నాతో మొక్కలు మాట్లాడతాయి.. డల్ ఐపోతాయి...
జబర్దస్త్ కమెడియన్ రఘు గురించి అందరికీ తెలుసు...అటు సిల్వర్ స్క్రీన్ మీద, ఇటు స్మాల్ స్క్రీన్ మీద కూడా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రఘు వన్స్ షూటింగ్ పూర్తయ్యాక స్ట్రెయిట్ గా ఇంటికి వచ్చేసి ఇంట్లో తాను పెంచుకునే పెరటిని చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఇల్లు చూస్తే నందనవంలా ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. మొక్కలతో, ఆర్గానిక్ పంటలతో కళకళ లాడుతూ ఉంటుంది. బయటి నుంచి కూరగాయలు అస్సలు తెచ్చుకోరట. "షూటింగ్ లేకపోతే గనక ఈ ప్రకృతే నా ప్రపంచం...నా ఇంట్లో అన్ని పండుతాయి. 365 డేస్ అన్నీ ప్రొడక్ట్స్ వస్తాయి. వంకాయ, బెండకాయ, దొండకాయ, క్యాబేజి, కాలిఫ్లవర్, టమాటో, మిర్చి, డ్రాగన్ ఫ్రూట్, రామాఫలం, లక్ష్మణ ఫలం, బోన్సాయ్ మామిడి ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. పసుపు కొమ్ములు, ఎండుమిరపకాయలు అన్నీ ఇంట్లోనే పండించుకుంటాను. ఒకవేళ నేను లేనప్పుడు మా డ్రైవర్ నారాయణ.. మా అత్తయ్య, బామ్మర్ది, నా భార్య వీటిని చూసుకుంటారు.
నాతో కొన్ని మొక్కలు మాట్లాడుతూ ఉంటాయి. రెండు రోజుల పాటు పలకరించకపోతే డల్ అవుతాయి. ఏమిటి ఇలా ఇపోయారు. నేను రాలేదనా..అని ఒక గ్లాస్ నీళ్లు పోయగానే పావుగంటలో నిగ నిగలాడుతూ ఉంటాయి. మొక్కలైనా, జంతువులైనా మనం ఇంటరాక్ట్ ఐతే అవి కూడా స్పందిస్తాయి, మాట్లాడతాయి...దానికి మించిన లైఫ్ లేదు. నేను సోలోగా కారు డ్రైవ్ చేసుకుని అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటా. క్యాంపింగ్ చేసుకుని అక్కడే తినేసి మళ్ళీ ఇంటికి వస్తా..ఎన్నో స్టేట్స్ తిరిగాను. మా ఇంట్లో అన్ని మట్టి కుండల్లోనే వండుకుంటాం..అదే ఇష్టం నాకు." అని చెప్పాడు రఘు.