సోమేష్, సుదర్శన్ మాస్టర్ల మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగింది?

ఢీ ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ప్రతీ వారం ఏదో ఒక కాంట్రవర్సితో ఎంటర్టైన్ చేస్తోంది. ఒక టీమ్ కి పోటీగా మరొక టీమ్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తూ అలరిస్తున్నాయి. ఈ షో మధ్య మధ్యలో హైపర్ ఆది కామెడీ కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చు. ఐతే ఇప్పుడు ఆయనతో పాటు ఓల్డ్ కంటెస్టెంట్ పండు కూడా జతకట్టాడు. పండు కామెడీ కూడా పీక్స్ లో ఉంటోంది. ఆడియన్స్ కూడా పండు కామెడీని ఇష్టపడుతున్నారన్న విషయం కామెంట్స్ చూస్తుంటే అర్ధమవుతోంది.  ఐతే ఈ షో ఈవారం ఎక్స్-కంటెస్టెంట్స్ థీమ్ గా రాబోతోంది. ఎక్స్ కంటెస్టెంట్స్  వచ్చి ఇందులో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేసి ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ లో చెర్రీ అనే ఒక కంటెస్టెంట్ "ఏదో ఒక రాగం వింటున్నా" అనే సాంగ్ కి "నాన్న" మూవీలో విక్రమ్ రోల్ లా యాక్ట్ చేస్తూ డాన్స్ చేసాడు. ఐతే ఇందులో విక్రమ్ కి డాన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. జస్ట్ ఎక్స్ ప్రెషన్స్, సింపుల్ స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడి కంటెస్టెంట్ కూడా అలాగే చేసాడు. ఆ డాన్స్ పెర్ఫార్మ్ చేసాక "ఇది నాకు డాన్స్ పెర్ఫార్మెన్స్ లా అనిపించలేదు" అని సుదర్శన్ మాస్టర్ అనేసరికి "గ్రూప్ లో సైడ్ డాన్సర్ గా పెట్టలేము కదా చెర్రీని" అని సోమేష్ మాస్టర్ కూడా గట్టిగానే ఆన్సర్ చేసాడు. "అప్పుడు చెర్రీని హైలైట్ చేసినప్పుడు గ్రూప్ లో ఒక్కో అబ్బాయిని కూడా హైలైట్ చేయొచ్చు కదా" అని సుదర్శన్ మాస్టర్ మళ్ళీ ఒక కౌంటర్ వేసాడు. "కానీ ఏదో చెప్పాలని ఏదో చెప్పకూడదు" అంటూ రివర్స్ లో ఫైర్ అయ్యాడు సోమేష్ మాస్టర్. "తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేదంటే వదిలేయండి" అన్నాడు సీరియస్ గా సుదర్శన్ మాస్టర్. ఆ మాటలకూ శేఖర్ మాస్టర్ షాకయ్యాడు.  ఇక నెటిజన్స్ కూడా సుదర్శన్ మాస్టర్ మీద ఫైర్ అవుతున్నారు. "సుదర్శన్ మాస్టర్ ముందు మీది చూసుకోండి అందరినీ ఎత్తి చూపడం కాదు. ఐనా మీరు చేసే కొరియోగ్రఫీ ఏమైనా బాగుందా..? సీజన్ మొదట్లోనే మీ కంటెస్టెంట్ రాహుల్ పైన సింపతి క్రియేట్ చేశారు. అందుకే మీకు మార్కులు మంచిగా ఇవ్వకపోతే బాగోదని ఇస్తున్నారు. మాటలు తగ్గించి మంచిగా డాన్స్ చేయించండి. ఒకరు కష్టపడితే అందరి దగ్గర అభినందనలు మాత్రం మీరు పొందుతారు. ఇది మీకు కరెక్ట్ కాదు" అని గట్టిగా కౌంటర్ వేశారు. ఇంతకు ఈ షోలో ఏం జరిగింది. వీళ్ళ మధ్య మొదలైన మాటల యుద్దానికి తెర పడిందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సెంచరీ కొట్టారు.. లైవ్ కి వచ్చారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ లో మురారి పాత్రలో గగన్ చిన్నప్ప, ముకుంద పాత్రలో యష్మి గౌడ, కృష్ణ పాత్రలో ప్రేరణ కంభం నటిస్తున్నారు. చాలా సినిమాల్లో తల్లి పాత్రలు పోషించిన సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ ఈ సీరియల్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సీరియల్ శుక్రవారం 100వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. మురారి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ముకుంద పరిచయమవుతుంది. వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అనుకోకుండా వారిద్దరు అక్కడ విడిపోతారు. మురారి, ముకుంద మళ్ళీ ఒకరినొకరు కలుసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన అడ్రెస్ గాని ఫోన్ నెంబర్ గాని ఏమీ తెలియవు. దీంతో ముకుంద వాళ్ళింట్లో అమ్మనాన్న తెచ్చిన సంబంధానికి ఇష్టం లేకున్నా ఓకే చెప్తుంది. అలా ముకుంద పెళ్ళి ఆదర్శ్ తో జరుగుతుంది. అయితే ఆదర్శ్ మురారికి అన్నయ్య అనే విషయం తర్వాత తెలుస్తుంది. ముకుంద పెళ్ళి చేసుకుని మురారి ఇంటికే వస్తుంది. పెళ్ళి అయిన వెంటనే ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు అనుకోకుండా ఒక సంఘటనలో కృష్ణ వాళ్ళ నాన్న చనిపోతాడు. కృష్ణ వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం కృష్ణని మురారి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు. కృష్ణకి మురారితో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఇది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ అని తన చదువు పూర్తి కాగానే వెళ్ళిపోతా అని కృష్ణ చెప్తుంది. కృష్ణని పెళ్లి చేసుకోవడం మురారి పెద్దమ్మ భవానీ(ప్రియా)కి ఇష్టముండదు.  ఇలా ఆ ఇంట్లో ముకుంద తన ప్రేమని బ్రతికించుకోవాలని పరితపిస్తూ ఒకవైపు.. అమాయకురాలిగా కృష్ణ ఒక వైపు.‌. మధ్యలో నలిగిపోతూ మురారి కన్పిస్తుంటారు. ఇలా ఈ సీరియల్ సాగిపోతూ 100 వ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా కృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చింది. తన ఫాలోవర్స్ కి హాయ్ చెప్తూ వారు అడిగే ప్రశ్నలకి తీరిగ్గా సమాధానం చెప్పింది. అక్కడ షూటింగ్ లొకేషన్ ని చూపిస్తూ, పక్కనే ఉన్న మురారితో కలిసి సరదాగా ముచ్చటించింది.

పాగల్ పవిత్ర ముఖం కప్పలా ఉంటుంది!

లేడీస్ అండ్ జెంటిల్ మెన్ షో ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి వస్తోంది. ఇక ఈ వారం రాబోయే షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో పవిత్ర-భాస్కర్, తాగుబోతు రమేష్- కెవ్వు కార్తిక్, అదిరే అభి-సునామి సుధాకర్ జోడీస్ గా వచ్చారు. "పవిత్రను ముద్దుగా ఏమని పిలుస్తావ్" అని ప్రదీప్ బులెట్ భాస్కర్ ని అడిగేసరికి "కప్పకు మానవ రూపం ఇస్తే ఎలా ఉంటుందో పవిత్ర అలా ఉంటుంది" అని పంచ్ వేసాడు. "పాలకూర పప్పు..పవిత్ర నిప్పు" అంటూ ఆడియన్స్ పవిత్ర మీద డైలాగ్ వేశారు. దానికి పవిత్ర "నా పక్కన ఉంది తుప్పు" అంటూ భాస్కర్ కి అదిరిపోయే రివర్స్ పంచ్ వేసేసింది.  వీళ్ళ తర్వాత తాగుబోతు రమేష్- కెవ్వు కార్తిక్ ఎంట్రీ ఇచ్చారు. తాగుబోతు రమేష్ గారు షోకి కూడా హెల్మెట్ తో వచ్చారు అనేసరికి ఒక్కసారి షాకయ్యాడు. "మీ టీ షర్ట్ మీద ఉంది హెల్మెట్" అనేసరికి అందరూ నవ్వేశారు. తాగుబోతు రమేష్ అన్నకు చాల అన్యాయం జరిగింది ఎందుకంటే "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి నంది అవార్డు వచ్చింది.. కానీ ఆయనకు పునాది రాళ్లు సినిమాకు రావాలి" అని బులెట్ భాస్కర్ అనేసరికి రమేష్ నోరెళ్లబెట్టాడు. దాంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో "ముసలి తాత ముడత ముఖం" ప్లే చేశారు. తర్వాత అభి-సునామి సుధాకర్ ఎంట్రీ ఇచ్చి 'నాటు నాటు' సాంగ్ కి నాగార్జున-అక్కినేని నాగేశ్వరావు స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు.  తర్వాత కంటెస్టెంట్స్ కి మస్కిటో కాయిల్స్ ఇచ్చి విరగకుండా సెపరేట్ చేయమని టాస్క్ ఇచ్చాడు ప్రదీప్. "ఎంత శాతం మంది మగవాళ్ళు తల్లో రెండు సుడులు ఉన్నవాళ్లు రెండు పెళ్లిళ్లు అవుతాయని నమ్ముతారు" అని ప్రదీప్ అడిగేసరికి "చేసుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ సుడులతో పని లేదు" అని చెప్పాడు భాస్కర్. "మీకెప్పుడైనా అనిపించిందా అర్రే ఇంకొక్క సుడి ఉంటె బాగుండు అని" రమేష్ ని అడిగాడు. "ఉంటే బాగుండు..కనీసం రెండన్నా" అని రమేష్ ఆన్సర్ చెప్పేలోపు "మీకు సుడి లేకపోయినా ఇంటికెళ్ళాక వచ్చేస్తుంది" అని కామెడీగా కౌంటర్ వేసాడు ప్రదీప్. ఇలా రాబోయే వారం ఈ షో అలరించడానికి రాబోతోంది.

రాజ్ పక్కన కావ్యని చూసి షాకైన అపర్ణ.. ఆమెని ఇంటికోడలిగా అంగీకరిస్తుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి ఉత్కంఠభరితంగా మారుతూ వస్తోంది. ఒకరంటే ఒకరికి అసలు ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులకు బ్రహ్మముడి పడింది. దీంతో తదుపరి ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. కాగా ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -39 లో కావ్యకు అప్పగింతలు చేసి కనకం కుటుంబం రాజ్ తో పంపిస్తారు. కావ్య వెళ్ళిపోయిన వెంటనే అప్పు ఒక బ్యాగ్ తీసుకొచ్చి "అక్క ఈ బ్యాగ్ మర్చిపోయింది. ఈ బ్యాగ్ అంటే తనకి ఇష్టం. ఎలాగైనా ఇవ్వాలి" అని కావ్య, రాజ్ లు వెళ్తున్న కార్ వెంబడి పరుగెత్తుతుండగా.. రాజ్ కార్ అద్దంలో చూసి కార్ ఆపమంటాడు. ఇక కార్ ఆగిన తర్వాత అప్పు బ్యాగ్ తీసుకొని వచ్చి.. "అక్క బ్యాగ్ మర్చిపోయావ్" అని కావ్యకి ఇస్తుంది. "బ్యాగ్ కోసం ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావా" అని కావ్య అంటుంది. "మా అక్క దేవత జాగ్రత్తగా చూసుకోండి" అని రాజ్ తో అనగానే.. "మేము వెళ్ళేది అడవికి కాదు అయోధ్యకే" అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్, కావ్యలు బయల్దేరి వెళ్తారు. రాజ్, కావ్యల కంటే ముందే రాజ్ వాళ్ళ కుటుంబసభ్యులంతా వారింటికి వెళ్తారు. ఇక ఇంట్లో ఉన్న రాజ్ తల్లి అపర్ణ "అక్కడే ఉండండి హారతి ఇస్తాను" అన్నా పట్టించుకోకుండా అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. "ఏమైంది అలా ఉన్నారు.. రాజ్, స్వప్నలు ఎక్కడ? వస్తున్నారా?" అని అడిగినా ఎవరూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఇంతలో రాజ్-కావ్య కలిసి కార్ లో వస్తారు. అలా రాజ్ కారు వచ్చి ఆగడంతో.. రాజ్ వాళ్ళు వచ్చారంటూ.. సంతోషంతో అపర్ణ హారతి పట్టుకొని వెళుతుంది. రాజ్ పక్కన స్వప్న కనిపించకపోవడంతో అటు ఇటు చూసి పక్కన ఉన్న కళ్యాణ్ ని..‌ మీ వదిన ఎక్కడ అని అడుగుతుంది అపర్ణ. ఆ తర్వాత కళ్యాణ్ వెనకాలే ఉన్న కావ్యని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఈ అమ్మాయి ఉందని అపర్ణ అడుగుతుంది. "స్వప్నకు పెళ్ళి ఇష్టం లేదని లెటర్ రాసి పారిపోయింది. ఈ అమ్మాయి కూడా కనకం కూతురే. వాళ్ళు మనకు చెప్పినవన్నీ అబద్దాలే. చేసినవన్నీ మోసాలే" అని రాజ్ తన తల్లితో చెప్తాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఈ అమ్మాయిని ఎలా చేసుకున్నావ్? అని కోప్పడుతుంది అపర్ణ.  "మీరంతా అక్కడ ఏం చేసారు? నేను అక్కడ ఉండి ఉంటే ఈ పెళ్ళి జరగనిచ్చేదాన్నే కాదు" అని కుటుంబసభ్యులతో అపర్ణ అంటుంది. అక్కడ మనకు సపోర్ట్ గా మీడియా వాళ్ళు లేరు.. మనమేదో తప్పు చేస్తున్నామని అంతా అనుకుంటున్నారని అపర్ణకి అక్కడ జరిగిందంత చెప్తారు. అలా చెప్పేసరికి అపర్ణ కూల్ అయి.. రాజ్, కావ్యల దగ్గరికి వస్తుంది. కావ్య అంటే ఇష్టం లేని అపర్ణ ఆమెని ఇంటి కోడలిగా అంగీకరిస్తుందా? ఇంట్లోకి రానిస్తుందా? దుగ్గిరాల ఫ్యామిలీని కావ్య ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధారకి పూలు కొనిచ్చిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.‌ ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌-706 లో.. మినిస్టర్ ఇంటికి రిషి, వసుధార భోజనానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు కలిసి భోజనం చేస్తుండగా.. మీరిద్దరు ఎప్పుడు? ఎక్కడ? కలిసారని మినిస్టర్ రిషిని అడిగేసరికి అతను తడబడతాడు. దాంతో అతనికి వాటర్ ఇస్తూ ఎవరో తలుచుకుంటున్నట్టు ఉన్నారని వసుధార అంటుంది. అది విని మినిస్టర్ ఇంకెవ్వరు జగతి, మహేంద్రలే తలుచుకుంటారని అంటాడు. కాసేపు మాట్లాడాక మినిస్టర్ ఇంటి దగ్గర నుండి బయల్దేరి వచ్చేస్తారు. రిషి కార్ ని మధ్యలో ఒక దగ్గర ఆపుతాడు. అక్కడ రిషి, వసుధార పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటారు. "ఈ రోజు మన ప్రయాణంలో ఏమైనా మార్పు కనిపించిందా వసుధార" అని రిషి అడుగుతాడు. "ఆ కనిపించింది సర్.. ఇన్ని రోజులు మీకు అసిస్టెంట్ గా వచ్చాను.. ఈ రోజు మీ భార్యగా వచ్చాను" అని వసుధార చెప్పింది. "మనల్ని ప్రపంచమంతా భార్యాభర్తలనే అనుకుంటున్నారు కదా సర్" అని వసుధార అనగా.. "అనుకోవడం వేరు వాస్తవం వేరు కదా" అని రిషి అంటాడు. "మీరు అందరి ముందు ఒప్పుకున్నారు కదా సర్.. ఇప్పుడేంటి ఇలా అంటున్నారు" అని వసుధార అడుగుతుంది. అందరి ముందు నువ్వు తలదించుకోకూడదని అలా చెప్పానని రిషి అనగానే.. "మీరు నన్ను భార్య అని చెప్పుకోవడం సంతోషంగా లేదా సర్?" అని అడుగుతుంది. "సగం సంతోషం ఉంది‌.. మిగతా సగం బాధ ఉంది.. ఎందుకు అలా చేసావ్? నీ మీద ప్రేమ తగ్గదు.. గౌరవం తగ్గదు.. నువ్వు నా భార్యగా రావాలంటే నా  మనసుకు చేసిన గాయం తగ్గాలి" అని రిషి అంటాడు.  అంతలోనే పూలు అమ్మే ఆమె వస్తుంది. "మీరిద్దరు భార్యాభర్తలా అమ్మా?" అని పూలమ్మే ఆమె అడుగగా.. "అవును మా వారే" అని వసుధార అంటుంది. తర్వాత వసుధారకి పూలు కొనిస్తాడు రిషి. కాసేపటికి ఇద్దరు అక్కడి నుండి బయల్దేరతారు. వసుధార ఇంటి ముందు రిషి కార్ ఆపుతాడు. వసుధార తనని పిలిస్తే ఇంట్లోకి వెళదామని రిషి అనుకుంటాడు. మరి తను రిషిని ఇంట్లోకి పిలుస్తుందా? లేదా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు  ఆగాల్సిందే.

కొత్తగా పెళ్లయింది కదా.. సరదాలు ఉంటాయిలే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-100 లో.. నందు గురించి కృష్ణ ఆలోచిస్తుంది. "ఇంట్లో అందరూ నందుకి గతం గుర్తు రాకుండా ఉండే టాబ్లెట్స్ ఎందుకు వాడుతున్నారు" అని కృష్ణ అనుకుంటుంది. మరోవైపు మురారి స్టేషన్ కి వెళ్ళకుండా తన ఫ్రెండ్ గోపి దగ్గరికి వెళ్ళి బాధను చెప్పుకుంటాడు. "ఇంటికెళ్ళాలి అనిపించట్లేదు.. ఒక్క కృష్ణ కోసమే వెళ్తున్నాను.. ముకుందని చూస్తే భయమేస్తుంది" అని గోపీతో మురారి చెప్తాడు. "ముకుందని చూస్తే ఎందుకు భయమేస్తుంది? ముకుంద నిన్ను సిన్సియర్ గా లవ్ చేసింది. అందుకే నిన్ను మర్చిపోలేకపోతుంది.. కాని నువ్వే స్వార్థంతో ఆలోచిస్తున్నావు.. నిన్ను ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ చెయ్యలేను" అని గోపి అంటాడు. "నువ్వు అలా అంటే నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తున్నట్లు ఉంది గోపి.. నేను ఏం చెయ్యాలి" అంటూ మురారి బాధపడతాడు. మరోవైపు భవాని దగ్గరికి ఈశ్వర్, ప్రసాద్ వచ్చి మాట్లాడుతుంటారు. "వదిన నందు గురించే ఆలోచిస్తున్నావా? కృష్ణ తన సీనియర్ డాక్టర్ తో మందులు రాయించుకొని తీసుకొస్తా అంటుంది" అని ఈశ్వర్ చెప్తాడు. ఆ డాక్టర్ నందుని చూడకుండా ఎలా మందులు రాస్తాడని భవాని అడుగుతుంది‌. నందుకి గతం గుర్తొస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది.. కృష్ణ ని ఓ కంట కనిపెడుతుండాలని ముగ్గురు అనుకుంటారు. మురారి గురించి ముకుంద ఆలోచిస్తుంటుంది. "నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నాడు. నేను వెంటనే మురారిని చూడాలి" అని భావించిన ముకుంద స్టేషన్ కి ఫోన్ చేస్తుంది. స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి.. "సర్ ఈ రోజు లీవ్ లో ఉన్నాడు మేడమ్" అని చెప్పగానే.. ముకుంద ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత బయటికి వెళ్తుంది. మరోవైపు నందు కోసం గౌతమ్ రాసిన మందులు తీసుకొని.. "నందు గురించి ఏసీపి సర్ కి చెప్పాలా" అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మురారికి ఫోన్ చేస్తుంది. కాలేజీకి వస్తున్నారా అని అడిగేసరికి.. పక్కనే ఉన్నానని చెప్పి కాసేపటికి కృష్ణ దగ్గరికి వస్తాడు మురారి. ఆ తర్వాత ఇద్దరు కార్ లో వెళ్తుంటారు. నందు గురించి కృష్ణ చెప్పాలనుకుంటుంది కాని మురారిని చూడగానే డల్ గా కనిపించేసరికి సర్ మూడ్ బాలేదని చెప్పదు. ఇక మధ్యలో కార్ ఆగిపోతుంది. అక్కడ పక్కనే ఉన్న పానీపూరి బండి చూసి ఇద్దరూ తినడానికి వెళ్తారు. మురారికి కృష్ణ పానీపూరి తినిపిస్తుండగా.. ముకుంద వచ్చి ఆపుతుంది. "ముకుంద.. నువ్వు ఏంటి ఇక్కడ" అని కృష్ణ అడిగేసరికి.. పని మీద వచ్చానని ముకుంద చెప్తుంది. మీరు ఇలా తినడం ఇంట్లో ఎవరికీ చెప్పనులే.. కొత్తగా పెళ్ళి అయింది కదా.. మీకు సరదాలు ఉంటాయని ముకుంద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అమ్ములుకి కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన అంకిత్!

ప్రియాంక జైన్ అంటే చాలా కొద్ది మందికే తెలుస్తుంది కానీ 'మౌనరాగం' సీరియల్‌ లో నటించిన అమ్ములు అంటే అందరికీ గుర్తొచ్చేస్తుంది. ఇక ఇదే సీరియల్ లో అంకిత్ గా నటించిన శివ కుమార్ కూడా అందరికీ తెలిసిన నటుడే. వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న 'జానకి కలగనలేదు' సీరియల్‌లో జానకిగా లీడ్ రోల్ లో నటిస్తోంది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్. ఆన్ స్క్రీన్‌లో మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీళ్ళ లవ్ ని ఎక్సప్రెస్ చేస్తూ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.  ఐతే శివ కుమార్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం రీసెంట్ గా ఒక కార్ కొనిచ్చాడు. నెక్సా వారి 25 లక్షల విలువైన గ్రాండ్ విటారాని గిఫ్ట్ గా ఇచ్చాడు. ముందుగా ప్రియాంక వాళ్ళ ఫామిలీ మొత్తాన్ని కళ్ళకు గంతలు కట్టి డైరెక్ట్ గా కార్ షోరూమ్ కి తీసుకెళ్లి అక్కడ కార్ చూపించి సర్ప్రైజ్ ఇచ్చాడు. వాళ్లంతా శివ కుమార్ కి విషెస్ చెప్పారు. ఇక అక్కడే కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు.  'మౌనరాగం' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక సినిమా హీరోయిన్ కూడా. కన్నడలో ఒక మూవీలో నటించింది. తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి మూవీస్ లో నటించింది. కొంతకాలం క్రితం సీమంతం జరిగినట్టుగా  కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే అవి సీరియల్ లో భాగంగా జరిగిన ఫోటో షూట్ అన్న విషయం తర్వాత అర్ధమయ్యింది. శివ కుమార్ 'ఇంటికి దీపం ఇల్లాలు' సీరియల్ లో చేస్తున్నాడు.

మార్చ్ 14 నుంచి మధురానగరిలో... డైలీ సీరియల్

బుల్లి తెర మీద కీర్తి భట్ అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. కార్తీక దీపం సీరియల్ లో అమాయకమైన ముఖంతో హిమ రోల్ లో నటించింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకుంది. తన ఫామిలీ మొత్తం తనకు దూరమైనా ఎక్కడా, ఎప్పుడూ బాధపడకుండా తన జీవితాన్ని ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకెళుతోంది. తనలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.  2017 వ సంవత్సరంలో రూపొందిన కన్నడ చిత్రం 'ఐస్ మహల్' తో ఈమె నటిగా మారింది. ఇప్పుడు ఈమె మెయిన్ రోల్ లో నటించిన "మధురానగరిలో.." సీరియల్ మార్చ్ 14 నుంచి స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ మధ్యాహ్నం 2 కి తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేయడానికి రాబోతోంది. రియల్ లైఫ్ లో  అమ్మా అని పిలిపించుకునే భాగ్యం లేదని కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి  'మధురానగరిలో' సీరియల్ లో  ఓ బాబుకి అమ్మగా..రాధగా నటిస్తోంది. సీరియల్  లో భాగంగా మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఉంటుంది. మంచి వాళ్లకు మంచి సంబంధాలు చూస్తూ...అబద్దాలు చెప్పేవాళ్లకు బుద్ది చెప్పే క్యారెక్టర్ లో నటిస్తోంది కీర్తి. మధురానగర్ కాలనీలో అందరికీ తలలో నాలుకలా ఉండే రాధ తన జీవితాన్ని సంతోషాన్ని ఎలా కోల్పోయింది ? అనేది ఈ స్టోరీ. ఆల్రెడీ కీర్తి నటనను కార్తీక దీపంలో చూసిన ఆడియన్స్ ఆమెకు నూటికి నూరు మార్కులు ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ సీరియల్ లో మలుపులు ఎలా ఉండబోతున్నాయి..కంటెంట్ ఎలా మెప్పించబోతోంది...కీర్తి నటన ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

వాళ్ళ కోసం నేను మారాలా..నాలానే ఉండాలా?

గీతూ రాయల్ గురించి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అన్ని సీజన్స్ లోకి సీజన్ 6 గురించి ఆలోచిస్తే మాత్రం మొదట గుర్తొచ్చే కంటెస్టెంట్ గీతూ..అలాంటి గీతూ బిగ్ బాస్ హౌస్ ని వదల్లేక వదిలి వచ్చింది. ఐతే గీతూ రాయల్ ఒక యూట్యూబర్..తన ఛానల్ లో ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. మోటివేషనల్ వీడియోస్ తో ఎక్కువగా పాపులర్ అయ్యింది. అలాంటి గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఆమెను ఒక సమస్య వెంటాడుతోందట. ఆ విషయం చెప్తూ చాలా బాధపడుతోంది. "నాకుండే చాలా ప్రాబ్లమ్స్ లో ఒక కొత్త ప్రాబ్లమ్ తయారయ్యింది. నిజం చెప్పాలంటే నాలుగు నెలల నుంచి ఈ ప్రాబ్లమ్ నన్ను హాంట్ చేస్తోంది. ఒకప్పుడు నేను మోటివేషనల్ వీడియోస్ చేసేటప్పుడు జనాలకు నా రియాలిటీ తెలీదు. ఆ తర్వాత నేను బిగ్ బాస్ లోకి వెళ్ళాక నా రియాలిటీ ఎప్పుడైతే జనాలకు అర్దమయ్యిందో...నాకంటూ టు సెట్స్ ఆఫ్ పీపుల్ తయారయ్యారు. ఒక వర్గం ఫాన్స్ కి నేను ఎలా ఉన్నానో అలాగే ఇష్టం...మరో వర్గం ఫాన్స్ మాత్రం నన్ను హేట్ చేస్తూ ఉన్నారు. నేనంటే ఇష్టపడిన వాళ్ళ కోసం నేను ఇట్లనే ఉండాలా...లేదంటే నన్ను హేట్ చేసేవాళ్ల కోసం నేను మారాలా ...లేదా నేను ఏదన్నా మార్చుకోవాలా..అని చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను. నా ప్రాబ్లమ్ కి ఎవరు ఆన్సర్ ఇస్తారో ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందో" అంటూ తన బాధను వీడియో రూపంలో చేసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. మరి ఆమె సమస్య ఎప్పటికి తీరుతుందో తెలీదు. గీతూ రాయల్ బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసి కొన్నాళ్ళు అమెజాన్‌లో పని చేసింది. కానీ ఆ జాబ్ నచ్చక వదిలేసింది. తర్వాత బిగ్ బాస్ వీడియోలకు రివ్యూలు చెబుతూ బాగా పాపులర్ అయ్యింది.

లేస్తుందేంట్రా... కాపురానికి పనికి రాకుండా పోతావ్...

మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షో ప్రతీ వారం అలరిస్తూ ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. ఇక ఈ ఫినాలేకి డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. దీని ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ప్రోమో స్టార్టింగ్ లో జడ్జెస్ శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ ఒక రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ స్నేహ చేతి మీద ముద్దు పెట్టాడు  శివ బాలాజీ దాంతో  "బాలాజీ ఆర్ యూ హ్యాపీ.." అని స్నేహ అడగడంతో "చాలా హ్యాపీ.." అంటూ చెప్తూనే తెగ సిగ్గుపడిపోయాడు. వెంటనే శ్రీముఖి "అప్పుడెప్పుడో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చారు  ..మళ్లీ ఈ ఫినాలేకి వస్తానని మాటిచ్చారు." అంటూ అనిల్ రావిపూడిని పిలిచింది స్టేజి మీదకు "మన ఎపిసోడ్స్ రెగ్యులర్‌గా ఎప్పుడైనా ఫాలో అయ్యారా?" అని రావిపూడిని శ్రీముఖి అడిగింది. దీనికి "కచ్చితంగా స్నేహ గారి కోసం ఫాలో అవుతాను" అని చెప్పారు. "ఐతే ఎవరి జడ్జిమెంట్ బాగా నచ్చింది.." అనగానే "స్నేహ గారే కరెక్టుగా మాట్లాడతారు." అని అనిల్ చెప్పేసరికి శివబాలాజీకి మండిపోయింది.  "మీరు మాత్రం చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు." అంటూ  కౌంటర్ వేసాడు.  షోలో ఉన్న జంటలకు  కళ్లకు గంతలు కట్టి బాస్కెట్ బాల్ గేమ్ ఆడించారు. ఒకరు కళ్ళకు గంతలు కట్టుకుని బాల్ వేస్తే మరొకరు బాస్కెట్ పట్టుకుని అందులోకి పడేలా చూడాలి.  అయితే రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత ఆడుతున్న టైములో బంతి రెండు స్టెప్స్ పడ్డాక రాకేష్ దాన్ని పట్టుకున్నాడు. అది చూసిన  శ్రీముఖి "దొబ్బిందమ్మా.." అంది. దీనికి "అదేంటి టూ స్టెప్స్ లేవా.." అని అడిగేసరికి "లేవని ముందే చెప్పినాను కదరా.." అని గట్టిగా అరిచేసింది.  దీంతో రాకేష్  "ఏయ్ లే.." అంటూ శ్రీముఖి చేతిని టచ్ చేశాడు. దీంతో "చెయ్యి లేస్తుందేంట్రా..అని శ్రీముఖి అనేసరికి డ్రెస్ లేచింది అన్నాడు రాకేష్" మళ్లీ కాపురానికి పనికి రాకుండా పోతావ్.. చెప్తున్నాను." అంటూ రాకేష్ కి వేలు చూపిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేసింది. రాకేష్ మాత్రం  సైలెంట్ అయిపోయాడు. ఇక ప్రోమో చివరిలో  "విన్నర్ ఎవరూ, టైటిల్ గెలుచుకుంటుంది ఎవరూ..? 3 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకునేదెవరూ?" అంటూ శ్రీముఖి చెప్పింది. తర్వాత "విన్నర్ ఈజ్.."అంటూ అనిల్ రావిపూడి అనౌన్స్ చేస్తుండగా ప్రోమోను ఎండ్ చేశారు.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లాస్య

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, యాంకర్‌ లాస్య పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. తమకి కుమారుడు పుట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ హ్యాపీ న్యూస్ ని  వెల్లడించింది. "మా  జీవితాల్లో కొత్త ప్రేమని కలిసాం" అని కాప్షన్ పెట్టింది లాస్య. మార్చి 7న తమకు కుమారుడి పుట్టినట్టు హార్ట్ ఎమోజీస్ పెట్టి మరీ చెప్పింది. ఈ హ్యాపీ న్యూస్ ని  ఓ చిన్న వీడియోని ద్వారా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది  లాస్య. ఇందులో తన భర్త మంజునాథ్‌ తన రెండు చేతులు ఓపెన్‌ చేసి `ఇట్స్ ఏ` అని, లాస్య తన చేతులుతెరిచి  `బేబీ` అని, జున్ను తన  చేతులు తెరిచి  `బాయ్‌` అని కొత్తగా ఈ విషయాన్ని చెప్పారు. చివరగా పుట్టిన బిడ్డ చేతిని చూపించారు. హోలీ కూడా రావడంతో ఈ ముగ్గురూ చేతులకు రంగులు పూసుకుని  ఈ విషయాన్ని కలర్ ఫుల్ గా చెప్పేసారు. హోలీ స్పెషల్‌గా, ఉమెన్స్ డే రోజున తమ కుమారుడు పుట్టినట్టు ప్రకటించింది. లాస్య, మంజునాథ్‌ ప్రేమించుకుని సాహసం చేసి పేరెంట్స్ ఒప్పుకోకపోయినా సీక్రెట్ గా వివాహం చేసేసుకున్నారు. జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడిన ఈ జంట ఇప్పుడు మాత్రం వెల్ సెటిల్ అయ్యింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళ ప్రేమను, పెళ్లిని, పిల్లలను యాక్సెప్ట్ చేసి అందరూ కలిసిపోయారు.  వీరికి ముందు ఒక కుమారుడు జున్ను జన్మించాడు.  ఈ విషయం తెలిసిన అభిమానులు లాస్య, మంజునాథ్‌ కు విషెస్  చెబుతున్నారు.  లాస్య  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యూట్యూబ్ లో  రీల్స్, షార్ట్స్ చేస్తూ చాలా  బిజీగా  ఉంటుంది. తనతో పాటు తన భర్తని కూడా సెలబ్రెటీని చేసేసింది. మంజునాథ్ తో కలిసి వీడియోస్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. సిరి హన్మంత్, గీతూ రాయల్, జ్యోతక్క, మై విలేజ్ షో అనిల్, గెటప్ శీను వైఫ్, శ్వేతనాయుడు, మెహబూబ్, సుష్మకిరణ్, రవికిరణ్ ఇలా బుల్లితెర యాక్టర్స్ అంతా కంగ్రాట్స్ చెప్పారు.

కావ్యని కన్నీళ్ళతో సాగనంపిన కృష్ణమూర్తి కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-38లో రాజ్ కావ్యల పెళ్ళి జరుగుతుంది. అసలు పెళ్ళి అవుతుందో కాదో అని అనుకున్నారంతా కానీ జరిగింది. మీ ఇద్దరికి పడిన ఈ బ్రహ్మముడిని ఆ బ్రహ్మ కూడా విడదీయలేడు అని పెళ్ళి జరిపించిన పంతులు చెప్తారు. ఆ తర్వాత అప్పగింతలు మొదలవుతాయి. కావ్యని పంపించే ముందు అందరూ ఏడుస్తుంటారు. "తెలిసో తెలియకో మీ అమ్మ తప్పు చేసింది. ఇందులో నా‌ అసమర్థత కూడా ఉంది అమ్మా.. కూతుళ్ళని నాకు ఉన్నంతలో పెళ్ళి ఘనంగా చేసి గొప్పింటికి కోడళ్ళుగా పంపించాలానుకున్నా కానీ ఇలా కన్నీళ్ళతో సాగనంపాల్సి వస్తుందనుకోలేదు" అని కృష్ణమూర్తి కావ్యతో చెప్తాడు. ఏడ్వకండి నాన్న  అని కావ్య ఓదార్చుతుంది.  కనకం వాళ్ళ అక్క కూడా కావ్యకి అత్తింట్లో ఎలా ఉండాలో చెప్తుంది. "ఇప్పుడు మనం తప్పు చేసాం.. వాళ్ళు మనల్ని మోసం చేసామని అంటారు. ఇక నుండి అత్తిళ్ళే నీకు పుట్టిల్లు.. మీ భర్తకి నీ మీద కోపం ఉంది. వాళ్ళ కుటుంబానికి మనం మోసం చేసామనే బాధ ఉంది. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకమ్మా" అని కనకం వాళ్ళ అక్క కావ్యకి చెప్తుంది. మరోవైపు రాజ్ పెళ్ళి కోసం ముస్తాబు చేసిన కార్ లో కూర్చొని "పదా వెళ్దాం" అంటే కార్ ముందు సీట్ లో ఉన్న కళ్యాణ్.. "ఎక్కడికి?.. మనం పెళ్ళికూతురితో ఇక్కడి నుండి వెళ్ళకుంటే మనకుందా ముందు మీడియా మన ఇంటి ముందు ఉంటుంది. పెళ్ళి కూతురిని వదిలేసి వెళ్ళిన రాజ్ అని న్యూస్ హెడ్ లైన్ లో వస్తుంది" అని చెప్తాడు. దాంతో రాజ్ సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తర్వాత కావ్య కార్ లో ఎక్కగానే బయల్దేరుతారు. కావ్య అక్క వస్తువులు మర్చిపోయిందని అప్పు ఆ వస్తువులు ఉన్న సంచీ తీసుకొని కార్ వెనుకాలే పరుగెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చీరకట్టులో వసుధారని చూసి ఇంప్రెస్ అయిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -705 లో.. రిషిని ఎవరు పట్టించుకోవట్లేదని దేవయాని ఫణింద్రతో చెప్తుంది.  అప్పుడే అక్కడికి వచ్చిన జగతి, మహేంద్రలను.. రిషి ఎక్కడికి వెళ్ళాడని దేవయాని అడుగుతుంది. వాళ్ళు మాకు తెలియదని చెప్పడంతో.. "అయినా మీకెందుకు తెలుస్తుందిలే. మీరు రిషి గురించి పట్టించుకోరు కదా" అని దేవయాని అంటుంది.  మరోవైపు బయటకెళ్ళాలని వసుధారని రెడీ అవ్వమని రిషి చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి వసుధార రెడీ అయి వచ్చి.. పదండి సర్ వెళదాం అని అంటుంది. ఈ డ్రెస్ ఏంటి? బయటికి వెళ్ళినప్పుడు ఇలాగేనా రెడీ అయ్యేది.. నేను వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేస్తాను. నువ్వు రెడీ అయి రమ్మని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార ఎక్కడికి వెళ్లాలో చెప్పకుండా ఎలా రెడీ అవుతారు అని అనుకొని జగతికి కాల్ చేస్తుంది. "రిషి సర్ ఎక్కడికో రమ్మని రెడీ అవమన్నాడు. రెడీ అయితే ఇలా కాదు మళ్ళీ రెడీ కావాలని చెప్పాడు. ఏంటి మేడం రిషి సర్ వరస.. నా మీద ఏంటి ఈ దబాయింపు" అని అని వసుధార అనగానే.. ప్రేమ ఉంది కాబట్టే ఆ దబాయింపు అని జగతి అంటుంది. ఇక వసుధార చీరకట్టుకొని రెడీ అయి రిషి ముందుకు వెళ్తుంది. అలా చీరకట్టులో వసుధారని చూస్తూ రిషి ఉండిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అక్కడ నుండి  బయల్దేరి వెళ్తారు. మరోవైపు జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటారు. రిషి, వసుధారలు ఎక్కడికి వెళ్ళారని గెస్ చేస్తుంటారు. సరదాగా అలా బయటికెళ్లారు కదా ఇప్పటికైనా వాళ్ళ మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలి అని మహేంద్రతో జగతి అంటుంది.  ఆ తర్వాత మినిస్టర్ గారి ఇంటి ముందు రిషి కార్ అపుతాడు. ఇంట్లోకి వెళ్తూ.. "ఈ ప్రపంచం దృష్టిలో మనం భార్యభర్తలం కదా.. పదండి శ్రీమతి గారు" అని రిషి అనగానే వసుధార సంతోషపడుతుంది. ఇక ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని లోపలికి వెళ్తారు. మినిస్టర్ గారు రిసీవ్ చేసుకొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తను ప్రేమించిన అమ్మాయి అడ్రస్ తెలుసుకున్న గౌతమ్!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -99 లో.. కృష్ణ కాలేజీ కి రెడీ అయి సర్ నేను కాలేజీకి వెళ్తున్నా అని మురారికి చెప్పగానే.. నేను డ్రాప్ చేస్తానని మురారి అంటాడు. "లేదు సర్ నేను వెళ్ళగలను. మీరు ఇచ్చిన ధైర్యంతో వెళ్ళిరాగలను సర్" అని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. "ఏంటి మురారి నన్ను మర్చిపోయాడా? కృష్ణకి సపోర్ట్ చేస్తున్నాడు.. నేను ఇప్పటికి ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమ నీకు మాత్రమే.. ఆదర్శ్ వచ్చినా కూడా నీ మీదనే ప్రేమ పెంచుకుంటాను. ఇంతకు మురారి మనసులో నా స్థానం ఏంటో తెలుసుకోవాలి" అని ముకుంద అనుకుంటుంది. మరోవైపు కాలేజీకి వెళ్ళిన కృష్ణ హడావిడిలో గౌతమ్ కి డాష్ ఇస్తుందనగా గౌతమ్ తప్పుకుంటాడు. "ఎందుకు ఇంత హడావిడి? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసుకున్నావా" అని కృష్ణని అడుగుతాడు గౌతమ్. కృష్ణ తింగరి సమాధానం చెపుతుంది. ఆ తర్వాత సర్లే అని ఆ విషయాన్ని వదిలేస్తాడు. "నాకు తలనొప్పి గా ఉంది టీ తాగి వద్దాం పదా" అని గౌతమ్ అనగానే.. సరే అని కృష్ణ అంటుంది. ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి బయటికెళ్తారు. మరోవైపు స్టేషన్ కి రెడీ అయి మురారి వెళ్తుంటే ముకుంద మురారిని ఆపి.. నీతో మాట్లాడాలని అంటుంది. తను అలా అనగానే మురారి అక్కడ ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల చూస్తూ భయపడుతుంటాడు. "అసలు నన్ను నువ్వు చులకనగా చూస్తున్నావ్ కదా? కృష్ణ మీద ప్రేమా? అభిమానమా?" అని ముకుంద అడుగగా.. "నీ మీద మాత్రం ప్రేమ ఎన్నటికి పుట్టదు.. మన ప్రేమ గతం. అన్ని మర్చిపో" అని మురారి అంటాడు. నువ్వు పెళ్ళి అయ్యాక మారిపోయావని ముకుంద ప్రశ్నిస్తుంది. పెళ్ళి అయ్యాక ఏ మగాడైనా మారాల్సిందే అని మురారి సమాధానమిస్తాడు. నన్ను క్షమించు ముకుంద అని మురారి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు టీ తాగడానికి వెళ్ళిన కృష్ణ గౌతమ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ గౌతమ్ కి నందు రిపోర్ట్ లు, టాబ్లెట్లు చూపిస్తుంది కృష్ణ. అవి చూసిన గౌతమ్ "ఇవన్నీ గతం గుర్తురాకుండా ఉండే టాబ్లెట్స్. అవి వాడొద్దని చెప్తాడు. నేను టాబ్లెట్స్ రాసిస్తాను ఇవే వాడండి" అని చెప్తాడు. ఇక కృష్ణ ఉండేది ఎక్కడ అని గౌతమ్ అడిగేసరికి.. కృష్ణ తన అడ్రస్ చెప్తుంది. అలా కృష్ణ చెప్పడంతో.. గౌతమ్ తను ప్రేమించిన అమ్మాయి అడ్రస్ కూడా అదే కదా అని మనసులో అనుకుంటాడు. ఏంటి సర్ ఏదో ఆలోచిస్తున్నారని కృష్ణ అడుగగానే.. ఏం లేదని చెప్పి గౌతమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బ్రహ్మముడి కనకంని వరించిన స్త్రీ శక్తి అవార్డు!

కనకం..‌ ఇప్పుడు స్టార్ మా టీవీ ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన క్యారెక్టర్. బుల్లితెర ధారావాహికల్లో బ్రహ్మ ముడి ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీరియల్ మొదలై ముప్పై పై చిలుకు‌ ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం ‌ఉన్న స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మ రథం పడుతున్నారు. ఇందులో కనకం-కృష్ణమూర్తి ల కుటుంబాన్ని మధ్యతరగతి వాళ్ళలాగా చూపించాడు డైరెక్టర్. బ్రహ్మముడి సీరియల్ లో ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఉండగా.. ఒక్కో కూతురికి ఒక్కో శైలి ఉంది. అయితే కనకం క్యారెక్టర్ ని అధ్బుతంగా మలిచాడు. ఒక మధ్య తరగతి తల్లి తన కూతురి కోసం కనే కలలను ఇందులో చక్కగా చూపిస్తున్నాడు. కనకం తన కూతుళ్ళకు గొప్పింటి కోడళ్లను చెయ్యాలని అనుకుంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో నీప శివ అలియాస్ కనకం.. ఈ మద్యతరగతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కనకం మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ని చూపించడమే కాకుండా కామెడీ వెర్షన్ తో ఆకట్టుకుంటుంది. కనకంకి తెలుగులో బ్రహ్మముడి మొదటి సీరియల్ అయినప్పటికి ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.  తాజాగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్బంగా M.L.C కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా స్త్రీ శక్తి అవార్డు అందుకుంది. ఇలా కనకంకి కవిత అవార్డుని ఇచ్చే వీడియోని.. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ అవార్డు వచ్చినందుకు తను చాలా సంతోషంగా ఉంది. కనకం చేస్తోన్న మొదటి సీరియల్ కె ఈ అవార్డు రావడంతో.. ఇందులోని కనకం క్యారెక్టర్ ని ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్ అంటూ తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంది కనకం.

అంతగా డిలీట్ చేయాల్సి వస్తే తరుణ్ భాస్కర్ నంబర్ డిలీట్ చేస్తాను

సుమ అడ్డా షో ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం కూడా మంచి కలర్ ఫుల్ గా ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బలగం మూవీ టీమ్ వచ్చింది. కావ్య, ప్రియదర్శి, వేణు, రచ్చ రవి వచ్చారు. వీళ్లందరినీ కూర్చోబెట్టి సుమ కొన్ని ప్రశ్నలు అడిగింది.." మీ మొబైల్ లో పెర్మనెంట్ గా ఒక నంబర్ డిలీట్ చేసెయ్యాలి అంటే మీరు ఎవరి నంబర్ ని డిలీట్ చేసేస్తారు..తరుణ్ భాస్కర్, వేణు ..వీళ్లల్లో ఎవరు  ?" అని ప్రియదర్శిని అడిగింది. తరుణ్ భాస్కర్ నంబర్ ని డిలీట్ చేసేస్తాను అని చెప్పాడు. ఆ మాటతో అక్కడ ఉన్నవాళ్ళంతా షాకయ్యారు. "వేణు గారు మీరు ఈ వేదిక మీదనే వేణు వండర్స్ గా వచ్చారు. ఇప్పుడు వండర్ఫుల్ వేణు డైరెక్టర్ గా వచ్చారు. ఎలా అనిపిస్తోంది" అని సుమ అడిగేసరికి "జబర్దస్త్ అనే స్టేజి మాతోనే స్టార్ట్ అయ్యింది. అక్కడ మేము చేసి పది నిమిషాల స్కిట్ కూడా చిన్నపాటి డైరెక్షన్ లాంటిదే...ఈరోజు ఈ మూవీని ఇంత కంఫర్టబుల్ గా చేసాను అంటే దానికి జబర్దస్త్ స్కిట్స్ కూడా నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. బలగం అనే చిన్న సినిమా ఇంత రీచ్ అయ్యిందంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు." అని చెప్పాడు. ఇక ఈ షోలో ప్రియదర్శికి ఎమోషన్స్ చేసే టాస్క్ ఇచ్చింది సుమ. వేణుకి కమెడియన్ గా మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే వేణు ‘జబర్దస్త్’ లో టీమ్ లీడర్ గా చేసేటప్పుడు  చాలామంది కమెడియన్స్ ను పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు అడుగులు వేసి ‘బలగం’ అనే మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు.

బ్రహ్మముడి పడింది.. ఇష్టం లేకుండానే ఒక్కటైన రాజ్-కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. గత వారం రోజులుగా రాజ్ పెళ్ళి ఎవరితోనా అనే‌ సస్పెన్స్ కి తెరపడింది. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -37 లో.. పెళ్లి పందింట్లో కావ్యను పెళ్లి చేసుకోనని రాజ్ తెగేసి చెప్పి తన ఫ్యామిలీతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోతుంటే..  ఆ షాక్ తో కనకం కిందపడిపోతుంది. అది చూసి ఏమైందని రాజ్ ఫ్యామిలీ వాళ్ళు ఆగిపోతారు. రాజ్ ఫ్యామిలీ వాళ్ళు డాక్టర్ ని పిలిపించి కనకంకి ఏమైందని చూస్తారు. కనకంని చూసిన‌ డాక్టర్.. బీపి ఎక్కువ అయి ఇలా కిందపడిపోయింది. ఈమెను ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని చెప్తాడు. కనకం కళ్ళు తెరిచాక మళ్ళీ నా కూతురుని పెళ్లి చేసుకోండి బాబు అని రాజ్ తో చెప్తుంది. నేను చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష పడొద్దని రాజ్ ఫ్యామీలీని బ్రతిమిలాడుతుంది కనకం. రాజ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి కృష్ణమూర్తి వెళ్ళి.. తప్పు అంతా మాదే.. మీరు గొప్పోళ్ళు.. మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండని అంటాడు. అలా అనగానే రాజ్ వాళ్ళ తాతయ్య ఆలోచనలో పడతాడు. రాజ్ బయట మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ.. "ఒక అమ్మాయి డ్రామా చేస్తుంది. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది" అని చెప్తాడు. మీడియా వాళ్ళు మీరు పెళ్ళి చేసుకోవాలని చెప్తారు. అది కుదరదంటూ రాజ్ గట్టిగా చెప్తాడు. ఇక రాజ్ తాతయ్య రాజ్ తో.. "ఈ పెళ్ళి ఆగిపోతే మనం ఒక అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మనకు లేదు. మనమేదో తప్పు చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ పెళ్ళి ఆగిపోతే మన పరువు పోతుంది. నువ్వు అలోచించి నిర్ణయం తీసుకో రాజ్" అని వాళ్ళ తాతయ్య చెప్తాడు. దాంతో రాజ్ ఆలోచనలో పడతాడు. మరోవైపు కావ్య నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తుంది. ఇంతలో రాజ్ వచ్చి.. నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కనకం, కృష్ణమూర్తి కలిసి కావ్యను పెళ్ళికి ఒప్పిస్తారు. కావ్య కూడా సరే అనడంతో కనకం సంతోషిస్తుంది. ఇక రాజ్ కావ్యలకి పెళ్ళి అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీకి ఇష్టంలేని అమ్మాయి.. ఆ ఇంటి కోడలు అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి సార్ కి నా మీద ప్రేమ ఎక్కువే.. మురిసిపోయిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -704 లో.. మినిస్టర్ రిషికి కాల్ చేసి "మీడియాలో వసుధార భర్త మీరేనని చెప్పింది చూసాను. చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్" అని చెప్పి రిషి, వసుధారలను వాళ్ళింటికి భోజనానికి ఆహ్వానించాడు.  మరోవైపు స్టూడెంట్స్ ఇచ్చిన వసుధార-రిషీల ఫోటో గ్రీటింగ్ ను పట్టుకొని వసుధార క్యాబిన్ కి జగతి, మహేంద్ర వెళ్తారు. ఆ గ్రీటింగ్ ని వాల్ కి అంటిస్తుండగా సడన్ గా రిషి వచ్చేసరికి తడబడుతారు. అది చూసిన రిషి.. "ఏంటి డాడ్" అని అడుగుతాడు. ఏమో మాకేం తెలియదని వాటిని తీసేస్తుంటాడు మహేంద్ర.. ఆ గ్రీటింగ్స్ ను రిషి చూసి.. "డాడ్.. పర్లేదు ఉండనివ్వండి.. స్టూడెంట్స్ అభిమానంతో ఇస్తే వాటిని తీసుకోవాలి" అని చెప్పి వెళ్ళిపోతాడు. రిషికి కోపం ఎంతనో ప్రేమ‌ కూడా అంతే కదా జగతి అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు బయటకు వెళ్తుండగా అక్కడే ఉన్న రిషి.. వసుధార ఎందుకు రాలేదని జగతిని అడుగుతాడు. ఏమో రిషి నాకేం చెప్పలేదని జగతి అంటుంది. అలా తను అనగానే ఫోన్ చేసి కనుక్కోమని చెప్తాడు రిషి. దాంతో జగతి, వసుధారకి ఫోన్ చేసి.. "ఎందుకు రాలేదు ఎప్పటివరకు రావు" అని  అడుగుతుంది. ఈ రోజు రాను.. నా వర్క్ పూర్తిగా అయ్యాక వస్తానని వసుధార అనగానే.. రిషి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా రిషి వెళ్ళిపోయాక వసుధారకి జగతి జరిగిందంతా చెప్తుంది. "ఏంటి వసు.. రావట్లేదని రిషీకి ఒక్క మాట చెప్పొచ్చు కదా.. రిషి ఎన్నిసార్లు అడిగాడో తెలుసా" అని జగతి అంటుంది. దాంతో రిషి సర్ కి నా మీద ప్రేమ ఎక్కువేనని మురిసిపోతుంది వసుధార. ఆ తర్వాత రిషి మినిస్టర్ గారింటికి ప్లాన్ ఫిక్స్ చేసి వసుధార దగ్గరికి వస్తాడు. రిషి వచ్చాడని వసుధార పరుగున బయటికి వెళ్తుంది. అలా పరుగెత్తుకుంటూ వస్తుండగా.. వసుధార పడిపోతుంటుంది. వెంటనే రిషి పట్టుకొని.. నడుస్తూ రావొచ్చు కదా పరిగెత్తుకు రావాలా అని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి రిషికి టీ ఇచ్చి, వసుధార రెడీ అవుతుంది. మరోవైపు వసుధార, రిషిల మధ్య ఏం జరుగుతుందని దేవయాని ఆలోచిస్తుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కలయో నిజమో తెలియకుండా ఉన్న మురారి!

స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-98 లో.. నందుకి వేసే టాబ్లెట్స్ ఓవర్ డోస్ అని, అవి వాడొద్దని కృష్ణ చెప్పగా.. ముకుంద అంతా తనకు తెలుసన్నట్లు మాట్లాడకు అని అంటుంది. నేను టాబ్లెట్స్ వేస్తానని భవాని ముందుకు వెళ్తుండగా కృష్ణ వద్దని అడ్డుపడుతుంది. "ఇంట్లో పెద్దత్తయ్య మాటకు ఎవరు ఎదురు తిరగరు. నువ్వు ఏంటి ఎదురు తిరుగుతున్నావు. మీ అత్తయ్యని ఒక్క మాట అన్నా నువ్వు ఒప్పుకోవు కదా. ఇప్పుడు నువ్వు పెద్దత్తయ్యని ఏం అన్నా నేను ఒప్పుకోను" అని ముకుంద అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మురారి కల్పించుకొని కృష్ణ "ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఇప్పుడు జూనియర్ డాక్టర్ గా చేస్తుంది. కృష్ణకి బాగా తెలుసు.. ముకుంద నువ్వు నా భార్యను ఒక్క మాట అనడానికి వీలు లేదు" అని అందరి ముందే చెప్తాడు. ఆ తర్వాత భవాని దగ్గరికి ఈశ్వర్, ప్రసాద్ ఇద్దరు వచ్చి.. నందు గురించి మాట్లాడుతారు. "వాలెంటైన్స్ డే రోజు నందు.. గతం గుర్తొచ్చినట్లు ప్రవర్తించేసరికి భయం వేసింది.. కృష్ణకి నందు గురించి తెలిస్తే మన కుటుంబం గుట్టు బయటపడుతుంది" అని ఈశ్వర్, ప్రసాద్ లు అనుకుంటారు. మరోవైపు రేవతి దగ్గరికి కృష్ణ వచ్చి.. అసలు నందు అలా అవడానికి కారణం ఏంటని అడుగుతుంది. రేవతికి ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఆలోచిస్తుంది. రేవతి మౌనంగా ఉండడంతో.. నందు గురించి చెప్పకూడని విషయం ఏమైనా ఉందా, నందూనే అడగాలని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. కృష్ణ ఆలోచనలతో మురారి కలలు కంటుంటాడు. కృష్ణ వచ్చి తనకు ప్రేమగా కాఫీ ఇచ్చినట్లుగా.. బుగ్గని తడిమి నిద్రలేపినట్లుగా ఉహించుకుంటాడు. సడన్ గా నిద్రలేచి చూసుకొని.. "నేను కల కన్నానా" అని అనుకుంటాడు. కాని కృష్ణ కాఫీతో నిజంగానే అక్కడికి వస్తుంది. కృష్ణ రావడం చూసిన మురారి అది  తన కల అనుకొని సైలెంట్ గా ఉంటాడు. సర్ కాఫీ తీసుకోండని అనగానే.. "నా భ్రమ" అని మురారి అంటాడు. "భ్రమ కాదు సర్.. నిజమే" అని మురారి చేతిని గిల్లుతుంది కృష్ణ. కాసేపు సరదాగా ఇద్దరు ఆటపట్టించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.