డేటింగ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా!

అఖిల్ సార్థక్ రీసెంట్ గా తన పెళ్లి గురించి ఒక న్యూస్ చెప్పాడు. లేటెస్ట్ గా అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ ?' టాస్క్ ని తన ఫాన్స్ కి ఇచ్చాడు. ఇక చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఒక నెటిజన్ మాత్రం "ఏ వయసులో పెళ్లి చేసుకుంటే బెటర్" అని అడిగేసరికి అఖిల్ తన మనసులో ఉన్న అసలు విషయాన్ని బయట పెట్టాడు. "పెళ్లికి సరైన సమయం 32 లేదా 33 అని అనుకుంటున్నాను.. నాకు ప్రస్తుతానికి  27 ఏళ్లు.. ఇంకో ఐదేళ్ల వరకు పెళ్లి గురించి అస్సలు ఆలోచించను.. ఇప్పుడు నేను ప్రేమలో లేను.. డేటింగ్ కూడా చేయడం లేదు..ఎలాంటి రిలేషన్ షిప్‌లోనూ లేను.. ఒక వేళ నేను ఎవరితోనైనా రిలేషన్‌లో ఉంటే.. డేటింగ్ చేస్తే.. వాళ్లనే పెళ్లి చేసుకుంటాను.. నేను టైం పాస్‌కు మాత్రం డేటింగ్ చేయను.." అంటూ చెప్పుకొచ్చాడు.  మరో నెటిజన్ కొంటెగా "తేజు ఆర్ మోనాల్..ఇద్దరిలో ఎవరిష్టం" అని అడిగేసరికి "దీపికా పదుకొనె" అని ఆన్సర్ చేసాడు. "బీబీ జోడి జర్నీ ఎలా వుంది.. ఇందులో ఏ జోడి అంటే బాగా ఇష్టం" అని అడిగేసరికి "చాలా బాగుంది.. నా షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది.. ఆరు కేజీలు కూడా తగ్గాను...నాకు ఫైమా-సూర్య, అర్జున్ కళ్యాణ్-వాసంతి వీళ్ళ జోడీలంటే చాలా ఇష్టం అని తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు అఖిల్. బీబీ జోడిలో తేజుతో కలిసి అఖిల్ మాములుగా రచ్చ చేయడం లేదు. ప్రతీ వారం సోషల్ మీడియాలో వీళ్ళ డాన్స్ హాట్ టాపిక్ గా ఉంటోంది.

మంచానికి దగ్గరుంటే పిల్లలు పుడతారు.. రోహిణికి రష్మీ సలహా!

నెక్స్ట్ వీక్ రాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోయింది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫన్ మాత్రం పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ మొత్తానికి రష్మీ వేసిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ స్కిట్ సత్తిపండు-రోహిణి జంటతో స్టార్ట్ అయ్యింది. "మా నాన్న ఫోన్ చేసి పిల్లలు కావాలి పిల్లలు కావాలి" అని ప్లేట్ లో ఉన్నది తింటూ రోహిణి అనేసరికి "ఇలా కంచానికి దగ్గరగా ఉంటే పిల్లలు పుట్టరే.." అని సత్తిపండు ఒక డైలాగ్ వేసేసరికి రష్మీ దానికి కంటిన్యూషన్ గా "మంచానికి దగ్గరుండాలి" అని ఫన్నీగా చెప్పేసింది. దాంతో అందరూ స్టన్ ఐపోయారు. మళ్ళీ సత్తిపండు స్కిట్ లోకి వెళ్ళిపోయి "అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చేస్తాడు చూడు.. 1000 రూపాయలకు ఒక పూజ, 5000 వేలకు ఒక పూజ, 10 వేలకు ఒక పూజ అలాంటి పూజలు చేస్తే పిల్లలు పుడతారే" అని అనేసరికి ఖుష్బూ పడీ పడీ నవ్వేసింది.  తర్వాత బులెట్ భాస్కర్ తన టీమ్ తో ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లో "ఇదేలే తరతరాల చరితం" అనే పాట వస్తుంటే ఇమ్మానుయేల్ మాత్రం వర్షాను ఒక వీల్ చెయిర్ లో కూర్చోబెట్టి తోసుకుంటూ వస్తాడు. రాగానే వర్ష వెనక్కి తిరిగి "అన్నయ్యా" అని పిలిచేసింది. దానికి  రష్మీ అవాక్కైపోయి "అన్నయ్యానా.. అయ్యా.." అని జబర్దస్త్ టాపు లేచిపోయేలా గట్టిగా జారీచేసింది. తర్వాత రాకేష్-సుజాత స్కిట్ పర్లేదనిపించింది. స్కిట్ ఎండింగ్ లో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఖుష్బూకు చెప్పింది రష్మీ. దాంతో ఆమె వాళ్ళిద్దరికీ కంగ్రాట్యులేషన్స్  చెప్పింది.

అందరూ కలిసి నన్ను పిచ్చోన్ని చేశారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్-690 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. కళ్ళు తిరిగిపడిపోయిన వసుధారని రిషి కారులో తీసుకెళ్తుంటాడు. అంతలో మెలుకువ వచ్చిన వసుధార హాస్పిటల్ కి ఏం వద్దు ఇంటికి వెళ్దామని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటుండగా రిషి ఏదో అనేసరికి వసుధార అలిగి కార్ ఆపమని చెప్పి, మధ్యలోనే దిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి ఒక్కడే కార్ లో కొంత దూరం ముందుకు వెళ్ళాక.. "రిషి వసుధారలు వేరు వేరు కాదు.. మేమిద్దరం రిషిధారలమే అని తనలో తానే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రిషి వాళ్ళ ఇంటికెళ్ళేసరికి దేవయాని హాల్లోని సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పటికే దేవయాని తన కోడలు ధరణితో మాట్లాడుతుంటుంది. రిషిని చూసిన దేవయాని.. ఏమైంది రిషి అలసిపోయావా? రిషికి కాఫీ తీసుకురా ధరణి అని చెప్తుంది. వద్దు పెద్దమ్మ.. నేను అలసిపోలేదు‌.. హ్యాపీగా ఉన్నానని చెప్పి, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన సంతోషాన్ని జగతి, మహేంద్రలకి చెప్పాలని వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి రిషి గురించి వసుధార, జగతి, మహేంద్ర, చక్రపాణి మాట్లాడుకుంటారు. సరిగ్గా వాళ్ళు మాట్లాడే సమయానికి రిషి అక్కడికి వెళ్తాడు. రిషికి ఇన్నిరోజులు తెలియదు. మొత్తానికి ఈ రోజు తెలిసిందని మహేంద్రతో‌ జగతి అంటుంది. అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. రిషి ఆ మాటలు విని.. క్లాప్స్ కొడతాడు. రిషి వాళ్ళ నాన్న మహేంద్ర.. రిషి మై సన్ అని తనని హత్తుకోడానికి దగ్గరగా రాగా వద్దని చెప్తాడు.‌ ఇప్పుడే నాకు తెలిసింది. వసుధార మెడలో తాళి ఎవరు కట్టారో మీకు ముందే తెలుసని, మీ అందరికి తెలిసి కూడా నాకు చెప్పలేదు. నన్ను పిచ్చోన్ని చేశారు కదా.. నా కళ్ళకి గంతలు కట్టి నాతో ఆడుకున్నారు కదా మీరంతా కలిసి అని అంటాడు. జగతి ఏదో‌ మాట్లాడుతుండగా రిషి తనని ఆపి.. "మిమ్మల్ని ఎంత నమ్మాను మేడం.. మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు" అని చెప్తాడు. "వాళ్ళ తప్పేం లేదు రిషి సర్.. నేనే వాళ్ళని చెప్పొద్దని చెప్పాను" అని వసుధార అనగా... ఓహో‌ నువ్వేనా ఈ నాటకానికి సూత్రధారి అన్నట్టుగా మాట్లాడతాడు రిషి. ఇప్పుడే అసలు కథ మొదలైందని రిషి అంటాడు. అందరికి ముందే తెలిసి, తనని ఫూల్ ని చేశారనకుంటున్న రిషి ఇకపై ఏం చేయనున్నాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కన్నకూతురిని పరాయిదాన్ని చేసిన కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్-23 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం నాటి ఎపిసోడ్ లో.. కనకం అక్క మీనాక్షి ఇంటికి రాజ్ ఫ్యామిలీ పెళ్లిచూపులకి రావడంతో వాళ్ళని ప్రేమగా ఆహ్వానించింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తడబడుతూ నోరుజారుతుంటుంది కనకం.  మరోవైపు కావ్య చేసిన పిండివంటలను రాజ్ ఫ్యామిలీ కంటపడకుండా చాటుగా తీసుకువెళ్తుండగా.. అప్పుడే ఫోన్ మాట్లాడడానికి బయటకు వచ్చిన రాజ్ చూసుకోకుండా కావ్య కి డాష్ ఇస్తాడు. రాజ్, కావ్య ఇద్దరు పడిపోతుండగా ఒకరికొకరు పడిపోకుండా పట్టుకుంటారు. ఆ తర్వాత రాజ్ మాటల యుద్ధం మొదలైంది. మరొకవైపు ఇప్పుడు గొడవ ఎందుకని కావ్య సైలెంట్ గా ఉంది. రాజ్ తో పాటు అతని తల్లి కూడా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళినా నీతో గొడవ అయిపోయిందని అంటుంది. "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. ఈ అమ్మాయి మీకు తెలుసా" అని కావ్య గురించి కనకంని అడుగుతుంది రాజ్ తల్లి. అప్పుడు కనకం ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అని చెప్తుంది. కృష్ణమూర్తి గారికి నేనే బొమ్మలకు డిజైన్ వేసి పంపిస్తాను. వాటి తాలూకా డబ్బుల కోసం వచ్చానని చెప్తుంది. "అవును నిజమే.. తను మా కూతురులాంటిదండి.. తననేం అనకండి" అని రాజ్ ఫ్యామిలీతో కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మీనాక్షి పనిలో సాయం చేద్దువు రా అమ్మా అని కావ్యని లోపలికి తీసుకువెళ్తుంది. లోపలకి వెళ్లిన కృష్ణమూర్తి ఏంటే కన్నకూతురుని పరాయి దాన్ని చేసావ్ అంటూ కనకంని తిడతాడు. కనకం, కావ్యకి సారి చెప్పి పిండివంటలు అందరికి ఇవ్వమని పంపిస్తుంది. మరోవైపు రాహుల్ ప్రేమలో స్వప్న పూర్తిగా మునిగిపోతుంది. రాజ్ ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవాలి.. రాహుల్ ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది.. ఎలాగైనా రాహుల్ ని పెళ్లి చేసుకోవాలని స్వప్న అనుకుంటుంది. పిండి వంటలు తీసుకొని రాజ్ ఫ్యామిలీ ముందుకు కావ్య వెళ్తుంది. తన చేత్తో ఇస్తే ఎవరు తీసుకోరని స్వప్న చేసింది అనగానే.. రాజ్ ఒక్కడే తీసుకొని తింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వాలైంటైన్స్ డే రోజు అందరికీ షాక్ ఇచ్చిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి'  సీరియల్ ఎపిసోడ్-84 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం నాటి ఎపిసోడ్ లో.. ముకుంద ఏం ప్లాన్ చేస్తుందో తెలియట్లేదే.. తన ప్లాన్ ని ఎలాగైనా ఆపాలని ముకుందకి మురారి ఫోన్ చేస్తాడు. మురారి కాల్ చేసాడనే సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసిన ముకుంద.. "ఏంటీ మురారి కాల్ చేసావ్" అని అడుగగా.. "నువ్వు ఏం చేస్తున్నావ్ ముకుంద? నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు.. అందరి ముందు నువ్వు నాకు రోజ్ ఇస్తే ఇంట్లో వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు.. మన గురించి తెలిసిపోతుంది కదా" అని మురారి అంటాడు. తెలిస్తే తెలియనివ్వు అన్నట్లుగా ముకుంద మాట్లాడుతుంది. మరోవైపు కృష్ణ వాలెంటైన్స్ డే కాబట్టి ఇల్లంతా హార్ట్ షేప్ బెలూన్ లతో డెకరేట్ చేస్తుంది. అప్పుడే కిందకి వచ్చిన భవాని అదంతా చూసి.. "ఏంటీ ఇదంతా" అని అడుగుతుంది. ఈ రోజు వాలెంటైన్స్ డే పెద్ద అత్తయ్య అని చెప్తుంది. అయితే ఇక్కడ పెళ్లి కాని ప్రేమికులు ఎవరున్నారని భవాని అడుగుతుంది. ఈరోజు ప్రేమికులది మాత్రమే కాదు అత్తయ్యా.. ఎవరైనా జరుపుకోవచ్చు అని అంటుంది. కృష్ణ మాటలకి మొదట్లో భవానీ కోప్పడినా తర్వాత సరదాగానే తీసుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారిలు రెడీ అయి వస్తారు. ముకుంద తన రూం నుండి బయటకు రోజ్ పట్టుకొని వస్తుంటే.. అందరూ తనవైపే చూస్తారు. మురారి మాత్రం.. ఆ రోజ్ తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇస్తుందా అని టెన్షన్ పడుతుంటాడు. రేవతి కూడా తన మనసులో మురారికి ఇస్తుందా ఏంటీ అనుకుంటుంది. తను అనుకునట్టుగానే ముకుంద,  మురారికి రోజ్ ఇచ్చి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అసలు మురారికి ముకుంద ఎందుకు రోజ్ ఇచ్చింది? ఇది నిజమా? కలనా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుందా.. నమ్మితే పంగనామాలే!

గలాటా గీతూ అలియాస్ చిత్తూర్ చిరుత అంటే ఇప్పుడు ఫుల్ ఫేమస్. బిగ్ బాస్ కి వెళ్ళకముందు యూట్యూబ్ లో రివ్యూస్ చేస్తూ ఒక మోస్తరుగా పేరు తెచ్చుకున్న గీతూ హౌస్ లోకి వెళ్లి వచ్చాక మస్త్ ఫెమిలియర్ ఐపోయింది. గీతూ రకరకాల వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఈ అమ్మడు అప్పుడప్పుడు జీవిత పాఠాలను కూడా వీడియోలుగా చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది.  రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన ఒక పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. "దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది.. అనే మాట మనం చాలా వింటా ఉంటాం. ఆ కాన్సెప్ట్ మీరు నమ్ముతారా? నమ్మినారనుకో పంగనామాలే ఇంక. ఎందుకంటే ఒక మనిషిని దూరం పెడితే వాళ్లకి మన విలువ తెలిసి మన మీద ప్రేమ పెరుగుతుందా లేదా... అనేది నాకు తెలియదు కానీ.. ఒక మనిషిని మనం విలువ తెలుసుకునేదానికి దూరం పెడితే.. వాళ్లు మనం లేకుండా బతికేదానికి అలవాటు చేసుకుంటారు. ఆ తప్పు మాత్రం చేయొద్దండి." అని చెప్పింది. "మరి మన విలువ తెలియాలి అంటే.. ప్రేమ పెరగాలి అంటే ఏం చెయ్యాలి. కరెక్టే..మారుతున్న రోజులు..మారిపోతున్న మనుషుల్ని బట్టి మన సామెతలను కూడా మార్చుకోవాల్సి వస్తోంది..." అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా కూడా వెళ్ళను అంటూ అక్కడే ఏడ్చేసింది.

వసుధారను ప్రేమగా హత్తుకున్న రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -689 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో.. వసుధార రూమ్ లోని ఒక పేపర్ మీద "ఐ లవ్ యు మై MD సర్ " అని రాసి ఉంటుంది. అది రిషి చూసి ఎమోషనలవుతాడు. ఆ తర్వాత వసుధార దగ్గరకి బయల్దేరతాడు. మరోవైపు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిషి సర్ నిజం తెలుసుకోవడం లేదని, నాకు నేనుగా చెప్పాలంటే భయంగా ఉందంటూ గుడికెళ్ళి అమ్మవారి ముందు నిల్చొని బాధపడుతుంది. ఇంకా ఎన్నాళ్ళమ్మ ఈ ఆవేదన.. కన్నీళ్లు.. ఎలాగైనా రిషి సర్ ని మీరే మార్చాలంటూ వసుధార ఏడుస్తుంది. అప్పటికే వసుధార వెనకాలకి రిషి వచ్చేస్తాడు. వసుధార అని ప్రేమగా పిలిచి హత్తుకుంటాడు రిషి. "మీరు వస్తారని నాకు తెలుసు సర్" అని చెప్తూ ఆనందపడుతుంది. అప్పుడే వసుధార మెడలోని తాళి, రిషి షర్ట్ బటన్ కి అతుక్కుపోతుంది. ఈ‌ సీన్ అంతా ఎమోషనల్ గా సాగుతూ.. హైలైట్ అఫ్ ది ఎపిసోడ్ గా మారింది. రిషి తన మనసులో ఉన్న బాధనంతా వసుధారకి చెప్తాడు. ఈ ఒక్క నిజం తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందా అని వసుధార అడుగగా.. ఎందుకు ఇలా చేసావని రిషి బాధతో అంటాడు. సర్ నేను కావాలనేం దాచలేదని, రాజీవ్ తనని బెదిరించిన విషయం దగ్గరి నుండి అన్ని విషయాలు చెప్తుంది. "నీకు నువ్వు తాళి మెడలో వేసుకోవడమేంటి" అని రిషి అడుగగా.. సర్ అది జగతి మేడం నాకు పంపించారు. మీకు తెలియకుండానే అది మీరే తీసుకొచ్చి ఇచ్చారు.. అది మీరే నా మెడలో కట్టినట్లు నమ్ముతున్నానని వసుధార చెప్తుంది. అయినా ఇన్ని రోజులు కాలేజీలో అందరూ అలా మాట్లాడుకున్నారు. అందరు నా వైపు ప్రశ్నార్ధకంగా చూస్తుంటే ఏం చెప్పాలో తెలియలేదు అని రిషి చెప్తాడు. అలా మాడ్లాడుకుంటుండగా.. వసుధారకి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. వసుధార ఏమైంది అంటూ ఎత్తుకొని తన కార్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు రిషి. మరోవైపు దేవయాని హాల్లో కూర్చుని ఉండగా.. ధరణి వచ్చి ఎవరో శుభలేఖ ఇచ్చారని తీసుకొస్తుంది. దేవయాని అక్కడే ఉన్న జగతి,మహేంద్రలకి వినపడేటట్లు మాట్లాడుతుంది. "అన్ని బాగుంటే మనం కూడా ఇలా రిషి పెళ్ళికి శుభలేక ప్రింట్ చేయించేవాళ్ళం" అని దేవయాని అనగానే.. తొందరలోనే మా ఇంట్లో కూడా ఇలా శుభలేక ప్రింట్ అయ్యేలా చేయు దేవుడా.. అందులో మా రిషి పేరు ఉండేలా చేయండి దేవుడా అని మహేంద్ర అంటాడు. మరి రెండవ పేరు ఎవరిది చిన్న మావయ్య అని ధరణి అంటుంది. అంతా దేవుడి ఇష్టమని మహేంద్ర అంటాడు. ఏంటో మీ ప్లాన్స్ అసలు అర్థం కావని దేవయాని అక్కడినుండి వెళ్ళిపోతుంది. మరోవైపు వసుధారని కార్ లో పడుకోపెట్టి రిషి తీసుకుపోతుంటాడు. ఇంతలో వసుధార మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. వెంటనే కార్ పక్కకి ఆపి హాస్పిటల్ కి వెళ్దామా అని రిషి అడుగుతాడు. అవసరం లేదు టెన్షన్ కి ఇలా అయిందని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజ్ పెళ్ళిచూపులు.. కనకాన్ని కంగారు పెట్టిన అక్కబావ ఫోటో

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్.. రీసెంట్ గా మొదలై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ఎపిసోడ్ -22 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో రాహుల్ ఫోన్ చేసి స్వప్నని రమ్మనడంతో.. స్వప్న వెళ్తుండగా కనకం ఎక్కడికని చెప్పి అపుతుంది. అప్పుడే కృష్ణమూర్తి రావడంతో అతను ధరించిన బట్టలు చూసి.. "ఈ అవతారమేంటి" అని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇదే సందు అన్నట్టుగా బయటికి జారుకుంటుంది స్వప్న. "నీ బట్టలు కాకుండా ఈ సూట్ వేసుకో" అని కృష్ణమూర్తిని అనగా.. "నా మనసు మార్చుకున్నాను కాని ఈ బట్టలు మార్చుకోను" అని కృష్ణమూర్తి సూటిగా చెప్పేస్తాడు. మరోవైపు రాహుల్ ఫ్లర్టింగ్ కు పడిపోయి అతను చెప్పిన ఈవెంట్ కి వెళ్తుంది స్వప్న. అక్కడ కొందరు గర్ల్స్ వచ్చి స్వప్నతో సెల్ఫీలు తీసుకోవడంతో తను మురిసిపోతుంది. రాహుల్ నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడని అనుకుంటుంది. స్వప్న పూర్తిగా నా మాయలో పడిపోయిందని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు పెళ్ళిచూపులకు వచ్చిన రాజ్ ఫ్యామిలీకి దగ్గర ఉండి మర్యాదలు చేస్తుంది కనకం. అప్పుడప్పుడు నోరు జారుతుంది. మళ్ళీ కవర్ చేస్తూ వస్తుంటుంది. కానీ రుద్రాణికి మాత్రం దొరికిపోతూనే ఉంటుంది. మాటిమాటికి మీనాక్షి "ఇది నా చెల్లెలు ఇల్లు" అనడంతో రాజ్ ఫ్యామిలీకి డౌట్ వస్తుంది. మీనాక్షి, తన భర్త ఫోటో గోడకు ఉండటం రాజ్ వాళ్ళ అమ్మ గమనిస్తుంది. అది చూసి మీ అక్కబావల ఫోటో మీ ఇంట్లో ఉందేంటని రాజ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. "నాకు మా అక్కబావ దైవంతో సమానం.. ఈ ఇల్లు మా అక్క వాళ్ళకి రాసిచ్చేసి.. మేము జూబ్లీహిల్స్ కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం" అని కనకం కవర్ చేస్తుంది. కాసేపటికి "మీ భర్త లండన్ నుండి వచ్చారా?" అని రాజ్ వాళ్ళ అమ్మ అడుగగా.. హా వచ్చారని తీసుకోస్తుంది. కృష్ణమూర్తి వాలకం చూసి రాజ్ వాళ్ళ అమ్మకి డౌట్ వస్తుంది. మా ఆయనకి సింపుల్ గా ఉండడమంటేనే ఇష్టం అంటూ కవర్ చేస్తుంది కనకం. మరోవైపు కావ్య పిండివంటలు పట్టుకొని ఇంటి దగ్గరికి వస్తుంది. అది కనకం చూసి తొందరగా బయటకు వచ్చి.. "నువ్వు ఎందుకు వచ్చావే" అని కనకం అడుగగా.. అప్పు రాలేదమ్మా.. అందుకే నేనే తీసుకొచ్చానని కావ్య అంటుంది. సరేగని అవన్ని వెనక డోర్ నుండి వెళ్ళి పెట్టేసి వెళ్ళమని కనకం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మురారికి అందరిముందు ముకుంద ప్రపోజ్ చేయనుందా?!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ.. ఎపిసోడ్-83 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో.. మురారి, కృష్ణది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసి పట్టరాని సంతోషంలో ఉన్న ముకుంద.. ఇంట్లో అందరికి టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. ఇక మురారి టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్లి డల్ గా కూర్చుంటాడు. అప్పుడే వచ్చిన కృష్ణ.. "ఏంటీ ఏసీపీ సార్.. డల్ గా ఉన్నారు. ఓ ఈ రోజు వాలెంటైన్స్ డే కదా.. మీకు గర్ల్ ఫ్రండ్ ఉందా" అని కృష్ణ అడిగేసరికి మురారి షాక్ అవుతాడు. "ఓ.. లేదా అందుకే డల్ గా ఉన్నారా?" అని అడుగుతుంది. "మరి నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?" అని మురారి అడగడంతో.. "హా ఉన్నాడు శివన్న" అని కృష్ణ చెప్పేసరికి ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక స్టేషన్ కి బయలుదేరుతున్న మురారిని ఆపి.. మనం భార్యభర్తలం కాకపోయినా.. "హ్యాపీ వాలెంటైన్స్ డే"అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇక బయల్దేరి మురారి కార్ లో కూర్చునేసరికి పక్క సీట్ లో ముకుంద ఉంటుంది. "ముకుందా.. నువ్వు ఏంటీ ఇక్కడ.. ఎవరైనా చూస్తే బాగోదు" అని మురారి అంటాడు. "నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు వాలెంటైన్స్ డే రోజు మంచి న్యూస్ చెప్పావు" అంటుంది ముకుంద. "నీకు ఈ రోజు సర్‌ప్రైజ్ ఉంది. ఇంట్లో అందరి ముందు రోజ్ ఇచ్చి.. హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్తాన"ని ముకుంద అనడంతో.. మురారి కంగారు పడుతుంటాడు. ఇక ముకుంద ఇంటికి, మురారి స్టేషన్ కి వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్‌లో.. ఒకతన్ని కానిస్టేబుల్ కొడుతుంటే మురారి అపుతాడు. "ఏం చేసాడు ఎందుకు కొడుతున్నారు?" అని అడుగుతాడు. సర్.. రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్తున్నాడని కానిస్టేబుల్ అనేసరికి.. "అతన్ని వదిలెయ్యండి" అని మురారి చెప్తాడు. ఇక ముకుంద ఏం ప్లాన్ చేస్తుంది.. ఎలాగైనా ఆపాలని ముకుందకి మురారి ఫోన్ చేస్తాడు. ముకుంద ఏం ప్లాన్ చెయ్యనుంది? అందరి ముందు హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పనుందా? వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుందా.. ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

నటుడు నందు కాలికి గాయం...గెట్ వెల్ సూన్ అంటున్న నెటిజన్స్

నటుడు నందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గీత మాధురి భర్తగా అందరికీ సుపరిచితుడే. ఆయన గాయపడి కాలికి పెద్ద కట్టు కట్టించుకుని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్నా డబ్బింగ్ చెప్పడానికి  స్టూడియోకి వచ్చాడు నందు. అక్కడ కాలు చాపుకుని కూర్చున్న ఫోటో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. కానీ అసలు ఏం జరిగింది అన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు. నందు ప్రస్తుతం  సినిమాలు, క్రికెట్ కామెంటరీస్ చెప్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. "ఫోటో" అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన నందు తర్వాత ఎన్నో మూవీస్ లో నటించాడు.  100 పర్సంట్ లవ్, ఆటోనగర్ సూర్య , పెళ్లి చూపులు, జయ జానకి నాయక, రాజుగారి గది2, సమ్మోహనం, సవారీ వంటి సినిమాల్లో నటించాడు. లాస్ట్ ఇయర్  "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే మూవీ చేసాడు కానీ అది ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28 తో పాటు ఆర్‌సి 15, డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కీ ధమ్కీ సినిమాలతో నటిస్తున్నారని తెలుస్తుంది. కాలికి గాయం ఐనా కూడా నాలుగు రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసాడు. "మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా వాచ్ చేస్తూ నా గురించి ఆలోచిస్తున్నందుకు" అని కాప్షన్ పెట్టాడు. ఇక నెటిజన్స్ కూడా "గెట్ వెల్ సూన్, యువర్ ఆర్ రాక్ స్టార్, టేక్ కేర్" అని కామెంట్స్ పెట్టారు.   శరీరంలో వస్తున్న మార్పులకు కారణం థైరాయిడ్ కావచ్చు.శరీరం లోని హార్మోన్ల లోపం వల్ల వచ్చే సంకేతంగా చెప్పవచ్చు. థైరాయిడ్ సమస్య ముఖ్యంగా స్త్రీల పైనే తీవ్ర ప్రభావం చూపిస్తుంది.నేడు స్త్రీలు ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్యలలో బిపి,డయాబెటిస్,లాంటి సాధారణ సమస్యలతోపాటు,ఇంఫెర్టిలిటి,సంతాన లేమి సమస్య లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం,లేదా ఇతర అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి.

నేను ఏ మూవీ డైరెక్ట్ చేయడం లేదు..అదంతా ఫేక్ న్యూస్..క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాష్టర్

శేఖర్ మాష్టర్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడంటూ త్వరలో అది రిలీజ్ కాబోతోందంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొట్టింది. ఐతే ఇప్పుడు ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు.."నేను ఒక మూవీని డైరెక్ట్ చేస్తున్నానంటూ ఒక న్యూస్ వస్తోంది. అది ఫేక్ న్యూస్..నేను ఏ మూవీని డైరెక్ట్ చేయలేదు. ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే గనక మీ అందరికీ చెప్తాను. షూటింగ్స్ చేయడానికే టైం సరిపోవట్లేదు.. ఇప్పుడు నాకు డైరెక్ట్ చేసే ఉద్దేశమే లేదు. ఇంకో విషయం ఏమిటి అంటే మా శేఖర్ స్టూడియో నుంచి లాస్ట్ ఇయర్ "టెర్రస్ లవ్ స్టోరీ" వచ్చింది.  అలానే  రేపు శివరాత్రి సందర్భంగా "ఇష్టమే..కానీ ప్రేమ లేదంట" అనే వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ మా స్టూడియో నుంచే రాబోతోంది. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి" అంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్లేస్ లో ఉన్నాడు. ఒక పక్కన  కొరియోగ్రఫీ చేస్తూనే బుల్లితెరపైన షోస్ కి జడ్జిగా  వ్యవహహరిస్తున్నాడు. యూట్యూబ్ లో వీడియోస్ అప్ డేట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు. తన కూతురు, కొడుకుతో కలిసి చేసే ఫన్నీ వీడియోలు బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. శేఖర్ మాష్టర్ కొడుకు కూడా ఒక మూవీలో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ కి శేఖర్ మాష్టర్ కొరియోగ్రఫీ చేస్తుంటాడు. అతని డాన్స్ స్టెప్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి.

జోలపాట పాడి కూతురు కోసం సింగరైన బాలాదిత్య!

బాలాదిత్య ఎంత పెద్దవాడైనా ఇద్దరు పిల్లలకు తండ్రైనా కూడా ఇంకా బాలనటుడిగానే అందరికీ గుర్తొస్తాడు. బాలాదిత్య ఆల్ రౌండర్. బాలనటుడిగా సుమారు 40 సినిమాల్లో నటించాడు.  ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత ‘రౌడీగారి పెళ్ళాం’ ‘జంబలకిడి పంబ’ , అన్న, ‘ఆజ్ క గుండా రాజ్’ ‘హలో బ్రదర్’ ‘హిట్లర్’ ‘సమరసింహారెడ్డి’  లిటిల్ సోల్జర్స్ వంటి మూవీస్ లో  చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. లిటిల్ సోల్జర్స్ మూవీకి నంది అవార్డు అందుకున్నాడు. 1940 లో ఒక గ్రామం అనే మూవీకి  నేషనల్ అవార్డును అందుకున్నాడు. 2003 లో ఇతను హీరోగా ‘చంటిగాడు’ అనే మూవీలో నటించాడు. రీసెంట్ గా " మా ఊరి పొలిమేర" అనే చిత్రంలో కూడా  నటించాడు. హీరోగా మంచి బ్రేక్ రాకపోయేసరికి ఫైనల్ గా సీరియల్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యాడు.. సావిత్రమ్మ గారి కొడుకు, శాంభవి వంటి సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మంచి మార్క్స్ కూడా సంపాదించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన రెండో కూతురు యజ్ఞ విధాత్రి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఈ ఫంక్షన్ కి వచ్చారు.  ఇప్పుడు బాలాదిత్య తన కూతురు కోసం సింగర్ కూడా అయ్యాడు. "నా చిట్టిగాడే..నా తల్లిగాడే..నా చిట్టితల్లిగాడే...నా పుత్రి వీడే...విధాత్రి వీడే..యజ్ఞ విధాత్రి వీడే.." అంటూ ఒక చిన్న జోలపాటను క్రియేట్ చేసి పాడాడు. బాలాదిత్య పాడుతున్నంత సేపూ..తన కూతురు చాలా ఆసక్తిగా రెప్ప వాల్చకుండా వాళ్ళ నాన్న పెదాల కదలికలనే చూస్తూ ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. పాట బాగుంది..పాపా బాగుంది..పేరు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నేను పరుపు... నువ్వు ఎరుపు... ఆది డబుల్ మీనింగ్ డైలాగులు

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. డాన్సస్ అన్నీ ఒక రేంజ్ లో అలరిస్తుంటే ఆది కామెడీ మాత్రం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోనే సాగుతోంది. ఢీ-15 రాబోయే ఎపిసోడ్ 'వైల్డ్ కార్డ్ స్పెషల్' థీమ్‌తో నెక్స్ట్ వీక్ ఎంటర్టైన్ చేయనుంది. ఫస్ట్ కంటెస్టెంట్ డాన్స్ చేసాక ఆది గబ్బర్ సింగ్ గెటప్ లో గన్ పట్టుకుని స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాడు. "గెటప్ వేయడం కాదు.. నీలో ఏదైనా  స్పెషల్ టాలెంట్ ఉందా" అని యాంకర్ ప్రదీప్ అడగ్గానే "రబ్బర్ పన్నంగా..రబ్బర్ తీసి మార్చి పన్నంగా.. ఆరేయ్ ఎప్పుర్రా" అంటూ సోషల్ మీడియాలో ఈమధ్య వైరల్ అయిన బుడ్డోడి డైలాగ్ చెప్పి అందరినీ నవ్వించాడు ఆది.  తర్వాత చేతిలో ఉన్న గన్ ని పవన్ కళ్యాణ్ తిప్పినట్టు తిప్పడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు ఆది. బిగ్ బాస్ జెస్సీ కూడా పోలీస్ గెటప్ లో పక్కనే ఉండి "ఉత్తుత్తినే గన్ తీస్తావ్ తప్ప ఆ గన్ పేలదు, అందులో బుల్లెట్లు ఉండవు" ఆది పరువు తీసేసాడు. ఆది అందుకుని "వెళ్లి శ్రుతిహాసన్‌ను పిలు" అని చెప్పగానే "ఆగు ఇంకా డైలాగ్ ఉందని" మరోసారి కౌంటర్ వేసేశాడు జెస్సి. "అయ్యబాబోయ్ నాకు డైలాగ్ గుర్తుచేసే స్టేజికి ఎదిగిపోయాడేమిటి" అని ఆది తెగ ఫీలైపోయాడు. ఇంతలో వీళ్ళ టీమ్ లో ఉండే దివ్య వచ్చింది. ఆమెను చూసి "ఏదో ఒక రోజు నువ్వు నాకు కచ్చితంగా పడతావ్ తెల్సా" అన్నాడు ఆది. "అలా పడడానికి  నేను మామూలు అమ్మాయిని కాదు.. నేను మెరుపు" అని జుట్టు ఎగరేసేసరికి "నేను పరుపు" అన్నాడు ఆది మరి నేను అని జెస్సి అనేసరికి  "నువ్వు ఎరుపు" అంటూ బూతు డైలాగ్ వేసాడు ఆది. ఇక ఈ షో 22 న ప్రసారం కానుంది.

దాన్ని చూసి మనమంతా బుద్దితెచ్చుకోవాలి...అనసూయ ఫైర్

బుల్లితెర మీదైనా, సిల్వర్ స్క్రీన్ పైనైనా, సోషల్ మీడియాలో ఐనా ఫైర్ బ్రాండ్. ఎవరు ఏమన్నా డోంట్ కేర్ అని వాళ్లకు తగ్గట్టుగానే బుద్దొచ్చే సమాధానం ఇస్తుంది. "ఆంటీ" అంటూ ట్రోల్స్ చేసినవారిని కడిగిపారేసింది. వాలెంటైన్స్ డే రోజున కూడా ఒక నెటిజన్ కి ఫుల్ కోటింగ్ ఇచ్చేసింది. "నీతో లైఫ్ చాలా క్రేజీ" అనే కాప్షన్ తో  తన హజ్బెండ్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి పెట్టుకుంది.   "అలా ఏం లేదు అక్కా.. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది అందుకే" అని ఒక నెటిజన్ కామెంట్ చేసేసరికి అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా ? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే నేను వేస్తా చెప్పులతోటి.. సారీ నా అర్థం చెప్పులతో చెంపలేస్తానని" అంటూ ఫుల్ గా యుద్ధం చేసింది.  అనసూయకు మూగ జీవాలంటే చాలా పిచ్చి కూడా..ఇంట్లో చాలా పెంచుకుంటూ ఉంటుంది.  చిలకలకి భాష నేర్పించి మాట్లాడిస్తూ ఉంటుంది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఎక్కడిదో తెలీదు కానీ. ఒక ఇద్దరు మనుషులు  స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ పెట్టిన రెడ్, గ్రీన్ స్టాండ్స్ నీళ్ళల్లోకి పడిపోయేసరికి ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న సీల్ వాళ్లకు హెల్ప్ చేసింది. వాటిని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ గట్టు మీద నిలబెట్టింది. అనసూయ " వాట్ ఏ క్యూటీ బుద్ది తెచ్చుకోవాలి మనం" అంటూ కాప్షన్ పెట్టుకుంది. నిజమే కదా మనుషులు ఆలోచించలేని విషయాలను మూగజీవాలు ఆలోచిస్తాయి అనడానికి ఇదే నిదర్శనం..

కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి పాలు పొంగించిన సింగర్ లిప్సిక

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ లో మంచి పేరు తెచ్చుకున్న సింగర్ లిప్సిక. ఈమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఎంతో  క్రేజ్ ను సొంతం చేసుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది. అంతేకాదు ఈమె సోషల్ మీడియాలో మోటివేషనల్ లైన్స్ చెప్తూ ఫేమస్ అయ్యింది. సంగీతం అంటే ఎంతో ఇష్టపడే లిప్సిక  ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి  తన టాలెంట్ ని నిరూపించుకున్నారు.  లెజెండరీ సింగర్  ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం గారి నుంచి అద్భుతమైన  ప్రశంసలను కూడా అందుకుంది. తర్వాత ప్లేబ్యాక్‌ సింగర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు  300లకు పైగా పాటలు పాడారు. టెంపర్ మూవీలో  ‘నిన్ను చూసి పడిపోయా ఆన్‌ ద స్పాట్‌’, కొత్తజంట మూవీలో  ‘ఓసి ప్రేమ రాక్షసి’, ప్రేమకథ చిత్రం మూవీలో  ‘ఐ జస్ట్‌ లవ్‌ యు బేబి’  వంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్ ని ఈమె పాడారు. ఈమె గొంతును ఈజీగా గుర్తుపట్టేయొచ్చు. ఇక ఇప్పుడు లిప్సిక తన భర్త పేరు ఉదయ్ తో కలిసి  కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఆ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నారు.  ఇక నెటిజన్స్ అంతా వాళ్ళను విష్ చేస్తున్నారు. లిప్సిక కొంతకాలం క్రితం తన తండ్రిని పోగొట్టుకుంది.. కిడ్నీ సంబంధ  సమస్యతో ఆయన చనిపోయారు. ‘‘మీరు లేని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు పప్పా’ అంటూ ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగానికి గురయ్యారు.

ఘనంగా సామ్రాట్ కూతురు ధ్రితి పుట్టినరోజు వేడుకలు

సిల్వర్ స్క్రీన్ మీద సామ్రాట్ రెడ్డి అందరికి తెలిసిన నటుడే. చాలా మూవీస్ లో  హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పార్టిసిపేట్ చేసి మరింత ఫేమస్ అయ్యాడు. తనకు  మొదట హర్షిత రెడ్డితో పెళ్లైయింది. అయితే కొన్ని కారణాల వల్ల వీళ్ళ వైవాహిక జీవితానికి బ్రేక్ పడింది. తర్వాత ఇద్దరూ డివోర్స్ తీసేసుకున్నారు. చివరికి  అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.  లాస్ట్ ఇయర్  ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున లిఖిత పండంటి పాపకి జన్మనిచ్చింది. అప్పుడు  సామ్రాట్ పాపను ఎత్తుకున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో  షేర్ చేశాడు.  ఇప్పుడు తన కూతురు "ధ్రితి"కి ఆరు నెలలు పూర్తయ్యాయని చెప్తూ తన కూతురు, భార్యతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. " మా లిటిల్ ప్రిన్సెస్ కు ఆరు నెలలు నిండాయి. హ్యాపీ బర్త్ డే చిన్ని నాన్న..మేము నిన్ని ఎంతో ప్రేమిస్తాం...ఇట్లు మీ అమ్మా-నాన్న" అని కాప్షన్ పెట్టాడు. అలాగే బర్త్ డేని ఫామిలీ మెంబర్స్ తో కలిసి  గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు.    ఇది చూసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరీటి "టైం ఎంత తొందరగా గడిచిపోయింది. స్వీట్ హార్ట్ కి బెస్ట్ విషెస్" అని మెసేజ్ పెట్టాడు. నెటిజన్స్ అంతా సామ్రాట్ కూతురిని విష్ చేస్తూ రిప్లైస్ ఇచ్చారు. టాలీవుడ్‌లో పంచాక్షరి, బావ, అహ నా పెళ్లంట వంటి  సినిమాల్లో నటించాడు.  అదే ఫేమ్ తో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.   

వాళ్ళను చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి

ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కొన్ని పేర్లకు అస్సలు పరిచయాలే అక్కరలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కాంట్రావర్సీస్ తో ఆడియన్స్ కి, ఫాన్స్ కి బాగా కనెక్ట్ ఐపోతారు. అలాంటి వాళ్ళ లిస్ట్ లో ఆర్జీవీ, కౌశల్ మందా ఇద్దరూ టాప్ ప్లేస్ ఉంటారు. కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ 2 లో ఆయన కోసం కౌశల్ ఆర్మీ కూడా ఒకటి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కౌశల్ బీబీ జోడిలో అభినయశ్రీతో కలిసి జోడి డాన్సర్ గా కాంటెస్ట్ చేస్తున్నాడు. ఈ షోలో కూడా ఫుల్ కాంట్రవర్సీతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు కౌశల్. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ గొడవలే ఉంటాయి.  ఈయన సోషల్ మీడియాలో ఈమధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు.  ఐతే రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. తన కూతురు పాలు చేతిలో పట్టుకుని, స్కూల్ డ్రెస్ వేసుకుని కుర్చీలో నిద్రపోతూ ఉంది..మరో వైపు కారులో తన కొడుకు కూడా సీట్ లో కూర్చుని నిద్ర పోతూ కనిపించాడు. ఎయిర్ రెండిటిని మిక్స్ చేసి ఒక వీడియోగా తన పేజీ లో పోస్ట్ చేసాడు. "నా పిల్లలు ఇలా చూస్తుంటే నా స్కూల్ డేస్ మళ్ళీ నాకు గుర్తొస్తున్నాయి. ప్రతీ రోజు మా అమ్మకు మమ్మల్ని స్కూల్ కి పంపించడం అనేది పెద్ద ఛాలెంజ్" అని కాప్షన్ పెట్టాడు. ఈ వీడియో నెటిజన్స్ అందరికి బాగా కనెక్ట్ ఐపోయింది. "ఈరోజుల్లో పిల్లలకు స్కూల్ కష్టాలు చాలా ఉన్నాయి. 9 గంటలకల్లా స్కూల్ కి వెళ్ళాలి అంటే 8 కల్లా లేవాల్సిన తయారు కావాల్సిన పరిస్థితి..చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. నా చిన్నప్పుడు నేను స్కూల్ కి 9 .30 కి వెళ్ళేవాడిని"..."పిల్లలకు సరిగా నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు...ఏదైనా అప్పటి రోజులు గోల్డెన్ డేస్" అంటూ రిప్లైస్ ఇస్తున్నారు.

ముకుంద చేసిన పనులను చూసి ఆశ్చర్యపోయిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీరియల్ లో.. గతవారం జరిగిన ఎపిసోడ్ లో ముకుంద, కృష్ణకి నిజం చెప్తుందేమోననే ట్విస్ట్ క్రియేట్ చేసారు మేకర్స్. కాగా ఈ సీరియల్ ఎపిసోడ్ -82 లోకి అడుగుపెట్టింది.  గురువారం నాటి ఎపిసోడ్ లో.. మురారి, కృష్ణలది నిజం పెళ్ళి కాదని.. అగ్రిమెంట్ పెళ్ళని ఆవేశంలో ముకుందకు చెప్తాడు మురారి. దీంతో సంతోషంతో మురారిని హత్తుకుంటుంది ముకుంద. మురారి మాత్రం ఆవేశంలో నోరు జారానని భయపడుతుంటాడు. ఇప్పుడు ముకుందని కంట్రోల్ చెయ్యడం చాలా కష్టమని మురారి టెన్షన్ పడతాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి కాళ్ళు పట్టుకొని లాగుతుంది. "ఏంటి కృష్ణా.. ఏం చేస్తున్నావ్" అని మురారి అడుగుతాడు. "నా కాటుక కన్పించట్లేదు సర్.. అసలే నేను అందంగా ఉంటానని కాటుక పెట్టుకుంటాను" అని కృష్ణ అంటుంది. అవునవును నువ్వు అందంగా ఉంటావని మురారి అనగా.. అవును సర్ రాత్రి మీరు ఎక్కడికెళ్ళారు? నేను లేచేసరికి మీరు లేరు. నాకు భయమేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాని కృష్ణ అంటుంది. ముకుందతో మాట్లాడానని చెబితే ప్రాబ్లం అవుతుందని.. బయటకెళ్ళానని చెప్పేసి తప్పించుకుంటాడు. మరుసటి రోజు ఎప్పుడు ఇంట్లో చిన్నపని కూడా చేయని ముకుంద అన్ని పనులు చేస్తుంది. కారణం కృష్ణ, మురారిలది అగ్రిమెంట్ పెళ్ళనే సంతోషం. ముకుంద ప్రొద్దున్నే లేచి.. ఇంటిపని, వంటపని చేసి అందరిని టిఫిన్ చెయ్యడానికి రమ్మంటుంది. ఏంటి ముకుంద వంట చేసిందా అని అందరూ ఆశ్చర్యపోతారు. "ఏంటి ముకుందా.. ఇంత సంతోషంగా ఉన్నావ్" అని భవాని అడుగుతుంది. నా సంతోషానికి కారణం మురారికి తెలుసని ముకుంద అంటుంది. అప్పుడు మురారి.. అవును ఆదర్శ్ ని వెతకడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాను.. తొందర్లోనే ఆదర్శ్ ని తీసుకొస్తానని మురారి అనడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు  దక్కదనుకున్న సంతోషం.. మళ్ళీ మనకు దక్కినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా అని ముకుంద అంటుంది. అది విన్న రేవతి.. "అవును.. ఆదర్శ్ వస్తే నువ్వు తను సంతోషంగా ఉండొచ్చు" అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధార చెప్పని ఆ రహస్యాన్ని రిషి తెలుసుకున్నాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎందుకంటే వసుధార, రిషిల ప్రేమకథని ఇష్టపడని వారంటూ ఎవరుండరు. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్ -688 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం నాటి ఎపిసోడ్ లో.. రిషి లైబ్రరీలో బుక్స్ చూస్తుండగా.. అటు వైపుగా ఉన్న వసుధార కూడా బుక్స్ చూస్తుంటుంది. అలా వసుధార బుక్స్ అన్నీ చూస్తుండగా ఒక బుక్ కిందపడిపోవడంతో తీస్తుండగా.. వసుధార మెడలో ఉన్న VR లాకెట్ బయటికి వస్తుంది. ఆ లాకెట్  బయటికి వచ్చిన విషయం గమనించుకోకుండా వసుధార బుక్ చదువుకుంటూ వెళ్తుంది. అనుకోకుండా రిషి  బుక్ తీసేసరికి.. అటువైపు ఉన్న వసుధార మెడలోని లాకెట్ కనిపిస్తుంది. రిషి ఒక్కసారిగా షాక్ అయి.. అలానే తనని చూస్తూ ఉండిపోతాడు. రిషి వెంటనే పరుగెత్తుకుంటూ వసుధార ముందుకి వస్తాడు. వసుధార రిషిని చూసి "సర్ మీరేంటిక్కడ" అని అని అడుగుతుంది. వెంటనే రిషి వసుధార మెడలోని లాకెట్ ని చూపిస్తాడు. వసుధార కూడా షాక్ అవుతుంది. ఏంటి వసుధార నా లాకెట్ నీ మెడలో ఏంటని రిషి అడుగుతాడు. అది నాకు నచ్చింది కాబట్టి నేను వేసుకున్నా అని వసుధార చెప్తుంది. ఇంతలోనే ఆఫీస్ బాయ్ వచ్చి సర్ బుక్స్ అని ఇస్తాడు. వెంటనే వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వసుధార ఆటోలో వెళ్తూ.. రిషి సర్ కోపంలో ఆలోచన లేకుండా తెలుసుకోలేకపోతున్నారంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతలోనే చక్రపాణి ఫోన్ చేసి.. "ఎక్కడున్నావ్ అమ్మా.. ఎప్పుడొస్తావ్" అని అడుగగా.. "లేట్ అవుద్ది నాన్న" అని అంటుంది. మరోవైపు ఒంటరిగా కూర్చొని రిషి ఆలోచిస్తుంటాడు. నేను ఇచ్చిన లాకెట్ తన మెడలో ఎందుకు వేసుకుంది.. అసలు తన ఉద్దేశ్యం ఏంటి.. ఇప్పుడు నా లాకెట్ తన మెడలో ఎందుకు ఉంది.. నా లైఫ్ ని చిందర వందర చేస్తుంది.. ఈ బాధని భరించలేను అని అనుకొని.. చివరికి ఈ రోజు అటో ఇటో తేల్చుకుంటానని ఆవేశంగా వసుధార ఇంటికి వెళ్తాడు.  రిషి అక్కడికి వెళ్ళిన తర్వాత.. వసుధార ఎక్కడా? అని చక్రపాణిని అడుగుతాడు. ఇంకా రాలేదు సర్.. లేట్ అవుతుందని చెప్పిందని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత చక్రపాణి కాఫీ తీసుకొస్తానని వెళ్ళగానే.. రిషి అద్దంలో చూసుకుంటాడు. అక్కడే ఉన్న ఒక పేపర్ మీద 'రిషిధారలు వేరు వేరు కాదు.. ఐ లవ్ యూ అండి.. ఇట్లు మీ పొగరు' అని రాసి ఉంది చూస్తాడు. అది చూసి రిషి కళ్ళలో ఆనందం చిగురిస్తుంది. వసుధార అన్న ప్రతి మాటను గుర్తు చేసుకొని పట్టరాని సంతోషంతో వెళ్లిపోతుంటాడు. అలా తను వెళ్తుంటే .. "సర్ వసమ్మ ఎక్కడికి వెళ్ళిందో" అని చక్రపాణి అనగానే.. "నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళిందో" అని రిషి చెప్పేసి .. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.