప్పేసి వెళ్తాడు. ఆ తర్వాత పూజలో ఎవరు కూర్చుంటారనే సంభాషణలో కృష్ణ, మురారి కలిసి పూజలో కూర్చుంటారని భవానీ చెప్పింది.  పూజ ఫలిస్తుందా? లేదా? ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

వసుధార మెడలో తాళి కట్టిందెవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ -677 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో .. వసుధారని వెతుక్కుంటూ కాలేజ్ కి వస్తాడు రాజీవ్. అక్కడ జగతి, మహేంద్రలతో నా భార్య వసుధార ఎక్కడ అంటూ అడుగుతాడు. మీ పర్సనల్ విషయాలు‌ ఇక్కడ మాడ్లాడకు.. ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మీ ఇంటికెళ్ళి చూసుకోమని మహేంద్ర చెప్తాడు. మీ కాన్ఫరెన్స్ లోకి వస్తేనే మీరు ఇలా అంటున్నారు. మరి నా కాపురంలోకి వస్తే నేనేం అనాలని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత కాసేపు అలాగే వాగ్వాదం జరిగాక వసుధారని వెతుక్కుంటూ తన క్యాబిన్ దగ్గరుకు వెళ్తాడు. అక్కడ వసుధార వచ్చి.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ బయటకెళ్ళు అని అంటుంది. ఇది బాగానే ఉంది. ఒక భార్య..‌ ఒక భర్త.. ఒక తగాదా.. ఈ మాత్రానికే భర్తను వెళ్ళిపోమాంటావా అని రాజీవ్ అడుగుతాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.. వెళ్ళిపోమని వసుధార చెప్తుంది. అలా కాసేపటికి వసుధారని బలవంతంగా తీసుకెళ్తుండగా రిషి అక్కడికి వస్తాడు. ఏంటి వసుధార ఏం జరుగుతుంది అని అడుగుతాడు. సర్.. నేను రానని చెప్పినా బలవంతంగా తీసుకెళ్తున్నాడని వసుధార చెప్తుంది. నేను నా భార్యని తీసుకెళ్తున్నాని రాజీవ్ చెప్తాడు. నేను రానని వసుధార అంటుంది. అలా కాసేపు ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఇక రాజీవ్ వసుధార చేతిని పట్టుకోబోతుండగా రిషి అడ్డుపడతాడు. "ఏంటి రిషీ సర్.. ఈ ట్విస్ట్" అని రాజీవ్ అనగా.. "అసలు ట్విస్ట్ నేను కాదు వాళ్ళు ఇస్తారు అటు చూడు" అని పోలీసుల వైపు తోసేస్తాడు. దీంతో రాజీవ్ షాక్ అవుతాడు. నేనేదో నా భార్యని తీసుకెళ్తుంటే ఇలా చేస్తున్నారు సర్ అని రాజీవ్ చెప్పగా.. "తాళి కట్టకుండా ఎలా తను‌ నీ భార్య అవుతుంది రా" అని SI రాజీవ్ కాలర్ పట్టుకొని అంటాడు. ఇక రాజీవ్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత రాజీవ్ ని  పోలీసులు తీసుకెళ్తారు. రిషి, వసుధార దగ్గరకి వెళ్ళి... "ఏంటి వసుధార ఇది.. ఇన్నాళ్ళు రాజీవ్ తాళి కట్టాడని అనుకున్నా కానీ ఇప్పుడు కాదని తెలిసింది. ఎవరిని మోసం చేస్తున్నావ్? నన్ను మోసం చేస్తున్నావా లేక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా... నాకు ఏం అర్థం కావట్లేదు" అని అడుగుతాడు. నన్ను అర్థం చేసుకున్నానని అన్నారు కదా.. ఇదేనా మీరు అర్థం చేసుకుంది. వీలైతే నా మెడలో తాళి ఎవరు కట్టారో తెలుసుకోడానికి ప్రయత్నించండని వసుధార చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జగతి, మహేంద్రలు కలిసి "వసుధార ఏంటి ఇలా చేసింది. అసలు ఎవరిని పెళ్ళి చేసుకుంది" అని మాట్లాడుకుంటారు. అసలు నిజమేంటో తెలియాలంటే వసుధారనే అడగాలి అని ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ కి చుక్కలు చూపించిన రామ్ చరణ్!

అన్ స్టాపబుల్ షో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆహా ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఆహా మొత్తం పవర్ స్టార్ మేనియా కనిపిస్తోంది. ఈ షో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. పవన్ కళ్యాణ్ తో చేసిన ఎపిసోడ్ 1 లో జనసేనాని ఎన్నో విషయాలు చెప్పారు. ఇక రాంచరణ్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. హోస్ట్ బాలయ్య తనని "బాలా" అని ముద్దుగా పిలిపించుకున్నారు.  చిన్నప్పుడు అంటే పవన్ టీనేజ్ లో ఉన్నప్పుడు చిరంజీవి, నాగబాబు సినిమాకి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లల్ని చూసే డ్యూటీ చేసినట్లు చెప్పారు.  ఇక పవన్ చేత రామ్ చరణ్ కి కాల్ చేయించారు బాలయ్య. రామ్ చరణ్ కాల్ లోకి వచ్చాక " మీ బాబాయి గురించి ఎవరికీ తెలీని ఒక సీక్రెట్ చెప్పు" అని అడిగేసరికి " బాబాయ్ లైఫ్ చాలా బోర్, పెద్దగా సీక్రెట్స్ అనేవి ఉండవు.  వారం మొత్తం హైదరాబాద్ బిర్యానీ పెట్టిన తింటారు అంత ఇష్టం" అని చెప్పాడు.  "నువ్వు పవన్ దగ్గరే ఎక్కువగా పెరిగావట" అని బాలయ్య అడిగేసరికి "నిజం మా అమ్మ కన్నా బాబాయి చాలా స్ట్రిక్ట్.. బాబాయ్ చెప్పినవన్నీ ఫాలో అయ్యేవాడిని" అని చెప్పాడు రాంచరణ్. "మీరిద్దరూ కలిసి మీ నాన్నకు తెలియకుండా చేసిన ఒక అల్లరి పని చెప్పు" అని అడిగేసరికి పక్కనుంచి పవన్ హింట్ ఇచ్చారు "సింగపూర్ వెళ్ళినప్పుడు నేను ఎలా చూశానో అడగండి" అని చెప్పేసరికి బాలయ్య అదే అడిగారు " ఆ టైంలో నేను బాబాయ్ కి నరకం చూపించాను. మాతో అమ్మ లేదు కదా అని ఇష్టమొచ్చిన ఫుడ్ తినేసాను. చివరికి అక్కడ రోడ్ మీద వాంతి చేసేసుకున్న.. అది మొత్తం బాబాయ్ క్లీన్ చేసి హోటల్ కి తీసుకెళ్లి నన్ను ఫ్రెష్ గా చేశారు. అలా  ఆయన సింగపూర్ ట్రిప్‌ మొత్తాన్ని నేను నాశనం చేశాను’’ అని చెప్పుకొచ్చాడు చరణ్‌. ‘‘అప్పుడు నీ వయసెంతమ్మా’’ అని బాలకృష్ణ చరణ్‌ని అడిగేసరికి నాలుగైదేళ్ళ ఉంటాయని చెప్పారు పవన్ కళ్యాణ్. వెంటనే బాలయ్య.. ‘‘ఐదేళ్ల పిల్లాడిని చంకలో పెట్టుకుని సింగపూర్‌ వెకేషన్‌ వెళ్లడం ఏంటమ్మా’’అని సరదాగా ఆటపట్టించాడు.  "మా నాన్నకు నా మీద బాగా విసుగొచ్చినప్పుడు బాబాయ్ దగ్గరకు పంపేవారు.ఆయన కొట్టేవారు కాదు కానీ గంటలు గంటలు మాట్లాడేవారు" అన్నాడు రాంచరణ్ .తర్వాత ఫోన్ మళ్ళీ పవన్ కి ఇచ్చేసి "మీ అబ్బాయికి అందరు ముందు చెప్పాలనుకున్నది చెప్పవా" అనేసరికి పవన్ సిగ్గుపడుతూ "ఓకే రా జాగ్రత్త బై" అని ఫోన్ పెట్టేసాడు. "ఇంత క్యూట్ ఫామిలీ ఏంటయ్యా బాబు మీది" అన్నారు బాలయ్య సరదాగా.

మళ్ళీ ప్రేమలో పడొచ్చా ...అంటున్న అష్షు!

అష్షు రెడ్డి సోషల్ మీడియా స్టార్ గా పేరు తెచ్చుకుంది. బుల్లితెర మీద ఈవెంట్స్ లో  కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లింగజ్ , అష్షురెడ్డి ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తామిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని గతంలో చాలా సార్లు వీలు చెప్పుకున్నారు. అంతేకాదు పార్టీలకు, పబ్బులకు కలిసి వెళ్లి సందడి చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.  ఇటీవల అష్షు మాత్రమే ఎక్కడికైనా సరే ఒంటరిగా ప్రయాణం చేస్తోంది. ఐతే అసలు విషయానికి వస్తే అష్షు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.  శారీలో నిలబడి దీర్ఘంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఒక ఫోటో పెట్టి " చాలా కాలం క్రితం గుండె ముక్కలైపోయింది అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రేమలో పడగలమా ? " అని ఒక కాప్షన్ పెట్టింది. ఇంతకు అష్షు గుండెను బ్రేక్ చేసింది ఎవరో తెలీదు. మళ్ళీ ఎవరితో ప్రేమలో పడిందో కూడా రివీల్ చేయలేదు. ఇక నెటిజన్స్ అష్షుకి మెసేజెస్ కూడా పెట్టారు "ప్రేమలో పడే అవకాశం ఉంది. కానీ పాత గాయం మానడానికి కొంచెం టైం పడుతుంది కదా" అన్నారు. మరో నెటిజన్ కొంటెగా ఆన్సర్ ఇచ్చాడు "గుండె ముక్కలైపోతే గనక ఒక్కో భాగం ఒక్కో పర్సన్ ని ప్రేమించొచ్చు" అని..ఇకపోతే అష్షు" ఏ మాస్టర్ పీస్" పేరుతో రూపొందుతోన్న  సినిమాలో ఆద్య అనే పాత్రలో కనిపించబోతోంది.

వాళ్ళ స్టెప్పులు మాములుగా లేవు.. అందరూ కలిస్తే అంతేమరి

మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప అదృష్టం ఏమిటి అంటే టాలెంట్ ఉంటే చాలు హీరో, హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో ఫుల్ పాపులర్ అవ్వొచ్చు..మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలా ఎంతో మంది హీరోయిన్స్ అవ్వాలని వచ్చి క్యారక్టర్ ఆర్టిస్టులు ఐన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎన్నో మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో చేసిన నటీమణులు అంతా కలుసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ లో మనకు ఎక్కువగా అమ్మ, అత్తా, వదిన, అక్కా, చెల్లి లాంటి క్యారెక్టర్స్ లో  నటించిన సురేఖా వాణి, హేమ, ప్రగతి, పవిత్రా లోకేష్ తో పాటు చాలామంది గుర్తొస్తారు. అప్పటి, ఇప్పటి మూవీస్ సక్సెస్ లో వీళ్లంతా కీ రోల్ ప్లే చేస్తున్నారు. హీరోయిన్ కి మించి నటిస్తున్నారు. తనకు అవకాశాలు రావడం లేదు అంటూ ఈమధ్య కాలంలో బాధపడిన సురేఖా వాణి తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది.హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉండేసరికి ఈమెకు ఎక్కువగా అక్క పాత్రలు వస్తున్నాయి.   శైలజ ప్రియా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అందంగా కనిపిస్తూ తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్  పెంచుకుంది.  ఇలా ఒకప్పటి సపోర్టింగ్ రోల్స్ లో నటించి ఇప్పటికీ నటిస్తున్న వాళ్లంతా కూడా సరదాగా సురేఖావాణి ఇంట్లో కలుసుకున్నారు.  12 మంది సీనియర్ నటీమణులు ఒక్కచోటకు చేరారు. ఫుల్ గా ఆడి పాడారు. సురేఖావాణి ఆ ఫొటోస్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. "రా రా రక్కమ్మ" సాంగ్ కి అందరూ కలిసి స్టెప్స్ ఇరగదీసారు. ఇక నెటిజన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. "ప్రగతి, సుధా, పవిత్ర లోకేష్ ఆంటీలు ఎక్కడ ?" " వీళ్లు లేని సినిమా  వుండదు. వీళ్ళు చేయని పాత్రలు కూడా లేవు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వీళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు "  అంటూ కామెంట్స్ పెట్టారు.