శ్రీముఖి ఇంట్లో రాకేష్, సుజాత హనీమూన్!

మిస్టర్ అండ్ మిస్సెస్ షో ఈమధ్య కాలంలో చాలా రొమాంటిక్ గా తయారయ్యింది. జంటలతో ఆటలు మంచి ఫన్నీగా డిజైన్ చేస్తున్నారు. రాబోయే వారం షోకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రీముఖి ఎంట్రీలోని రాకింగ్ రాకేష్ తో సరదాగా మాట్లాడింది. "రాకేష్ మీ ఇద్దరికీ టెన్షన్ ఉందా" అని అడిగేసరికి "ఉంది ఎందుకుండదు..ఇక పై నుంచి ఈ షో తర్వాత నిన్ను కలవనేమోనన్న చిన్న బెరుకు ఉంది" అన్నాడు...అంటే "నువ్వు చచ్చిపోతున్నావా, నేను చచ్చిపోతున్నానా" అని శ్రీముఖి రివర్స్ లో అడిగింది దాంతో అందరూ నవ్వేశారు. "హనీమూన్ కి ఎక్కడికి వెళ్లారు" అని శ్రీముఖి మళ్ళీ అడిగేసరికి "మీ ఇంటికొచ్చాం అని చెప్పు" అన్నాడు రాకేష్ ఫన్నీగా దాంతో సుజాత విరగబడి నవ్వింది. ఇక ఈ షోలో ఒక్కో జంటకి ఒక్కో వెరైటీ టాస్క్ ఇచ్చి ఆడించారు. నటి శ్రీవాణి జంటకు ఇచ్చిన రొమాంటిక్ టాస్క్ మాత్రం భలే సరదాగా ఉంది. శ్రీవాణి తన భర్తతో కలిసి ఐస్ క్రీమ్స్ ని పెదాలతో పట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చి ఒక బాక్స్ లో నుండి ఇంకో బాక్స్ లోకి పెట్టాల్సి ఉంటుంది. రాకేష్-సుజాత పెయిర్ కి కొంస్హ్మ్ టాప్ టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. రాకేష్ చేతులకు గ్లాసులను కట్టేసుకున్నాడు. సుజాత వేసే బాల్స్ ఆ కప్పులో పడాలి. కానీ ఈ టాస్క్ లో రాకేష్ మధ్యలో ఒకసారి పడిపోయాడు. ఇలా ఐదు జంటలు వెరైటీ టాస్క్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఐతే ఈ ఐదు జంటల్లో రెండు జంటలు ఎలిమినేట్ అవుతున్నాయి అని అనౌన్స్ చేసింది శ్రీముఖి. మరి ఇందులో సేఫ్ జోన్ లో ఉన్న పెయిర్స్ ఎవరు..ఎలిమినేట్ అవుతున్న పెయిర్స్ ఎవరో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

పెళ్ళిమండపం నుండి స్వప్న జంప్.. బాధలో కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -32లో.. స్వప్న పెళ్ళికి రెడీ అవుతూ.. అందరినీ వదిలి వెళ్లిపోతున్నాననే బాధతో కావ్య, అప్పులను పట్టుకొని ఏడుస్తుంది. నువ్వేం భయపడకు అక్కా.. నీకు నచ్చిన అతన్ని పెళ్ళి చేసుకుంటున్నావ్ అని కావ్య  అంటుంది. అప్పు ఎలాగైనా బతికేస్తుంది.. నీ గురించే భయంగా ఉంది కావ్య.. చిన్నప్పటి నుండి నువ్వు మా కోసం కష్టపడుతున్నావని స్వప్న మనసులో అనుకుంటుంది. తను చీర మార్చుకుంటానని చెప్పి కావ్య, అప్పులను రూం నుండి బయటికి పంపించేసి.. స్వప్న వెనుక డోర్ నుండి పారిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ పెద్దమ్మ నగలు, చీరలు అన్నింటిని తన లగేజ్ లో సర్దుకొని లెటర్ రాసిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజ్ ఫ్యామిలీ వచ్చారని కనకం వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది.. ఇక రాజ్  పెళ్ళిపీటల మీద కూర్చొని ఉంటాడు. పెళ్లి కూతురుని తీసుకొని రండి అనగానే.. స్వప్నని తీసుకురావడానికి కనకం గదిలోకి  వెళ్ళి చూసేసరికి స్వప్న లేకపోవడంతో.. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందనుకుంటూ కంగారుగా అంతా చూస్తుంది. అప్పుడే స్వప్న రాసిన లెటర్ ని చూసి.. దాన్ని చదువుతుంది. "అమ్మ నన్ను క్షమించు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నా గురించి వెతకొద్దు" అని స్వప్న ‌రాసిన లెటర్ లో ఉంటుంది. ఆ లెటర్ చదివిన కనకం "ఎంత పని చేసావే.. నువ్వు ఇష్టం అంటేనే కదా.. ఇన్ని అబద్ధాలు ఆడి నీ చెల్లెలు మాట, నీ నాన్న మాట వినకుండా ఇంత దూరం తీసుకొచ్చాను" అనుకుంటూ కనకం ఏడుస్తుంది. ఇక బ్రతకనని కనకం ఫ్యాన్ కి చీరతో ఉరేసుకుందామనుకుంటుంది.  మరోవైపు ఇంకా పెళ్ళి కూతురు రావట్లేదని అందరూ అనుకుంటారు. అందరూ అలా అనడంతో.. మా అమ్మ ఇంకా రావట్లేదేంటి అని కావ్య అనుకొని గదిలోకి వెళ్తుంది. అక్కడ కావ్య వెళ్ళేసరికి కనకం ఉరేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అది చూసి కావ్య వెళ్ళి కనకంని ఆపుతుంది. అమ్మా.. ఏమైంది.. పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావని కావ్య అనగానే కనకం జరిగిందంతా చెప్తుంది. మరోవైపు రాహుల్ కూడా పెళ్ళి మండపం నుండి ఎవరికి డౌట్ రాకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. స్వప్నని కార్ లో తీసుకొని వెళ్ళిపోతాడు. అలా స్వప్న కార్ లో వెళ్ళిపోతుండగా అప్పు ఫ్రెండ్ చూసి.. "మీ అక్క ఎవరి కార్ లోనో వెళ్తుంది" అని అప్పుతో చెప్తాడు. అలా చెప్పడంతో.. అప్పు పరుగున గదిలోకి వెళ్తుంది. అది విని.. "స్వప్న ముందే ప్లాన్ చేసుకుందే" అని కావ్య, అప్పులతో చెప్పుకుంటూ ఏడుస్తుంది కనకం. ఇక రాజ్ ఫ్యామిలీకి స్వప్న గురించి కనకం ఏం చెప్పనుంది?  తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అలాంటి పెర్ఫార్మెన్స్‌కి ఇలాంటి కామెంట్సా.. శేఖర్‌ని నిలదీసిన పండు!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ నెక్స్ట్ వీక్ ప్రోమో చాలా అందంగా ముస్తాబై వచ్చింది. ఇందులో హైపర్ ఆది ఛత్రపతి మూవీలో ప్రభాస్ గెటప్ లో వచ్చి ఎంటర్టైన్ చేసాడు. "అసలు నువ్వు ప్రభాస్ అనడానికి ఒక సాక్ష్యం చూపించు" అని ప్రదీప్ ఫన్నీగా అడిగేసరికి "నా మెడలో గవ్వ చూసావా" అనేసరికి "గవ్వ పగిలిద్ది ఇంకోసారి" అని ప్రదీప్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. "ఈ సెట్ లో హగ్గులు ఏడ్చాము, ముద్దులకు ఏడ్చాము, మా కరువు హద్దులు దాటింది. శేఖర్ మాస్టర్ పొతే జానీ మాస్టర్ ఆయన పొతే గణేష్ మాస్టర్ ఇలా ఎవరైనా శ్రద్దా జోలికి వస్తే అని గొడ్డలిని టేబుల్ మీద కొట్టి తన ప్రతాపాన్ని చూపించాడు" ఆది. ఆయన డైలాగ్ ని కంటిన్యూ చేయాల్సిన జెస్సి మాత్రం సైలెంట్ గా నిలబడేసరికి "అరేయ్ నీకు దణ్ణం పెడతాను నీ డైలాగ్ చెప్పారా" అంటూ బతిమాలేసరికి "నీ శ్రద్దా కాదురా...నా శ్రద్దా" అని చెప్పి నవ్వు తెప్పించాడు. తర్వాత ఒక డాన్స్ టీమ్ వచ్చి "నా పేరు సూర్య" మూవీలోని సాంగ్ కి డాన్స్ చేసింది. దానికి శేఖర్ మాస్టర్ "గైస్ యు కిల్డ్ ఇట్ " అని కామెంట్ చేసేసరికి పండు ఫైర్ అయ్యాడు. "మీరు ఎందుకు అలా కామెంట్స్ ఇస్తున్నారో నాకు తెలీదు..ఈ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇవ్వాల్సిన కామెంట్స్ అవి కాదు మాస్టర్" అనేసరికి సెట్ మొత్తం కూడా ఒక్కసారి షాకయ్యింది. దానికి శేఖర్ మాస్టర్ అస్సలు కోప్పడకుండా "సరే ఎలా కామెంట్ ఇవ్వాలో చెప్పు" అనేసరికి "హే జయజయ జై" ఇలా ఇవ్వాలంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో శ్రద్దా సాంగ్ పాడి షాకిచ్చింది. "నిన్నేన నేను చూస్తోంది నిన్నేనా" అంటూ శ్రద్దా అచ్చ తెలుగులో హైపర్ ఆదిని ఉద్దేశించి చక్కగా సాంగ్ పాడి అందరినీ మెస్మోరైజ్ చేసింది. ఆది మాత్రం సిగ్గులమొగ్గయ్యాడు. "రియల్లీ ఐ లవ్ యు రా శ్రద్దా" అని ఆది చెప్పాడు.

వసుధార గురించి ఆ విషయాన్ని బయటపెట్టిన దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-699లో.. న్యూస్ రిపోర్టర్స్ ఆ సస్పెండ్ అయిన ఇద్దరి టీచర్స్ తో మాట్లాడతారు. "మీరు కాలేజీలో చేసిన తప్పులన్నీ రిషి సర్ మా మీడియాలోని అందరికి పంపించాడు. రిషి సర్ పంపించాడు కాబట్టే నిజానిజాలు ఏంటో తెలుసుకున్నాం. లేకపోతే మీ మాటలు నమ్మితే నేను నవ్వులపాలు అయ్యేవాడిని. ఇంకెప్పుడు ఇలా చేయకండి" అని మీడియా పర్సన్ ఆ ఇద్దరు టీచర్స్ తో చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం కొంచెం దూరంలో ఉన్న వసుధార, జగతి వింటారు. "మేడం రిషి సర్ ఇంత దూరం ఆలోచిస్తాడా? సర్ కి ఇంత ముందుచూపా" అని జగతిని అడుగుతుంది వసుధార. "రిషికి కాలేజీ మీద ఉన్న గౌరవం  అలాంటిది. కాలేజీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు" అని జగతి అంటుంది.   మిషన్ ఎడ్యుకేషన్ గురించి జగతి ప్రెస్ మీట్ మొదలుపెడుతుంది. తర్వాత ఫణీంద్ర భూషన్ మాట్లాడతూ.. "ఈ ప్రాజెక్ట్ గురించి మొదటి నుండి ప్రణాళిక చేసి, ఆచరణ చేసింది వసుధార" ఈ సందర్భంగా వసుధారని అభినందిస్తున్నాను" అని  ఫణీంద్ర భూషన్ చెప్పి వసుధారని మాట్లాడమని చెప్తాడు. తనకంటే ముందే దేవయాని మాట్లాడానికి వస్తుంది. రిషిని వదిలిపెట్టి వెళ్ళిపో అని వసుధారతో అంటుంది దేవయాని. ఈ దేవయానిని తక్కువ అంచనా వేస్తున్నావ్.. వెళ్తావా? వెళ్ళవా? అని దేవయాని అనగా.. నేను వెళ్ళనని వసుధార చెప్తుంది. వసుధారని పొగుడుతూ స్పీచ్ మొదలుపెడుతుంది దేవయాని. "వసుధారని నా కోడలుగా చేసుకుందామని అనుకున్నాను.. కానీ తను ఎవరినో పెళ్ళి చేసుకొని వచ్చింది" అని దేవయాని అంటుంది. ఇది పర్సనల్ విషయాలు మాట్లాడే టైం కాదని వసుధార అంటుంది. అయితే నీ మెడలో ఉన్న ఆ తాళిని ఎవరు కట్టారు? నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకున్నావ్? అని దేవయాని అడుగగా.. వదినగారు ఏంటిది అని మహేంద్ర అంటాడు. మీరు ఆగండి నేను మాట్లాడుతున్నా అని దేవయాని అంటుంది. పదే పదే దేవయాని తాళి ఎవరు కట్టారని అడుగగా.. వసుధార మెడలో తాళికి రిషి కారణమని జగతి చెప్తుంది. "నా కొడుకు రిషే వసుధార మెడలో తాళికి కారణం. వసుధార నా కోడలు" అని జగతి అందరికి చెప్తుంది. నీ శిష్యురాలిని కాపాడేందుకు రిషిని ఎందుకు వాడుకుంటున్నావ్ అని దేవయాని అడుగుతుంది. అప్పుడు అక్కడికి రిషి వస్తాడు. రిషిని చూసిన దేవయాని.. "విన్నావా రిషి.. ఆ వసుధార మెడలోని తాళికి కారణం నువ్వంట.. రిషి ఆగావేంటి.. అక్కడికి వచ్చి చెప్పు.. రా నాన్న" అని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి చెప్పమంటుంది. వసుధార మెడలో తాళికి నువ్వు కారణం కాదని చెప్పమని దేవయాని అంటుంది. రిషి నిజం చెప్తాడా? లేక వసుధారకి సపోర్ట్ చేస్తాడా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

క్యూరియాసిటీ పెంచేసిన ‘బ్రహ్మముడి’ సీరియల్ డైరెక్టర్!

అప్పుడు కార్తీకదీపం సీరియల్ ప్రసారమయ్యే టైం స్లాట్ లో‌ ఇప్పుడు 'బ్రహ్మముడి'‌ సీరియల్ ప్రసారమవుతుంది. ఇప్పుడు ఈ సీరియల్ విశేషంగా వీక్షకాదరణను పొందుతూ వస్తోంది. రాజ్ కి కావ్య అంటే ద్వేషం.. కావ్యకి రాజ్ అంటే పడదు. ఇలా ఇద్దరు తూర్పు పడమరలా ఉంటున్నారు. అయితే తాజాగా బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో స్వప్న పెళ్ళి మండపం నుండి రాహుల్ తో వెళ్ళిపోయింది.  పెళ్ళిపీటల మీద రాజ్ ఉన్నాడు. ఇప్పటిదాకా అనుకుంటున్న పెళ్ళికూతురు స్వప్న వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది అనే ట్విస్ట్ తో సినిమా రేంజ్ ఇంటర్వెల్ లా ప్లాన్ చేసారు ఈ సీరియల్ మేకర్స్ . కాగా తాజాగా ఈ సీరియల్ డైరెక్టర్ ‌చింటు పంతం తను కావ్య(దీపికా రంగరాజు)తో కలిసి దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసాడు. అయితే ఈ ఫోటోలో‌ కావ్య పెళ్ళికూతురిలా రెడీ అయింది. తలమీద జీలకర్రబెల్లంతో, మెడలో పూలమాలతో పెళ్ళికూతురులా ఉండటంతో రాజ్ తో పెళ్ళి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే  కావ్యతో పెళ్ళికి రాజ్ ఫ్యామీలీ ఎలా ఒప్పుకుంది? కావ్యని ఎలా ఒప్పించారనే ట్విస్ట్ ఇప్పుడు అందరికి ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ లో మొదటినుండి కావ్య, రాజ్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టముండదు అలాంటిది ఎలా పెళ్ళి చేసుకోగలిగారు? అసలు కావ్య రాజ్ నే పెళ్ళిచేసుకుందా? అనే క్యూరియాసిటి ఇప్పుడు వీక్షకులలో నెలకొంది. అయితే ఈ ట్విస్ట్  ఏంటో తెలియాంటే 'బ్రహ్మముడి' చూడాల్సిందే!

కృష్ణని ఇరికించిన ముకుంద.. భవానీ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -93 లో.. కృష్ణ తన  మాటలతో డాక్టర్ గౌతమ్ కి చిరాకు తెప్పిస్తుంది. గౌతమ్ ఒక ఫోటోని చూస్తూ ఎమోషనల్ అవ్వగా.. ఆ ఫోటో ఏంటి సర్ అని అడిగేసరికి గౌతమ్ కి కోపం వచ్చి.. "ఇక్కడ నుండి వెళ్ళిపో" అని అంటాడు. ఏమైనా పని ఉంటే చెప్పండి సర్ చేస్తానని కృష్ణ అనడంతో.. రెండు ఫైల్స్ ఇచ్చి ఇవి రేపటివరకు రాసుకొని రా అని చెప్తాడు. ఇవ్వన్నీ ఒక్క రోజులో ఎలా రాయాలంటూ బాధగా అంటుంది. ఇంకా రెండు కావాలా అని గౌతమ్ అనేసరికి.. వద్దు వద్దు సర్ ఇవి చాలని కృష్ణ చెప్పి బయటకొచ్చేస్తుంది. అప్పుడే కృష్ణని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన మురారిని చూసి హడావిడి గా కార్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏమైంది కృష్ణ అని మురారి అడగడంతో..  "ఇంట్లో భవాని అత్తయ్య పులి అయితే ఇక్కడ పరిమళ మేడం సింహం. ఇప్పుడు ఇంకొక సర్ గౌతమ్ సర్.. పరమ శివుడు మూడో కన్ను తెరిచినట్లుగా తన కోపం ఉంటుందని కృష్ణ చెప్తుంది. ఒక్క రోజులోనే ఒక మనిషి గురించి స్టడీ చేసావ్.. నువ్వు చాలా గ్రేట్ కృష్ణ  అని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. అప్పటికే కృష్ణ కోసం ఎదురుచూస్తూ ఏమీ తినకుండా  నందిని మారాం చేస్తుంది. కృష్ణ నువ్వు వచ్చావా అంటూ దగ్గరికి వెళ్తుంది. అన్నం తిన్నావా నందు? అని కృష్ణ అనగానే.. నువ్వు వచ్చాకే తింటానని నందు అంటుందని ముకుంద చెబుతుంది. మురారి ఫ్రెష్ అప్ అయి వస్తానని తన గదిలోకి వెళ్తాడు. అప్పుడే కృష్ణ దగ్గరికి భవాని వచ్చి.. ఇంట్లో పనులు ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయావా? ముకుంద ఒక్కతే ఇంట్లో పనులు వంట పనులు చూసుకుంటుందా అని భవాని అడుగుతుంది. లేదు అత్తయ్యా.. నేను ముకుందకి హెల్ప్ చేస్తా అంటే తనే వద్దు అందని కృష్ణ చెప్తుంది. లేదు అత్తయ్య కృష్ణ, మురారి ఇద్దరు కాలేజీకి రెడీ అయి వెళ్ళేటప్పుడు.. హెల్ప్ చేయాలా అని అడిగింది.. అప్పుడు కాలేజీకి వెళ్తున్నావ్ గా.. వద్దులే అని చెప్పానని ముకుంద అంటుంది. కాలేజీకి వెళ్తుంటే బాక్స్ ఇచ్చి వెళ్ళమని చెప్పి ఇంటికొచ్చేసరికి ఇదంతా రాద్దాంతం చేస్తావా ముకుంద అని కృష్ణ అడుగుతుంది. ఏంటి కృష్ణా.. ఆ మాటలు చిన్న పెద్ద లేకుండా.‌. అయినా ఇంట్లో ఎవరి పనులు వారే చేసుకోవాలి. నువ్వు ఇంట్లో పని అయ్యాకే కాలేజీకి వెళ్ళాలి అని భవాని చెప్తుంది. "సరే అతయ్యా.. ఇంట్లో పని అయ్యాకే వెళ్తాను.. ఇంకా ఎవరికి అనే ఛాన్స్  ఇవ్వను" అని  ముకుందని ఉద్దేశించి కృష్ణ అంటుంది. ఆ తర్వాత తన గదిలో ఉన్న రేవతి దగ్గరికి కృష్ణ టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళి.. "ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్యా" అని అడుగుతుంది. పర్లేదమ్మా బానే ఉంది.. కాలేజీకి వెళ్ళావా అంటూ రేవతి అడుగుతుంది. వెళ్ళానని చెప్పి ముకుంద చేసిన గొడవ గురించి రేవతికి చెప్తుంది కృష్ణ. ఏంటి ఈ ముకుంద వాలెంటైన్స్ డే నుండి ఇలా ప్రవర్తిస్తుందని రేవతి అనుకుంటుంది. కాసేపటికి కృష్ణని వెతుకుతూ మురారి అటు ఇటు తిరుగుతుండగా.. ముకుంద ఎదురుపడి కృష్ణ కోసం చూస్తున్నావా? ఆ నందు తో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉంటుందని ముకుంద అంటుంది. అవునా.. అది మంచి పనే కదా అని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

టాస్క్ కంప్లీట్ చేసినవాళ్లకు ఆదితో కాండిల్ లైట్ డిన్నర్

త్వరలో ఉమెన్స్ డే వస్తున్న సందర్భంగా ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ షో మొత్తం విమెన్  స్పెషల్ గా రాబోతోంది. ఈ ఎపిసోడ్ లో ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ లేడీ గెటప్స్ లో కనిపించారు. "సిఎస్ ఐ సనాతన్" మూవీ టీం నుంచి ఆది సాయికుమార్, వాసంతి వచ్చారు. రాకెట్ రాఘవ ఇందులో గంగూభాయ్ క్యారెక్టర్ లో కనిపించి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. ఆదితో చెప్పిన డైలాగ్స్ అందరినీ నవ్వించాయి "నీతో ఒక విషయం మాట్లాడాలి బావ..ఆ మధ్య మీ నాన్న గారు మా వాడకు వచ్చినప్పుడు వాడంతా తగలబడిపోయింది. ఎందుకంటే మీ నాన్న పేరు అగ్ని అంట. ఇప్పుడు అన్నీ బిల్డింగులు కట్టుకున్నాం. వీలైనప్పుడు నాన్నగారిని ఒకసారి  వచ్చి పొమ్మని చెప్పు నాయనా" అనేసరికి ఆది పగలబడి నవ్వేసాడు. తర్వాత ఆది, భాస్కర్, నూకరాజు అంతా కలిసి లేడీ గెటప్స్ లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ పంచ్ డైలాగ్స్ తో నవ్వించేసారు. సౌజన్య, శిరీషా కలిసి సమ్మక్క, సారక్క గెటప్ లో ఒక డాన్స్ చేసి అలరించారు.  యాంకర్ రష్మీ ఆది సాయికుమార్ కి ఒక టాస్క్ ఇచ్చింది. అది చక్కగా పూర్తి చేసి చూపించాడు. ఇక లేడీస్ లో  ఎవరైతే ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఆదితో కాండిల్ లైట్ డిన్నర్ ఉంటుంది అని అనౌన్స్ చేసింది రష్మీ. మరి ఎవరు ఈ టఫ్ టాస్క్ కంప్లీట్ చేసి ఆదితో డిన్నర్ కి వెళ్తున్నారో తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే..

బైక్ డ్రైవింగ్ కూడా రాదా అన్న సౌమ్య!

హోలీ పండగ వస్తున్న సందర్భంగా ఈటీవీలో ఒక స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. అదే "గుండెజారి గల్లంతయ్యిందే" అనే పేరుతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో బుల్లితెర నటులు, కమెడియన్స్ అందరూ వచ్చి మంచి పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని నవ్వించారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా బైక్ సింగర్ రమణ, భాను వచ్చారు. రమణ తన సాంగ్ తో గతంలో ఒక ఎపిసోడ్ లో భానుకి ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ అయ్యాక ఊరు వెళ్తే అక్కడ అంతా "భాను వదిన ఎక్కడ" అని బుర్ర తినేస్తున్నారు అని చెప్పాడు.  "ఈ హోలీ పండక్కి నిన్ను తీసుకొస్తానని వాళ్లందరికీ మాటిచ్చాను " అంటూ ప్రోమో స్టార్టింగ్ లో చెప్పాడు. తర్వాత  డాక్టర్ బాబు, మానస్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. " మీరెందుకు లేటుగా వచ్చారు.." అని ఆది అడిగేసరికి "గూగుల్‌లో మ్యాప్ పెట్టాను.. మధ్యలో అది మిస్సయ్యింది" అని డాక్టర్ బాబు చెప్పేసరికి  "మరేం చేశావ్" అని ఆది మళ్ళీ రివర్స్ లో అడిగాడు "ఏముంది ఇద్దరు గోకే వాళ్లు ఎక్కడ అని  గూగుల్‌లో టైప్ చేశాను.. ఇక్కడికి తీసుకొచ్చింది" అని నిరుపమ్ పంచ్ వేసేసరికి ఆది చెవుల్లోంచి పొగలు బయటకి వచ్చాయి.. ఈ ఈవెంట్‌కు జడ్జిగా హీరోయిన్ జూనియర్ శ్రీదేవి వచ్చింది. తర్వాత  మానస్ "ఎన్నో రాత్రులొస్తాయి గాని" అనే సాంగ్ కి చేసిన రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి శ్రీదేవి ఫిదా ఐపోయింది. "మానస్ నీకు సాంగ్ ఇచ్చినా సినిమాలో చేసినట్టుగా చేస్తావ్" అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది.  ఆదికి యాంకర్ రవి ఒక బైక్ ఇచ్చాడు సౌమ్యను వెనక బైక్ మీద ఎక్కించుకుని ఇలా స్టేజి మీద ఒక రౌండ్ తిప్పాలి అనేసరికి ఆది కూడా వెనక సౌమ్యను ఎక్కించుకుని రెండు అడుగులు వేశాడో లేదో సౌమ్య బైక్ దిగిపోయి "నీకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, కామెడీ రాదు.. ఇప్పుడు బైక్ కూడా రాదా ?" అంటూ స్టేజి పైనే ఆది పరువు తీసింది.  

ప్రెస్ మీట్ లో వాళ్ళిద్దరిని అలా చేయమని చెప్పిన దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-698లో.. తన గురించి, వసుధార గురించి చెడుగా మాట్లాడిన ఇద్దరు మేడమ్స్ ని రిషి డిస్ మిస్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు దేవయాని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. "మా ఉద్యోగం ఊడిపోయింది" అంటూ తమ బాధని చెప్పుకుంటారు. ఇక దేవయాని వాళ్ళకి ఒక సలహా ఇస్తుంది. "కాలేజీలో కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంది కదా? అప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ చెయ్యండి.. రిషి సర్ మంచివాడే కానీ ఈ వసుధార వల్లే మా ఉద్యోగం పోయిందని చెప్పండి.. అప్పుడు అందరి ముందు వసుధార పరువుపోతుంది" అని వాళ్ళతో చెప్పగానే వాళ్ళు సరేనని అక్కడి నుండి కాలేజీకి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ధరణి.. వాళ్ళ మాటలు విని ఎలాగైనా వీళ్ళ గురించి రిషికి చెప్పాలనుకుంటుంది. మరోవైపు రిషి క్యాబిన్ కి వసుధార వెళ్ళి.. "సర్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు.. ఇంటికి వెళ్ళలేదా? మీకు పూర్తిగా జ్వరం తగ్గలేదు" అంటూ టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. వెళ్ళమని వసుధార అనగానే.. "ఏంటి ఆర్డర్ వేస్తున్నావ్" అని రిషి అంటాడు. రిషి సర్.. మీరు ఏమైనా అనుకోండి. ముందు అయితే వెళ్ళండని చెప్పి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది.. ఇక రిషి బయల్దేరి వెళ్తుండగా జగతి మహేంద్రలు ఎదురు పడి ఎక్కడికి వెళ్తున్నావ్ రిషి అని అడుగుతారు. ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. మీటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయో? లేవోనని వసుధారని ఫణీంద్ర అడిగి తెలుసుకుంటాడు. మరోవైపు డిస్ మిస్ చేసిన మేడంలు వస్తారు. ప్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మేమే ఈ కాలేజీ పై కంప్లైంట్ ఇచ్చిందని అంటారు. వాళ్ళు అలా అనడంతో.. "మీరు ఈ కాలేజీ మీద కంప్లైంట్ ఇస్తారా? రిషి సారే.. మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ఈ పేపర్ లో రాసిచ్చాడు" అని ప్రెస్ వాళ్ళు అంటారు. అది విని ఆ ఇద్దరు మేడమ్స్ షాక్ అవుతారు. దూరం నుండి జగతి, వసుధారలు వాళ్ళని చూస్తుంటారు. ఇక దేవయాని కాలేజీకి బయల్దేరి వస్తుంది. ఈ రోజు వసుధార పరువుపోతుందని అనుకుంటూ కాలేజీకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజ్ తో పాటు కావ్యకి ‌మంగళస్నానం.. ఎమోషనల్ అయిన స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-31లో రాజ్ కి మంగళ స్నానం చేయిస్తుంటారు. అప్పుడే కావ్య బయటవైపు వెళ్తుంటుంది. అదే సమయంలో  రాజ్ వాళ్ళ సర్వెంట్ గార్డెన్ లో చెట్లకి నీరు పడుతుండగా.. ఆ నీళ్లు కావ్యపై పడుతాయి. ఇక రాజ్ కి డాష్ ఇచ్చినప్పుడు పసుపు అంటుతుంది. అలా కావ్యకి కూడా మంగళస్నానం అయినట్లుగా చూపిస్తారు. ఇక రాజ్ ఫ్యామిలీ రెడీ అయి పెళ్ళి మండపానికి బయల్దేరుతుండగా.. రాజ్ వాళ్ళ నాన్న కి ఫోన్ వస్తుంది. రాజ్ అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు చనిపోయాడని చెప్పడంతో.. "పెళ్ళిలో నేను ఉండడం కంటే వాళ్ళని ఓదార్చడం ముఖ్యం.. మీరు వెళ్ళండి నేను అక్కడికి వెళ్తాను" అని రాజ్ తల్లి అంటుంది. నువ్వు వెళ్ళు మేము అంతా ఉన్నాం కదా.. రాజ్ పెళ్లి ఘనంగా జరిపిస్తామని రాజ్ నానమ్మ అంటుంది. రాజ్ ఫ్యామిలీ పెళ్ళి మండపానికి వెళ్తారు. మరోవైపు కావ్య కొంత డబ్బు తీసుకొని వచ్చి కనకంకి ఖర్చులకి ఇస్తుంది. ఇక్కడ నన్ను రాజ్ చూస్తే గొడవ అవుతుంది. నేను అక్కని పెళ్లి కూతురిని చేశాక వెళ్ళిపోతానని కనకంతో కావ్య అంటుంది. అప్పు, కావ్య లు స్వప్నని రెడీ చేస్తారు. "ఏంటీ నిన్ను ఇంత రెడీ చేసినా పెళ్లి కళ రాలేదు" అని అప్పు అంటుంది. కాసేపు సరదాగా మాట్లాడుకొని.. ఇన్ని రోజులు మనం ఎన్ని గొడవలు పెట్టుకున్నా నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్లిపోతుంటే బాధేస్తుందే అంటూ అప్పు ఎమోషనల్ అవుతుంది. దాంతో స్వప్న కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పు, కావ్యలని పట్టుకొని ఏడుస్తూ.. "ఇక మనం కలవడం, మాట్లాడుకోవడం ఇదే ఆఖరిసారి కావొచ్చు" అని మనసులో అనుకుని ఏడుస్తుంది. ఆ తర్వాత స్వప్నకి పెళ్ళి నుండి ఎవరికి  తెలియకుండా ఎలా బయటకు రావాలో రాహుల్ చెప్తాడు. అందరూ రెడీ అయి పెళ్ళి మండపానికి వస్తారు. ఎవరికీ తెలియకుండా స్వప్న ఎలా పారిపోతుందో? రాజ్ కావ్యని ఎలా పెళ్ళి చేసుకుంటాడో? పెళ్లి టైంకి స్వప్న లేదన్న విషయం తెలిస్తే కనకం ఏం చేస్తుందో? ఈ సస్పెన్స్ రివీల్ కావాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణని హౌస్ కీపింగ్ కి వచ్చావా అని అడిగిన గౌతమ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -92 లో.. కృష్ణ కాలేజీలో మేడం దగ్గరికి  వెళ్తుంది. నిన్ను ఒక టీంలో యాడ్ చేస్తున్నాను. ఆ టీం హెడ్ గౌతమ్.. తన దగ్గరికి వెళ్ళమని మేడం చెప్పడంతో అతని దగ్గరికి కృష్ణ వెళ్తుంది. గౌతమ్ కొన్ని ఫైల్స్ కృష్ణకి ఇస్తాడు. "ఈ ఫైల్స్ అన్నీ చూడు.. నేను రౌండ్స్ కి వెళ్ళొస్తా" అని చెప్పి వెళ్తాడు. చిందర వందరగా ఉన్న గౌతమ్ క్యాబిన్ ని కృష్ణ నీట్ గా సర్ది, అందంగా చేస్తుంది. మరోవైపు మురారి కోసం క్యారేజ్ తీసుకొని ముకుంద స్టేషన్ కి వెళ్తుంది. స్టేషన్ కి వచ్చిన ముకుందని చూసి.. "నువ్వు ఎందుకు తీసుకొచ్చావ్? వేరే ఎవరైనా తెచ్చేవాళ్ళు కదా.. నిన్ను ఎవరైనా చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఇదివరకు ఒకసారి ఇలానే వచ్చి వెంకటేష్ అంకుల్ ముందు నన్ను ఇరికించావ్" అని మురారి అనడంతో.. అయితే ఏంటి.. ఎలాగైనా కృష్ణ వెళ్ళిపోతుంది కదా.. అయినా నువ్వు ఏంటి కృష్ణకి గిఫ్ట్ లు ఇస్తున్నావ్? వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇల్లు వదిలి వెళ్తుందా అని ముకుంద అంటుంది. "నువ్వు అలా మాటి మాటికి కృష్ణ వెళ్ళిపోతుందని అనకు ముకుంద.. ఒకవేళ కృష్ణకి వెళ్ళడం ఇష్టం లేక నాతోనే ఉంటుందేమో.. కృష్ణ నన్ను ప్రేమిస్తే నేను కూడా తనని ప్రేమిస్తాను. ఒక వేళ కృష్ణ వెళ్ళిపోయినా నేను ఒంటరిగా ఉంటాను కానీ నీతో ఉండను" అని మురారి చెప్తాడు. మురారి మాటలన్ని విన్న ముకుంద ఒక్కసారిగా షాక్ అయి.. ఆదర్శ్ వచ్చినా, కృష్ణ వెళ్ళినా వెళ్ళకున్నా.. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తానని ముకుంద ఎమోషనల్ అవుతుంది. కాసేపటికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ముకుంద. మరోవైపు గౌతమ్ వచ్చేసరికి తన క్యాబిన్ నీట్ గా ఉండడంతో.. ఇదంతా ఎవరు సర్దారని కృష్ణని అడుగుతాడు. "నేనే సర్దాను సర్" అని చెప్తుంది. నువ్వు హౌస్ సర్జన్ చెయ్యడానికి వచ్చావా? హౌస్ కీపింగ్ చేయడానికి వచ్చావా? నాకు ఇలాగ ఉంటే నచ్చదు.. క్యాబిన్ ముందు ఎలా ఉందో అలానే చేయమని గౌతమ్ అంటాడు. అతను అలా అనగానే.. "నాకు సర్దడమే వచ్చు.. పాడు చెయ్యడం రాదు" అని కృష్ణ చెప్తుంది. గౌతమ్ క్యాబిన్ మీద నందు ఫోటో ఉంటుంది. నందు, గౌతమ్ ఒక్కప్పుడు ప్రేమించుకున్నారు. కృష్ణ ఆ ఫోటో చూసేలోపే గౌతమ్ వస్తాడు. నందు ప్రేమించింది గౌతమ్ నే అనే విషయం కృష్ణ కి తెలుస్తుందా? లేదా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రెట్రో స్పెషల్ డ్యాన్స్ తో బిబి జోడి ప్రోమో!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో బిబి జోడి. ఈ షో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మొదలయిన విషయం తెలిసిందే. ఈ షోలో శ్రీముఖి యాంకర్ గా.. సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్జ్ లుగా చేస్తున్నారు. ప్రతీవారం కొత్త కాన్సెప్ట్ లతో ఆకట్టుకుంటున్న బిబి జోడి.. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్స్ ఫుల్  జోష్ తో డ్యాన్స్ చేసినట్టుగా వాళ్ళ పర్ఫామెన్స్ కనిపిస్తోంది. కాగా ఇప్పుడు ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వారం  ఎపిసోడ్ లో రెట్రో స్పెషల్  ఉంటుదని తెలుస్తుంది. రెట్రో స్పెషల్ అంటే జోడీలు పాత పాటలని రిక్రీయేట్ చేసి డ్యాన్స్  చేయాలి. దీంతో అదనపు అట్రాక్షన్ ఈ ప్రోమోకి దక్కింది. ఇందులో జడ్జ్ రాధ ఎంట్రీ సాంగ్ కి డాన్స్ చేసి మంచి ఓపెనింగ్ ఇచ్చింది. అయితే కంటెస్టెంట్స్ అందరు అలనాటి స్టార్ హీరోల ఆల్ టైం హిట్ సాంగ్స్ ని సెలక్ట్ చేసుకొని ప్రతి జంట తమ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకించి అవినాష్- అరియానా జోడి కలిసి చేసిన 'ఆకు చాటు పిందె తడిసే' పాటకి సీనియర్ ఎన్టీఆర్ మార్క్ స్టెప్స్ తో అదరగొట్టారనే చెప్పాలి. వీరిద్దరి పర్ఫామెన్స్ చూసిన రాధ.. "దిస్ ఈజ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్" అంటూ చెప్పింది. ఆ తర్వాత "బంగిన పల్లి మామిడి పండు" సాంగ్ కి సూర్య-ఫైమా జోడి డ్యాన్స్ బాగా చేశారు. అది చూసిన సదా.. "సూర్య.. సూర్య.. ఏం చెప్పాలి" అంటూ ఎగ్జైట్ ఫీల్ అయింది. ఆ తర్వాత సదా స్టేజి మీదకి వచ్చి సూర్యతో కలిసి చిందులేసింది. బిబి జోడిలోని మగాళ్ళంతా లేడీ గెటప్స్ వేసుకుని అలరించారు. అలనాటి సినిమాలలోని పాటలని, ఫైట్స్ ని రిక్రీయేట్ చేసిన ఈ డ్యాన్స్ ఎపిసోడ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. బిబి జోడి ప్రోమోనే ఈ లెవెల్ లో ఉంటే.. మరి ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇన్ స్టాగ్రామ్ లో రాధ క్వశ్చనింగ్!

నటి రాధ.. ఒకప్పుడు తన అందంతో, అభినయంతో డ్యాన్స్ తో తన మార్క్స్ ని చాటుకుంది. హీరోలతో సమానంగా డ్యాన్స్ చేయగల నటి. తొంభైల్లో యాక్టివ్ గా ఉన్న రాధ తర్వాత పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయింది. రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. బిబి జోడీలో గెస్ట్ గా చేస్తూ అందరికి దగ్గరవుతూ వస్తుంది. అయితే తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని పోటీ పెట్టింది. దాంతో తన అభిమానులంతా ప్రశ్నల వర్షం కురిపించారు. అలా అందరూ పంపిన వాటిలో నుండి కొన్నింటికి సమాధానాలు చెప్పుకొచ్చింది రాధ. తన కూతురు కార్తీక కూడా క్వశ్చన్ అడిగింది. మీ ముగ్గురు పిల్లలలో మీకు ఎవరంటే బాగా ఇష్టమని తన కూతురు కార్తీక ప్రశ్నించగా.. "నాకు ముగ్గురు పిల్లలు ఇష్టమే. ఏయ్ కార్తూ నువ్వే కదా.. నువ్వు ఇంట్లోనే ఉండి క్వశ్చన్ అడుగుతున్నావ్ కదా.. నాకు ముగ్గురు సమానమే. నువ్వు ముందు పుట్టావ్ కదా నువ్వంటే కొంచెం ఎక్కువ ఇష్టం.. ఇలా అన్నానని వాళ్ళిద్దరికీ చెప్పకు" అని రాధ చెప్పింది. ఆ తర్వాత మరొక అభిమాని.. "మేడమ్ మీకు ఎన్ని భాషలు వచ్చు" అని క్వశ్చన్ అడుగగా.. ఐదు భాషలు వచ్చని చెప్పి.. ఐదు బాషల్లో మాట్లాడింది. మళ్ళీ మూవీలో యాక్ట్ చేస్తారా మేడమ్ అని మరొకరు అడిగితే.. "త్వరలో .. అతిత్వరలో చేస్తాను " అని చెప్పింది. మరొక అభిమాని.. "మేడమ్ మీరు చిరంజీవి గారు కలిసి మళ్ళీ జంటగా నటిస్తారా" అని అడిగేసరికి... "ఓ గాడ్ దట్స్ ఏ ట్రికీ క్వశ్చన్. జంటగా ఉండాలంటే సో మెనీ క్రైటీరియా కదా.. స్టోరీకి తగినట్టు ఉండాలి. ట్రెండ్ లో ఉండాలి. ఫేర్ గానే ఉన్నాను‌ కదా" అని సమాధనమిచ్చింది.  తమిళ్ లో మీ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్ ఎవరని ఒక అభిమాని అడుగగా.. "మై ఆల్ టైం ఫేవరెట్ యాక్టర్ శివాజీ గణేశన్, యాక్ట్రెస్ పద్మినీ అమ్మ" అని చెప్పింది. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి మేడమ్ అనగా.. "హ్మ్.. అది చెప్తే అందరూ రాధలాగా అవుతారు కదా.. అది చెప్పను" అని చెప్పింది. "డూ సమ్ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ మేడమ్.. యూ కార్తూ తులసీ అండ్ టుగెదర్" అని అడుగగా.. "కమింగ్ సూన్" అని సమాధమిచ్చింది రాధ.

కృష్ణని బ్యాడ్ చేయడానికి ముకుంద వేసిన ఎత్తుగడ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -91లో.. మురారి ఉన్న గదిలోకి ముకుంద కాఫీ తీసుకొని వస్తుంది. అది చూసిన మురారి.. "నువ్వేంటి కాఫీ ఇక్కడికి తీసుకొచ్చావ్? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు" అని అడుగుతాడు. అలా తను అనగానే.. నాకు నీకు ఇలా ప్రేమగా తీసుకొచ్చి ఇవ్వడమే కావాలని ముకుంద అంటుంది. ఇంతలోనే కృష్ణ వాష్ రూమ్ నుండి బయటికొచ్చి.. "ఏంటీ ముకుంద నువ్వు కాఫీ తీసుకొచ్చావ్" అని అడుగుతుంది. చిన్న అత్తయ్యకి తలనొప్పిగా ఉందని పడుకుంది.. అందుకే నేను తీసుకొచ్చానని ముకుంద అంటుంది.  మీరు రెడీ అయి కిందకి వచ్చేయండని చెప్పి ముకుంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ముకుంద వంటగదిలో వంట చేస్తూ తనలో తానే మాట్లాడుకుంటుంది.. "ఎలాగైనా కృష్ణని అందరి ముందు బ్యాడ్ చెయ్యాలి" అని ముకుంద అనుకుంటుంది. అప్పుడే కృష్ణ, మురారిలు కిందకి వస్తారు. "అత్తయ్యకి బాలేదు కదా?  నేను ఏమైనా హెల్ప్ చేయాలా ముకుంద" అని కృష్ణ అడుగుతుంది. నువ్వు కాలేజీకి రెడీ అయ్యావ్ కదా..ఎందుకులే.. నేను చూసుకుంటామని చెప్పి.. ఇదిగో నీ లంచ్ బాక్స్ అని ఇస్తుంది ముకుంద. కాసేపటికి కృష్ణ, మురారిలు కాలేజీకి వెళ్తారు. ఇక వంటగదిలో ఉన్న ముకుంద.. "ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్యను.. పెద్ద అత్తయ్య వచ్చే ముందు స్టార్ట్ చేసి కృష్ణ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయింది" అని చెప్పాలనుకుంటుంది. ఇంతలోనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన భవాని.. "ఏంటి బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్యలేదా? టేబుల్ మీద ఏం లేవు" అని అడుగుతుంది. ఇంకా రెడీ చెయ్యలేదు అత్తయ్య.. రేవతి అత్తయ్యకి బాగోలేదు. తను పడుకుంది. కృష్ణకి బాక్స్ రెడీ చేసి పంపించేసరికి నాకు ఈ టైం అయిందని ముకుంద అంటుంది. అలా తను అనడంతో.. "ఏంటి కృష్ణ తన పని కూడా తాను చేసుకోవట్లేదా? ఇంట్లో పనులు అందరూ సమానంగా చెయ్యాలి కదా" అని భవానీ అంటుంది. మరోవైపు కాలేజీకి వెళ్తున్న కృష్ణకి.. కాలేజీలో ఎలా ఉండాలో చెప్తుంటాడు. "ఇన్ని రోజులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదు.. ఇంట్లో ఉన్నట్లుగా కాకుండా, అందరితో బాగుండాలి" అని మురారి చెప్తాడు. "మీరు చెప్పే గోల్డెన్ వర్డ్స్ నేను మర్చిపోను సర్" అని చెప్పేసి కృష్ణ కాలేజీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆమె ముందే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-697లో .. మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెడదామన్నారు. కానీ నేనే వద్దన్నాని వసుధర చెప్పగా.. ఎందుకు వద్దన్నావ్ అని రిషి అడుగుతాడు. ప్రెస్ మీట్ పెడితే మీరుండాలి కదా అని వసుధార అంటుంది. మన పర్సనల్ విషయాలకు‌ ప్రెస్ మీట్ ని ఆపేయడం కరెక్ట్ కాదని రిషి అంటాడు. దానికి సరే సర్ అని వసుధార సమాధానమిస్తుంది. అక్కడే ఉన్న జగతి మహేంద్ర లు మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధార చెప్పేది వింటారు. అప్పుడే గదిలోని దేవయాని వస్తుంది. అలా వచ్చాక.. "ఏంటి రిషికి బాగోలేదని తెలుసు కదా.. మీరంతా మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారేంటి? రిషికి రెస్ట్ ఇవ్వండి" అని అంటుంది. మహేంద్ర.. మనం బయటకు వెళ్దాం. రిషి వసుధార ఇద్దరు కలసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వసుధార వెళ్ళుంటే.. "థాంక్స్" అని రిషి చెప్పగా.. "రావడానికి సమయం‌ కావాలి.. మీరు ఒప్పుకోవాలి" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి జరిగినదాని గురించి ఆలోచిస్తుంటాడు.  వసుధార కాలేజీలో ప్రెస్ మీట్ కి వెళ్తుండగా.. రిషి సర్ కి ఎలా ఉందోనని ఆలోచించుకుంటూ వెళ్తుంది. లోపలికి వెళ్ళాక రిషిని చూసి కోప్పడుతుంది. జ్వరం వచ్చింది కదా ఎందుకు వచ్చారు? అని వసుధార అడుగగా.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి అని రిషి చెప్పగా.. ఇంటికి వెళ్ళండని దబాయించి మాట్లాడుతుంది. రిషి క్యాబిన్ బయట ఇద్దరు టీచర్స్ రిషి, వసుధారల గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. అప్పడే బయటకు వచ్చిన రిషి వాళ్ళు మాట్లాడుకున్నదంతా వింటాడు. ఆ ఇద్దరిని రిషి తన క్యాబిన్ లోకి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత జగతి మేడమ్ ని రమ్మని చెప్తాడు. జగతి మేడం వచ్చాక.. ఆమె ముందే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తాడు. "వీళ్ళు కాలేజీలో పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. వీళ్ళు పద్దతి మార్చుకోలేదు. సో డిస్మిస్ చేస్తున్నాను" అని చెప్తాడు. అలా చెప్పేసి వెళ్ళిపోతుండగా.. ఆ టీచర్స్ ఇద్దరు రిషిని రిక్వెస్ట్ చేస్తే..  "జగతి మేడంతో మాట్లాడుకోండి" అని చెప్పేసి రిషి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇది రిషి సర్ నిర్ణయం.. నా చేతుల్లో ఏమీ లేదని వాళ్ళిద్దరితో జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజ్ కంటపడకుండా కావ్య తప్పించుకుంటుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -30 లో.. రాజ్ తలపాగా కావ్య దగ్గరే ఉండిపోవడంతో తను ఎలాగైనా రాజ్ ఇంటికి చేర్చాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి అన్ని సామాన్లు ఉన్నాయో లేవోనని రాజ్ వాళ్ళ అమ్మ చూస్తుంటుంది. తీసుకొచ్చిన వస్తువులలో తలపాగా లేదని కళ్యాణ్ తో రాజ్ వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు కళ్యాణ్, కావ్యకి ఫోన్ చేసి తలపాగా తీసుకురమ్మంటాడు. అలా చెప్పడంతో కావ్యనే స్వయంగా తలపాగా తీసుకొని రాజ్ ఇంటికి వస్తుంది. మరోవైపు రాహుల్ ఆలోచనల్లో స్వప్న పిచ్చిదవుతుంది. స్వప్న ఫోన్ చేస్తే రాహుల్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. స్వప్న కాల్ చేసిన ప్రతీసారీ నిన్ను ఎంత దూరం పెడితే అంత దగ్గర అవుతావని రాహుల్ తన మనసులో అనుకుంటాడు. "ఏంటి రాహుల్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు.. నేను అంటే ఇష్టం అన్నాడు.. ఖరీదైన బహుమతులిచ్చాడు.. లేచిపోదామన్నాడు.. కొంపదీసి మనసు మార్చుకున్నాడా.. అదేం అయి ఉండదులే తన చుట్టూ అందరూ ఉండి ఉంటారు.. అందుకే ఇలా చేస్తున్నాడు" అని మళ్ళీ తనకు తానే సర్దిచెప్పుకుంటుంది స్వప్న. ఆ తర్వాత కనకం దగ్గరికి వెళ్తుంది స్వప్న. "అమ్మ నీకొకటి చెప్పాలి.. నీకు రాహుల్ తెలుసు కదా.. తను చాలా రిచ్" అంటూ రాహుల్ గురించి గొప్పగా చెప్తుంది స్వప్న.. అలా చెప్పేసరికి కావ్యకి సంబంధం సెట్ చేస్తుందని కనకం అనుకుని.. "నువ్వు ఎంత మంచిదానివే.. నీ చెల్లి గురించి ఆలోచిస్తున్నావ్" అంటుంది. అలా కనకం అనేసరికి.. "అయ్యో అమ్మకి ఇలా అర్థం అయిందా" అని స్వప్న అనుకుంటుంది. మరోవైపు తలపాగా తీసుకొని కావ్య, రాజ్ ఇంటికి వెళ్లి సెక్యూరిటీతో తలపాగ ఇచ్చి రాజ్ కి ఇవ్వమని చెప్తుంది. ఆ తర్వాత స్వప్నని పెళ్ళికూతురు చేయడానికి కావలసిన వస్తువులు, నగలు తీసుకొని రాహుల్ వస్తాడు. స్వప్న, రాహుల్ పై కోపంగా ఉంటుంది. అలా రాహుల్ ని చూసి ఎలాగైనా తనతో మాట్లాడాలని కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. ఆ తర్వాత స్వప్నని రాహుల్ ఎత్తుకొని తీసుకుపోయి బెడ్ మీద పడుకోపెడతాడు. మరో వైపు కావ్య, రాజ్ కి డాష్ ఇస్తుంది. రాజ్ తనని చూడకుండా.. తన కంటపడకుండా తప్పించుకుంటుంది కావ్య. అప్పటికే రాజ్ కి కావ్య వచ్చినట్లుగా అనుమానం వస్తుంది. మరోవైపు కనకంని ఎలాగైనా బయటికి పంపించి, రాహుల్ తో మాట్లాడాలని స్వప్న అనుకుంటుంది. కనకంని జ్యూస్ తెమ్మని చెప్పి అలా బయటకు పంపిస్తుంది స్వప్న. ఆ తర్వాత గదిలో స్వప్న, రాహుల్ ఇద్దరే ఉంటారు. "నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు" అని స్వప్న అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ సీన్ చూసి చాలా ఏడ్చానని చెప్పిన గలాటా గీతు!

గలాటా గీతు.. ఇప్పుడు ఈ పేరు అందరికి సుపరిచితమే. గీతూ బిగ్ బాస్ రివ్యూవర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఏకంగా బిగ్ బాస్-6 లో కంటెస్టెంట్ గా ఛాన్స్ కొట్టేసింది. తను బిగ్ బాస్ లోకి వెళ్ళాక కంటెస్టెంట్స్ తో ఎప్పుడు గొడవలు పెట్టుకునేది. తన ఆటిట్యూడ్ తో ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. దాంతో కొన్నివారాలకే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయింది. ఆ టైంలో హౌస్ ని విడిచిపోను అంటూ ఎమోషనల్ అయింది. గీతు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక ఆదిరెడ్డి వాళ్ళ సొంత ఊరికి కూడా వెళ్ళింది. ఇలా తనకు సంబంధించిన అప్డేట్స్ ని వీడియోల రూపంలో ఇటు యూట్యూబ్ ఛానెల్ లోను.. అటు ఇన్ స్టాగ్రామ్ లోను పోస్ట్ చేస్తుంది. కాగా బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చినవాళ్ళలో దాదాపు అందరూ ఫేమ్ వచ్చి వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారు. గీతూకి మాత్రం ఫేమ్ వచ్చినా అవకాశాలు రావట్లేదు. తనతో పాటు హౌస్ లోకి వెళ్ళిన మిగతావారు ఏదో ఒక షో లో మెరుస్తున్నారు. కాగా గీతూ తన యూట్యూబ్ వ్లాగ్ లతో బిజీ అయిపోయింది. ఆదిరెడ్డి బిగ్  బాస్ నుండి కొన్ని మెమోరీస్  తీసుకురాగా.. ఆ మెమోరీస్ అన్నీ చూపిస్తూ ఆ సీన్స్ ని చెప్తూ..  బిగ్ బాస్ మెమోరీస్ అని ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. ఆదిరెడ్డి, కవితలతో కలిసి కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఎమోషనల్ అయింది. ఇక ఆదిరెడ్డి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చినప్పుడు ఆదిరెడ్డి ఎమోషనల్ అయిన ఫొటోని చూపిస్తూ.. "ఆ సీన్ ని చూసి చాలా ఏడ్చాను. నేను అప్పుడు అక్కడ లేను.. నేను దగ్గర ఉండి చూడలేకపోయాను.. ఇంకా మా అమ్మని ఫ్యామిలీ వీక్ లో తీసుకురాలేదు" అంటూ గీతు చెప్పుకొచ్చింది. మరికొన్ని ఫొటోస్ చూపిస్తూ ఇవే తాను ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయని చెప్పింది. గీతు సరదాగా మాట్లాడుతూ కొన్ని ఫొటోస్ చూపించిన తర్వాత వీడియో ఆపేసి ఏడ్చేసింది. ఇలా తన ఎమోషనల్ జర్నీ సాగిందంటూ బిగ్ బాస్ లోని కొన్ని మెమోరీస్ ని పంచుకుంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు.. "గీతు, ఆదిరెడ్డిల ఫ్రెండ్ షిప్ బాండింగ్ సూపర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండని దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-696 లో.. ఆరోగ్యం బాలేని రిషిని వసుధార దగ్గరుండి చూసుకోవడంతో దేవయాని ఓర్వలేకపోతుంది. "ఇంట్లో మనమంతా ఉన్నాం కదా.. మనలో ఎవరైనా రిషిని చూసుకుంటాం కదా.. ఈ పద్ధతి ఏంటో నాకు నచ్చలేదు" అని మహేంద్రతో అంటుంది దేవయాని. రిషి ఆరోగ్యం బాగవడం ముఖ్యం వదిన అని మహేంద్ర అంటాడు. అప్పుడే జగతి వచ్చి ఏం అయింది అక్కయ్యా అని అడుగుతుంది. మీరు వసుధారని పంపించేయండి.. రిషి పరువు ఏమవుతుందని దేవయాని అనగానే.. రిషికి జ్వరం తగ్గడం మనకు ముఖ్యమని జగతి అంటుంది. "ఏంటి మొగుడు పెళ్ళాం ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు" అంటూ దేవయాని ఆవేశపడుతుంది. తనని ఇంట్లోకి రానివ్వొద్దని మొదటి నుండి చెప్తున్నాను.. అయినా ఎవరూ వినలేదు అని దేవయాని అనగానే.. "ప్లీజ్ ఆపండి వదిన" అని కోపంగా అరుస్తాడు మహేంద్ర. ఆ తర్వాత "రిషి నా కొడుకు.. ఎలాంటి తప్పు చెయ్యడు.. మీరు పెంచి పెద్ద చేసారు.. ఆ గౌరవం అలాగే ఉండనివ్వండి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి" అని వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర. మరోవైపు రిషి పక్కనే వసుధార ఉండి తన బాగోగులు చూస్తుంటే.. రిషి తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ బయటకు కోపం ఉన్నట్లుగా చూస్తాడు. రాత్రి పాలు తీసుకొస్తానని వసుధార వెళ్తుంటే.. హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్న దేవాయనిని చూసి.. "మేడం మీరు ఇంకా పడుకోలేదా" అని అడుగుతుంది. నిద్రపోయేంత ప్రశాంతత ఈ ఇంట్లో ఎక్కడుందని దేవాయని అంటుంది. ఇల్లు ప్రశాంతంగానే ఉంది కదా మేడం అని వసుధార అంటుంది. భయం లేదు మొండిదానివి అనుకున్నాను కానీ ఇంత తెగిస్తావని అనుకోలేదు అంటుంది. వసుధార కౌంటర్ లా మరొకటి మాట్లాడేసరికి ఇంకా కోపంతో ఊగిపోతుంది దేవయాని. ఇక రిషి దగ్గరికి జగతి, మహేంద్రలు వస్తారు. అక్కడే వసుధార కూడా ఉంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సుమ అడ్డాలో 'పులిమేక' వెబ్ సిరీస్ టీం సందడి!

ఈటీవీలో ప్రసారమవుతున్న 'సుమ అడ్డా' షోకి యాంకర్ గా సుమ చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వారం జరిగిన ఎపిసోడ్ లో 'పులిమేక' వెబ్ సిరీస్ టీం సందడి చేశారు. ఈ సిరీస్ తాజాగా జీ5లో విడుదలై విశేష స్పందన పొందుతోంది. అయితే సిరీస్ టీం‌మ్ తాజాగా సుమ అడ్డా ఎపిసోడ్ లో గెస్ట్ లు గా వచ్చారు. అందులో హీరోయిన్ లావణ్య త్రిపాఠి, రచయిత కోన వెంకట్, సిరి హనుమంత్, రాజా చెంబోలు పాల్గొన్నారు. దీంతో ఈ షో ఆసక్తికరంగా సాగింది. ఈ సిరీస్ లో నువ్వేం చేసావ్ సిరి అని సుమ అడుగగా.. యాక్టింగ్ చేసానని సిరి చెప్పింది.. పోనీలే సిరి ఇన్నాళ్ళకి నీకు యాక్టింగ్ చేయాలని అర్థం అయిందని సుమ పంచ్ వేసింది. సిరి నీకొక కొశ్చన్.. రిలేషన్ షిప్ ల వల్ల నువ్వు పాపులర్ అయ్యావా లేక యాక్ట్ చేయడం వల్ల పాపులర్ అయ్యావా? అని సుమ ప్రశ్నించగా.. రిలేషన్ షిప్ లో యాక్టింగ్ చేయడం వల్ల పాపులర్ అయ్యానని చెప్పింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కొడుకని కాకుండా మీరంతట మీరు ఒక‌ గుర్తింపుని తెచ్చుకున్నారు కదా రాజా చెంబోలు గారు గ్రేట్ అని సుమ అభినందించింది. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి వచ్చి.. 'మీరు ఎప్పటిలాగే బాగున్నారు.. గ్రేట్' అని సుమతో చెప్పగా.. అదేంటో రోజు రోజుకి నా అందం అలా పెరిగిపోతూ ఉంటుందని సుమ చెప్పింది. మీ నాన్న గారు లాయర్, అమ్మ టీచర్, చెల్లి డాక్టర్ మీరేంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ రన్ చేస్తున్నారా అని సుమ అడిగేసరికి.. లావణ్య నవ్వేయగా.. ప్రేక్షకులు ఊ కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆస్క్ మీ కొశ్చన్ రౌండ్ లో లావణ్య తప్పుగా సమాధానం చెప్పినందుకు గాను ఒక పనిష్మెంట్ ఇచ్చింది సుమ. అదేంటంటే లావణ్య ఒక వెడ్డింగ్స్ చేసే కంపెనీకి హెడ్ అని, తను మేడమ్ అసిస్టెంట్ అని సుమ స్టార్ట్ చేయగా.. పెళ్ళిచూపుల దగ్గర నుండి శ్రీమంతం వరకు మేడమే గ్యారంటీ అని సుమ చెప్తుంది.. వెంటనే డైవర్స్ గ్యారంటీ అని లావణ్య అంటుంది. దీంతో సుమ షాక్ అవుతుంది. ఆ తర్వాత కామన్ ఆడియన్స్ లో నుండి ఒక స్టూడెంట్ వచ్చి.. నాకు లావణ్య త్రిపాఠి లాంటి అమ్మాయి కావాలి అని అంటాడు. "లావణ్య లాంటి అమ్మాయంటే కన్యాశుల్కం ఇవ్వాలి" అని సుమ చెప్తుంది. దానికి అతను.. "నా ప్రాణాలే ఇస్తాను" అని చెప్తాడు. ఒకవేళ లావణ్య అలిగితే ఏం చేస్తావ్? అని సుమ అడుగుతుంది. ఒక‌ రొమాంటిక్ డేట్ కి తీసుకెళ్తానని చెప్పగా.. అలిగిందే నీకు రొమాన్స్ లేదనేరా అని సుమ పంచ్ వేసేస్తుంది. దీంతో షోలో నవ్వులు పూసాయి. ఇలా షో అంతా సుమ కామెడీ పంచ్ లతో వీక్షకులకు ఫుల్ మస్తీ ఎంటర్‌టైన్మెంట్ లభించింది.