కావ్య చేసిన డిజైన్స్ ని మెచ్చుకున్న రాజ్ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-29 లో.. రాజ్ ఫ్యామిలీకి పెళ్ళికి కావలసిన బొమ్మలు తయారు చేస్తుంటుంది కావ్య. రెండు కుటుంబాలు పెళ్ళి పనులు మొదలుపెడతారు. ఇక రాజ్ ఇంట్లో పెళ్ళి పనులు మొదలు పెట్టి.. గణపతి పూజ చేసి రాజ్ తల్లి రాజ్ కి బొట్టు పెడుతుండగా..‌ రాహుల్ వచ్చి రాజ్ తల్లి చెయ్యి పట్టుకొని ఆపుతాడు. "రాజ్ ఎప్పుడైనా.. ఏదైనా.. నన్నే ముందు ట్రై చేయమంటాడు. ఇప్పుడు నాకంటే ముందే పెళ్ళి చేసుకుంటున్నాడు" అని రాహుల్ అనడంతో.. "ఆట పట్టించే సమయం ఇదేనా రాహుల్" అంటూ రాజ్ తల్లి  కోప్పడుతుంది. నన్ను ఆటపట్టించడానికి చేసాడు మమ్మీ అని రాజ్ అంటాడు. మరోవైపు స్వప్నకి నలుగు పెట్టడానికి కూర్చోపెడతారు. కావ్య, అప్పులు కూడా పక్కనే కూర్చుంటారు. "జరగని పెళ్ళికి ఇదంతా ఎందుకు అమ్మా.. చాలా ఖర్చు పెడుతుంది పాపం.. చెప్దామంటే చెప్పే ఛాన్స్ ఇవ్వట్లేదు" అని రాహుల్ కి మెసేజ్ చేస్తుంటుంది స్వప్న. అంతలోనే కనకం బొట్టు పెడుతుండగా.. వద్దని తన చేతిని పక్కకి నెట్టి వేస్తే.. ఆ బొట్టు కావ్య నుదుటికి పడుతుంది. అక్కడున్న వాళ్ళు మాటలు అనడంతో కావ్య పక్కకి వెళ్ళిపోతుంది. స్వప్న నీవల్ల కావ్య మనసు చిన్నబుచ్చుకుందని కనకం అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ పంపిన మనిషి వచ్చి తను పెళ్ళికోసం రెడీ చేసిన బొమ్మలను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాడు. రాజ్ ఇంట్లోకి కావ్య తయారు చేసిన డిజైన్ లు అన్నీ వస్తాయి. అవి చూసిన రాజ్ కుటుంబసభ్యులందరు.. చాలా బాగున్నాయ్ అంటారు. రాజ్ కి అనుమానం వచ్చి.."ఎవరు చేసారు? ఎక్కడ నుండి తీసుకొచ్చావ్" అని కళ్యాణ్ ని అడుగుతాడు. "ఆ కళావతి మాత్రం కాదు" అని కళ్యాణ్ అంటాడు. కళావతి ఎవరని రాజ్ నానమ్మ అడుగగా.. ఆ రోజు వినాయకుని నగలు డిజైన్ చేసింది కదా.. ఆ  అమ్మాయి" అని కళ్యాణ్ చెప్తాడు. ఆ అమ్మాయి ఎప్పుడు చూసిన మన రాజ్ తో గొడవ పడుతూనే ఉంటుందని రాజ్ అమ్మ అంటుంది. ఇక పెళ్ళికూతురికి పెట్డవలసిన బట్టలను నేను తీసుకెళ్తానని రాహుల్ చెప్పి తీసుకెళ్తాడు. మరోవైపు రాజ్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన కొన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయి.. ఎలాగైనా కళ్యాణ్ కి ఇవ్వాలని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేనేం నీ అగ్రిమెంట్ భార్యని కాదు కదా మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-90 లో.. ఇంట్లో ఎవరు నా మాట  వినట్లేదని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారని భవాని అంటుంది. రేవతి నువ్వు కృష్ణని కూడా వాళ్ళిద్దరితో పాటుగా ఢిల్లీకి పంపిద్దామని అనుకుంటున్నట్టు నాకొక మాటైనా చెప్పొచ్చు కదా అని భవాని అడుగగా.. నీకు చెప్పకపోవడం తప్పే అక్క అని రేవతి అంటుంది. మురారి నువ్వు అయినా నాకు టికెట్ బుక్ చేసే ముందు చెప్పాలి కదా అని భవాని అనగానే.. "పెద్దమ్మ అమ్మ టికెట్ బుక్ చెయ్యమంటేనే చేశాను" అని మురారి చెప్తాడు. కృష్ణ నిన్న కాక మొన్న వచ్చి.. ఆదర్శ్ రావాలని కోరుకుంటుంది. కానీ ముకుంద మాత్రం ఎందుకు అలా ఆలోచిస్తుందో నాకు అర్ధం కావడం లేదని మురారి అనేలోపే.. ముకుంద అక్కడకి వస్తుంది. వీళ్ళందరు కలిసి పెద్ద అత్తయ్య ముందు నన్ను బ్యాడ్ చేసేలా ఉన్నారని రేవతి దగ్గరికి వెళ్లి అత్తయ్య నన్ను క్షమించండి.. పెద్ద అత్తయ్య మీరు కూడా నన్ను క్షమించండి.. నేను ఏదో బాధలో అలా అనేశాను అని నటిస్తుంది. ఇంకా మురారికి నామీద కోపం తగ్గినట్లు ఉందని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఇక మళ్ళీ ఢిల్లీకి ఎప్పుడు రమ్మన్నారు ముకుందా? అని భవాని అడుగుతుంది.. వాళ్ళు కాల్ చేసి చెప్తామని చెప్పారు అత్తయ్య అని ముకుంద అంటుంది. ఈ సారి ఢిల్లీకి వెళ్తే నువ్వు ఒక్కదానివే వెళ్ళని భవాని చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. రేవతి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ముకుంద, మురారి కోసం ఎదురుచూస్తుంటుంది. ఉదయం వెళ్ళాడు ఇంకా రావట్లేదని అనుకునే లోపే మురారి వస్తాడు. మురారి ఎక్కడికెళ్ళావ్? నీకోసం ఎదురు చూస్తున్నా అని ముకుంద అంటుంది. ఎదురు చూడడం దేనికి బయటికి వెళ్ళినవాడిని మళ్ళీ ఇంటికే వస్తానుగా అని అంటాడు మురారి. అందరి ముందు మాట్లాడడానికి నేనేం నీ అగ్రిమెంట్ భార్యని కాదు కదా మురారి.. అందుకే ఇలా మాట్లాడుతానని ముకుంద అనగానే.. "ప్రతీసారి అగ్రిమెంట్ అని గుర్తుచేయకు.. ఎవరైనా వింటారు" అని మురారి అనడంతో.. వింటే ఏంటి ఎప్పుడైనా తెలిసేదే కదా అని ముకుంద అంటుంది. చెప్పాల్సిన పరిస్థితి వస్తే మేమే చెప్తామని చెప్పేసి వెళ్ళిపోతాడు మురారి.  మరోవైపు కృష్ణకి సర్ ప్రైజ్  ప్లాన్ చేస్తాడు మురారి. తనకి ఫోన్ చేసి ముందువైపు చూడు అని చెప్పడంతో.. కృష్ణ ముందువైపు చూడగా.. తనకి ఇష్టమైన డాక్టర్ డ్రెస్, స్టెతస్కోప్ పట్టుకొని మురారి ఎదురుగా నిలబడతాడు. అది చూసి  కృష్ణ చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి కాలేజీకి రెడీ అవ్వు.. లేట్ అవుతుందని మురారి అనడంతో.. కృష్ణ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మురారి దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తన భార్య కవితకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఆదిరెడ్డి!

బిగ్ బాస్  సీజన్ -6 తో ఫేమ్ లోకి వచ్చిన వాళ్ళలో అదిరెడ్డి ఒకడు.. తనకంటూ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుని.. ఎప్పటికికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట రివ్యూ యర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి.. ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా తన భార్య కవిత గురించి గొప్పగా చెప్తూ ఉండేవాడు. అయితే ఒకరకంగా తను బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కారణం కూడా కవితనే అంటూ చాలా సందర్భాలలో చెప్పాడు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆదిరెడ్డి చూపించే ఫ్యామిలీ ఎమోషన్ కు ఆ షో చూసే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఆదిరెడ్డి జనాలకు ఎంత తెలుసో బయట ఉన్న కవిత కూడా అంతగా జనాలకు తెలిసిపోయి తను కూడా ఫేమ్ సంపాదించుకుంది. ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో ఫ్యామిలీ విషయాలు అన్నీ షేర్ చేస్తుంటాడు. రెండు రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానెల్ నాలుగు లక్షల సబ్ స్క్రైబర్స్ కి రీచ్ అయినందుకు గాను హైదరాబాదులోని ఒక ఓల్డేజీ హోంలో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.. కాగా ఇప్పుడు తాజాగా తన భార్య కవితకి సర్ ప్రైజ్ ఇచ్చాడు. తనకు ఇష్టమైన స్కూటీని.. ఆమెకు తెలియకుండా కొని సర్ ప్రైజ్ ఇచ్చాడు. అది చూసిన కవిత థ్రిల్ ఫీల్ అయింది. "ఇంకా షాక్ లోనే ఉన్నాను.. అస్సలు ఊహించనేలేదు. థాంక్స్ ఆది" అంటూ కవిత ఎమోషనల్ అయింది. ఆ తర్వాత మొదటగా ఆదిరెడ్డిని ఎక్కించుకొని డ్రైవ్ చేసింది కవిత. ఇదంతా కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలోను, యూట్యూబ్ ఛానెల్ లోను పెట్టాడు. కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు తమ కామెంట్స్ తో అభినందనలు తెలుపుతున్నారు. ఆదిరెడ్డి ఎప్పటికప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. సోషల్ మీడియా లో యాక్డివ్ గా ఉంటున్న కవిత, ఆదిరెడ్డి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నారు. ఈ దంపతులు బయట సమాజంలో సోషల్ సర్వీస్ చేస్తూ అందరిచేత ప్రశంసలు అందుకోగా. తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంటున్నారు ఆదిరెడ్డి ఫ్యామిలీ.

పెళ్ళికి ముందే హన్సిక పేరుని టాటూగా వేసుకున్న సోహెల్!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రతీ శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవుతున్న 'హన్సిక లవ్ షాదీ డ్రామా' సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ‌గతవారం విడుదలైన ఎపిసోడ్‌లో హన్సిక తన పెళ్ళి గోల్ఫ్ గ్రౌండ్ లో జరగాలని కోరగా అలాగే జరుగుతుందని ఈవెంట్ మేనేజర్ చెప్పాడు. అయితే తాజాగా విడుదలైన మూడవ ఎపిసోడ్‌లో ట్విస్ట్ లు ఆకట్టుకుంటున్నాయి. హన్సిక తమ్ముడు ప్రశాంత్ గురించి చెప్పాలంటే.. తను నాకు మంచి ఫ్రెండ్‌..  వాళ్ళ అక్క కోసం నేను ఏదైనా స్పెషల్ గా చేస్తానని చెప్పినప్పుడు తను సరేనన్నాడు. నేను టాటూ వేసుకుంటానంటే తనే 'టాటూ వేసుకుంటానంటే వద్దన్నాడు. నువ్వు ప్రేమిస్తే ఈ టాటు వేసుకుంటావా అని నన్ను డిస్కరేజ్ చేసాడు ప్రశాంత్. కానీ నేను ఎక్కడా కూడా డ్రాప్ అవ్వలేదు. హన్సిక పేరుని హిందీలో టాటూ వేసుకున్నాని చెప్పుకొచ్చాడు సొహెల్. హన్సిక వాళ్ళ అమ్మ మధ్య ఉన్న బాండింగ్ గురించి‌ చెప్పుకొచ్చింది. వాళ్ళ అమ్మ తనని కన్యదానం చెయ్యనని చెప్పింది. నా కూతురేం వస్తువు కాదని.. కావాలంటే ఆవులను దానం చేస్తాను.. కాని కన్యాదానం చెయ్యనని చెప్పింది.. నువ్వు పెళ్ళికి ముందు ఎలా ఉన్నావో, పెళ్ళి తర్వాత కూడా అలాగే ఉండొచ్చని హన్సిక అమ్మ చెప్తూ ఏడ్వగా.. దీంతో హన్సిక కూడా ఎమోషనల్ అయి ఏడ్చేసింది. "అమ్మా నువ్వు స్ట్రాంగ్.. నువ్వు ఇలా ఏడిస్తే నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను" అని హన్సిక చెప్పి ఓదార్చింది. ఆ తర్వాత సొహెల్, హన్సిక కలిసి వాళ్ళ పెళ్ళిబట్టలు ఎలా ఉండాలో  డ్రెస్ డిజైన్ చేసిన షాప్ కి వెళ్ళి చూసుకొని ఇద్దరూ తమ డ్రెస్ లు ఎలా ఉన్నాయోనని సరిచూసుకుంటారు. దాని తర్వాత సొహెల్, హన్సిక ఫ్యామిలీ కలిసి పంజాబీ స్టైల్ లో అమ్మవారికి పూజ చేసి..‌ ఆ పూజలో యాభై రకాల స్వీట్స్ పెట్టారు. ఆ స్వీట్స్ ని తమ బంధువులకు పంచారు. ఇలా వారిద్దరూ ‌కలిసి పెళ్ళికి రెడీ అయ్యారు. ఆ తర్వాత రాబోయే నాలుగవ ఎపిసోడ్ ప్రోమోని ఈ ఎపిసోడ్ చివరన ఆడ్ చేసారు. ఆ ప్రోమో ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

తన పెళ్ళి సంప్రదాయబద్ధంగా జరగాలని చెప్పిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌-28 లో.. కనకం ఖరీదైన చీరలు తీసుకురావడంతో కావ్య చూసి.. ఇంత ఖరీదైన చీరలు కొనడానికి మీకు డబ్బులు ఎక్కడివని కనకంని అడుగుతుంది కావ్య.. "నీకెందుకు అవన్నీ" అని కనకం అనగానే.. ఎందుకంటే ఆ అప్పులు తీర్చాలిసింది నేనే కాబట్టి అని కావ్య అంటుంది. "ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావే కనకం.. నేను సాయం చేస్తానని చెప్పి మా అక్క డబ్బులు ఇచ్చింది" అని చెప్పి కవర్ చేస్తుంది కనకం. అలా చెప్పినా కూడా కావ్యకి కనకం మీద అనుమానం కలుగుతుంది. మరోవైపు పెళ్ళి దగ్గరపడడంతో రాజ్ ఫ్యామీలీ అంతా టెన్షన్ పడుతుంటారు. రాజ్ వాళ్ళ అమ్మనాన్న వచ్చి పెళ్ళికి ఎక్కువ టైం లేదు కాబట్టి పెద్ద ఈవెంట్ కంపెనీతో మాట్లాడదాం.. వాళ్ళే అన్నీ చూసుకుంటారని అనుకుంటారు. ఇక అప్పుడే వచ్చిన రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య.. "రాజ్ పెళ్ళి నీ జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దీన్ని నువ్వెలా జరగాలని కోరుకుంటున్నావ్" అని అడుగుతాడు. పెళ్ళి మొత్తం సంప్రదాయబద్ధంగా జరగాలని అనుకుంటున్నాను తాతయ్య అని రాజ్ అనగానే.. సీతారామయ్య సంతోషపడి..అలాగే జరిపిద్దామని చెప్తాడు. ఇక పెళ్ళికి కావలిసిన బొమ్మలు సామాన్లు కావ్య దగ్గరే తీసుకోవాలని కళ్యాణ్ అనుకొని కావ్య దగ్గరికి వస్తాడు.. కళ్యాణ్ వచ్చి బొమ్మల డెకరేషన్ కాంట్రాక్టు కావ్యకి ఇస్తాడు. దానికి కావ్య ఒప్పుకొదు. ఇక పక్కనే ఉన్న అప్పు కావ్యని పక్కకి తీసుకెళ్ళి... "ఇప్పుడు మన అమ్మ చాలా అప్పులు చేస్తుంది.. వచ్చిన కాంట్రాక్ట్ వద్దు అనకక్కా" అని చెప్పడంతో కావ్య కాంట్రాక్టు ఒప్పుకుంటుంది.  మరోవైపు రాహుల్ ని ప్రేమిస్తున్న విషయాన్ని ఎలాగైనా కనకంకి చెప్పాలని స్వప్న ప్రయతిస్తుంది. కనకం మాత్రం చెప్పే అవకాశం ఇవ్వదు..స్వప్న చెబుదామని అనుకుంటుండగా.. మీనాక్షి తన నగలు తీసుకొని వచ్చి పెళ్ళి వరకు ఉంచుకొని.. పెళ్ళి తర్వాత నావి నాకు ఇచ్చేయ్ అని కనకంతో అంటుంది. ఇక వీళ్ళు నగల గురించి మాట్లాడుకుంటుంటే స్వప్నకి కోపం వస్తుంది. రాజ్ అప్పుడే స్వప్న కి కాల్ చేస్తాడు. చిరాకుగా ఉన్న స్వప్న.. బిజీగా ఉన్నానని అనడంతో సరే అని రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు స్వప్న, రాహుల్ కి ఫోన్ చేస్తుంది. రాహుల్ వేరే అమ్మాయికి పులిహోర కలుపుతుంటాడు. స్వప్న ఫోన్ చేసింది చూసిన కూడా లిఫ్ట్ చేయడు. ఇలా లిఫ్ట్ చేయకుండా ఉంటేనే నా ఆలోచనలో పిచ్చెక్కిపోతావు.. అప్పుడు నేను ఏం చెప్తే అది చేస్తావ్ అని అనుకుంటాడు. కానీ స్వప్న మాత్రం రాహుల్ బిజీ పర్సన్ కదా ఎలాగూ నాతోనే ఉంటాడు కదా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

రాత్రంతా రిషి గదిలో ఉండిపోయిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-695 లో.... జగతి, మహేంద్రలు కలిసి రిషి గదిలో ఉంటారు.  ఆ తర్వాత కాసేపటికి రిషి తన గదిలోకి వచ్చేసరికి వాళ్ళిద్దరు ఉండడంతో..  "ఏదో పెద్ద విషయమే ఉందనుకుంటా" అని రిషి అంటాడు.. నీకు నిజం తెలిసింది ఇంకా మరి వసుధార అంటే ఎందుకు అంత కోపం.. ఎందుకు దూరం పెడుతున్నావ్? అయిందేందో అయింది.. అపార్థాలు అన్నీ తొలగిపోయాయి కదా అని మహేంద్ర అడుగుతాడు. "నాకు వసుధార మీద కోపం తగ్గలేదు.. తనకి దూరంగా ఉండలేను అలా అని దగ్గర చేసుకోలేను.. అయినా మీరు కూడా నన్ను మోసం చేశారు కదా.. మీ మీద కూడా కోపం ఉంది" అని చెప్పేసి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక లోపలగదిలో వాళ్ళంతా మాట్లాడుకునే మాటలన్నీ చాటుగా వింటుంది దేవయాని. బయటకొచ్చి దేవయానిని చూస్తారు జగతి, మహేంద్రలు. "ఎంత సేపు నిలుచుంటారు అక్కయ్యా.. కాళ్ళు నొప్పిగా లేవా" అని జగతి వెటకారంగా అంటుంది. నేనేం వినలేదు.. ఇప్పుడే వచ్చాను అని కోపంగా దేవయాని అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు రిషి, వసుధారల ఛాటింగ్ చేసుకుంటారు. ఇక ఛాటింగ్ మధ్యలో తల నొప్పిగా ఉందని రిషి అనగానే.. అల్లం టీ తాగండని వసుధార మెసేజ్ చేస్తుంది. అలాగే ఛాటింగ్ చేసుకుంటూ రిషి పడుకుంటాడు. ఉదయం రిషి దగ్గరికి మహేంద్ర వచ్చేసరికి తనకి జ్వరం వచ్చి ఉంటుంది. అప్పుడే రిషికి వసుధార కాల్ చెయ్యడంతో.. మహేంద్ర కాల్ లిఫ్ట్ చేసి.. "రిషికి జ్వరం వచ్చిందమ్మా" అని మహేంద్ర అనగానే.. రిషి దగ్గరికి తొందరగా వస్తుంది వసుధార. రిషి పక్కనే ఉన్న దేవయాని.. "ప్రాజెక్ట్ లు అంటూ అటుఇటు తిప్పారు.. ఎవరు రిషిని పట్టించుకోరు.. జ్వరం ఎలా వచ్చిందో చూడంటి" అని అంటూ నటిస్తుంది. అలా మొదలు పెట్టగానే వసుధార వచ్చి.. "మేడం మీరు రిషి సర్ దగ్గర నుండి లేవండి.. రిషి సర్ కి జ్వరం తగ్గాలని మీకు ఉంటే బయటకు వెళ్ళండి" అని వసుధార అనగానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది దేవాయాని.  ఇక వసుధార, రిషి పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటుంది. ఆ రోజు రాత్రి నుండి మరుసటి రోజు ఉదయం వరకు రిషి పక్కనే ఉంటుంది వసుధార. అలా రాత్రంతా ఉన్న వసుధారని చూసిన రిషి.. "రాత్రంతా ఇక్కడే ఉన్నావా" అని రిషి అడుగుతాడు.. "మీరు ఇక్కడ ఇలా ఉంటే.. నేను అక్కడ ఎలా ఉంటాను సర్" అని వసుధార అంటుంది. థాంక్స్  వసుధార అని రిషి అనగానే.. "మీరు నేను వేరు కాదు సర్.. మనమిద్దరం ఒక్కటే" అని వసుధార అంటుంది. సర్ బ్రష్ చెయ్యండి కాఫీ తెస్తాను అంటూ వసుధార వెళ్తుండగా.. దేవయాని తనని కోపంగా చూస్తుంది. మేడం మీక్కూడా కాఫీ తెస్తానని దేవయానితో చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ముకుందపై భవానీ ఫైర్.. ఢిల్లీ టూర్ క్యాన్సిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌-89 లో..  ఆదర్శ్ గురించి మురారి, ముకుందలని  ఢిల్లీ వెళ్ళమని భవానీ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణని కూడా తీసుకొని వెళ్ళమని రేవతి అంటుంది. అప్పుడు మురారి.. అమ్మ మేము వెళ్ళేది ఆదర్శ్ ను వెతకడానికి, మాతో కృష్ణ ఎందుకని అంటాడు. మురారి అలా అనగానే నువ్వు కచ్చితంగా కృష్ణని తీసుకొని వెళ్ళాలని రేవతి చెప్తుంది. దానికి మురారి ఒప్పుకుంటాడు. కృష్ణ మాత్రం.. "వద్దు అత్తయ్యా" అని అనగానే.. నువ్వు నోరు మూసుకో కాసేపు అని రేవతి కోప్పడుతుంది.. మురారి టికెట్స్ బుక్ చెయ్.. మీ ఇద్దరికి పక్క పక్క సీట్స్ బుక్ చెయ్.. ముకుందకి వెనకాల సీట్ బుక్ చెయ్ అని దగ్గర ఉండి టికెట్ బుక్ చేయిస్తుంది రేవతి. ఇక త్వరగా పడుకోండి తొందరగా లేవాలి కదా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది రేవతి.. మరుసటి రోజు ఉదయం.. ముందుగా రెడీ అయి తన లగేజ్ పట్టుకొని మురారి కోసం ఎదురుచూస్తుంటుంది ముకుంద.. ఇన్ని రోజులు ఏ ప్లాన్ చేసిన నాకు అడ్డుపడే రేవతి అత్తయ్య ఇప్పుడు మాత్రం నాకు అడ్డుపడలేదని ముకుంద తన మనసులో అనుకుంటూ సంతోషపడుతుంది. ఇక అక్కడే ఉన్న రేవతి, ముకుందని చూసి.. "అప్పుడే సంతోషపడకు ముకుందా"అని మనసులో అనుకుంటుంది. తర్వాత మురారి వచ్చి కృష్ణ కోసం వెయిట్ చేస్తాడు. ఇక కృష్ణ కూడా తన లగేజ్ తో రావడంతో.. ముకుంద షాక్ అవుతుంది.  అలా  కృష్ణ కూడా తన లగేజీతో రావడం భవానీ చూస్తుంది. "కృష్ణని కూడా పంపిస్తున్నావా రేవతి" అని భవాని అడుగుతుంది. "అవును అక్కా.. మొన్న హనీమూన్ కూడా క్యాన్సిల్ అయింది కదా.. ఆదర్శ్ ను వెతుకుతూ.. ఖాళీ ఉన్న టైంలో కృష్ణ, మురారిలు సరదాగా అలా బయటికి వెళ్తారని రేవతి అంటుంది. అంటే వీరిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉండాలా అని ముకుంద అనగానే.. భవాని కోపంగా ముకుందని తిడుతుంది.  "స్టాప్ ఇట్.. నా తోటికోడలిని ఇలా విమర్శించడమేంటి" అని  అడుగుతుంది. ఇక మురారి కూడా.. "మా అమ్మని అలా ఎందుకు అంటున్నావ్" అని అడగడంతో ముకుంద ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది.  ముకుంద ప్లాన్ ని తిప్పికొట్టినట్లుగా రేవతి భావిస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అవుతుంది. అంతకముందు ఈ ఇంట్లో అందరూ నా మాట వినేవాళ్ళే.. ఈ తింగరిపిల్ల వచ్చినప్పటి నుండే ఇలా జరుగుతుందని భవాని అంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

పుట్టపర్తి సాయిబాబా తనని చూసాడని చెప్పిన ఇంద్రజ!

ఇంద్రజ.. ఈ పేరు వినగానే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చే సినిమా 'యమలీల'. యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన 'యమలీల' సినిమా లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ.. అప్పట్లో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్నారు. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు తన కెరియర్ ని కొత్తగా మలుచుకుంటున్నారు. జబర్దస్త్ లో జడ్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంద్రజ.. ఇప్పుడు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' లో కూడా జడ్జ్ గా  వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఇంద్రజ అందరితో హంబుల్ గా ఉంటూ ఎవరినీ నొప్పించక, కష్టాలలో ఉన్నామని ఎవరైనా చెప్పిన వెంటనే కరిగిపోతుంది. వారికి తన వంతు సాయం కూడా చేస్తుంది. అయితే సంప్రదాయ చీరకట్టుతో ఎప్పుడూ కనిపించే ఇంద్రజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది.  అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. "నేను పుట్టపర్తి సాయిబాబాను ఆరాధిస్తాను. ఒకరోజు నేను యూట్యూబ్ షార్ట్ వీడియోలు చూస్తున్నప్పుడు నా ఫోటోలు ఉన్న షార్ట్ వీడియో పక్కన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు. అయితే బాబా గారు ఒక ఫోటోలో మాములుగా ఉండగా.. మరొక ఫోటోలో నన్ను చూస్తున్నట్టుగా ఉన్నారు. అది చూసి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. నేను నమ్మే బాబా.. నన్ను చూడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది" అంటూ ఇంద్రజ తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోని పోస్ట్ చేసింది.

పడ్డోడెప్పుడూ చెడ్డోడు కాదని మా అమ్మ చెప్పింది అన్న అనసూయ

అనసూయ నిన్న మొన్నటి వరకు బుల్లితెర మీద గ్లామరస్ యాంకర్. తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. ఇప్పుడు బుల్లితెరను పూర్తిగా వదిలేసి, కాన్సంట్రేషన్ మొత్తాన్ని మూవీస్ వైపుకు మళ్లించేసింది. సోషల్ మీడియాలో అనసూయ ఫుల్ యాక్టివ్ అనే విషయాన్ని మరో సారి ప్రూవ్ చేసుకుంది. "కాసేపు మాట్లాడుకుందాం రండి" అంటూ ఫాన్స్ ని క్వశ్చన్స్ అడగమంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇన్వైట్ చేసింది.  అలా వచ్చిన వారిలో ఒక నెటిజన్ "మీ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా మీరెప్పుడు ఫీల్ కాలేదు..ఆ ధైర్యాన్ని, ఆ స్పిరిట్ ని వదల్లేదు" అనేసరికి "ఎందుకంటే మా అమ్మ నేర్పించింది..పడ్డోడెప్పుడూ చెడ్డోడు కాదు అని..ఎదుటి వాళ్ళు మనల్ని ఏం అన్నా అది వాళ్ళ క్యారెక్టర్ ని బయటకు చూపిస్తుంది. మన క్యారెక్టర్ ఏమిటో మనకు తెలుసు...ప్రూవ్ చేయాల్సిన, చేసుకోవాల్సిన అవసరం లేదు..మిగతా వారికీ చేయాల్సిన అవసరం లేదు" అని చెప్పింది. "ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లకు మీరు ఏం సజెషన్ ఇస్తారు" అని మరో నెటిజన్ అడిగేసరికి " నువ్వెంటో నిరూపించుకో...నీలాగే ఉండు. ఏది వదులుకోవద్దు...అలా అని పరిస్థితులకు తగ్గట్టు మారిపోవద్దు..అంతే కాదు ప్రతీ నిమిషం చాలా అలెర్ట్ గా ఉండు" అని సలహా ఇచ్చింది.  "అక్కా మీరు గర్ల్స్ కి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు కదా. మోటివేషన్ లా ఒక మాట చెప్పండి" అనేసరికి  "సమయం, ఎనర్జీ, స్పేస్ వీటి విలువ ముందుగా తెలుసుకో. వీటిని ఎలా వినియోగించుకోవాలో ఆలోచించుకో" అని అద్భుతమైన వాక్యం ఒకటి చెప్పింది అనసూయ.

ఘనంగా జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్ పెళ్లి

ఎట్టకేలకు జబర్దస్త్ రాకేష్ కి, జోర్దార్ సుజాతకు పెళ్లయిపోయింది. ప్రేమించిన అమ్మాయితోనే  ఏడడుగులు వేశాడు రాకేష్. ఇరు కుటుంబాలతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ల ఫ్యామిలీస్ కూడా హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు వచ్చారు.  ప్రస్తుతం వాళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  కొత్త జంటకు అందరూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు.  రాకింగ్ రాకేష్  ఎక్కువగా పిల్లలతో స్కిట్స్ చేస్తూ ఉంటాడు. మొదట్లో ధనరాజ్ టీమ్ లో ఓ కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత కిరాక్ ఆర్పీ-రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత కిర్రాక్  ఆర్పీ వెళ్లిపోయేసరికి  సింగిల్ టీమ్ లీడర్ గా మిగిలిపోయాడు. కొంతకాలానికి జోర్దార్ సుజాత వచ్చి టీమ్ లో యాడ్ అయ్యింది. అలా అప్పటినుంచి ఇప్పటివరకు  కామెడీ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.   ఓ న్యూస్ ఛానెల్ లో జోర్దార్ వార్తలు చదువుతూ ఫేమస్ ఐన సుజాత, తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి క్రేజ్ తెచ్చుకుంది. జబర్దస్త్ షో చేస్తూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆడియన్స్ కి తెలిసేలా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తమది రీల్ జోడి మాత్రమే కాదు రియల్ జోడి కూడా అని ఇప్పుడు పెళ్లి చేసుకుని నిరూపించారు. ఇక నెటిజన్స్ కూడా వీళ్లకు హ్యాపీ మారీడ్ లైఫ్ అంటూ విష్ చేస్తున్నారు.

వాళ్ళిద్దరిని నిజమైన భార్యాభర్తలేనా అని నిలదీసిన రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌-88 లో.. ముకుంద అంటే నీకు ఇష్టం లేదా చెప్పు రేవతి అని భవాని అడుగుతుంది. ‌దీంతో రేవతి టెన్షన్ పడుతూ.. ముకుంద పెళ్ళి అయిన నుండి ఆదర్శ్ కి దూరంగా ఉంది. కానీ తన ముందే కృష్ణ, మురారిలు హ్యాపీగా ఉంటే తను ఎలా  ఉంటుందక్కా... అందుకే ఆదర్శ్ ని వెతికించమని చెప్పాలని రేవతి అనగా.. అవును నిజమే అని భవానీ అంటుంది ఒక శుభవార్త చెప్పాలని అందరినీ పిలుస్తుంది ముకుంద. అందరూ వచ్చాక ఏంటి ముకుంద ఏదో శుభవార్త అన్నావ్? అని భవాని అడుగుతుంది. ఆదర్శ్ ని తొందరగా వెతికించి మనకి అప్పజెప్పడానికి ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ కి రిక్వెస్ట్ లెటర్ రాసి పెట్టాలి.. అలా మన రిక్వెస్ట్ లెటర్ పంపిస్తే తొందరగా పని జరుగుతుందని నాకు మెయిల్ చేశారని ముకుంద అంటుంది. అవునా ఇది అందరికి శుభవార్త అని భవాని అంటుంది. నేను ఢిల్లీ వెళ్ళడానికి ఒక పోలీస్ కానీ ఆర్మీ ఆఫీసర్ కానీ కావాలి. కాబట్టి నేను మురారిని తీసుకొని వెళ్తానని ముకుంద అనగా.. మురారి ఎందుకు? మేమందరం ఉన్నాం కదా ఎవరో ఒకరం వస్తాం అని రేవతి అంటుంది. అది విని మనం వెళ్తే అక్కడ ఎన్ని రోజులు పడిగాపులు కాచినా పని జరగదు. అందుకే మురారి లాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే తొందరగా రిక్వెస్ట్ తీసుకుంటారని ముకుంద అంటుంది. అది కృష్ణ విని.. "ఆదర్శ్ తిరిగిరావడం మనకి ముఖ్యం కాబట్టి ఏసీపీ సర్ వస్తాడు" అని అంటుంది. ఆ తర్వాత మురారిని ఒంటరిగా పక్కకి తీసుకెళ్ళి మనం హ్యాపీగా ఢిల్లీ కి వెళ్దామని ముకుంద అంటుంది. దానికి మురారి ఎమోషనల్ అవుతాడు. "ఎక్కడ విలువలు.. ఏది పవిత్ర బంధం, ఏది మంగళసూత్రం, ఏది అరుంధతి నక్షత్రం.. నీకు వేదమంత్రాల సాక్షిగా పెళ్ళి అయింది.. మనసుతో ఆలోచించు ముకుంద.. నీ మాజీ ప్రేమికుడి మీదకి వెళ్తున్న నీ మనసుని ప్రశాంతంగా ఉంచి ఆలోచించు" అని మురారి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముకుంద పశ్చాత్తాపంతో ఏడుస్తుంది. మరోవైపు ఢిల్లీకి వెళ్ళడానికి కృష్ణ లగేజ్ ప్యాక్ చేస్తుండగా, మురారి గదిలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అది చూసిన కృష్ణ.. "ఏమైంది ఏసీపి సర్.. అలా ఉన్నారు" అని అడగగా.. ఏమీ లేదని మురారి చెప్తాడు. "నేను సొల్యూషన్ చెప్పలేకపోయినా కనీసం సలహా‌ అయినా ఇస్తాను కదా.. చెప్పండి దేని గురించి ఆలోచిస్తున్నారు ఏసీపి సర్" అని అడుగుతుంది. నీ అమాయకత్వమే నన్ను నిలువునా దహించేస్తుంది కృష్ణ అని మనసులో అనుకొని ఏమీ లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ‌కాసేపటికి రేవతి వచ్చి.. "మీరు నిజమైన భార్యాభర్తలేనా లేక మా అందరికోసం ఇలా యాక్ట్ చేస్తున్నారా? నిజమైన భార్యాభర్తలైతే టూర్ కి వెళ్ళాలంటే ఎగిరి గంతేయాలి కానీ తనేమో కాలేజీకి వెళ్ళాలంటుంది. నువ్వేమో ఇంకేదో నసుగుతున్నావ్" అని రేవతి అనేసరికి కృష్ణ మురారీలు ఆశ్చర్యపోతారు. అలా రేవతి వాళ్ళిద్దరిని నిలదీస్తుంది. మరి వాళ్ళిద్దరు ఎలా కవర్ చేశారో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

షాజహాన్ లాంటి ప్రేమికుడు కావాలంటున్న అష్షు రెడ్డి

అష్షు రెడ్డి సోషల్ మీడియాను షాక్ చేసే సెలబ్రిటీ బాంబ్. రోజూ ఏదో ఒక కోట్ తో కావొచ్చు, ఫోటో షూట్స్ తో కావొచ్చు ఫుల్ వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే మరోసారి వార్తల్లో నిలిచింది. హీరోయిన్ ల రేంజ్ లో అష్షు అందాల ఆరబోసే ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి  అష్షు బోల్డ్ బ్యూటీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తాజ్ మహల్ చూడడానికి ఆగ్రా వెళ్ళింది. అసలు ప్రేమకు గుర్తు ఈ తాజ్ మహల్ అన్న విషయం అందరికీ తెలుసు. అష్షు ఇక్కడికి వెళ్లి షాజహాన్ ని ఒక కోరిక కూడా కోరుకుంది. " హే షాజహాన్, నా జీవితంలో కూడా నీలా ప్రేమించే ఒక ప్రేమికుడిని ప్రసాదించు" అని వేడుకుంది. ఇక నెటిజన్స్ "ప్రపంచంలో ఏదైనా అందమైనది ఉంది అంటే అది ఇదే...అదే మీరు చూసేది. నువ్వు అన్ని దేశాలు రాష్ట్రాలు వెళ్తున్నావ్. దేవుడు మీద నమ్మకం ఉంచు. నీ లైఫ్ లో మంచి వ్యక్తి వస్తాడు" అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఏ మాస్టర్ పీస్‌  టైటిల్ తో సిల్వర్ స్క్రీన్‌పై మీద మెరవబోతోంది అష్షు. రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ మ‌ధ్య కాలంలో  ఆమె చాలా పాపులర్ అయ్యింది.

ఎవరికి తెలియకుండా అర్థరాత్రి రాహుల్ ని కలిసిన  స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌-27 లో..  రాహుల్ స్వప్న అర్థరాత్రి ఎవరికీ తెలియకుండా కలుసుకుంటారు. మరోవైపు స్వప్న ఫోన్ కి రాజ్ కాల్ చేయగా.‌. కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. "నీకు ఈ పెళ్ళి ఇష్టమో లేదో నాకు తెలియదు.‌ ఇష్టమైతే ఎస్ అని, లేదంటే నో అని చెప్పు చాలు" అని రాజ్ అనగా.. "ఎస్" అని కావ్య చెప్తుంది. థాంక్స్ స్వప్న అంటూ ఆనందంతో గంతులేస్తాడు రాజ్.  ఎవరికీ తెలియకుండా కలుసుకున్న స్వప్న, రాహుల్ మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు నువ్వే చెప్తావని నేను ఆగాను.. ఇప్పుడు చెప్పు రాహుల్ అని స్వప్న అనగా.. "నా మనసు నిండా నువ్వే ఉన్నావ్.. మొట్టమొదటిసారిగా నిన్ను చూడగానే 'ఐ లవ్ యూ' చెప్పాలనుకున్నా.. ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ స్వప్న" అని రాహుల్ అంటాడు. దానికి సమాధానంగా ఐ లవ్ యూ టూ రాహుల్ అని స్వప్న అంటుంది. మన ఇద్దరి పెళ్ళికి మన ఇంట్లో వాళ్ళెవరు ఒప్పుకోరు.. కాబట్టి మనం లేచిపోదాం. కొన్నిరోజులు బయటకెళ్ళి, మళ్ళీ తిరిగి వద్దాం.. ఆ తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారని స్పప్న అంటుంది. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు.. నేను ఎలా చెప్తానో అలా చేయి చాలు అని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత స్వప్న అక్కడనుండి వాళ్ళింటికి వెళ్తుంది. అలా స్వప్న ఇంటిలోపలికి సైలెంట్ గా వెళ్తుండగా కావ్య చూసి.. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావ్ అక్కా అని అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని  స్వప్న  చెప్పేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం స్వప్న వాళ్ళ అమ్మ కోసం వెతుకుతుంది. ఎక్కడా కనపించదు. ఒక సేట్ దగ్గర కనకం వాళ్ళింటిని తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకొని.. ఖరీదైన చీరలు స్వప్న కోసమని తీసుకొస్తుంది. అవి చూసిన కావ్య... "ఇన్ని డబ్బులు ఎక్కడివి" అని అడుగుతుంది. దాంతో కనకంకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

వసుధార తప్పు నీవైపు ఉంటే శిక్ష నాకు పడింది.. రిషి ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌-694 లో.. దేవయాని, రిషి కలిసి ఇంటికొస్తారు. అలా వచ్చాక.. "ఇంకెప్పుడు వసుధార వాళ్ళింటికి వెళ్ళకండి.. నాకు వసుధారకి మధ్య మీరు రాకండి పెద్దమ్మా" అని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా రిషి అనడం మహేంద్ర, జగతి వింటారు. "వసుధార వాళ్ళింటికి ఎందుకు వెళ్ళారక్కా" అని జగతి అడుగగా.. "నేను ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాల్సింది నువ్వు కాదు కదా జగతి" అని దేవయాని సమాధానమిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే వసుధార వాళ్ళింట్లోని కిచెన్ లో వంట చేస్తుంటుంది. తను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉప్మా చేస్తుంది. అప్పుడే రిషి వస్తాడు. వసుధారని కిచెన్ లో చూసి తన వెనకాల నిల్చుంటాడు. వసుధార సడన్ గా వెనక్కి తిరుగుతుంది. రిషికి తగిలి వసుధార పడిపోతుంటే పట్టుకుంటాడు. ఒక మెలోడీ లవ్ డ్రామా మొదలవుతుంది. కాసేపు వసుధార కళ్ళలోకి అలానే చూస్తుండిపోతాడు రిషి. ఇక వసుధార కల అని అనుకుంటుంది. ఇంతలో రిషి సోఫాలోకి వెళ్ళిపోతాడు. వసుధార ఇదంతా కలనా.. రిషి సర్ వచ్చాడా లేదా అనే భ్రమలో‌ ఉంటుంది. ఆ తర్వాత చక్రపాణి బయట నుండి ఇంట్లోకి వస్తుండగా రిషిని చూసి.. సర్ మీరెప్పుడు వచ్చారు. కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగి రిషి వద్దని చెప్పినా తీసుకొస్తానని వెళ్తాడు. రిషి మాటలు విని, అతన్ని చూసి షాక్ అవుతుంది వసుధార. ఎందుకొచ్చారని వసుధార అడుగగా.. తనకి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి స్టూడెంట్స్ కి వసుధార క్లాస్ చెప్తుంటే క్లాస్ రూంకి వెళ్ళి కూర్చుంటాడు రిషి. క్లాస్ లో రిషిని చూసి ఇది కలనా? నిజమా? అని అనుకొని సర్లే అని క్లాస్ చెప్పేస్తుంది. క్లాస్ పూర్తయ్యాక స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. క్లాస్ లో రిషి ఒక్కడే కూర్చొని ఉంటాడు. రిషిని చూసి మళ్ళీ షాక్ అవుతుంది. రిషి దగ్గరికి వెళ్ళి ఎందుకొచ్చారు సర్ అని వసుధార అడుగగా.. నా రింగ్ నాకు ఇవ్వు అని అంటాడు. దానికి వసుధార ఇవ్వనని చెప్తుంది. ఎందుకివ్వవు అని రిషి అడుగగా.. "ఆ రింగ్ మీద 'VR' అని ఉంది.. 'V' అంటే వసుధార 'R' అంటే రిషి.. మనమిద్దరం కలిసి రిషిధార. అందులో నుండి అలా ఎలా విడదీస్తారు.. బంధం అంటే కలసి ఉండటం నేను ఇవ్వను" అని వసుధార అంటుంది. "బంధం అంటే బాధపెట్టడమని ఎక్కడైనా రాసి ఉందా.. తప్పు నీవైపు ఉంటే శిక్ష నాకు పడింది" అని చెప్పి రిషి ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రిషి అడిగిన ప్రశ్నలకు వసుధార సరైన సమాధానమిస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

ఆదిరెడ్డి చేసిన పనికి ఫిదా అయిన నెటిజన్లు!

బిగ్ బాస్ సీజన్-6 లో కామన్ మ్యాన్  గా అడుగుపెట్టిన  ఆదిరెడ్డి అందరికీ సుపరిచతమే.. బిగ్ బాస్ లో తన మార్క్ స్ట్రాటజీ తో టాస్క్ లు ఆడి, పర్ఫామెన్స్ చేసి టాప్-5 వరకూ ఉండి చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ వెళ్ళకముందు రివ్యూలు ఇచ్చే ఆదిరెడ్డి హౌస్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా తన రివ్యూలు, వ్లాగ్ లు ఆపలేదు. ఎప్పటికప్పుడు ప్రతీ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ కి తన చెల్లి నాగలక్ష్మి, భార్య కవితతో కలిసి వచ్చినట్టుగా ఒక వ్లాగ్, డ్యాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తున్నట్టుగా వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాడు. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ నాలుగు లక్షల సబ్ స్క్రైబర్స్ వచ్చినందుకు గాను ఆదిరెడ్డి తన భార్య కవిత, చెల్లి నాగలక్ష్మి తో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు.  అయితే ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాదులోని చెంగిచెర్లలో ఉన్న ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళందరితో ఆదిరెడ్డి ఫ్యామీలీ కాస్త సమయం గడిపారు. ఆశ్రమంలో ఉన్న వారికి ఫ్రూట్స్ పంచారు. ఆ తర్వాత "ఇక్కడ ఎలా ఉంది. వీళ్ళు బాగా చూసుకుంటున్నారా?" అంటూ  అన్నీ తెలుసుకున్నాడు ఆదిరెడ్డి. కేక్ కట్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ ని సబ్ స్ర్కైబ్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.. ఈ సేవ ఇక్కడితో అయిపోదు.. నేను హైదరాబాద్ కి వచ్చిన ప్రతీసారీ ఇక్కడికి వస్తానని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఇప్పుడు ఈ  వీడియో నెట్టింట్లో వైరల్ గా మరింది.

రాజ్ తో పెళ్ళి ఫిక్స్.. స్వప్న సీక్రెట్ లవ్ ఫట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'బ్రహ్మముడి' సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ ఎపిసోడ్-26 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. రాజ్, స్వప్నల పెళ్ళికి మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పడం తో, అన్ని రోజులు పెళ్ళికి టైం అంటే.. ఎక్కడ తన బాగోతం బయటపడుతుందోనని కనకం టెన్షన్ పడుతుంది. అన్ని రోజులు అంటే కుదరదు మా అక్క ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. మా దైవం అక్క కాబట్టి తను వెళ్ళకముందే పెళ్ళి చెయ్యాలని అంటుంది. ఇక రాజ్ ఫ్యామిలీకి స్వప్న బాగా నచ్చడంతో దగ్గర్లో ముహూర్తం చూడమని పంతులుకి  చెప్పగా.. అతను అంతా మళ్ళీ చూసి వారంలో ముహూర్తం ఉందని అనడంతో.. సరేనని రెండు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు. రాజ్ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నానని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక రాజ్ ఫ్యామిలీ వెళ్ళిపోయాక.. స్వప్న గదిలోకి వెళ్ళి చిరాకుగా రాహుల్ కి ఫోన్ చేస్తుంది. "మీరు సూటిగా ఏది చెప్పరా? నాకు ఎంగేజ్మెంట్ అయితే నువ్వు హ్యాపీగా ఉన్నావా" అని అంటుంది స్వప్న. "రాజ్ అంటే ఇష్టం లేదనన్నావ్ మరి నీకెవరు ఇష్టమో చెప్పలేదు కదా" అని రాహుల్ అంటాడు. నేను మీతో మాట్లాడాలి అని స్వప్న అనగానే.. అయితే రాత్రి మీ ఇంటి ముందుకు వస్తానని రాహుల్ అంటాడు. మరోవైపు రాజ్ పెళ్ళి వారంలో ఎలా సాధ్యం అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడు పెళ్ళి ఏర్పాట్లకు టైమ్ పడుతుంది కదా.. ఇలా ఎందుకు చేశారంటూ ఇంట్లో వాళ్ళపై కోప్పడతాడు రాజ్ తండ్రి. ఇక స్వప్న పెళ్ళికి కనకం అప్పు చెయ్యాలనుకుంటుంది. అందుకు కృష్ణమూర్తి కనకం ని కోప్పడతాడు. మరోవైపు దగ్గరలో పెళ్ళి పెట్టుకొని స్వప్న ఒక్కసారి కూడా రాజ్ తో మాట్లాడలేదు. స్వప్నకి ఈ పెళ్ళి అంటే ఇష్టముందా లేదా అనే డౌట్ రాజ్ కి వస్తుంది. ఇక స్వప్నకి ఫోన్ చేసి అడుగుదామని ఫోన్ చేస్తాడు. అప్పుడే స్వప్న తన గదిలోకి వెళ్తుంది. ఫోన్ రింగ్ అవడం చూసి పక్కనే ఉన్న కావ్య.. "అక్కా.. లే ఫోన్ వస్తుంది" అని లేపుతుంది. దుప్పటి తీసేసరికి స్వప్న లేకపోవడంతో ఈ టైంలో లో ఎక్కడికి వెళ్ళిందని కావ్యకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మురారి ఈ తింగరిపిల్లతో ఎలా వేగుతున్నావ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్-87 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. కృష్ణని తీసుకొని మురారి కాలేజీకి వెళ్తాడు. అక్కడ ఒక మేడం దగ్గరికి వెళ్తారు. కృష్ణని మేడం సర్టిఫికెట్స్ ఇవ్వమనగా కృష్ణ కంగారుగా అన్ని సర్టిఫికెట్స్ కింద పడేస్తుంది. అప్పుడు అది చూసిన మేడం.. "ఈ తింగరి పిల్లను ఎలా పెళ్ళి చేసుకున్నావ్" అని మురారితో అంటుంది. అప్పుడు కృష్ణ మురారి ఒకరి మొహం ఒకరు చూసుకొని అక్కడ పెద్ద అత్తయ్య కూడా అలానే అంటుందని కృష్ణ అంటుంది. తర్వాత ఫీజు కట్టడానికి కృష్ణ వెళ్తుంటే తనని ఆపి  మురారి పే చేస్తా అని అంటాడు. లేదు నేను చేస్తానని కృష్ణ అంటుంది. "నన్ను పరాయివాడిలా చూస్తున్నావ్.. ఈ విషయం అమ్మకి చెప్తే గరిటె అందుకొని నన్ను వాయిస్తుంది" అని మురారి అంటాడు. అలా అనడంతో కృష్ణ సరేనని ఒప్పుకుంటుంది. తర్వాత మురారి, కృష్ణ లు ఇంట్లోకి వెళ్లి కాలేజీలో మేడం అన్న మాటలను గుర్తు చేసుకుంటారు. ఎదురుగా ఉన్న  భవాని వాళ్ళని చూసి.. కాలేజీ కి వెళ్ళిన పని అయిందా అని అడుగుతుంది. హా అయిపోయింది పెద్దమ్మ అని మురారి చెప్తాడు.. " ఏసీపి సర్ ఎంత మంచివాడో పెద్ద అత్తయ్య.. నాకోసం రెండు సార్లు.. మూడు ఫ్లోర్ లు ఎక్కి దిగి ఫీజు కట్టి వచ్చాడు" అని కృష్ణ సరదాగా అంటుంది. ఏంట్రా మురారి ఈ తింగరి పిల్లతో ఎలా వేగుతున్నావ్ అని భవాని అంటుంది. దానికి మురారి.. "తప్పదు కదా పెద్దమ్మా" అని సరదాగా అంటాడు. దాంతో  కృష్ణ అలిగి కోపంగా తన గదిలోకి వెళ్తుంది. నీ భార్య అలిగినట్లు ఉంది వెళ్ళి ఓదార్చు అని మురారిని పంపిస్తుంది భవాని. గదిలోకి వెళ్ళిన కృష్ణని చూసి మురారి తన సరదా మాటలతో నవ్వించడానికి ప్రయతిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దేవయానికి విశ్వరూపం చూపించిన చక్రపాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-693 లో.. వసుధారకి టైం ఇవ్వకుండా సడన్ గా మీటింగ్ కి పిలుస్తాడు రిషి. అందరూ మీటింగ్ కి వచ్చాక వసుధారని మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమంటాడు. అలా హఠాత్తుగా చెప్పమనేసరికి వసుధారకి ఏం మాట్లాడాలో తెలియక అటుఇటు చూస్తు‌ంటుంది. అలా వసుధార అటుఇటు చూడటం చూసి రిషి మెసేజ్ చేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ టాపిక్ అని చెప్తాడు. వసుధార ఆ మెసేజ్ చూసి రిషి సర్ ఏంటి మెసేజ్ చేసాడని చూస్తుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి టాపిక్ కి సంబంధించిన అన్ని వివరాలను మెసేజ్ ల రూపంలో వసుధారకి పంపిస్తాడు రిషి. తను ఆ మెసేజ్ లు అన్నీ చూస్తు సెమినార్ బాగా ఇస్తుంది. మీటింగ్ పూర్తయ్యాక అందరూ చప్పట్లతో తమ అభినందనలని తెలుపుతారు. వసుధారని పర్సనల్ గా కలుస్తుంది జగతి. చాలా బాగా మాట్లాడావ్ అని చెప్పగా.. ఆ క్రెడిట్ మీ కొడుకుకే దక్కాలని వసుధార అంటుంది. అదేంటి అని అడుగుతుంది రేవతి. రిషి సర్ టాపిక్ గురించి మెసేజ్ ల రూపంలో పంపించాడని చెప్తుంది. ఆ తర్వాత రిషి, వసుధార కలిసి కాలేజ్ నుండి ఇంటికి బయల్దేరతారు చక్రపాణి ఇంటికి దేవయాణి వస్తుంది. వసుధారని మా రిషి మీదకి ఎందుకు ఉసిగొలుపుతున్నావని అంటుంది. దానికి ఒక్కసారిగా రెచ్చిపోతాడు చక్రపాణి. "ఏం మాట్లాడుతున్నావ్, మాటలు మంచిగా రానివ్వు.. నేను మారిపోయాను.. పాత చక్రపాణిని నిద్రలేపకు తట్టుకోలేవు.. నా విశ్వరూపం చూసి తట్టుకోలేవ్" అని చక్రపాణి కోపంతో ఊగిపోతుంటాడు. అతడిని చూసి.‌. "వీడేంటి ఇంతలా కోపంతో ఊగిపోతున్నాడు" అని దేవయాని తన మనసులో భయపడిపోతుంది. కాసేపటికి రిషి వచ్చి పెద్దమ్మా అని అనగానే చక్రపాణి, దేవయాని మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత దేవయానిని రిషి తీసుకెళ్తాడు. కాసేపటికి చక్రపాణిని ఏం అయిందని వసుధార అడుగగా.‌. "తను ఒక ప్రశ్న అడిగితే నేను నాలుగు సమాధానాలు చెప్పాను" అని చక్రపాణి చెప్తాడు. కార్ లో దేవయాని రిషి వెళ్తుండగా వసుధార థాంక్స్ అని మెసేజ్ చేస్తుంది. అలా ఇద్దరు కాసేపు చాటింగ్ చేసుకుంటారు. "ఫోన్ లో ఎవరు" అని దేవయాని అడుగగా.. "వసుధార పెద్దమ్మా.. మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండటం నాకిష్టం లేదు.. నా సమస్యని నేనే పరిష్కారించుకుంటాను" అని రిషి చెప్పగా దేవయాని మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

హగ్ మీ టైట్ అని ఎవరితోనో చెప్తోన్న అష్షు

బుల్లితెర మీద తన హాట్ పిక్స్ తో అందరినీ తన వైపు తిప్పుకునే బిగ్ బాస్ బ్యూటీ అషు  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈమె  సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫుల్ మస్తీ చేస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా పెద్దగా పట్టించుకోదు అష్షు. తనకు నచ్చిందే చేస్తుంది..ఏది అనిపిస్తే అదే పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన  ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. "హగ్ మీ టైట్...ఐ నీడ్ విటమిన్ యు" " నా విషయంలో ఈ విటమిన్ "యూ" లోపం ఎప్పుడూ ఉంటుంది" అని పోస్ట్ చేసింది. మరి ఈ కాప్షన్  ఎవరి కోసం పెట్టిందో మాత్రం అష్షు చెప్పలేదు.  అష్షు కామెంట్స్ పెట్టడమే కాదు, వీడియోస్ , ఫోటోషూట్స్ లో కనిపించడం మాత్రమే కాదు మంచి వంటగత్తె అని కూడా నిరూపించుకుంది. తన ఫ్రెండ్స్ కోసం మంచి స్పైసీగా ఉండే చికెన్ కర్రీని వండేసింది. బాగోకపోతే ఏమంటారో తెలీదు కానీ బాగుంటుందని గట్టి నమ్మకం అంది అష్షు. ఇక అరియనా, అష్షు రాంగోపాల్ వర్మ కలిశారు అంటే మాత్రం మీడియాకి మంచి స్టఫ్ దొరికినట్టే. పవన్ కళ్యాణ్ కు వీరాబాభిమాని అయిన అష్షు పవన్ పేరును తన ప్రైవేట్ పార్ట్ పై టాటూగా వేయించుకుని సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్న అష్షు మరో వైపు సినిమా ఛాన్స్ లు సైతం దక్కించుకుంటూ దూసుకుపోతోంది.